బీజేపీపై ప్రముఖ్య ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ అభియాన్ సంస్థ వ్యవస్థపకుడు ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు. దేశంలోని యువత సమస్యలు, నిరుద్యోగంపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు. ఓ టీవీ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. దేశంలోని యువతకు సంబంధిచిన సమస్యలపై బీజేపీ ఒక్కమాట కూడా మాట్లాడకుండా వరుసగా ఎన్నికల్లో ఎలా గెలుస్తుంది? అనే ప్రశ్నకు సమాధానం చేప్పారు.
2014 నుంచి బీజేపీ పలు ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి ప్రతిపక్షాలు ఐకమత్యంగా లేకపోవటమే కారణమని తెలిపారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలు.. ఓటర్లకు ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు వివరించటంలో విఫలం అయ్యాయి. ఓటర్లును తమవైపు మళ్లించుకోవటంలో ప్రతిపక్షాలు తరచూ వెనకబడటం వల్లే బీజేపీ మెరుగైన ఫలితాలు రాబట్టుకుంటోందనిపేర్కొన్నారు.
‘2019 సార్వత్రిక ఎన్నికల్లో సైతం వందమంది ఓటర్లలో సుమారు 38 మంది ప్రధాన మంత్రి మోదీ నాయకత్వానికి మద్దతుగా నిలిచారు. కానీ, 62 మంది ఓటర్లు వ్యతిరేకంగా ఆయనక ఓట్లు వేశారు. మెజార్టీ ఓటర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలేకపోయారు. 62 మంది ఓటర్లు ప్రతిపక్షాల వైపు ఐక్యంగా ఉండలేకపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మేజార్టీ ఓటర్లంతా కూడా చెల్లాచెదురుగా ఉన్నారు. ఎవరూ ప్రభుత్వ వ్యతిరేక మేజార్టీ ఓటర్లను ఒక్కతాటిపైకి తీసుకురాలేకపోయారు’ అని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.
ఇక.. ప్రశాంత్ కిషోర్ ఇటీవల తన సంస్థ ‘జన్ సూరాజ్’ ద్వారా అత్యంత వెనబడిన తరగతులకు చెందిన సుమారు 75 మందిని 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల బరితో దింపుతానని ప్రకటించారు. ప్రశాంత్ కిషోక్ ఎన్నికల వ్యూహకర్తగా బీజేపీ, జేడీ(యూ)- ఆర్జేడీ మహాఘట్‌బంధన్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు అధికారంలోకి రావటానికి కృషి చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment