జేడీ(యూ) చీఫ్ బిహార్‌లోని మహాకూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జట్టు కట్టడంపై ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ఏర్పడిన బీజేపీ-జేడీ(యూ) కూటమి కూడా ఎక్కువ కాలం నిలవదని అభిప్రాయపడ్డారు. నితీష్ కుమార్ మహాకూటమి సీఎం పదవీ రాజీనామా చేసి.. ఎన్‌డీఏ కూటమి నేతగా మళ్లీ బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న సమయంలో ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
2025లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా బీజేపీ-జేడీయూ కూటమి స్థిరంగా ఉండదని జోష్యం చేప్పారు. బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఒక ఏడాది లేదా దాని కంటే తక్కువేనని కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఏర్పడిన బీజేపీ-జేడీయూ కూటమిలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయన కేవలం ఆరు నెలల్లోనే ఊహించినంత మార్పు సంభవిస్తుందని కూడా తెలిపారు.
ఇక 2022లో నితీష్ కుమార్ ఎన్‌డీఏ ఉంచి బయటకు వచ్చారని.. అప్పుడు బిహార్‌లో రాజకీయ స్థిరత్వం ఉంటుందని ఆశించానన్నారు. అయితే రాజకీయ, పరిపాలన పరమైన అంచనాలు ఎప్పటికప్పుడు పెరిగిపోవటం వల్లనే ఇలాంటి కూటమి మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మహాకూటమి కూటమి కూడా 2020 వరకు మాత్రమే కొనసాగదని గతంలో తాను అంచనా వేసినట్లు గుర్తు చేశారు. గత అంచనా నిజం అయినట్టు ఇప్పుడు కూడా 2025 వరకు మాత్రమే ప్రస్తుతం ఏర్పడిన బీజేపీ-జేడీయూ కూటమి సైతం కొనసాగుతుందని అన్నారు. అనంతరం బీజేపీ- జేడీయూ కూటమి కూడా బీటలు వారుతుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment