JD (U)
-
బీజేపీ-జేడీయూ కూటమిపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు
జేడీ(యూ) చీఫ్ బిహార్‌లోని మహాకూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో జట్టు కట్టడంపై ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ఏర్పడిన బీజేపీ-జేడీ(యూ) కూటమి కూడా ఎక్కువ కాలం నిలవదని అభిప్రాయపడ్డారు. నితీష్ కుమార్ మహాకూటమి సీఎం పదవీ రాజీనామా చేసి.. ఎన్డీఏ కూటమి నేతగా మళ్లీ బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న సమయంలో ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2025లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా బీజేపీ-జేడీయూ కూటమి స్థిరంగా ఉండదని జోష్యం చేప్పారు. బిహార్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక ఏడాది లేదా దాని కంటే తక్కువేనని కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఏర్పడిన బీజేపీ-జేడీయూ కూటమిలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు పూర్తి అయన కేవలం ఆరు నెలల్లోనే ఊహించినంత మార్పు సంభవిస్తుందని కూడా తెలిపారు. ఇక 2022లో నితీష్ కుమార్ ఎన్డీఏ ఉంచి బయటకు వచ్చారని.. అప్పుడు బిహార్‌లో రాజకీయ స్థిరత్వం ఉంటుందని ఆశించానన్నారు. అయితే రాజకీయ, పరిపాలన పరమైన అంచనాలు ఎప్పటికప్పుడు పెరిగిపోవటం వల్లనే ఇలాంటి కూటమి మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మహాకూటమి కూటమి కూడా 2020 వరకు మాత్రమే కొనసాగదని గతంలో తాను అంచనా వేసినట్లు గుర్తు చేశారు. గత అంచనా నిజం అయినట్టు ఇప్పుడు కూడా 2025 వరకు మాత్రమే ప్రస్తుతం ఏర్పడిన బీజేపీ-జేడీయూ కూటమి సైతం కొనసాగుతుందని అన్నారు. అనంతరం బీజేపీ- జేడీయూ కూటమి కూడా బీటలు వారుతుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. చదవండి: ‘నితీష్, బీజేపీకి బిహార్ ప్రజలు బుద్ధి చెబుతారు’ -
‘నితీష్, బీజేపీకి బిహార్ ప్రజలు బుద్ధి చెబుతారు’
జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్ మహాకుటమి నుంచి బయటకు వచ్చి సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన బీజేపీతో జట్టు కట్టి ఆదివారం మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లీకార్జును స్పందిస్తూ.. బిహార్‌లో ఇటువంటి పరిస్థితి వస్తుందని.. జేడీ(యా) చీఫ్ నితీష్ కుమార్ మహాకూటమి నుంచి వైదొలుగుతారని ముందే ఊహించినట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేష్ మాత్రం నితీష్.. బీజేపీలో చేరటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదని స్పష్టం చేశారు. అదే విధంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’పై నితీష్ వైదొలటం ఎలాంటి ప్రభావాన్ని చూపదని అన్నారు. 2024 పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ ప్రజలు నితీష్ కుమార్, ఢిల్లీలో(బీజేపీ) వారికి ఖచ్చితంగా తమదైన శైలిలో బుద్ధి చెబుతారని తెలిపారు. నితీష్ కుమార్ వంటి పచ్చి రాజకీయ అవకాశవాదిని తానెప్పుడూ చూడలేదని తీవ్రంగా మండిపడ్డారు. #WATCH | On Nitish Kumar joining NDA, Congress MP Jairam Ramesh says, "This will not affect the INDIA alliance. The people of Bihar will give the right answer to Nitish Kumar and those who are sitting in Delhi in the 2024 elections. I have not seen any opportunistic leader like… pic.twitter.com/w1IYot6jCc — ANI (@ANI) January 28, 2024 అవకాశవాదంలో ఊసరవెల్లితోనే ఆయన పోటీ పడ్డారని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారం అంతా ప్రధాని మోదీ డైరెక్షన్లో నడుస్తోందని మండిపడ్డారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ సాధిస్తున్న విజయం పట్ల బీజేపీకి భయం కలుగుతోందని అన్నారు. అందుకే కూటమిని చీల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇక.. నితీష్ కుమార్ నేడు సాయంత్రం 4 గంటలకు మరోసారి బిహార్ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ మద్దతుతో సీఎం కానున్న నితీష్.. బీజేపీకి రెండు డిప్యూటీ సీఎం పదవులు , స్పీకర్ పదవిని కేటాయిస్తారని తెలుస్తోంది. చదవండి: అందుకే మహా కూటమి నుంచి బయటకొచ్చా: నితీష్ -
బిహార్‌లో ఆసక్తికరంగా మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్
పట్నా: ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహా కూటమి నుంచి వైదొలిగి బీజేపీలో చేరి.. మళ్లీ సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి బిహార్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా జేడీ(యూ), ఆర్జేడీ పార్టీల్లో జరగుతున్న చర్చలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పక్క పార్టీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు నితీష కుమార్ పార్టీ జేడీ(యూ) తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 10 మందితో జేడీయూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో 13 మందిని లాగేందుకు ఆర్జేడీ అధినేత లాలూ సైతం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా పట్నాలో అందుబాటులో ఉండాలని లాలూ ఆదేశించారు. నితీష్ కుమార్ మహా కూటమిని మారే సమయంలో బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శనివారం రాత్రి 7 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలతో నితీష్ చర్చలు జరపనున్నారు. అయితే ఈ రాత్రికి నితీష్ సీఎంగా రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ మద్దతుతో రేపు(ఆదివారం) మరోసారి బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆదివారం తెలంగాణలో పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు బిహార్ వెళ్లనున్నారు. ఆదివారం పట్నాలో బీజేపీ ఎమ్మెల్యేలతో వారు సమావేశం కానున్నారు. చదవండి: ‘ఇండియా కూటమి ఎక్కడ? అందరూ వెళ్లిపోతున్నారు’ -
‘ఇండియా కూటమిలో ఉంటే నితీష్ కుమారే ప్రధాని!’
లక్నో: ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూపంలో మరో భారీ షాక్ తగలనున్నట్టు జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఇప్పటికే కూటమి నుంచి బయటకు వచ్చి.. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, పంజాబ్‌లో ఆప్ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజు మరో కీలకమైన పార్టీ జేడీ(యూ) కూడా కూటమి నుంచి వైదొలగనుందని తెలుస్తోంది. బిహార్ సీఎం నితీష్ కుమారు దీని కోసం పావులు కదపుతున్నారని సమాచారం. దాని కోసం ఆయన ప్రస్తుత సీఎం పదవి రాజీనామా చేసి.. బీజేపీలో చేరి మళ్లీ 9వ సారి సీఎం ప్రమాణస్వీకారం చేయడానికి కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్షాల కూటమిలో ఎవరైనా ప్రధానమంత్రి పదవికి అర్హులేనని తెలిపారు. ఇక.. కూటమిలో ఎవరినైనా ప్రధాని చేయటానికి అవకాశాలు కల్పించబడతాయని పేర్కొన్నారు. అటువంటి స్వేచ్ఛ ప్రతిపక్షాల కూటమిలో ఉంటుందని చెప్పారు. నితీష్ కుమార్ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో ఉంటే ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ లో తాను ఎప్పుడు పాల్గొంటాననే విషయాన్ని సరైన సమయలో వెల్లడిస్తానని అన్నారు. నితీష్ కుమార్ యూ టర్న్ తీసుకొని బీజేపీతో చేతులు కలుపుతున్నారన్న వార్తలపై అఖిలేష్ యాదవ్ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటగా నితీష్ కుమార్ చొరవ తీసుకొని మరీ ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఆయన కూటమి నుంచి వైదొలగకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక ఆయన కూటమిలోనే ఉంటే ప్రధాని అవుతారని అన్నారు. చదవండి: బీజేపీ-జేడీయూ నేతృత్వంలో నితీష్ మళ్లీ సీఎం? -
కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. త్వరలో జేడీ(యూ), ఆర్జేడీ విలీనం!
జనతాదళ్ యునైటెడ్ జేడీ(యూ), రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) పార్టీలు త్వరలో విలీనం అవుతాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ(యూ)అధినేత, సీఎం నితీష్ కుమార్.. ఇండియా కూటమిలో భాగంగా సీట్ల పంపిణీపై పట్టబడుతున్నారన్న మీడియా ప్రశ్నకు కేంద్రమంత్రి ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో పలు వ్యక్తిగత సమీకరణాలు పంచుకున్నా. ఆయన కూడా చాలా విషయాలు నాకు చెప్పారు. అయితే వాటిని మీడియా ముందు ప్రజలకు వెల్లడించడం సరికాదు. కానీ, మీకు నేను ఒకటి చెప్పగలను. త్వరలో జేడీ(యూ), ఆర్జేడీ పార్టీలు విలీనం అవుతాయి. అప్పడు ఇండియా కూటమిలో సీట్ల పంపిణీకి సంబంధించి ఎటువంటి ప్రశ్నలు ఉత్పన్నం కావు’ అని అన్నారు. అయితే గురవారం పార్లమెంట్ సమావేశాలు ముగించుకొని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఇడియా కూటమి సమావేశం అనంతరం లలూ ప్రసాద్ ఇరువురు ఒకే విమానంలో ఢిల్లీ నుంచి పట్నాకు ప్రయాణం చేశారు. ప్రస్తుతం బీహార్ డిప్యూటీ సీఎం ఉన్న తన కుమారు తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేసే సమయం ఆసన్నమైందని లాలూప్రసాద్.. తనతో చెప్పాడని కేంద్ర మంత్రి గిరిరాజ్ అన్నారు. కేంద్ర మంత్రి ‘విలీనం’ వ్యాఖ్యలపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అసాధారణమైన వ్యాఖ్యలు చేస్తారు. ఆయనకి ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలవాలని ఉంటుంది. ఆయన్ను ఎవరు గుర్తించరు కావును అసాధారణ వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకుంటారు’ అని మండిపడ్డారు. చదవండి: Alcohol Ban Exemption: గుజరాత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఫైర్ -
బీజేపీ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకుంటాం!
ఇంఫాల్: వరుసగా పలు రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు తలెత్తడం.. ప్రధాన పార్టీల పొత్తులు మారిపోయి ప్రభుత్వాలే తలకిందులు కావడం చూస్తున్నాం. తాజాగా బీహార్‌లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పేసింది జనతాదల్ యునైటెడ్(జేడీ(యూ)) పార్టీ. దీంతో పూర్తి సంబంధాలు తెగిపోయినట్లేనని అంతా భావించారు. కానీ.. ఆశ్చర్యకర రీతిలో మణిపూర్‌లో మాత్రం బీజేపీ సర్కార్‌కు ఇంకా మద్దతు కొనసాగిస్తోంది ఆ పార్టీ. అయితే.. మణిపూర్‌లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుంచి బయటకు రాబోతున్నట్లు ప్రకటించింది ఆ రాష్ట్రానికి చెందిన జేడీయూ యూనిట్. అంతేకాదు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు సైతం ఉపసంహరించుకోబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జేడీ(యూ) మణిపూర్ యూనిట్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కేఎస్‌హెచ్ బీరెన్ సింగ్ ప్రకటన చేశారు. ‘‘మద్దతు ఉపసంహరించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. కానీ, కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి కావాల్సి ఉంది’’ అని బీరెన్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. అంతేకాదు సెప్టెంబర్ 3-4 తేదీల మధ్య పాట్నాలో జరగబోయే ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ మేరకు అగ్రనేతలతో సమావేశమై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని, ఈ భేటీకి మణిపూర్ జేడీయూ ఎమ్మెల్యేలు సైతం హాజరవుతారని, సమావేశం అనంతరం అధికారికంగా ఒక ప్రకటన చేస్తామని తెలిపారు. క్లియరెన్స్ లేకనే.. ఇదిలా ఉంటే.. బీహార్ రాజకీయాల్లో భాగంగా జేడీ(యూ) ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత కేంద్రం నుంచి కూడా సంబంధాలు తెంచేసుకుంది. అయితే.. మణిపూర్‌లో ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ కూటమి ప్రభుత్వానికి మాత్రం మద్దతు కొనసాగుతూనే వస్తోంది. వాస్తవానికి ఆగస్టు 10వ తేదీనే మణిపూర్ జేడీయూ యూనిట్ తెగదెంపులపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అయితే పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో ప్రకటన జాప్యం అవుతూ వస్తోంది. మణిపూర్ అసెంబ్లీలో 60 స్థానాలు ఉండగా.. బీజేపీ ప్రభుత్వం 55 మంది ఎమ్మెల్యేలతో కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. అందులో బీజేపీ ఎమ్మెల్యేలు 32 మంది కాగా, ఏడుగురు నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన వాళ్లు. ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు, మిగతా వాళ్లు ప్రాంతీయ పార్టీల వాళ్లు ఉన్నారు. జేడీయూ మద్దతు ఉపసంహరించుకున్నా ప్రభుత్వం కుప్పకూలే అవకాశం లేదు. అయితే ప్రాంతీయ పార్టీల్లో తాము బీజేపీ-బీ టీంలం కాదనే అసంతృప్తి బాగా పేరుకుపోయింది ఉంది. ఒకవేళ జేడీయూ గనుక వాళ్లను ప్రభావితం చేయగలిగితే మాత్రం ప్రభుత్వం సంక్షోభంలో పడే అవకాశాలు ఉన్నాయి.! మరోవైపు.. మణిపూర్ బీజేపీలో నేతల మధ్య అసంతృప్తి పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. కీలక నేత నిమాయ్‌చంద్ లువాంగ్ తన మద్దతుదారులతో కలిసి సోమవారం ఇంఫాల్‌లో జేడీయూ పార్టీ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఇదీ చదవండి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి రేసులో ఆయన! -
నితీశ్‌కు వెన్నుపోటు అలవాటే: బీజేపీ
పట్నా: ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు వెన్నుపోటు రాజకీయాలు అలవాటేనని బీజేపీ ఆరోపించింది. ఆర్జేడీతో తాజాగా పొత్తు పెట్టుకోవడం ద్వారా బిహార్‌ను అశాంతి, అవినీతి అగాథంలోకి నితీశ్ నెట్టివేస్తున్నారని విమర్శించింది. వేగంగా మారిన సమీకరణాల నేపథ్యంలో మంగళవారం పట్నాలో బీజేపీ కోర్‌కమిటీ సమావేశమైంది. నితీశ్ నిర్ణయాలను నిరసిస్తూ బుధవారం అన్ని జిల్లాల్లో మహాధర్నాలు చేపడతామని, బుధవారం బ్లాక్ స్థాయిలో నిరసనలకు దిగుతామని అనంతరం ఒక ప్రకటనలో తెలిపింది. నితీశ్‌కు తెలియకుండానే ఆర్సీపీ సింగ్‌కు కేంద్రం కేబినెట్లోకి తీసుకుందంటూ నితీశ్ చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ ట్వీట్ చేశారు. 2024లో బీజేపీ తిరుగులేని మెజారిటీ సాధించి అధికారంలోకి వస్తుందన్నారు. నితీశ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం కనౌజ్: బిహార్‌లో బీజేపీతో బంధాన్ని తెంచుకున్నట్లు ప్రకటించిన నితీశ్ కుమార్‌ను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అభినందించారు. ‘నితీశ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జరగబోయే మంచికి ఇది శుభసూచకం’ అని అఖిలేశ్ అన్నారు. ‘ఆనాడు స్వాతంత్య్ర సమరయోధులు ఆగస్ట్ 9న క్విట్ ఇండియా నినాదం వినిపించారు. అదే తేదీన నితీశ్ బీజేపీ భాగో( బీజేపీ నుంచి దూరంగా వెళ్దాం) అంటూ నినదించారు. బిహార్‌లో మాదిరే మిగతా రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాలి’ అని అన్నారు. చదవండి: (Nitish Kumar: తొలుత ఇంజనీర్‌గా..) -
మాది సంకీర్ణ ధర్మం- నితీశ్దేమో..: బీజేపీ
ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ నిష్క్రమణను బీజేపీ ముందే పసిగట్టిందా? తెలిసి కూడా నితీశ్ కుమార్‌ను బుజ్జగించడం, నిలువరించడం లాంటి ప్రయత్నాలు ఎందుకు చేయలేదు?. అసలు నితీశ్ నిష్క్రమణను బీజేపీ ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదు??.. తాజా పరిణామాలపై బీజేపీ ఏంమంటోందంటే.. బీహార్ రాజకీయాల్లో ఇవాళ్టి కీలక పరిణామంపై దేశమంతా చర్చ నడుస్తోంది. నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ).. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడం, సీఎం పదవికి నితీశ్ రాజీనామా, ఆ వెంటనే విపక్షాల మద్దతుతో గవర్నర్ అనుమతులతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన, బుధవారం సాయంత్రం సీఎంగా ప్రమాణం చేస్తారనే ధృవీకరణ.. ఒకదాని వెంట ఒకటి శరవేగంగా జరిగిపోయాయి. అయితే సోమవారం నాడే ఈ మేరకు బలమైన సంకేతాలు అందినప్పటికీ.. బీజేపీ మౌనంగా ఉండిపోవడం, ఇంత కీలక పరిణామంపై ముఖ్య నేతలెవరూ స్పందించకపోవడం గమనార్హం. ఆ ఉద్దేశంలోనే నితీశ్? నితీశ్ కుమార్ చేసింది ముమ్మాటికీ మోసమేనని, వెన్నుపోటుతో నితీశ్ కుమార్ రాజకీయ విశ్వసనీయత సైతం కోల్పోయాడని బీజేపీ బలంగా భావిస్తోంది. అంతేకాదు రాబోయే రోజుల్లో బీహార్ ప్రజలే ఆయనకి బుద్ధి చెప్తారని అంటోంది. అందుకే తమ అధిష్టానం సైతం ఆయన్ని నిలువరించే ప్రయత్నాలేవీ చేయలేదని చెబుతోంది. నితీశ్ కుమార్‌కి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆరాటంతో ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని నడిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ఎన్డీయేకి దూరంగా జరిగి ఉండొచ్చు అని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత చెప్తున్నారు. టామ్ అండ్ జెర్రీలా.. బీహార్ రాజకీయాల్లో జేడీయూ- బీజేపీల మధ్య విమర్శల పర్వం కొంతకాలంగా నడిచింది. స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తీరు, బీజేపీ నేతలు నితీశ్ సర్కార్‌పై విమర్శలతో ఆయన అసహనంలోకి కూరుకుపోయారు. ఈ లోపే అగ్నిపథ్ నిరసనలను ఆయన కట్టడి చేయలేకపోయారని బీజేపీ నేతలు బహిరంగ విమర్శలకు దిగారు. ఈ పరిణామాలతో నితీశ్ కుమార్ బీజేపీకి, కేంద్రానికి అంటీముట్టనట్లు ఉంటున్నారు. కీలక భేటీలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం ఆయన్ని శాంతింపజేసేలా ప్రకటనలు చేసింది. జేడీయూ-ఎన్డీఏ పొత్తు రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని, నితీశ్ కుమార్ సీఎం అభ్యర్థిగా ఉంటారని స్వయంగా అమిత్ షా ప్రకటించారు. అయినా నితీశ్ కుమార్ మాత్రం కూటమి నుంచి వైదొలగాలనే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నితీశ్‌కు, జేడీయూ కీలక నేతలకు అమిత్ షా ఫోన్ చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని సమాచారం. బీహార్‌కి కూడా ద్రోహమే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. సంకీర్ణ ధర్మం బీజేపీ ఏనాడూ తప్పబోదని ప్రకటించారు. తక్కువ సీట్లు ఉన్నా ఆయన్ని(నితీశ్‌ను ఉద్దేశిస్తూ) సీఎంను చేసిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. ఆయనవి ఉత్త అనుమానాలే అని కుట్ర కోణాల ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఇక తాజా పరిణామంపై బీహార్ బీజేపీ చీఫ్ సంజయ్ జైశ్వాల్ తీవ్రంగా స్పందించారు. 2020 ఎన్నికలలో NDA హయాంలో JD(U)-BJPలు కలిసి పోరాడం. మేం ఎక్కువ సీట్లు గెల్చుకున్నా.. నితీష్ కుమార్‌ను సీఎం చేశాం. ఈరోజు ఏం జరిగినా అది బీహార్ ప్రజలకు, బీజేపీకి నితీశ్ చేసిన ద్రోహమే అని తీవ్రంగా స్పందించారాయన. Chirag on Nitish Kumar: ఈరోజు మళ్లీ కూటమి నుంచి వైదొలిగిన నితీష్ కుమార్ - నాలుగు దశాబ్దాల కెరీర్లో ఐదోసారి, బీహార్ ప్రజల ఆదేశాన్ని అవమానించారు. బీహార్‌లో తాజా రాజకీయ వాతావరణం అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి సొంత ఆశయాలకు ముందు ఏదీ లెక్కలేకుండా పోయింది. బీహార్ కొన్ని సంవత్సరాల వ్యవధిలో మూడు పొత్తుల ద్వారా వెళ్ళింది. నితీశ్ కంసుడి లాంటోడు. కంసుడు తన మేనల్లులను తానే చంపించాడు. జార్జ్ ఫెర్నాండెజ్, ప్రశాంత్ కిషోర్, ఉపేంద్ర కుష్వాహలను వెన్నుపోటు పొడిచాడు నితీశ్. నితీశ్ అహంకారం వల్ల బీహార్ చాలా నష్టపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లే లక్ష్యంగా నితీశ్‌కు పెద్ద పెద్ద కోరికలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. నితీశ్ విలువల్లేనోడు. నితీశ్ నుంచి ఇలాంటిది ముందే ఊహించాం ::: లోక్‌జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ ఇదీ చదవండి: సీఎంగా మరోసారి నితీశ్.. ప్రమాణానికి ముహుర్తం ఫిక్స్! -
Bihar Crisis: నితీశ్‌కు ఇది బాగా అలవాటే!
#BiharPoliticalCrisis: ‘‘ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశా.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశాం’’ అంటూ స్వయంగా జనతా దళ్(యునైటెడ్) సీనియర్ నేత నితీశ్ కుమార్ ప్రకటనతో ఉత్కంఠకు తెరపడింది. బీహార్ రాజకీయాలను మలుపు తిప్పుతూ.. బీజేపీతో తెగదెంపుల ప్రకటన చేసిన నితీశ్.. ప్రభుత్వ ఏర్పాటులో సాయానికి ఆర్జేడీ, వామపక్ష, కాంగ్రెస్‌లు ముందుకు రావడంతో కొండంత ధైర్యం ప్రదర్శించారు. అయితే.. బీజేపీ అయితేనేం మరో పార్టీ అయితేనేం నితీశ్‌కు తెగదెంపులు చేసుకోవడం ఇలా కొత్తేం కాదు! రాజకీయాల్లో శాశ్వత శత్రువులెవరూ ఉండరు.. అలాగే మిత్రులు కూడా ఉండరు. బీహార్ సీనియర్ నేత నితీశ్ కుమార్ విషయంలో అదే నిజం అనిపిస్తోంది. నితీశ్ కుమార్లో నిలకడలేనితనం.. రాజకీయాల్లోకి వచ్చిన తొలి నాళ్ల నుంచే అలవడింది. జయప్రకాశ్ నారాయణ్ స్ఫూర్తితో సత్యేంద్ర నారాయణ్ సిన్హా నేతృత్వంలోని జనతా దళ్‌లో చేరాడు నితీశ్ కుమార్. తొలినాళ్లలో ప్రతిపక్ష నేతగా ఉంటూనే నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌తో దోస్తీ కట్టాడు. అది 1989లో.. ► 1994లో.. లాలూతో కటీఫ్ చెప్పి జార్జి ఫెర్నాండేజ్ నేతృత్వంలోని సమతా పార్టీతో జట్టు కట్టాడు. ► 1996లో బర్హ్ లోక్ సభ సీటు గెలిచిన తర్వాత.. సమతా పార్టీకి దూరం జరిగి బీజేపీతో చేతులు కలిపాడు. ► అంతేకాదు అటల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్లో మంత్రిత్వ శాఖను(రైల్వే మంత్రిత్వ శాఖ) దక్కించుకున్నాడు. ఈ పరిణామం.. అప్పటి జనతాదళ్ ప్రెసిడెంట్ శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్ మధ్య చిచ్చుపెట్టిందని అంటారు. ఈ దెబ్బకు లాలూ సొంతగా ఆర్జేడీని ఏర్పాటు చేశారు. అలా నితీశ్ తన రాజకీయ స్వార్థం కోసం చిచ్చురగిల్చాడనే అపవాదు ముద్రపడిపోయింది. ► 2000 సంవత్సరంలో.. ఎన్డీయే కూటమి తరపున నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. కానీ, మ్యాజిక్ ఫిగర్(163 సీట్లు) కంటే 12 సీట్లు తక్కువ ఉండడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రమాణం చేసిన వెంటనే రాజీనామా చేయాల్సి వచ్చింది. ► 2003లో నితీశ్ సమక్షంలోనే సమతా పార్టీ, శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతా దళ్‌లో విలీనం అయ్యింది. అదే సమయంలో బీజేపీ కూటమితో పొత్తు సైతం కొనసాగింది. అలా జేడీ(యూ) ఏర్పడి.. నితీశ్‌కు మళ్లీ సీఎం అయ్యే అవకాశం కలిగించింది. ► 2005లో.. ఎన్డీయే కూటమిలోని జేడీయూ పార్టీ అధికారంలోకి వచ్చింది. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. ► 2010లో.. మళ్లీ ఎన్డీయే కూటమి-బీజేపీ అండతోనే నితీశ్ కుమార్ జేడీయూ అధికారం కైవసం చేసుకుంది. ► 2013లో.. ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ క్యాంపెయిన్ కమిటీని ఏర్పాటు చేసింది. అది జీర్ణించుకోలేని నితీశ్ కుమార్.. బీజేపీతో పదిహేడేళ్ల బంధాన్ని తెంచేసుకున్నాడు. ► బీజేపీకి దూరంగా జరిగినప్పటికీ.. కాంగ్రెస్ సహకారంతో విశ్వాస తీర్మానంలో నెగ్గాడు సీఎం నితీశ్ కుమార్. అయితే.. లోక్‌సభ ఎన్నికల్లో దారుణమైన పరాభవం(20 నుంచి 2 సీట్లకు పడిపోవడం) తర్వాత ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ► ఏడాది తిరిగే లోపే.. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల మద్దతుతో జేడీయూలో తనకు కొరకరాని కొయ్యగా మారిన జితన్ రామ్‌ను ఢీ కొట్టి.. మళ్లీ ముఖ్యమంత్రి గద్దెపై కూర్చున్నారు నితీశ్ కుమార్. ► 2017.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని.. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ఒకటిగా అభివర్ణిస్తుంటారు విశ్లేషకులు. ఈ సమయంలోనే బీహార్‌లో బీజేపీ వ్యతిరేక మహా కూటమి ఏర్పడింది. అదే మహాఘట్బంధన్. ఆర్జేడీ, కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లి ఘన విజయాన్ని కైవసం చేసుకున్నాడు నితీశ్. ఆ సమయంలో బీజేపీపై, ప్రధాని మోదీపై వాడీవేడి విమర్శలు గుప్పించారు ఆయన. రాజకీయ-ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహకారంతో తిరిగి అధికారంలోకి రాగలిగారు. అయితే ఈ బంధం రెండేళ్లకే తెగిపోయింది. ► లాలూ కొడుకు, అప్పటి బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ తేజస్విని ఒత్తిడి చేశాడు నితీశ్. అందుకు ఆర్జేడీ అంగీకరించకపోవడంతో.. సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేశారు. ► ఈ తరుణంలో.. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని మహాఘట్బంధన్ నుంచి బయటకు వచ్చేసి.. 24 గంటలు గడవక ముందే తిరిగి పాత మిత్రుడు బీజేపీ(ఎన్డీయే) సాయంతో ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడుకున్నాడు. ► 2022లో.. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేయాలని, తనను సీఎం గద్దె నుంచి దించేయాలని బీజేపీ కుట్రకు పాల్పడుతోందన్న అనుమాన ఆరోపణలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి తెగదెంపులు చేసుకుని మళ్లీ ఆర్జేడీ, వామపక్ష, కాంగ్రెస్ మద్దతు తీసుకుంటున్నాడు. #BiharPolitics #NitishKumar #JDU #BJP #Bihar Nitish Kumar after every few months pic.twitter.com/WiPJnvMBO5 — g0v!ñD $#@®mA (@rishu_1809) August 8, 2022 ఇదీ చదవండి::: సీఎం పదవికి నితీష్ రాజీనామా -
మరో బాంబు పేల్చిన నితీష్ కుమార్..
పట్నా : బిహార్ ముఖ్యమంత్రి, నితీష్ కుమార్ జేడీయూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఉన్నతాధికారి ఆర్సీపీ సింగ్‌కు జేడీయూ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన గంటల వ్యవధిలోనే నితీష్ కుమార్ మరో బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి పదవి తనకు అక్కర్లేదన్నారు. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీజేపీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తుందని జనాలు మాట్లాడుకుంటున్నారు. సీఎం కుర్చికి నేను అంకితం కాలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించలేనని సంకీర్ణానికి తెలియజేశాను. కానీ వారు అంగీకరించలేదు. ఎంతో ఒత్తిడి తర్వాత నేను మరో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. ఈ పదవి పట్ల నాకు ఏ మాత్రం ఆసక్తి లేదు.. అక్కర్లేదు’ అని స్పష్టం చేశారు. ఇక నితీష్ వ్యాఖ్యలు ఎన్డీఏ కూటమిలో కలకలం రేపుతున్నాయి. (చదవండి: 21 ఏళ్లు.. అందుకు సిగ్గుపడుతున్నా!) ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై జేడీయూ అసంతృప్తి వ్యక్తం చేసింది. కూటమి రాజకీయాలకు ఇది మంచి సంకేతం కాదని స్పష్టం చేసింది. అయితే, అరుణాచల్ ఎపిసోడ్ బిహార్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపదని జేడీయూ పేర్కొంది -
బిహార్ ఫలితాలు-ఆసక్తికర అంశాలు
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారి సామాజిక నేపథ్యం ఏమిటీ? వారు సమాజంలో ఏ వర్గానికి చెందిన వారు? తెలుసుకునేందుకు విజేతల కుల, మతాలు, ఆడ, మగ అంశాలపై ‘త్రివేది సెంటర్ ఆఫ్ పొలిటికల్ డాటా’ పరిశోధకులు వివరాలు సేకరించి ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ వద్ద నున్న డాటాతో విశ్లేషించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 40.7 శాతం మంది ఇతర వెనకబడిన వర్గాల (ఓబీసీ)కు చెందిన వారు కాగా, అగ్రవర్ణాలకు చెందిన వారు 30 శాతం మంది, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు 16. 5 శాతం మంది ఉన్నారు. ముస్లిం మతానికి చెందిన వారు 8 శాతం మంది ఉన్నారు. అగ్రవర్ణాల వారికన్నా ఇతర వెనక బడిన వర్గాల వారే ఎక్కువ మంది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక పార్టీల పరంగా చూస్తే అగ్రవర్ణాలకు చెందిన వారు బీజేపీ తరఫున 34 మంది, రాష్ట్రీయ జనతాదళ్ తరఫున 13 మంది జేడీయూ తరఫున పది మంది, కాంగ్రెస్ పార్టీ తరఫున ఏడుగురు విజయం సాధించారు. వెనకబడిన వర్గాలకు చెందిన వారు రాష్ట్రీయ జనతాదళ్ తరఫున 39 మంది, బీజేపీ తరఫున 27 మంది, జేడీయూ తరఫున 22 గెలుపొందారు. కాంగ్రెస్ తరఫున ఇద్దరంటే ఇద్దరే విజయం సాధించారు. (చదవండి: కొలువు దీరిన నితీష్ కొత్త సర్కార్) ఇక టిక్కెట్ల కేటాయింపు విషయానికొస్తే మొత్తం 110 అభ్యర్థుల్లో అగ్రవర్ణాలకు 52 టిక్కెట్లు, ఇతర వెనకబడిన వర్గాలకు 39, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి 15 టిక్కెట్లు, షెడ్యూల్డ్, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారికి ఒక టిక్కెట్ కేటాయించింది. ముస్లిం వర్గానికి ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వలేదు. బీజేపీకి చెందిన మరో ముగ్గురు అభ్యర్థుల కులాలేమిటో నిర్ధారణ కాలేదు. ఇక రాష్ట్రీయ జనతాదళ్ పోటీ చేసిన 144 నియోజకవర్గాల్లో ఓబీసీలకు 69 టిక్కెట్లు, అగ్రవర్ణాలకు 23, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారికి 18, ముస్లింలకు 19 టిక్కెట్లను కేటాయించింది. ఆర్జేడీ తరఫున పోటీ చేసిన మరో 14 మంది అభ్యర్థుల కులాలేమిటో నిర్ధారణ కాలేదు. అయితే వారిలో ఎక్కువ మంది ఓబీసీలేనని అర్థం అవుతోంది. జేడీయూ విషయానికొస్తే ఓబీసీలకు 59 టిక్కెట్లు, అగ్రవర్ణాలకు 23 టిక్కెట్లు, షెడ్యూల్డ్ కులాలకు 18, ముస్లింలకు 11, షెడ్యూల్డ్ తెగలకు ఒక టిక్కెట్ కేటాయించారు. ముగ్గురు అభ్యర్థుల వివరాలు తెలియరాలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా అగ్రవర్ణాల వారికే ఎక్కువ సీట్లను కేటాయించగా, ఆర్జేడీ, జేడీయూ పార్టీలు వెనకబడిన వర్గాల వారికే కేటాయించాయి. ఇక అగ్రవర్ణాల్లో ఏ సామాజిక వర్గానికి పార్టీలు ఎక్కువ టిక్కెట్లు కేటాయించాయో పరిశీలిస్తే ఏ వర్గానికి ఆ పార్టీలు ప్రాధన్యత ఇచ్చాయో కూడా స్పష్టం అవుతుంది. బీజేపీ 24.5 శాతం టిక్కెట్లను రాజ్‌పుత్‌లకు, 11.8 శాతం టిక్కెట్లు బ్రాహ్మణులు, 7.3 శాతం టిక్కెట్లు భూమిహార్లు, బిహార్‌లో ఓబీసీలుగా పరిగణించే కొమట్లు కూడా వారి జనాభాతో పోల్చి చూస్తే ఎక్కువగానే ఇచ్చింది. ఇక ఓబీసీల్లో యాదవ్‌లకు 13.6 శాతం, ఇతర ఓబీసీలకు 22 శాతం టిక్కెట్లు కేటాయించింది. జనతాదళ్ యూ పార్టీ ఓబీసీల్లో కుర్మీలకు 14 శాతం, యాదవ్‌లకు 13 శాతం టిక్కెట్లను కేటాయించగా, యాదవ్‌లు, కుర్మీలు కాకుండా ఇతర ఓబీసీలకు 25 శాతం టిక్కెట్లను కేటాయించింది. ఆర్జేడీ 31 శాతం టిక్కెట్లను యాదవ్‌లకు, మిగతా శాతం టిక్కెట్లను మిగతా అన్ని వర్గాలకు కేటాయించింది. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాల వారికి 40 శాతం టిక్కెట్లను, ముస్లింలకు 17 శాతం టిక్కెట్లను కేటాయించింది. బీజీపీ కారణంగా 2000 సంవత్సరం నుంచి బీహార్ ఎన్నికల్లో ఠాకూర్ల ప్రాబల్యం పెరగతూ వస్తోంది. అందుకనే ఆ రాష్ట్రంలో బీజేపీని రాజ్‌పుత్‌ల పార్టీగా వ్యవహరిస్తున్నారు. తగ్గిన మహిళల ప్రాతినిధ్యం గత అసెంబ్లీ కన్నా ఈసారి ఎన్నికల్లో పలు పార్టీల తరఫున ఎక్కువ మంది మహిళలు పోటీ చేసినప్పటికీ తక్కువ మంది విజయం సాధించడం గమనార్హం. 2015 ఎన్నికల్లో 273 మంది మహిళలు పోటీ చేయగా, ఈసారి 371 మంది పోటీ చేశారు. వారిలో మహా కూటమి తరఫున 62 మంది పోటీ చేయగా, ఏన్డీయే తరఫున 37 మంది పోటీ చేశారు. గత ఎన్నికల్లో 28 మంది మహిళలు విజయం సాధించగా, ఈసారి 26 మంది మాత్రమే విజయం సాధించారు. -
జేడీ(యూ)కి ఓటేసినందుకు చితకబాదారు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు చివరదశ పోలింగ్ నేడు జరుగుతుంది. 19 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతుంది. జేడీయూకి ఓటు వేసినందుకుగాను ఆర్జేడీ కార్యకర్తలు ఓ మధ్యవయసు వ్యక్తిని చితకబాదారు. ఈ క్రమంలో బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఓ వీడియోను షేర్ చేశారు. దీనిలో ఓ వ్యక్తి జేడీయూకు ఓటు వేసినందుకు ఆర్జేడీ కార్యకర్తలు తనపై దాడి చేశారని చెప్పడం చూడవచ్చు. ఈ సంఘటన మాధేపూరలో చోటు చేసుకుంది. వీడియోలోని పెద్దాయన తాను బాణం గుర్తుకు ఓటు వేశానని చెప్పడంతో ఆర్జేడీ కార్యకర్తలు తనని చితకబాదారని తెలిపాడు. ‘ఆర్జేడీ అంటే బిహార్‌లో గూండారాజ్యం అని అర్థం’ అంటూ వీడియోని ట్వీట్ చేశారు అమిత్ మాల్వియా. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఇక కొద్ది రోజుల క్రితం ఆర్జేడీ ఎన్నికల ప్రచారం సమయంలో బీజేపీ ఓటర్లకు డబ్బు పంచుతున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘బిహార్‌లో ఓడిపోతానని బీజేపీకి అర్థమయ్యింది. అందుకే డబ్బులు పంచుతుంది. కానీ ఇది బిహార్ సార్. మీరు డబ్బుతో బిహారీలను కొనలేరు’ అంటూ వీడియోని ట్వీట్ చేసింది. (చదవండి: ‘నితీష్‌కు ముందే ఆ విషయం అర్థమైంది’) ఇక బిహార్‌లో నేడు చివరి దశ పోలింగ్ కొనసాగుతుంది. దాదాపు 2.35 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజలు రికార్డు స్థాయిలో ఓటు వేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. నవంబర్ 10న ఫలితాలు వెల్లడవుతాయి. ఇక కరోనా వ్యాప్తి తర్వాత దేశంలో మొదటి సారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారు. -
ఆయనే సంపన్న అభ్యర్థి.. ఆస్తి ఎంతంటే!
పట్నా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నాయి. కాగా ఈనెల 28న రాష్ట్రంలో తొలి విడత పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో 1064 మంది ఎన్నికల బరిలో నిలిచారు. 16 జిల్లాల్లోని 71 శాసన సభ స్థానాలకు జరుగుతున్న మొదటి దశ పోలింగ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్(ఏడీఆర్) సంపన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ 1064 మందిలో 375 మంది కోటీశ్వరులు ఉన్నట్లు వెల్లడించింది. మూడింట ఒక వంతు అభ్యర్థులు రూ. కోటికి పైగా ఆస్తులు కలిగి ఉన్నట్లు పేర్కొంది. (చదవండి: బిహార్ 2020: ప్రధాన మహిళా అభ్యర్థులు) అత్యధికంగా ఆర్జేడీ నుంచి ఏడీఆర్ నివేదిక ప్రకారం, ఆర్జేడీ నుంచి పోటీపడుతున్న 41 మంది అభ్యర్థులో 39 మంది, జేడీయూ నుంచి బరిలో దిగిన 35 మందిలో 31 మంది, బీజేపీకి చెందిన 29 మందిలో 24 మంది, ఎల్జేపీ 30(41), బీఎస్పీ 12(26), 14(21) మంది అభ్యర్థులు కోటి రూపాయల కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. అదే విధంగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు తొలి విడత పోలింగ్‌లో బరిలోకి దిగిన ఒక్కో అభ్యర్థి సగటున 1.99 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారని ఏడీఆర్ వెల్లడించింది. (తొలిసారి నాన్న లేకుండానే: చిరాగ్) ఆయనే సంపన్న అభ్యర్థి ఇక వీరందరితో పోలిస్తే ఆర్జేడీ నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అనంత్ కుమార్ 68 కోట్ల రూపాయల సంపదతో సంపన్న అభ్యర్థిగా నిలిచినట్లు ఏడీఆర్ పేర్కొంది. కాగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడిన ఆయన, ప్రస్తుతం మొకామా నియోజకవర్గం నుంచి ఆర్జేడీ గుర్తు మీద రంగంలోకి దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన గజానంద్ షాహి(షేక్‌పురా) రూ. 61 కోట్ల ఆస్తి కలిగి ఉండి రెండోస్థానాన్ని ఆక్రమించారు. వీరిద్దరి తర్వాత మనోరమా దేవి(జేడీయూ) రూ. 50 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో నిలిచారు. ఇక ఐదుగురు అభ్యర్థులు మాత్రం తమకు ఎలాంటి ఆస్తులు లేవని అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. -
10 లక్షల ఉద్యోగాలు : తేజస్వీ యాదవ్
సాక్షి, పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రధానంగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)నేత, బిహార్ ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ కేంద్రం, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగి రావాల్సిన అవసరం లేదంటూ మండిపడ్డారు. తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ‘మహాఘట్ బంధన్’ కూటమి మేనిఫెస్టోను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పలు హామీలను గుప్పించారు. ముఖ్యంగా తమ కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు, ప్రత్యేక హోదా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తాను స్వచ్ఛమైన బిహారీని అని తన డీఎన్ఏ స్వచ్ఛమైందని తేజస్వీ వ్యాఖ్యానించారు. మూడు దశల్లో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల గ్రాండ్ అలయన్స్ మ్యానిఫెస్టోను తేజస్వీ యాదవ్ శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నితీష్ ప్రభుత్వంపై తన దాడిని ఎక్కుపెట్టారు. నితీశ్ ది డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని, గత15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా, ప్రయోజనమేమీలేదని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అధికార దాహం తప్ప ప్రజల సంక్షేమంపై దృష్టి లేదంటూ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఫారాలు ఉచితం చేస్తా మన్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థుల ప్రయాణ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందన్నారు. అలాగే బడ్జెట్ లో 12 శాతం విద్యకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి తొక్కారని, ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమని ఆరోపించారు. మోతియారి షుగర్ మిల్లులో కప్పు టీ తాగుతానని చెప్పిన ప్రధాని, రాష్ట్రంలో వరుసగా చక్కెర మిల్లులు, జనపనార మిల్లులు, పేపర్‌మిల్లులు, రైస్ మిల్లులను మూసివేసారని దుయ్యబట్టారు. నితీష్ కుమార్ నాయకత్వంలోని, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కనీసం 60 స్కాంలు జరిగాయని, నేరాలు పెరిగి పోయాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలలో అతి ముఖ్యమైన అంశం నిరుద్యోగమని పేర్కొన్న తేజస్వి ఉపాధి,ఉద్యోగాలు కోల్పోయిలన ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు. వ్యాపారాలు నాశనమై పోయినా, వరదలతో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు దెబ్బతింటే, ఇప్పటి వరకూ కేంద్రం పర్యటించిన పాపాన పోలేదని తేజస్వీ మండి పడ్డారు. అంతేకాదు ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, మాధ్యమిక పాఠశాలల్లో 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటారని ప్రకటించారు. దీంతోపాటు, ‘స్మార్ట్ గ్రామ యోజన’ కింద ప్రతి పంచాయతీలో డాక్టర్, నర్సులతో క్లినిక్స్, దీంతోపాటు ప్రాన్ హమారా, సంకల్ప్ బద్లావ్ కా లాంటి పథకాలను మ్యానిఫెస్టోలో ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు రణదీప్ సురేజ్వాలా, శక్తిసింహ్ గోహిల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా 243 సీట్ల రాష్ట్ర అసెంబ్లీ అక్టోబర్ 28 నుంచి మూడు దశల్లో ఎన్నిలు జరగనున్నాయి. నవంబర్ 10న ఫలితాలు ప్రకటించనున్న సంగతి తెలిసిందే. -
బిహార్ ఎన్నికలు.. మరక మంచిదే
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కనీసం 22 మందిపై హత్య, దోపిడీ వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. కానీ దీని గురించి పార్టీ ఎలాంటి ఆందోళన చెందలేదు. ఇక ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, ఆర్జేడీ తన అభ్యర్థులు ఎదుర్కొంటున్న నేరారోపణలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా, ఇతర పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటించింది. క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అభ్యర్థులలో అనంత్ సింగ్ కూడా ఉన్నారు. అతను 38 తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ పార్టీ అతన్ని మోకామా నుంచి బరిలో నిలుపుతుంది. సోషల్ మీడియాలో ఆర్జేడీ సమర్పించిన అతని నేర చరిత్ర కథనం ప్రకారం, అనంత్ సింగ్‌పై మొత్తం హత్యా నేరం సహా మొత్తం 38 కేసులు ఉన్నాయి. మర్డర్ కేసు పెండింగ్‌లో ఉంది. (చదవండి: వీడిన చిక్కుముడి.. కుదిరిన ఒప్పందం) అయినప్పటికీ, ఆర్జేడీ అనంత్ సింగ్‌కు టికెట్ ఇచ్చింది. ఇతర అభ్యర్థుల కంటే అనంత్ సింగ్ చాలా ఫేమస్ అని వాదిస్తుంది. పైగా అతను పేద, అణగారిన వర్గాలకు సాయం చేస్తాడు కాబట్టే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అని పార్టీ సమర్థించింది. అనంత్ సింగ్ మోకామా నుంచి గెలిచే అవకాశం ఉందని, ఇది అతన్ని ఆదర్శ అభ్యర్థిగా మారుస్తుందని పార్టీ పేర్కొంది. ఇక క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న ఇతర ఆర్జేడీ అభ్యర్థులు బెలగంజ్ నుంచి పోటీ చేస్తున్న సురేంద్ర యాదవ్, షాపూర్ నుంచి రాహుల్ తివారీ, జాముయి నుంచి విజయ్ ప్రకాష్, నోఖా నుంచి అనితా దేవి, డెహ్రీ నుంచి ఫతే బహదూర్ సింగ్, ఫతుహా నుంచి రామానంద్ యాదవ్, రాజౌలి నుంచి రెజాజుల్, షెర్ఘాటి దినారా నుంచి కుమార్ మండల్, భాబువా నుంచి భరత్ బింద్, షాపూర్ నుంచి రాహుల్ తివారీ, బెల్హార్ నుంచి రామ్‌దేవ్ యాదవ్, సూర్యగర నుంచి ప్రహ్లాద్ యాదవ్, సందేష్ నుంచి కిరణ్ దేవి, మఖ్దంపూర్ నుంచి సతీష్ కుమార్, జముయి నుంచి విజయ్ ప్రకాష్, ఝాజ నుంచి రాజేంద్ర ప్రసాద్, సీతామార్హి నుండి రఫీగంజ్ మొహమ్మద్ నిహలుద్దీన్, మీనాపూర్ నుంచి సునీల్ కుమార్, మీనాపూర్ నుంచి రాజీవ్ కుమార్, మహువా నుంచి ముఖేష్ కుమార్ రోషన్, దర్భంగా రూరల్ నుంచి లలిత్ కుమార్ యాదవ్, అత్రి నుండి అజయ్ యాదవ్ ఈ జాబితాలో ఉన్నారు. వీరందరిపై దోపిడీ, మోసం, దాడి మొదలైన నేరారోపణలు ఉన్నాయి. (చదవండి: జేడీ(యు)లో చేరిన ఆర్జేడీ నేత కుమారుడు) ఈ క్రమంలో జనతా దళ్ (యునైటెడ్) ప్రతినిధి రాజీవ్ రంజన్ ఆర్జేడీ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ తీరు మారదని దుయ్యబ్టటారు. ‘ఆర్జేడీ ఇచ్చిన సమాచారం చూస్తే.. ఇక అది తన వైఖరిని ఎన్నటికి మార్చుకోదని స్పష్టం అవుతుంది. హత్య, దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది, ఎందుకంటే వారు పాపులర్, తప్పక గెలుస్తారని. బిహార్ అభివృద్ధి చెందుతుంది.. కానీ ఆర్జేడీ కాదని ఇప్పుడు స్పష్టమైంది’ అన్నారు. జేడీ (యూ) ఆరోపణలను ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఖండించారు. తన పార్టీని సమర్థిస్తూ.. "మేము బాహుబలి, నేరస్థులకు టికెట్లు ఇచ్చామని మా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఒక నాయకుడు బీజేపీ, జేడీ (యూ)లో ఉన్నంత కాలం, అతను ఒక ప్రవక్త, హరిశ్చంద్ర. కానీ అతను ఆర్జేడీలోకి వస్తే అతను క్రిమినల్, రేపిస్ట్, బాహుబలి అవుతాడు. ఆశ్రయం గృహ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంజు వర్మకు టికెట్ ఇచ్చినందున జేడీ (యూ)కు మాపై ఆరోపణలు చేసే హక్కు లేదు" అన్నారు. -
జేడీ(యు)లో చేరిన ఆర్జేడీ నేత కుమారుడు
పాట్నా: ఆర్జేడీ సీనియర్ నాయకుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ కుమారుడు సత్యప్రకాష్ సింగ్ గురువారం జేడీ(యు) పార్టీలో చేరారు. వైశాలి జిల్లా మన్హర్ అసెంబ్లీ స్థానాన్ని ఆశించి ఆయన భంగపడ్డారు. త్వరలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్జేడీ పార్టీ సభ్యుడు, డాన్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన రామా సింగ్ భార్యకు లాలు ప్రసాద్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. ఆమెకు టికెట్ ఇచ్చిన మరుసటి రోజే సత్య ప్రకాష్ సింగ్ జేడీ(యు)లో చేరడం చర్చనీయాంశం మారింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు జేడీ(యు) రాష్ట్ర అధ్యక్షుడు బసిస్తా నారాయణ్ సింగ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బసిస్తా మాట్లాడుతూ.. తన తండ్రి కలను తనయుడిగా ప్రకాష్ నేరవేరుస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సత్యప్రకాష్ సింగ్ మాట్లాడుతూ... ఇటీవల తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టానని చెప్పారు. తన తండ్రి రఘువంశ్ కలలను తాను పూర్తి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన తండ్రి సోషల్‌లిస్టు భావాలను నమ్మె వ్యక్తి అని అందుకే రాజకీయాల్లో ఒక కుటుంబం నుంచి ఒక్కరూ ఇద్దరూ సభ్యులు మాత్రమే ఉండాలని ఆయన బలంగా నమ్ముతారని చెప్పారు. సోషలిస్ట్ నాయకుడైన కార్పూరి ఠాకూర్ తన జీవితకాలంలో దీనిని ఆచరించారని, అలాగే తన తండ్రి కూడా అదే విశ్వసించారని చెప్పారు. పార్టీని తమ కుటుంబాన్ని కాదని మరొకరికి ఆర్జేడీ టిక్కెట్ ఇవ్వడాన్ని ఆయన విమర్శించారు. ఆర్జేడీ పార్టీ ప్రతినిధి తివారీ స్పందిస్తూ.. విజయావకాశాలు ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వడంలో తప్పు లేదని వ్యాఖ్యానించారు. 2014లో వైశాలి నియోజవర్గం నుంచి రామా సింగ్ లోకసభ ఎన్నికలకు ఆర్జేడీ పార్టీ నుంచి పోటీ చేయడంపై రఘువంశ్ సింగ్ వ్యతిరేకించారు. గత నెలలో రఘువంశ్ సింగ్ కన్నుమూశారు. లాలూప్రసాద్ యాదవ్‌కు విశ్వాసపాత్రునిగా ఉంటూ రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించిన ఆయన చనిపోవడానికి నాలుగు రోజుల ముందు ఆర్జేడీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన రాజీనామాను రాంచీ జైలులో ఉన్న లాలూ అంగీకరించలేదు. ఆరోగ్యం కుదుటపడ్డాక మాట్లాడుకుందామంటూ జవాబిచ్చారు. -
వీడిన చిక్కుముడి.. కుదిరిన ఒప్పందం
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యు), బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహార విషయం కొలిక్కి వచ్చినట్లు కన్పిస్తోంది. మొత్తం 243 స్థానాలలో సగం సీట్లను బీజేపీకి ఇచ్చేయనుంది. దీంతో జేడీయూ 122 సీట్లలో, బీజేపీ 121 సీట్లలో పోటీ చేయనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు(మంగళవారం) వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. జేడీయూ వాటాలో ఉన్న 122 సీట్లలో అయిదు స్థానాలను జితిన్ రాం మాంఝి నేతృత్వంలోని హెచ్‌ఎమ్‌కు వెళ్లనుండగా, బీజేపీకి చెందిన 121 సీట్లలో కొన్ని ముఖేష్ నిషాద్కు చెందిన వికాషీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ)కు ఇవ్వనున్నారు. (ఆర్జేడీ తొలి జాబితా విడుదల.. ఇద్దరికి దక్కని చోటు) రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఎన్డీయే నుంచి తప్పుకుని సొంతంగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే తమ పార్టీ జనతాదళ్(యు)పై పోటీ చేస్తామని ప్రకటించింది కానీ బీజేపీ వ్యతిరేకంగా కాదని రాం విలాస్ పాశ్వాన్ అన్నారు. ఎల్జేపీ 42 సీట్లు కోరితే కేవలం 15 సీట్లు మాత్రమే ఇస్తానని బీజేపీ చెప్పడంతో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోతున్నట్టు పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు. ఈ మేరకు బిహార్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. (ఒంటరి పోరుకు ఎల్జేపీ సిద్ధం) -
బిహార్ ఎన్నికలు : నితీష్ వ్యూహాత్మక ఎత్తుగత
పట్నా : రాజకీయాల్లో ఏ సమయంలో ఏం చేయాలనేదే కీలకం. ఆ ఒడుపులన్నింటినీ ఒడిసిపట్టడంలో దిట్టగా పేరొందిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికల సమయంలో భారీ పథకంతో వేడిని రాజేశారు. సెప్టెంబర్ 25న బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ మూడు విడతల పోల్ షెడ్యూల్‌ను ప్రకటించిన మరుక్షణమే నితీష్ ఏడు సూత్రాల కార్యక్రమం -2ను ప్రకటించారు. 2015లో తన విజయానికి దోహదపడిన సాథ్ నిశ్చయ్ (ఏడు అంశాలు)కు కొనసాగింపుగా ఆయన ఈ ప్రకటన చేశారు. యువతకు ఉపాధి అవకాశాలను సమకూర్చే నైపుణ్య శిక్షణా కార్యక్రమాల నుంచి మహిళలోల వ్యాపార దక్షతను పెంచడం, వ్యవసాయ భూములకు సాగునీరు లభ్యత, ప్రజలకు వైద్య సౌకర్యాలు మెరుగపరచడం వంటి పలు అంశాలను ఈ ప్రణాళికలో పొందుపరించారు. వ్యాపారాలను ప్రారంభించే ఆసక్తి కలిగిన మహిళలకు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. దళిత యువతీ, యువకులకూ ఈ తరహా పథకాన్ని నితీష్ ఇప్పటికే అమలు చేస్తున్నారు. సాథ్ నిశ్చయ్ పథకం ప్రశంసలు దక్కించుకోవడమే కాకుండా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌ను విజయతీరాలకు చేర్చింది. అప్పట్లో బీజేపీతో జట్టు కట్టిన రాం విలాస్ పాశ్వాన్, ఉపేంద్ర కుష్వహ, జితిన్ రాం మాంఝీ వంటి హేమాహేమీలను ఎదుర్కొని నితీష్ జయకేతనం ఎగురవేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ వంటి పార్టీల సాయంతో నితీష్ ఆ ఎన్నికల్లో ఎదురీదుతారన్న అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన సారథ్యంలోని జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహాకూటమి విజయం సాధించింది. చదవండి : బిహార్‌లో మహాకూటమికి షాక్ ప్రతి ఇంటికీ పైపుల ద్వారా తాగునీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్లు కల్పించడంతో పాటు మరుగుదొడ్లు నిర్మిస్తామని, ప్రతి గ్రామలో రహదారుల నిర్మాణం చేపడతామని ఆ ఎన్నికల్లో నితీష్ వాగ్ధానం చేశారు. ఇప్పుడు ఆ పనులన్నీ దాదాపు పూర్తవుతున్నాయి. ఆ ఊపుతోనే నితీష్ వ్యూహాత్మకంగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సాథ్ నిశ్చయ్-2ను తెరపైకి తీసుకువచ్చారు. మహాకూటమిని వీడి ఈసారి ఎన్డీయే పక్షాన అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతున్న నితీష్ మరోసారి విజయం సాధిస్తే ఆయన రికార్డుస్ధాయిలో ఏడోసారి బిహార్ పాలనా పగ్గాలను చేపడతారు. ఇక ఈసీ వెల్లడించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మూడు దశల్లో అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న జరగనుంది. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. -
‘నీ తండ్రి ఏం ఉద్యోగం ఇచ్చాడు’
పట్నా: బిహార్ షెయిక్‌పూర్ నియోజకవర్గ జేడీయూ ఎమ్మెల్యే రంధీర్ కుమార్ సోనికి ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మే 22న తీసిన ఈ వీడియోలో రంధీర్ కుమార్ షెయిక్‌పూర్‌లోని చండి గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న వలస కార్మికులు ఉద్యోగాలు, మౌళిక వసతుల గురించి ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తగినన్ని ఉద్యోగాలు కల్పించడంలో ఎందుకు వెనకబడ్డాయి అంటూ వలస కూలీలు రంధీర్ కుమార్‌ను ప్రశ్నించారు. (‘ఆ బస్సులను ఆపకండి’) దానికి సదరు ఎమ్మెల్యే ‘మీ తండ్రి నీకు ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా’ అంటూ వలస కూలీని ప్రశ్నించారు. దాంతో వలస కూలీలకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిసస్థితి చేయి దాటడంతో రంధీర్ అక్కడి నుంచి మరో క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారు. అయితే రంధీర్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ మండిపడడ్డారు. ఎమ్మెల్యే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని తేజస్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. (క్వారంటైన్లో కోడికూర ఇవ్వలేదని..) -
ప్రశాంత్ కిషోర్‌పై జేడీయూ వేటు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్) విషయంలో పార్టీ వైఖరిని ప్రశ్నించినందుకు పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్‌ను జనతాదళ్(యూ) బహిష్కరించింది. సీఏఏ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తున్న కిషోర్... ఈ విషయంలో పార్టీ వైఖరిని తప్పుబడుతున్నారు. నితీశ్ ఈ రెండింటికీ మద్దతివ్వటాన్ని ప్రశాంత్‌తో పాటు జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి పవన్ వర్మ విమర్శించారు. ఈ రెండింటికీ వ్యతిరేకంగా విపక్షాలు ఒక్కటవ్వాలని ప్రశాంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీనుంచి వారిద్దరినీ బహిష్కరిస్తున్నట్లు జేడీయూ తెలిపింది. ‘వారిద్దరూ సీఎంను అవమానించేలా మాట్లాడారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించారు’ అని పార్టీ పేర్కొంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి, పార్టీ పదవుల నుంచి తక్షణమే అమల్లోకి వచ్చేలా ప్రశాంత్ కిషోర్, పవన్ వర్మలను బహిష్కరిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. నితీశ్ మళ్లీ సీఎం కావాలి: ప్రశాంత్ బహిష్కరణ ప్రకటన వెలువడిన వెంటనే ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ‘కృతజ్ఞతలు నితీశ్‌జీ. మీరు మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ’ అని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించడం వల్లే ప్రశాంత్ కిషోర్‌ను పార్టీలో చేర్చుకున్నానని మంగళవారం నితీశ్ చెప్పటంతో ఇద్దరి మధ్యా విభేదాలు తీవ్రమయ్యాయి. దానిపై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహిస్తూ... ‘‘ఎంత దిగజారిపోయారు!!. ఇలాంటి అబద్ధం చెప్పి నన్నూ మీ స్థాయికి లాగుతున్నారా? ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే అమిత్ షా సిఫారసులున్న నన్ను తొలగించే ధైర్యం మీకుంటుందా? దాన్ని ఎవరైనా నమ్ముతారా?’’ అని ప్రశ్నించారు. తృణమూల్‌లో చేరనున్నారా? ప్రశాంత్ త్వరలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారని వినిపిస్తోంది. కానీ ఈ వార్తను తృణమూల్ వర్గాలు నిర్ధారించలేదు. భవిష్యత్తులో ఆ అవకాశం లేకపోలేదంటూ... ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ లేదా తమ అధినేత్రి మమత బెనర్జీనే ధ్రువీకరించాలని టీఎంసీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీ పేర్కొన్నారు. మమత బెనర్జీతో ప్రశాంత్‌కు సంబంధాలున్నాయన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రశాంత్ సేవలను టీఎంసీ ఉపయోగించుకుంటోంది. -
'పార్టీ ఎజెండాను నితీశ్ అపహాస్యం చేశారు'
పట్నా : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, దౌత్యవేత్త పవన్ వర్మ 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నితీష్ కుమార్ 'వార్ రూమ్' ను విజయవంతంగా నడిపించారు. రాష్ట్ర జనతాదళ్ (ఆర్జెడి), జనతాదళ్ (యునైటెడ్)లతో కూడిన గ్రాండ్ అలయన్స్ కూటమి తరపున నితీశ్ ముఖ్యమంత్రి అవడంలో కీలకపాత్ర పోషించారు. అయితే తాజాగా వీరిద్దరు నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా మారారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కు నితీశ్ మద్దతు ఇవ్వడంపై వీరిద్దరు విరుచుకుపడుతున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జేడియూ బిజెపితో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో నేషనల్ పాపులేషన్ రిజిస్టార్(ఎన్పీఆర్), నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)లపై కూడా నితీశ్ స్పందించడం లేదు. దీంతో సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలపై నితీశ్ నుంచి తాను కేవలం సైద్దాంతిక స్పష్టతను కోరుతున్నట్లు పవన్ వర్మ వెల్లడించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గురించి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను పవన్ వర్మ గుర్తుచేస్తూ.. ఆర్ఎస్ఎస్ ధరించే కాషాయ దుస్తులు దేశానికి "అత్యంత ప్రమాదకరమైనదని' అభివర్ణించారని వెల్లడించారు. తాజాగా ఢిల్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని పార్టీ ఎజెండాను నితీశ్ అపహాస్యం చేశారని మండిపడ్డారు. కాషాయ ఎజెండాకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, సోషలిస్టు శక్తులు తిరిగి సంఘటితం కావాల్సిన అవసరం ఉందని పవన్ వర్మ పేర్కొన్నారు.(ప్రశాంత్ కిషోర్, నితీష్ మధ్య బయటపడ్డ విభేదాలు..!) సీఏఏకు నితీశ్ మద్దతివ్వడంపై జేడియూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నసంగతి తెలిసిందే. కాగా మంగళవారం, పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రశాంత్ కిషోర్‌పై ' ఉండాలనుకుంటే ఉండు లేకపోతే లేదు' అంటూ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రశాంత్ కిషోర్ ట్విట్టర్లో స్పందించారు. బీజేపీ నాయకుడు అమిత్ షా ఆదేశాల మేరకే తనను పార్టీలోకి తీసుకున్నానని నితీశ్ చెప్పినవన్నీ అబద్దాలేనంటూ ప్రశాంత్ కొట్టిపారేశారు.(అమిత్ షాకు ప్రశాంత్ కిషోర్ కౌంటర్..!) -
లాలు ఇంట్లో దయ్యాలు!
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ సీఎం తన అధికార నివాసాన్ని వదిలి వెళ్లేముందు అక్కడ దయ్యాలను వదిలేశారా? తన తరువాత ముఖ్యమంత్రి పీఠం చేపట్టిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లక్ష్యంగా లాలు ఆ పని చేశారా? అంటే అవుననే అంటున్నారు నితీశ్ కుమార్. నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక అనధికార కార్యక్రమంలో ఈ విషయాలను నితీశ్ కుమార్ పంచుకున్నారు. 2005లో ఆర్జేడీ అధికారం కోల్పోయాక, నితీశ్ లాలు కుటుంబం నివాసం ఉన్న 1, అన్నేమార్గ్ భవనంలోకి మారారు. విశాలంగా ఉన్న ఆ ఇంటి వెనక భాగంలో తనకు పెద్ద పెద్ద మట్టికుప్పలు కనిపించాయని, ఇంటి నలుమూలల్లో కొన్ని కాగితపు కవర్లు కనిపించాయని నితీశ్ గుర్తు చేసుకున్నారు. నీ కోసం కొన్ని దయ్యాలను ఆ ఇంట్లో వదిలి వచ్చానని ఆ తరువాత ఒక సందర్భంలో లాలు ప్రసాద్ యాదవ్ స్వయంగా నితీశ్‌తో చెప్పారట. అయితే, ఆ మాటలను లాలు తనదైన స్టైల్లో సరదాగానే అన్నారని నితీశ్ పేర్కొన్నారు. అయితే, నితీశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బిహార్‌లో సంచలనం సృష్టించాయి. నితీశ్ గతంలో లాలుకు నష్టం కలిగించే ఉద్దేశంతో పట్నాలోని కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారని గురువారం ఆర్జేడీ ఉపాధ్యక్షుడు శివానందతివారీ ఆరోపించారు. ఆ పూజలు చేసిన పూజారులు ఈ విషయాన్ని లాలుకు చెప్పారని, దాంతో లాలు ఆ ప్రభావం తనపై పడకుండా వేరే పూజలు చేశారని తివారీ వివరించారు. ఈ విషయం తనకు లాలునే చెప్పారన్నారు. కాగా, మూఢనమ్మకాలను, మంత్రతంత్రాలను లాలు విశ్వసిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. అదే సమయంలో నితీశ్‌కు అలాంటి నమ్మకాలేవీ లేవని ప్రచారముంది. -
జేడీ(యూ)17, బీజేపీ17, లోక్ జనశక్తి 6
పాట్నా : బీజేపీ, జనతాదళ్(యునైటెడ్), లోక్ జనశక్తి పార్టీల పొత్తు నేపథ్యంలో పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తయింది. అధికార ఎన్డీఏ కూటమి తరుపున బీహార్ లోక్‌సభ ఎన్నికల్లో ఆయా పార్టీల తరుపున పోటీ చేయనున్న స్థానాలపై బీజేపీ ఉపాధ్యక్షుడు అమిత్‌షా స్పష్టతనిచ్చారు. ఆదివారం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కార్యాలయంలో ఆయనతో భేటీ అయిన అమిత్‌షా ఈ మేరకు సీట్ల పంపకాన్ని పూర్తి చేశారు. జేడీ(యూ), బీజేపీలు తలా 17 స్థానాల్లో పోటీ చేయనున్నాయని సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అమిత్‌షా పేర్కొన్నారు. ఇక కేంద్రమంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ)కి ఆరు సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. కాగా ఉదయం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన నితిష్ కుమార్ బీహార్‌లో కరువు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లాలకు సహాయం చేయాలని కోరారు. పాతమిత్రులందరూ..ఒక్కటయ్యారు.. 2014 బిహార్ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చిన్న చిన్న పార్టీలతో చేతులు కలిపినా ఇంచుమించుగా ఒంటరి పోరాటమే చేసింది. విభేదాల కారణంగా చిరకాల మిత్రుడు నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్)తో ఎన్నికలకు ముందే తెగదెంపులు చేసుకోవడం కమలనాథులకు కలిసి వచ్చింది. కానీ ఈ అయిదేళ్లలో పరిస్థితులు మారాయి. పాత మిత్రులందరూ మళ్లీ చేతులు కలిపారు. ఎన్నికలకు ముందే బీజేపీ, నితీష్ కుమార్ జేడీ (యూ), రామ్‌విలాస్ పాశ్వానే నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీల మధ్య పొత్తు పొడిచింది. అయితే లాలూప్రసాద్ యాదవ్ ఆర్జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీ, ఇతర పార్టీలతో కలిసి ఏర్పాటైన మహాగఠ్ బంధన్ నుంచి గట్టి పోటీయే ఉంది. అందుకే కుల సమీకరణలు, కేంద్రం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలనే నమ్ముకొని బీజేపీ ప్రచారం చేస్తోంది. -
‘ఆమె లావయ్యారు..విశ్రాంతి అవసరం’
జైపూర్ : బహిష్కృత జేడీ(యూ) నేత శరద్ యాదవ్ రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్ధాన్ సీఎం వసుంధరా రాజెను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు బాడీ షేమింగ్ అంటూ ప్రత్యర్దులు విరుచుకుపడ్డారు. వసుంధర రాజె లావయ్యారని, ఆమెకు విశ్రాంతి అవసరమని శరద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ‘ఆమెకు కొంత విశ్రాంతి ఇవ్వండి..మధ్యప్రదేశ్ బిడ్డ అయిన వసుంధర రాజె ఈ మధ్య లావయ్యారు..అలిసిపోతున్నా’రని బుధవారం ఆల్వార్‌లో జరిగిన ఓ ప్రచార సభలో పేర్కొన్నారు. శరద్ యాదవ్ వసుంధర రాజెపై చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. -
ముందు సీట్ల సంగతి తేల్చండి..
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్ధుబాటుపై నిర్థిష్ట ఒప్పందం జరగాలని జేడీ(యూ) కోరుతోంది. సరైన తరుణంలో ఈ దిశగా బీజేపీ చొరవచూపాలని, దీనిపై ఇంతవరకూ ఆ పార్టీ నుంచీ ఎలాంటి సంకేతాలు లేవని జేడీ(యూ) వర్గాలు పేర్కొన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలు 2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే పూర్తి భిన్నమైనవని గుర్తెరగాలని జేడీ(యూ) తేల్చిచెప్పింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూలంకషంగా చర్చించిన మీదట సీట్ల పంపకాలపై ఓ నిర్ణయానికి రావడం మేలని సూచించింది. క్షేత్రస్ధాయిలో ప్రస్తుత పరిణామాలను అంచనా వేసి సరైన ఎత్తుగడతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సీనియర్ జేడీ(యూ) నేత పేర్కొన్నారు. గత లోక్‌సభ ఎన్నికల ప్రాతిపదికన సీట్ల పంపకం ఉండాలన్న బీజేపీ ప్రతిపాదనను జేడీ(యూ) శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే దానికి నిదర్శనంగా భావించాలని స్పష్టం చేశాయి. బిహార్‌కు ప్రత్యేక హోదా వర్తింపచేయకపోవడం రానున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు 2020లో జరిగే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమికి ప్రతికూలంగా మారే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.