పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యు), బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహార విషయం కొలిక్కి వచ్చినట్లు కన్పిస్తోంది. మొత్తం 243 స్థానాలలో సగం సీట్లను బీజేపీకి ఇచ్చేయనుంది. దీంతో జేడీయూ 122 సీట్లలో, బీజేపీ 121 సీట్లలో పోటీ చేయనున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు(మంగళవారం) వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. జేడీయూ వాటాలో ఉన్న 122 సీట్లలో అయిదు స్థానాలను జితిన్ రాం మాంఝి నేతృత్వంలోని హెచ్‌ఎమ్‌కు వెళ్లనుండగా, బీజేపీకి చెందిన 121 సీట్లలో కొన్ని ముఖేష్ నిషాద్‌కు చెందిన వికాషీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ)కు ఇవ్వనున్నారు. (ఆర్జేడీ తొలి జాబితా విడుదల.. ఇద్దరికి దక్కని చోటు)
రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఎన్డీయే నుంచి తప్పుకుని సొంతంగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే తమ పార్టీ జనతాదళ్(యు)పై పోటీ చేస్తామని ప్రకటించింది కానీ బీజేపీ వ్యతిరేకంగా కాదని రాం విలాస్ పాశ్వాన్ అన్నారు. ఎల్జేపీ 42 సీట్లు కోరితే కేవలం 15 సీట్లు మాత్రమే ఇస్తానని బీజేపీ చెప్పడంతో ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోతున్నట్టు పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు. ఈ మేరకు బిహార్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. (ఒంటరి పోరుకు ఎల్జేపీ సిద్ధం)
Comments
Please login to add a commentAdd a comment