
న్యూఢిల్లీ: జేడీ(యూ)పై ఆధిపత్య పోరులో బిహర్ సీఎం నితీశ్ కుమార్ విజయం సాధించారు. పార్టీని, ‘బాణం’ గుర్తును ఆయనకే కేటాయిస్తున్నట్లు శుక్రవారం ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. జేడీ(యూ) పార్టీలోని మెజారిటీ శాసనసభ్యులు, జాతీయ కౌన్సిల్ నితీశ్‌కే మద్దతు తెలిపినట్లు పేర్కొంది. పార్టీని, గుర్తును తమకే కేటాయించాలంటూ శరద్ యాదవ్ వర్గం దాఖలు చేసిన పిటిషన్ ఈసీ తిరస్కరించింది.
బీజేపీకి మద్దతు, ఆర్జేడీతో తెగదెంపుల విషయంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు రావడంతో పార్టీ రెండుగా చీలింది. దీంతో జేయూ(యూ) అధ్యక్షుడిగా సీనియర్ నేత, ఎమ్మెల్యే చోటుభాయ్ అమర్సాంగ్ వాసవను శరద్ నియమించారు. తమదే అసలైన జేడీ(యూ) అని ఈసీని అమర్సాంగ్ కోరగా ఈసీ శుక్రవారం తన నిర్ణయం వెలువరించింది.