the dominant fighting
-
నితీశ్ కుమార్‌దే జేడీ(యూ): ఈసీ
న్యూఢిల్లీ: జేడీ(యూ)పై ఆధిపత్య పోరులో బిహర్ సీఎం నితీశ్ కుమార్ విజయం సాధించారు. పార్టీని, ‘బాణం’ గుర్తును ఆయనకే కేటాయిస్తున్నట్లు శుక్రవారం ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. జేడీ(యూ) పార్టీలోని మెజారిటీ శాసనసభ్యులు, జాతీయ కౌన్సిల్ నితీశ్‌కే మద్దతు తెలిపినట్లు పేర్కొంది. పార్టీని, గుర్తును తమకే కేటాయించాలంటూ శరద్ యాదవ్ వర్గం దాఖలు చేసిన పిటిషన్ ఈసీ తిరస్కరించింది. బీజేపీకి మద్దతు, ఆర్జేడీతో తెగదెంపుల విషయంలో ఇరువురు నేతల మధ్య విభేదాలు రావడంతో పార్టీ రెండుగా చీలింది. దీంతో జేయూ(యూ) అధ్యక్షుడిగా సీనియర్ నేత, ఎమ్మెల్యే చోటుభాయ్ అమర్సాంగ్ వాసవను శరద్ నియమించారు. తమదే అసలైన జేడీ(యూ) అని ఈసీని అమర్సాంగ్ కోరగా ఈసీ శుక్రవారం తన నిర్ణయం వెలువరించింది. -
ఆప్ సర్కారుతో ఆగని ‘జంగ్’
ఏసీబీలో బిహార్ పోలీసులను డిప్యుటేషన్‌పై నియమించిన సర్కారు న్యూఢిల్లీ: ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కు మధ్య ఆధిపత్య పోరు మరింతగా ముదురుతోంది. ఉద్యోగుల నియామకంైపై తలెత్తిన వివాదం ఓ పక్క కోర్టుల్లో నానుతుండగానే.. ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ విభాగానికి సంబంధించి తాజా ఘర్షణ తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం బిహార్‌కు చెందిన ఆరుగురు పోలీసు అధికారులను డిప్యుటేషన్‌పై ఢిల్లీ ఏసీబీలో నియమించాలని నిర్ణయించగా.. ఆ నిర్ణయం చెల్లబోదని ఎల్జీ అభ్యంతరం చెప్పారు. ఏసీబీ నేరుగా తన అధికార పరిధిలో తన నియంత్రణలో తన పర్యవేక్షణలో పని చేస్తుందని.. దీనిలో నియామకాలు చేసే అధికారం తనకు మాత్రమే ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ జంగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీనిపై ఆప్ సర్కారు తీవ్రంగా ప్రతిస్పందించింది. ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన ఏసీబీ కోసం దేశంలోని ఎక్కడి నుంచైనా పోలీసు అధికారులను నియమించుకునే పూర్తి అధికారాలు తనకు ఉన్నాయని పేర్కొంది. కాగా, కేంద్రం మరోసారి ఎల్జీ వైఖరికి మద్దతు పలికింది. మరోపక్క.. ఢిల్లీ ఏసీబీ కార్యకలాపాల నిర్వహణకు కేంద్రం, ఎల్జీ ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ధ్వజమెత్తింది. ఆప్ సర్కారు ఎల్జీతో అనవసర ఘర్షణలకు దిగుతోందని బీజేపీ తప్పుపట్టింది. వివాదం కారణంగా ఢిల్లీవాసులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. -
నేడు ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాల విలీనం
సాక్షి, హైదరాబాద్: వివాదాలు, కోర్టు కేసులు, ఆధిపత్య పోరు మూలంగా పదేళ్ల క్రితం విడిపోయిన ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాలను మళ్లీ ఏకం చేసి కొత్త సంఘా న్ని ఏర్పాటు చేస్తున్నామని రెండు గ్రూపుల నేతలు టి.వై.ఎస్. శర్మ, టి.సాయిబాబ, షౌకత్ అలీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు సంఘాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘాన్ని(టీఎస్పీటీఏ) ఏర్పాటు చేస్తున్నామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ని ఎస్సీఈఆర్టీలో సమావేశమై సంఘాల విలీనంతో పాటు టీఎస్పీటీఏ కొత్తకార్యవర్గాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.