21 పాయింట్ల తేడాతో హరియాణా ఘనవిజయం
72 పాయింట్లతో అగ్రస్థానం మరింత పటిష్టం
పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ జోరుకు హరియాణా స్టీలర్స్ చెక్ పెట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా ఏకంగా 21 పాయింట్ల తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. స్టీలర్స్ 46–25 స్కోరుతో తెలుగు టైటాన్స్ జట్టును చిత్తు చేసింది. రెయిడర్ వినయ్ (7) ఆరంభం నుంచే క్రమం తప్పకుండా పాయింట్లు తెచి్చపెట్టడంతో హరియాణా ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత మరో రెయిడర్ శివమ్ పతారే (12) కూతలో పాయింట్ల వేగం పెంచడంతో స్కోరు అమాంతం పెరిగిపోయింది. మిగతా వారిలో ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా (5), డిఫెండర్లు రాహుల్ (4), సంజయ్ (3) రాణించడంతో స్టీలర్స్ ఎదురులేని విజయం సాధించింది.
టైటాన్స్ తరఫున స్టార్ రెయిడర్ ఆశిష్ నర్వాల్ (13) అదరగొట్టాడు. 14 సార్లు కూతకెళ్లిన ఆశిష్ రెయిడింగ్‌లో 11 పాయింట్లు చేశాడు. ప్రత్యర్థి రెయిడర్లు నిలువరించి రెండు టాకిల్ పాయింట్లు సాధించాడు. కెపె్టన్ విజయ్ మాలిక్ 5, డిఫెండర్ అంకిత్ 2 పాయింట్లు చేశారు. మొత్తం 12 జట్లు పోటీపడుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌లో ఇప్పటి వరకు 18 మ్యాచ్‌లు ఆడి హరియాణా 14 మ్యాచ్‌ల్లో గెలిచింది.
4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 72 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. తెలుగు టైటాన్స్ జట్టు 18 మ్యాచ్‌ల్లో 10 విజయాలు, 8 పరాజయాలతో 54 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచింది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 30–26 స్కోరుతో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. దబంగ్ జట్టును కెప్టెన్ అశు మలిక్ (13) ముందుండి నడిపించాడు. 19 సార్లు రెయిడింగ్‌కు వెళ్లిన 13 పాయింట్లు తెచ్చి పెట్టాడు.
సహచరుల్లో నవీన్ కుమార్ (4), యోగేశ్ (3), ఆశిష్ (2) స్కోరు చేశారు. పుణేరి జట్టులో అత్యధికంగా రెయిడర్ మోహిత్ గోయత్ 7 పాయింట్లు చేశాడు. మిగతా వారిలో పంకజ్ మోహితె (5), ఆకాశ్ షిండే (4), అమన్ (3) రాణించారు. దబంగ్ ఢిల్లీ 17 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు, 5 పరాజయాలు, 4 ‘టై’లతో కలిపి మొత్తం 56 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పుణేరి పల్టన్ 18 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 7 మ్యాచ్‌ల్లో నెగ్గి, 8 మ్యాచ్‌ల్లో ఓడింది. 3 మ్యాచ్‌లను ‘టై’గా ముగించింది. 49 పాయింట్లతో ఏడో ర్యాంక్‌లో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో గుజరాత్ జెయింట్స్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్ (రాత్రి 8 గంటల నుంచి), బెంగాల్ వారియర్స్‌తో బెంగళూరు బుల్స్ (రాత్రి 9 గంటల నుంచి) తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment