
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 24–42 స్కోరుతో హరియాణా స్టీలర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. హరియాణా రెయిడర్ మీతూ శర్మ అదరగొట్టాడు.
18 సార్లు కూతకెళ్లిన మీతూ 13 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో మన్‌జీత్ (7), కెప్టెన్ నితిన్ రావల్ (4), జైదీప్ దహియా (4) రాణించారు. తెలుగు టైటాన్స్‌లో సిద్ధార్థ్ దేశాయ్ చేసిన 5 పాయింట్లే అత్యధిక స్కోరు. ఆదర్శ్, విజయ్ కుమార్ చెరో 4 పాయింట్లు చేశారు. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన టైటాన్స్ ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment