PKL 11: ప్రొ కబడ్డి లీగ్‌ ఫైనల్‌ తేదీ, వేదిక ఖరారు | PKL Season 11: Play Offs And FInal Venue Fix Check Dates | Sakshi
Sakshi News home page

PKL 11: ప్రొ కబడ్డి లీగ్‌ ఫైనల్‌ తేదీ, వేదిక ఖరారు

Published Thu, Nov 28 2024 10:58 AM | Last Updated on Thu, Nov 28 2024 1:12 PM

PKL Season 11: Play Offs And FInal Venue Fix Check Dates

ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ ఫైనల్‌ వేదిక ఖరారైంది. పుణే వేదికగా ఈ మెగా టోర్నీ టైటిల్‌ పోరు జరుగనుంది. ఈసారి లీగ్‌ను మూడు నగరాల్లో నిర్వహిస్తుండగా... హైదరాబాద్‌ వేదికగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం నోయిడా వేదికగా పోటీలు జరుగుతున్నాయి.

ఇక.. డిసెంబర్‌ 3 నుంచి మూడో అంచె మ్యాచ్‌లు పుణేలో జరుగుతాయి. ఆ తర్వాత ప్లే ఆఫ్స్, సెమీఫైనల్స్‌తో పాటు తుదిపోరును పుణేలోనే నిర్వహించనున్నారు. బలేవాడి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఉన్న బ్యాడ్మింటన్‌ హాల్‌లో ఈ పోటీలు నిర్వహిస్తారు.

డిసెంబర్‌ 29న
ఇక గ్రూప్‌ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మరోవైపు.. మూడు నుంచి ఆరు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌లో తలపడతాయి. కాగ.. డిసెంబర్‌ 26న రెండు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు... డిసెంబర్‌ 27న రెండు సెమీఫైనల్స్‌ జరుగుతాయి. డిసెంబర్‌ 29న ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.

ఎనభై మ్యాచ్‌లు ముగిసేసరికి ప్రొ కబడ్డి లీగ్‌ 2024 పాయింట్ల పట్టిక ప్రస్తుతం ఇలా..
1. హర్యానా స్టీలర్స్‌: ఆడినవి 14.. గెలిచినవి 11.. ఓడినవి మూడు.. పాయింట్లు 56
2. యు ముంబా: ఆడినవి 13... గెలిచినవి 8.. ఓడినవి 4.. టై.. ఒకటి.. పాయింట్లు 45
3. దబాంగ్‌ ఢిల్లీ: 14... గెలిచినవి 6... ఓడినవి ఐదు.. టై.. మూడు.. పాయింట్లు 43
4. తెలుగు టైటాన్స్‌: ఆడినవి 13... గెలిచినవి 8.. ఓడినవి 5.. పాయింట్లు 43
5. పట్నా పైరేట్స్‌: ఆడినవి 13... గెలిచినవి 7.. ఓడినవి 5.. టై ఒకటి.. పాయింట్లు 43

6. పుణెరి పల్టన్‌: ఆడినవి 14... గెలిచినవి 6.. ఓడినవి 5.. టై ఒకటి.. పాయింట్లు 42
7. జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌: ఆడినవి 13.. గెలిచినవి 7.. ఓడినవి ఐదు.. టై ఒకటి.. పాయింట్లు 40
8. యూపీ యోధాస్‌: ఆడినవి 13... గెలిచినవి 6.. ఓడినవి 6.. టై ఒకటి.. పాయింట్లు 38
9. తమిళ్‌ తలైవాస్‌: ఆడినవి 13.. గెలిచినవి 5.. ఓడినవి 7.. టై ఒకటి.. పాయింట్లు 33
10. బెంగాల్‌ వారియర్స్‌: ఆడినవి 13... గెలిచినవి 3.. ఓడినవి 8.. టై 2.. పాయింట్లు 25
11. గుజరాత్‌ జెయింట్స్‌: ఆడినవి 13.. గెలిచివని 4.. ఓడినవి 8.. టై ఒకటి.. పాయింట్లు 25
12. బెంగళూరు బుల్స్‌: ఆడినవి 14.. గెలిచినవి 2.. ఓడినవి 12.. పాయింట్లు 16.

చదవండి: రాణించిన రహానే.. దుమ్మురేపిన శ్రేయస్‌ అయ్యర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement