‘ఆమె లావయ్యారు..విశ్రాంతి అవసరం’ | Sharad Yadav Says Vasundhara Raje Needs Rest | Sakshi
Sakshi News home page

‘ఆమె లావయ్యారు..విశ్రాంతి అవసరం’

Published Thu, Dec 6 2018 7:59 PM | Last Updated on Thu, Dec 6 2018 8:00 PM

Sharad Yadav Says Vasundhara Raje Needs Rest - Sakshi

రాజస్థాన్‌ సీఎం వసుంధరా రాజె (ఫైల్‌ఫోటో)

వసుంధరా రాజెపై శరద్‌ యాదవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

జైపూర్‌ : బహిష్కృత జేడీ(యూ) నేత శరద్‌ యాదవ్‌ రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్ధాన్‌ సీఎం వసుంధరా రాజెను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు బాడీ షేమింగ్ అంటూ ప్రత్యర్దులు విరుచుకుపడ్డారు. వసుంధర రాజె లావయ్యారని, ఆమెకు విశ్రాంతి అవసరమని శరద్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

‘ఆమెకు కొంత విశ్రాంతి ఇవ్వండి..మధ్యప్రదేశ్‌ బిడ్డ అయిన వసుంధర రాజె ఈ మధ్య లావయ్యారు..అలిసిపోతున్నా’రని బుధవారం ఆల్వార్‌లో జరిగిన ఓ ప్రచార సభలో పేర్కొన్నారు. శరద్‌ యాదవ్‌ వసుంధర రాజెపై చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement