వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే గడపగడప కార్యక్రమం ద్వారా ప్రజలకు బాగా చేరువైన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్‌లో నిర్వహించనున్న పాదయాత్రకు ముందు పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు, ప్రతి ఇంటికి పార్టీని చేర్చేందుకు ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం సమీపంలో ఉన్న రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో ‘ వైఎస్సార్ గుర్తుగా .. జగనన్నకి తోడుగా..’ పేరుతో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.