
పట్నా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడి అవతారమెత్తనున్నారు. బిహార్‌లో ఆయన ప్రారంభించిన జన్‌సురాజ్ అభియాన్ సంస్థ గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ 2న రాజకీయ పార్టీగా మారనుంది. రాజకీయ పార్టీగా మారేముందు ప్రశాంత్‌కిశోర్ పెద్దఎత్తున కసరత్తు చేయనున్నారు.
అక్టోబర్ 2కు ముందు జన్‌సురాజ్ తమ నేతలతో ఎనిమిది రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహించనుంది. ప్రశాంత్‌కిశోర్ పాదయాత్ర కోసం పనిచేసిన లక్షన్నర మంది కార్యకర్తలతో రాష్ట్రవ్యాప్త సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలన్నింటిలో పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉండాలి.. విధి విధానాలు ఏంటి..పార్టీ ప్రాధాన్యాలేంటన్న విషయాలపై చర్చించి ఫైనల్ చేయనున్నారు.
జన్‌సురాజ్ పేరు మీద బిహార్‌లో ప్రశాంత్‌కిశోర్ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సభల్లో విద్య, వైద్యం, యువతకు ఉద్యోగ అవకాశాలపైనే ఎక్కువ ఫోకస్ చేసి ప్రసంగించారు.
కాగా, ఇటీవల తమ కార్యకర్తలెవరూ జన్‌సురాజ్‌తో సంబంధాలు నెరపొద్దని బిహార్ ప్రతిపక్షపార్టీ ఆర్జేడీ ఒక అంతర్గత సర్కులర్ జారీ చేసింది. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బిహార్‌లో అత్యంత బలమైన పార్టీ అని చెప్పుకునే ఆర్జేడీ తమను చూసి భయపడుతోందని జన్‌సురాజ్‌ఎద్దేవా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment