Jan Suraaj
-
నితీశ్, లాలూ పీడ వదిలించడమే ఎజెండా: ప్రశాంత్‌కిశోర్
పట్నా: తాను ప్రారంభించబోయే రాజకీయ పార్టీ ప్రాథమిక ఎజెండాను రాజకీయ వ్యూవహకర్త ప్రశాంత్‌కిశోర్ ఆదివారం(ఆగస్టు4) ప్రకటించారు. బిహార్ నుంచి యువత వలసలు ఆపడానికి, బిహార్‌ను నితీశ్, లాలూల నుంచి విముక్తి చేయడమే తన పార్టీ ప్రధాన ఎజెండా అని చెప్పారు. అక్టోబర్ 2న కోటి మంది బిహారీలు సమావేశమై తమ పిల్లల భవిష్యత్తును నిర్ణయించుకుంటారన్నారు.‘అక్టోబర్ 2న ప్రశాంత్‌కిశోర్ పార్టీ ప్రారంభించడం లేదు. బిహార్ ప్రజలు కొత్త పార్టీ ప్రారంభించుకుంటున్నారు. నితీశ్‌కుమార్, లాలూ ప్రసాద్‌లను వదిలించుకుని తమ పిల్లల భవిష్యత్తును నిర్ణయించుకోబోతున్నారు. గతంలో నేను రాజకీయ పార్టీల గెలుపు కోసం పనిచేశాను. ఇప్పుడు మాత్రం బిహార్ ప్రజలకు వ్యూహకర్తగా పనిచేయబోతున్నాను’అని చెప్పారు. కాగా,ప్రశాంత్‌కిశోర్ జన్‌సురాజ్ పేరుతో బిహార్‌లో పాదయాత్ర చేశారు. జనసురాజ్‌ను అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రాజకీయ పార్టీగా ప్రకటించనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జన్‌సురాజ్ పోటీ చేయనుంది. -
అక్టోబర్ 2న ప్రశాంత్‌కిశోర్ కొత్త పార్టీ
పట్నా: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడి అవతారమెత్తనున్నారు. బిహార్‌లో ఆయన ప్రారంభించిన జన్‌సురాజ్ అభియాన్ సంస్థ గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ 2న రాజకీయ పార్టీగా మారనుంది. రాజకీయ పార్టీగా మారేముందు ప్రశాంత్‌కిశోర్ పెద్దఎత్తున కసరత్తు చేయనున్నారు.అక్టోబర్ 2కు ముందు జన్‌సురాజ్ తమ నేతలతో ఎనిమిది రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహించనుంది. ప్రశాంత్‌కిశోర్ పాదయాత్ర కోసం పనిచేసిన లక్షన్నర మంది కార్యకర్తలతో రాష్ట్రవ్యాప్త సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలన్నింటిలో పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉండాలి.. విధి విధానాలు ఏంటి..పార్టీ ప్రాధాన్యాలేంటన్న విషయాలపై చర్చించి ఫైనల్ చేయనున్నారు.జన్‌సురాజ్ పేరు మీద బిహార్‌లో ప్రశాంత్‌కిశోర్ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన సభల్లో విద్య, వైద్యం, యువతకు ఉద్యోగ అవకాశాలపైనే ఎక్కువ ఫోకస్ చేసి ప్రసంగించారు. కాగా, ఇటీవల తమ కార్యకర్తలెవరూ జన్‌సురాజ్‌తో సంబంధాలు నెరపొద్దని బిహార్ ప్రతిపక్షపార్టీ ఆర్జేడీ ఒక అంతర్గత సర్కులర్ జారీ చేసింది. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బిహార్‌లో అత్యంత బలమైన పార్టీ అని చెప్పుకునే ఆర్జేడీ తమను చూసి భయపడుతోందని జన్సురాజ్ఎద్దేవా చేసింది. -
ఎన్నికల బరిలో ప్రశాంత్ కిషోర్? పీకే సమాధానమిదే..!
పట్నా: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెటుతున్నట్లు కొద్ది నెలల క్రితం విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన ఓ పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఇప్పటి వరకు దానిపై స్పష్టత లేదు. ఇప్పుడు మరోమారు ఈ అంశం తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు ఇన్నాళ్లు మౌనం పాటించిన ఆయన సస్పెన్స్‌ను బ్రేక్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు. బిహార్ వ్యాప్తంగా ప్రజలను కలిసేందుకంటూ ‘జన్ సూరాజ్ అభియాన్’ ఏర్పాటు చేసిన క్రమంలో ఆయనకు ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఓ ఇంటర్వ్యూలో మీరు ఎన్నికల బరిలో నిలుస్తున్నారా? అని అడిగి ప్రశ్నకు సమాధానంగా.. ‘నేను ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి? నాకు అలాంటి ఆకాంక్షలు లేవు’ అని తేల్చేశారు ప్రశాంత్ కిషోర్. ఈ సందర్భంగా జేడీయూ, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పించారు. తాను స్వతంత్రంగా ఉండేందుకు నిర్ణయించుకున్న తర్వాత జేడీయు నేతలు తనను తిట్టేందుకు ఇష్టపడుతున్నారని ఆరోపించారు. తనకు రాజకీయ అవగాహన లేకపోతే నితీశ్ కుమార్ వెంట రెండేళ్లు ఏం పని చేశానో ఆయననే ప్రశ్నించాలని సూచించారు. జేడీయూ-ఆర్జేడీ కూటమి ప్రభుత్వం ఏడాదికి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని తోసిపుచ్చారు ప్రశాంత్ కిషోర్. వారు ఇచ్చిన హామీని నెరవేరుస్తే తన పాదయాత్రను ఆపేస్తానని సవాల్ చేశారు. బిహార్‌లో 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారు కిషోర్. ఈ సందర్భంగా జన్ సూరాజ్ కార్యక్రమం పార్టీగా మారనుందా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. 'మునుగోడు' వేడి చల్లారకముందే.. -
నితీశ్ సర్కార్‌కు పీకే బంపరాఫర్
పాట్నా: జన్ సురాజ్ అభియాన్ ద్వారా బీహార్‌లో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులేస్తారని భావిస్తున్న ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ప్రకటన చేశారు. బీహార్ ప్రజలకు ఇచ్చిన ఒక హామీని నెరవేరిస్తే.. తన జన్ సురాజ్ అభియాన్ క్యాంపెయిన్‌ను ఆపేస్తానని, నితీశ్ సర్కార్‌కు మద్దతు ప్రకటిస్తానని పేర్కొన్నారాయన. సమస్తిపూర్‌లో బుధవారం తన మద్దతుదారులతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్.. మహాగట్బంధన్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో అంతగా ఆదరణ లేదని వ్యాఖ్యానించారాయన. అంతేకాదు.. నితీశ్ కుమార్ సీఎం కుర్చీకి ఫెవికల్ అంటించుకుని కూర్చుంటే.. మిగతా పార్టీలు ఆయన చుట్టూరా తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్.. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీహార్ యువతకు పది లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే నితీశ్ కుమార్ కూడా మొన్న స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనూ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఉంటుందని ప్రకటించారు. ఈ ఇద్దరూ రాబోయే ఏడాది, రెండేళ్లలో తమ తమ హామీని నెరవేరిస్తే చాలూ.. నా జన్ సురాజ్ అభియాన్‌ను ఆపేస్తా. అంతేకాదు నితీశ్ కుమార్ ప్రభుత్వానికి నా మద్దతు ప్రకటిస్తా అని మీడియా ముఖంగా తెలిపారు పీకే. ప్రత్యక్ష రాజకీయ పార్టీగా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ.. ప్రాంతాల వారీగా సమస్యలు తెలుసుకోవడం, వాటికి పరిష్కారాలు చూపెట్టడం లాంటివి చేస్తుందని జన్ సురాజ్ అభియాన్‌పై గతంలోనే పీకే ఒక స్పష్టత ఇచ్చారు. అయితే నితీశ్ కుమార్‌కు మాత్రం జేఎస్ఏ గుబులు పుట్టిస్తూ వస్తోంది. ఇదీ చదవండి: మూడొంతుల మందిపై క్రిమినల్ కేసులు! -
ప్రశాంత్ కిశోర్ కామెంట్‌పై నితీశ్ కుమార్ కౌంటర్
పట్నా: తన పరిపాలనపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. ప్రశాంత్ కిశోర్ అభిప్రాయం తమకు అవసరం లేదని, తమ పాలన గురించి ప్రజలకు పూర్తిగా అవగాహన ఉందని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘బిహార్‌లో మేం మేలు చేశామా, లేదా అనేది ప్రజలకు తెలుసు. ఇక్కడ ఎవరి అభిప్రాయం ముఖ్యం కాదు. వాస్తవం ఒక్కటే ముఖ్యం. మా పని ప్రజలకు తెలుసు. మా పని తీరు ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. మీకు తెలుసు కాబట్టి, మీరే సమాధానం ఇవ్వమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు, మేము వ్యాఖ్యలకు ప్రతిస్పందించాలి. అయితే ఈ సందర్భంలో వాస్తవికత ఏమిటో మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని స్పందించమని అడుగుతున్నాన’ని నితీశ్ కుమార్ అన్నారు. బిహార్‌లో మార్పుతీసుకువచ్చేందుకు ‘జన్ సురాజ్’ వేదికను ప్రారంభిస్తున్నట్టు ప్రశాంత్ కిశోర్ గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లాలూ ప్రసాద్, నితీశ్ కుమార్ పాలనలో బిహార్ అంతగా అభివృద్ధి సాధించలేదని అన్నారు. బిహార్‌లో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. (క్లిక్: ‘జన సురాజ్’ ప్రకటించిన ప్రశాంత్ కిశోర్) నితీశ్ కుమార్‌ను కలవకుండా తప్పించుకోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నితీశ్ కుమార్‌తో వ్యక్తిగతంగా నాకు ఎలాంటి విభేదాలు లేవు. మా మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగత సంబంధాలు వేరు. కలిసి పనిచేయడం వేరు. ఒక వేళ నితీష్ కుమార్ నన్ను సమావేశానికి పిలిస్తే తప్పకుండా వెళ్తాను. దీని అర్థం అన్ని విషయాల్లో ఆయనతో ఏకీభవిస్తానని కాదు. నితీష్ జీ నాకు తండ్రి లాంటి వారు. ఆయనతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నంత మాత్రాన నాకు ప్రత్యేక రాజకీయ పంథా ఉండకూడదని ఏమీ లేదు కదా’ అని ప్రశాంత్ కిశోర్ సమాధానిమచ్చారు. (క్లిక్: బగ్గా అరెస్ట్.. మూడు రాష్ట్రాల పోలీసుల ‘టగ్ ఆఫ్ వార్’) -
‘జన సురాజ్’ ప్రకటించిన ప్రశాంత్ కిశోర్
పట్నా: బిహార్‌లో మా ర్పుతీసుకువచ్చేందుకు ‘జన్ సురాజ్’ వేదికను ఆరంభిస్తున్నట్లు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గురువారం ప్రకటించారు. ప్రస్తుతానికి రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, భవిష్యత్‌లో జన్ సురాజ్ వేదికే పార్టీగా మారే అవకాశాలుండొచ్చని చెప్పారు. బిహార్‌లో మార్పుకోరుకునే తనలాంటి 18వేల మందితో టచ్‌లో ఉన్నానని చెప్పారు. వీరందరినీ తాను తలపెట్టిన పాదయాత్రకు ముందే వ్యక్తిగతంగా కలిసేందుకు యత్నిస్తానని చెప్పారు. గాంధీజీ చెప్పిన సరైన చర్యలే మంచి రాజకీయమన్న సూక్తి ఆధారంగా తానీ జన్ సురాజ్‌ను ఆరంభించానని తెలిపారు. సంవత్సరంలో 3వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని, రాష్ట్రం నలుమూలలా వీలైనంత మందిని కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. లాలూ, నితీశ్ సాధ్యమైనంత మేర సాధికారత తెచ్చేందుకు యత్నించారని, కానీ రాష్ట్రం అభివృద్ధి సూచీల్లో అట్టడుగునే ఉందని తెలిపారు. బిహార్‌కు కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమన్నారు. అదే సమయంలో బెంగాల్లో మమతతో పనిచేయడంపై జవాబిస్తూ అక్కడ టీఎంసీకి పూర్తి యంత్రాంగం ఉందని, బిహార్‌లో అంతా కొత్తగా ఆరంభించాలని చెప్పారు. బిహార్‌లో ఓబీసీల హవా అధికం, తాను బ్రాహ్మిణ్ కావడం వల్లనే భవిష్యత్ సీఎంగా ముందుకురాలేకపోయారన్న ప్రశ్నకు బదులిస్తూ బిహార్‌లో ప్రస్తుతం మోదీకి అత్యధిక ఓట్లు రాబట్టే సత్తా ఉందని, కానీ బిహార్‌లో ఆయన కులస్తులెందరున్నారని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: తమిళనాడులో నీట్‌పై రగడ.. ఢిల్లీ తలుపు తట్టిన గవర్నర్