
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ప్రశాంత్ కిషోర్‌ను మేము వదిలేశాక బాబు పట్టుకున్నారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.
సాక్షి, చిత్తూరు: చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, ప్రశాంత్ కిషోర్‌ను మేము వదిలేశాక బాబు పట్టుకున్నారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బాబు తప్పుడు ప్రచారానికి ఎల్లో మీడియా అండగా ఉందని మండిపడ్డారు.
‘‘2019 ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు వైఎస్సార్‌సీపీకి వస్తాయి. సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా ఎన్ని కుయుక్తులు పన్నిన వచ్చే ఎన్నికల్లో తిరిగి సీఎం జగనేనని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: గ్రామీణ ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం: సీఎం జగన్