18వసారి జెండా ఎగురవేసిన సీఎం నితీష్‌ కుమార్‌ | Celebrations in Bihar CM Nitish Kumar | Sakshi
Sakshi News home page

18వసారి జెండా ఎగురవేసిన సీఎం నితీష్‌ కుమార్‌

Published Thu, Aug 15 2024 10:35 AM | Last Updated on Thu, Aug 15 2024 1:14 PM

Celebrations in Bihar CM Nitish Kumar

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ స్వాతంత్య్ర దినోత్సవ వేళ అరుదైన రికార్డు సాధించారు. రాజధాని పట్నాలోని గాంధీ మైదాన్‌లో నితీశ్‌ కుమార్‌ 18వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ ఘనత సాధించిన తొలి బీహార్ సీఎంగా ఆయన ఘనత సాధించారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతం ఆయన ఆ జెండాకు వందనం చేశారు.

ఈ సందర్భంగా సీంఎ నితీష్‌ కుమార్‌ మాట్లాడుతూ నేడు మనం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని, కొన్ని వందల మంది త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. అనంతం ఆయన బీహార్ ప్రభుత్వం సాధించిన అభిృద్ధి గురించి వివరించారు. బాలికల విద్య, పోలీసుశాఖలో మహిళల నియామకం, ఉపాధ్యాయుల నియామకంలో ప్రభుత్వం ఎంతో చొరవచూపిందన్నారు. బీపీఎస్సీ ద్వారా రెండు లక్షల 20 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని తెలిపారు.

రోగులకు ఆహారం అందించేందుకు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో దీదీకి రసోయ్‌ను ప్రారంభించామని సీఎం నితీశ్‌కుమార్‌ పేర్కొన్నారు. 2003లో అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పాట్నాలో ఎయిమ్స్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపారని, దీని నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. పట్నాలో ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కారానికి ఎలివేటెడ్ రోడ్లు, ఓవర్ బ్రిడ్జిలతో సహా అనేక కొత్త రోడ్లను నిర్మించామని తెలిపారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement