
భగీరథ పనులు పరిశీలించిన మంత్రి ఈటల
మిషన్ భగీరథ పనులను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం ఉదయం పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు ఉన్నారు.