సాక్షి, అనంతపురం : అది స్త్రీ సంక్షేమ శాఖ. అంటే మహిళలు, యువతుల సంక్షేమం కోసం పనిచేసే సంస్థ. కానీ అందులో పనిచేసే ఉద్యోగునులకే భద్రత లేకుండా పోయింది. తమ లైంగిక వాంఛ తీర్చాలంటూ ప్రతిరోజు వేధింపులే. పైఅధికారుల తీరుతో విరక్తి చెందిన ఓ మహిళా ఉద్యోగి, తన ఉన్నతాధికారికి తగిన రీతిలో బుద్ది చెప్పింది. అధికారి భాగోతాన్ని బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం ఐసీడీఎస్ పీడీ వెంకటేశం ఓ మహిళా ఉద్యోగిపట్ల గత కొద్ది కాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. తన కోరిక తీర్చాలని లేకపోతే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ప్రతిరోజు వెంకటేశం ఫోన్‌లో సదరు మహిళా ఉద్యోగిని వేధిస్తున్నాడు. అయితే అధికారి ఫోన్‌కాల్స్ అన్నింటిని మహిళా ఉద్యోగి రికార్డు చేసి తండ్రికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఉద్యోగి తండ్రి వెంకటేశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపులు ఆపకపోతే ఆడియో టేపులను బయటపెడతామని హెచ్చరించారు. దీంతో దారికి వచ్చిన వెంకటేశం తన బాగాతాన్ని బయటపెట్టొద్దని, తన ఉద్యోగం పోతుందంటూ ఫోన్‌లోనే క్షమాపణ కోరాడు. దీంతో విషయం కొద్ది మేర సద్దుమణిగింది. గతంలోనే వెంకటేశంపై పలు ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నవెంకటేశంను సస్పెండ్ చేయాలంటూ జిల్లా ఐద్వా అధ్యక్షురాలు సావిత్రి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment