rajkumar
-
విఖ్యాత ఆటగాడిగా ఎదిగిన స్క్వాష్ దిగ్గజం ఇకలేరు
భారత దిగ్గజ స్క్వాష్ క్రీడాకారుడు బ్రిగేడియర్ రాజ్‌కుమార్ మన్‌చందా కన్నుమూశారు. ఆయన వయస్సు 79 ఏళ్లు కాగా... అనారోగ్య కారణాలతో ఢిల్లీలో మృతి చెందినట్లు మంగళవారం కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. రాజ్ మన్‌చందా మృతిపట్ల క్రీడాభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో విశేషంగా రాణించి భారత్‌కు పతకాలు అందించిన ఆయన స్క్వాష్‌లో విఖ్యాత ఆటగాడిగా ఎదిగారు. 33 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ చాంపియన్‌గా నిలిచిన ఆయన 1977 నుంచి 1982 వరకు వరుసగా టైటిళ్లను నిలబెట్టుకున్నారు.రాజ్ తన కెరీర్లో ఓవరాల్‌గా 11 టైటిళ్లు సాధించారు. ఆసియా చాంపియన్‌షిప్ సహా పలు అంతర్జాతీయ టోర్నీలలో సత్తా చాటుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 1983లో ‘అర్జున అవార్డు’ను అందజేసింది. 1980 దశకాన్ని శాసించిన జహంగీర్ ఖాన్‌ను 1981లో ఎదుర్కొన్న ఆయన పలు అంతర్జాతీయ టోర్నీలకు భారత స్క్వాష్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. కరాచీలో 1981లో జరిగిన ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ రజత పతకం సాధించింది. 1984 ఆసియా చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలవడం ఆయన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన కాగా... ఆ ఈవెంట్లో టీమ్ ఈవెంట్లో భారత్ కాంస్య పతకం గెలుచుకుంది. ఆస్ట్రేలియాతోన్ టెన్నిస్ గ్రేట్ ఫ్రేజర్ మృతి మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో టెన్నిస్ దిగ్గజం నీల్ ఫ్రేజర్ మంగళవారం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో 91 ఏళ్ల ఫ్రేజర్ మృతి చెందారు. తమ దేశం ఓ మేటి దిగ్గజాన్ని కోల్పోయిందని టెన్నిస్ ఆ్రస్టేలియా (టీఏ) తెలిపింది. 24 ఏళ్ల సుదీర్ఘ టెన్నిస్ కెరీర్లో ఫ్రేజర్ మూడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లతో పాటు ప్రతిష్టాత్మక డేవిస్ కప్ టోర్నీలో వరుసగా నాలుగుసార్లు ఆస్ట్రేలియాను గెలిపించాడు. 1960లో జరిగిన వింబుల్డన్ ఫైనల్లో తమ దేశానికే చెందిన దిగ్గజం రాడ్ లేవర్ను ఓడించి టైటిల్ చేజిక్కించుకున్నారు. ఆ ఏడాది ఏకంగా 11 మేజర్ టైటిల్స్ (పురుషుల డబుల్స్) సాధించారు. అంతకుముందు ఏడాది (1959) యూఎస్ ఓపెన్‌లో టైటిళ్ల క్లీన్‌స్వీప్ చేశారు. సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ మూడు ట్రోఫీలు కైవసం చేసుకున్నారు. టెన్నిస్‌లో విజయవంతమైన, విశేష కృషి చేసిన ఆయన్ని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) 1984లో ‘టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్’లో చేర్చింది. 2008లో టెన్నిస్‌లో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుగా అభివరి్ణంచే ‘ఫిలిప్ చాట్రియెర్’ అవార్డును ఫ్రేజర్‌కు ప్రదానం చేసింది. -
కారుతో ఢీకొట్టి.. 4 కి.మీ.ఈడ్చుకెళ్లి..
మునిపల్లి (అందోల్): బైక్‌పై వెళుతు న్న ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టాడు.. గాయపడి న వ్యక్తి కారు బంపర్ లో ఇరు క్కుపోయినా పట్టించుకోలేదు. నాలుగు కిలోమీటర్లు అలాగే ఈడ్చుకెళ్లడంతో ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ అమానవీయ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. బుదేరా ఎస్ఐ రాజేశ్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. వన పర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్ల కానపురం తండాకు చెందిన మెగావత్ వెంకటేశం (22) హైదరాబాద్ మియాపూర్‌లో ఉంటూ ఎల్ఎల్బీ చదువుతున్నాడు. జహీరాబాద్ లోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి బైక్‌పై మియాపూర్‌కు పయన య్యాడు. హైదరాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్ కర్ణాటకలోని గానుగాపూర్ దైవదర్శ నానికి వెళ్లి కారులో తిరిగి వస్తూ.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పరిధిలో ముంబై జాతీయ రహదారిపై వెంకటేశాన్ని వేగంగా ఢీకొట్టాడు. దీంతో బైక్ పక్కకు పడిపోగా వెంకటేశం కారు బంపర్‌లో చిక్కుకున్నాడు. ఈ విషయం తెలిసినా కూడా రాజ్‌కుమార్.. కారుతో అలాగే నాలుగు కిలోమీటర్లు వెళ్లిపోయాడు. ఈ క్ర మంలో లింగంపల్లి టోల్గేట్ వద్ద ఆగిన కారు.. మృతదేహం ఇరుక్కుపోవడం వల్ల ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో టోల్గేట్ సిబ్బంది వచ్చి చూడగా.. మృతదే హం ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశాన్ని సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు చెప్పారు.ఛిద్రమైన శరీరం..కారులో ఇరుక్కున్న వెంకటేశం మృతదేహం పూర్తిగా ఛిద్రమైంది. వీపుభాగం మొ త్తం కాలిపోయింది. కాళ్లు విరిగిపోయాయి. తలకు తీవ్ర గాయం కావడంతో రక్త స్రావమైంది. చేతులు నెంబర్ ప్లేట్లో, కొన్ని శరీర భాగాలు పొగగొట్టంలో ఇరు క్కుపోయాయి. రోడ్డు ప్రమాదం జరగడంతో భయపడి తాను కారు అపకుండా వచ్చానని రాజ్‌కుమార్ అంగీకరించినట్టు బుదేరా ఎస్ఐ రాజేశ్‌నాయక్ తెలిపారు. -
మంత్రి అనగాని ఇలాకాలో శ్రుతిమించిన దౌర్జన్యం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: అధికారం అండతో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. వాహనాలను తగులబెడుతున్నారు. కులం పేరుతో దూషిస్తున్నారు. ఊరు వదిలిపోవాలని హెచ్చరిస్తున్నారు. వెళ్లనివారిపై దాడులు చేసి కొడుతున్నారు. తీవ్రంగా గాయపరుస్తున్నారు. నాయకులపై దాడులు చేయడంతోపాటు వారి ఆస్తులకు నష్టం చేస్తున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సొంత ఇలాకా రేపల్లె నియోజకవర్గంలో ఈ తరహా దాడులు పెచ్చుమీరాయి.ఆదివారం రాత్రి చెరుకుపల్లి మండలం రాంబోట్లవారిపాలెంలో వైఎస్సార్సీపీ ఎస్సీ నాయకుడు చేబ్రోలు రాజ్‌కుమార్ ఇంటిపై 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లు తదితర మారణాయుధాలతో దాడిచేశారు. రాజ్‌కుమార్‌ను కులం పేరు పెట్టి రాయలేని పదజాలంతో దూషించారు. మాకు వ్యతిరేకంగా పనిచేస్తావా..? అంటూ దాడిచేసి తీవ్రంగా కొట్టారు. బయటకు లాక్కొచ్చి ఇంటిమెట్లపైన, ఇంటిముందున్న ఇసుక దిబ్బపైన పడేసి మళ్లీమళ్లీ కొట్టారు. దాడివిషయం తెలుసుకున్న అతడి బంధువులు అక్కడికి చేరుకోవడంతో రాజ్‌కుమార్ కొనప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన రాజ్‌కుమార్‌ను తొలుత రేపల్లె ఆస్పత్రికి తరలించారు. తరువాత తెనాలి ఆస్పత్రిలో చేర్చారు.తనను ఊరువదలి వెళ్లిపోవాలని టీడీపీ కార్యకర్తలు హెచ్చరించారని రాజ్‌కుమార్ తెలిపారు. రాం»ొట్లవారిపాలెం, పగడంవారిపాలెం, పిట్టుకోటిరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లు తదితర మారణాయుధాలతో దాడి చేసినట్లు బాధితుడు సోమవారం జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ప్రసాదరెడ్డిని టీడీపీ మూకలు బెదిరిస్తున్నాయి.చెరుకుపల్లి మండలం ఆరుంబాక గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, న్యాయవాది కర్ర ప్రతాప్ ఇంటిపై దాడిచేసి ఆయన ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు. గుళ్లపల్లిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. నిజాంపట్నం మండలం అడవులదీవి సర్పంచ్ ఏమినేని రాంబాబు ఇంటిపై దాడిచేసి కిటికీ అద్దాలు పగులగొట్టారు. నియోజకవర్గవ్యాప్తంగా టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను ఊర్లు వదలివెళ్లాలని నిత్యం బెదిరిస్తున్నారు. -
చినబాబు బ్యాచ్ చిత్రహింసలు!
సాక్షి, అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేశ్ అనుచరులు ఈ నెల 9వ తేదీన తనను కిడ్నాప్ చేసి రాత్రంతా చిత్ర హింసలకు గురి చేసినట్లు పెదవడ్లపూడికి చెందిన బాధితుడు పాలేటి రాజ్‌కుమార్ సుప్రీం కోర్టు, హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. లోకేశ్ ఫ్లెక్సీ ఎదుట మోకాళ్లపై కూర్చోబెట్టి బెదిరించి క్షమాపణ చెప్పించి చిత్రీకరించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి తన కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నాడు.వీటి ప్రభావంతో పాఠశాలలో చదువుతున్న తన పిల్లలు అవమానభారంతో ఇంటికొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నేతలు పదే పదే బెదిరింపులకు దిగుతున్నారని, తక్షణమే జోక్యం చేసుకుని అరికట్టకుంటే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని విన్నవించుకున్నాడు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై చట్టప్రకారం పోలీసులతో విచారణ జరిపి వ్యక్తిగత, భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులను పరిరక్షించాలని కోరాడు. ఫిర్యాదులో ముఖ్యాంశాలు ఇవీ.. ⇒ మంగళగిరి నియోజకవర్గంలో 2019–24 మధ్య వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను మా కుటుంబంతో కలసి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశా. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. నారా లోకేశ్ అండదండలతో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. ⇒ ఈ నెల 9వతేదీన సాయంత్రం 4.30 గంటల సమయంలో నారా లోకేశ్‌కు సన్నిహితుడైన జవ్వాడి కిరణ్‌చంద్ అనుచరులు నరేంద్ర, షేక్ బాజీ, జానీ తదితరులు నేను మా అత్త ఇంట్లో ఉన్న సమయంలో మారణాయుధాలతో దాడి చేశారు. ఫరీ్నచర్‌ను ధ్వంసం చేశారు. ఏపీ 39 జీబీ 3333 వాహనంలో నన్ను కిడ్నాప్ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించి రాత్రంతా చిత్రహింసలకు గురిచేశారు. నా చొక్కా విప్పించి నారా లోకేశ్ ప్లెక్సీ ఎదుట మోకాళ్లపై మోకరిల్లి ముకుళిత హస్తాలతో క్షమాపణ చెప్పాలని బెదిరించి వీడియో చిత్రీకరించారు. ఈనెల 10వతేదీ తెల్లవారు జాము 4 గంటలకు బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై వదిలేసి వైఎస్సార్ సీపీకి మద్దతు పలికితే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ⇒ నాపై దాడి చేసిన వారిపై అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు (ఎఫ్ఐఆర్ నెంబరు 78/2024) చేశా. ఫిర్యాదు వాపసు తీసుకోవాలంటూ టీడీపీ మద్దతుదారులు పదే పదే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు నా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ⇒ మానవ హక్కులను కాలరాయడంపై తక్షణమే జోక్యం చేసుకుని టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి నాకు, నా కుటుంబానికి రక్షణ కలి్పంచాలి. నా ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణకు ఆదేశించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నా. -
విధులకు హాజరై తిరిగి కారులో వెళ్తుండగా.. విషాదం!
ఆదిలాబాద్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజ్‌కుమార్(32)రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం విధులకు హాజరై తిరిగి కారులో ఇంటికి వెళ్లే క్రమంలో రాత్రి నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం బట్టాపూర్ వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. రాజ్‌కుమార్ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ గ్రామం కాగా అందరితో కలివిడిగా ఉండే డాక్టర్ అకాల మరణంపై కడెం పీహెచ్సీ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. ఇవి చదవండి: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య -
చాలా భావోద్వేగానికి గురయ్యాను
‘‘డంకీ’ సినిమాలోని ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే..’ పాట తొలిసారి విన్నప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను’’ అని బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘డంకీ’. రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాప్సీ పన్ను, బొమన్ ఇరాని, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్‌పై గౌరీ ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ఈ నెల 21న విడుదలకానుంది. ప్రీతమ్ చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే..’ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. కాగా ‘హ్యాష్‌ట్యాగ్ ఆస్క్ ఎస్ఆర్కే’ సెషన్స్‌లో భాగంగా అభిమానులు, నెటిజన్స్‌తో మాట్లాడిన షారుక్ ఖాన్ పలు విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే..’ పాటని తొలిసారి విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది?’ అనే ప్రశ్నకు షారుక్ ఖాన్ మాట్లాడుతూ–‘‘ఆ పాట నా తల్లిదండ్రులను, నా స్నేహితులను గుర్తు చేసింది. అలాగే ఢిల్లీలో నేను గడిపిన నాటి రోజులు జ్ఞాపకం వచ్చాయి. చాలా భావోద్వేగానికి గురయ్యాను’’ అని బదులిచ్చారు. -
ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదంటూ.. చనిపోతున్నానని ఫోన్‌చేసి..
సాక్షి, వరంగల్: ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. జీఆర్పీ సీఐ నరేష్ కథనం ప్రకారం.. వర్ధన్నపేటకు చెందిన కట్ట సుజాత తన భర్త మృతి చెందడంతో నగరంలో ఎండోమెంట్ శాఖలో ఉద్యోగం చేస్తూ కుమారుడు రాజ్‌కుమార్(23)తో కలిసి నగరంలోని గిర్మాజీపేటలో నివాసం ఉంటోంది. రాజ్‌కుమార్ ఒకేషనల్ చదువుతున్నాడు. తరుచూ తల్లిని ఖర్చులకు డబ్బులు అడుగుతూ ఇవ్వకపోతే చనిపోతానని బెదిరిస్తూ పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. శుక్రవారం మళ్లీ తల్లిని ఖర్చులకు డబ్బులు అడగగా ఆమె నిరాకరించింది. దీంతో అదేరోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి రైలు కింద పడి చనిపోతున్నానని ఫోన్లో చెప్పాడు. అనంతరం నగరంలోని సంతోషిమాతా ఆలయం ఎదుట ఉన్న రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై డిప్యూటీ ఎస్ఎస్ ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ కె భాస్కర్ కేసు నమోదు చేసుకుని మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి తల్లి సుజాతకు అప్పగించామని సీఐ నరేష్ శనివారం తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
కథ సెట్.. కాంబో రిపీట్
ఒక హీరో... ఒక డైరెక్టర్... వీరి కాంబినేషన్లో ఓ బ్లాక్‌బస్టర్... ఇది చాలు... ప్రేక్షకులు ఆ కాంబో రిపీట్ కావాలని కోరుకోవడానికి. అయితే కారణాలేమైనా కొన్ని హిట్ కాంబినేషన్స్ రిపీట్ కావడానికి ఇరవయ్యేళ్లకు పైగా పట్టింది.ఇప్పుడు కథ సెట్ అయింది.. కాంబో రిపీట్ అవుతోంది. రిపీట్ అవుతున్న ఆ హిట్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. బిగిన్ ది బిగిన్ కమల్‌హాసన్ కెరీర్లో ‘నాయగన్’ (1987) బ్లాక్‌బస్టర్ ఫిల్మ్. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా విడుదలైంది. ఇంతటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ఇచ్చిన కమల్–మణిరత్నం కాంబోలో మరో సినిమా ప్రకటన రావడానికి మూడు దశాబ్దాలకు పైగా సమయం గడిచిపోయింది. ముప్పైఐదేళ్ల తర్వాత.. అంటే గత ఏడాది నవంబరులో తన పుట్టినరోజు సందర్భంగా మణిరత్నంతో సినిమాను ప్రకటించారు కమల్. మణిరత్నం, కమల్‌హాసన్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటుడిగా కమల్ కెరీర్లో 234వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంబోత్సవాన్ని నిర్వ హించి, బిగిన్ ది బిగిన్ అంటూ వీడియోను షేర్ చేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్, త్రిష, ‘జయం’ రవి ఈ చిత్రంలో కీ రోల్స్ చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోవైపు ‘ఇండియన్’ (‘భారతీయుడు’) చిత్రం కూడా కమల్‌హాసన్ కెరీర్లో ఓ బ్లాక్‌బస్టర్. ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ తర్వాత కమల్, శంకర్ల కాంబినేషన్లోపాతికేళ్లకు ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. లక్నో టు లాహోర్ దాదాపు పాతికేళ్ల క్రితం బాలీవుడ్లో హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్ అంటే సెన్సేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఘాయల్’ (1990) సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఆ ఏడాది బాక్సాఫీస్ టాప్ కలెక్షన్స్ సాధించిన మొదటి ఐదు చిత్రాల్లో ‘ఘాయల్’కు చోటు దక్కడం అనేది ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు . ఆ తర్వాత ‘దామిని’ (1993) చిత్రం కోసం సన్నీడియోల్, రాజ్‌కుమార్ సంతోషిలు కలిసి పని చేశారు. కానీ ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. మీనాక్షీ శేషాద్రి మెయిన్ లీడ్ రోల్ చేయగా, సన్నీ డియోల్, రిషీ కపూర్, అమ్రిష్ పూరి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం కూడా సూపర్‌హిట్. ఇక ముచ్చటగా మూడోసారి సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిలు కలిసి చేసిన చిత్రం ‘ఘాతక్’. ‘దామిని’ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, మీనాక్షీ చౌదరి, ఓమ్ పురి ఈ సినిమాలో కూడా నటించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇలా మూడు వరుస హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకో కానీ సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో ఈ సినిమా తర్వాత మరో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో ‘లాహోర్ 1947’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను హీరో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. భారతదేశం,పాకిస్తాన్ విభజన నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, లక్నో నుంచి లాహోర్‌కు వలస వెళ్లిన ఓ ముస్లిం కుటుంబం కథే ఈ చిత్రం అని టాక్. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. మరోవైపు హీరోగా ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్ కూడా రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయట. ఇదే నిజమైతే... 1994లో వచ్చిన ‘అందాజ్ అ΄్నా అ΄్నా’ తర్వాత ఆమిర్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో వచ్చే చిత్రం ఇదే అవుతుంది. అంటే.. 30 ఏళ్లకు ఆమిర్, రాజ్‌కుమార్ కలిసి సినిమా చేసినట్లవుతుంది. ఎప్పటికీ హీరోయే! జాకీ ష్రాఫ్‌ను ‘హీరో’ను చేసింది దర్శకుడు సుభాష్ ఘయ్. జాకీ ష్రాఫ్, సుభాష్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘హీరో’ (1983) సూపర్ హిట్‌గా నిలిచింది. హీరోగా జాకీకి ఇదే తొలి సినిమా. ‘హీరో’ సూపర్‌హిట్ అయినప్పటికీ వీరి కాంబోలో తర్వాతి చిత్రం ‘యాదేం’ (2001) తెరకెక్కడానికి 18 ఏళ్లు పట్టింది. జాకీ ష్రాఫ్‌తోపాటు హృతిక్ రోషన్ కూడా ఓ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు జాకీ ష్రాఫ్ హీరోగా ‘వన్స్ ఏ హీరో.. ఆల్వేస్ ఏ హీరో’ అంటూ తాజా చిత్రాన్ని ప్రకటించారు సుభాష్. ఇలా ఇరవై, ముప్పైఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న హీరో–డైరెక్టర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి. -
వీరప్పన్, కన్నడ రాజ్ కుమార్ ని అలా చూసుకున్నాడు: సౌకా జానకి
-
చైన్‌స్నాచింగ్ చేసి.. పారిపోతూ..చెరువుగుంతలో పడి..
ముత్తారం(మంథని): ఒకచోట చోరీకి యత్నించి విఫలమయ్యాడు.. వెంటనే మరో ప్రాంతానికి వెళ్లి ఓ మహిళ మెడలో చైన్ తెంపాడు. వెంటనే బాధితురాలు కేకలు వేయగా, పారిపోతూ చెరువుగుంతలో పడి ఓ పాత నేరస్తుడు మృతి చెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మైదంబండ గ్రామపంచాయతీ పరిధి సర్వారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..రామగిరి మండలం బేగంపేటకు చెందిన బొంతల రాజ్‌కుమార్(35) తన కుటుంబంతో కలిసి గోదావరిఖనిలో ఉంటున్నాడు. గురువారం బైక్‌పై ముత్తారం మండలం మచ్చుపేట నుంచి సర్వారం వైపు వెళుతున్నాడు. ఆ గ్రామానికి చెందిన కాంచర్ల పుష్పలత చేనుకు నడుచుకుంటూ వెళుతుండగా, బైక్‌పై రావాలని రాజ్‌కుమార్ కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో ఆమె గొంతు పట్టుకున్నాడు. బాధితురాలు కేకలు వేయడంతో సమీప చేనులో ఉన్న గొర్రె నవీన్ రావడంతో రాజ్‌కుమార్ అక్కడినుంచి పరారయ్యాడు. ఆ తర్వాత సర్వారంలోని సజ్జనపు మమత కిరాణం వద్దకు చేరుకున్నారు. బైక్‌లో పెట్రోల్ పోయించుకోగా, మిగతా చిల్లర ఇవ్వడానికి మమత ఇంట్లోకి వెళ్లింది. ఆమెను వెంబడించి మెడలోనుంచి 3 తులాల బంగారు పుస్తెలతాడు లాక్కు న్నాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకు న్నారు. వారిని చూసి రాజ్‌కుమార్ బైక్ అక్కడే వదిలేసి మైదంబండ వైపు పరుగెత్తాడు. ఆ దారిలో చెరువుగుంత కనిపించక అందులో మునిగి చనిపోయాడు. సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ తులా శ్రీనివాసరావు తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడికి భార్య సింధూజ, కుమారుడు అక్షిత్‌కుమార్(2) ఉన్నారు. నిందితుడిపై 12 కేసులు రాజ్‌కుమార్‌పై పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 12 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనాలతోపాటు పలు ఇళ్లలో చోరీలు చేశాడు. ఈక్రమంలో 2022న రామగిరిలో అరెస్టయి కరీంనగర్ జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై విడుదలయ్యాక గోదావరిఖనికి మకాం మార్చాడు. బైక్‌లో కారంపొడి ప్యాకెట్ చోరీలు చేయాలనే పక్కా ప్లాన్‌తోనే రాజ్‌కుమార్ తన బైక్‌లో కారంపొడి ప్యాకెట్లు ఉంచాడు. మమత మెడలో నుంచి పుస్తెలుతాడు లాక్కొని, పారిపోయేందుకు వీలుగా రోడ్డుపై బైక్ సిద్ధంగా ఉంచుకున్నాడు. అక్కడి నుంచి కాల్వశ్రీరాంపూర్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ, చోరీ సమయంలో స్థానికులు వెంబడించడంతో దారి మార్చుకున్నాడు. చెరువు వైపు పరుగెత్తాడు. అక్కడ చెట్ల ఆకులు, తీగలు, నాచు ఉండడంతో చెరువులోని నీరు కనిపించలేదు. అటువైపు వెళ్లొద్దని స్థానికులు హెచ్చరిస్తున్నా వినకుండా వెళ్లి పూడికతీసిన గుంతలో పడి చనిపోయాడు. -
కారుడ్రైవర్ రాజ్‌కుమార్ ఖాతాలో 9 వేల కోట్లు
సాక్షి, చైన్నె : ఓ ప్రైవేటు బ్యాంకు సిబ్బంది పొరబాటు, సాంకేతిక సమస్యతో ఓ కారు డ్రైవర్ 34 నిమిషాల పాటు వేల కోట్లకు అధిపతి అయ్యాడు. ఇందులో రూ.21 వేలను తన మిత్రుడి ఖాతాలోకి ఆ డ్రైవర్ బదిలీ కూడా చేశారు. చివరకు పొరబాటును గుర్తించిన బ్యాంకర్లు ఆ మొత్తాన్ని వెనక్కి లాగేసుకున్నారు. గురువారం ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిండుగల్ జిల్లా పళణి సమీపంలోని నైకారన్ పట్టికి చెందిన రాజ్‌కుమార్(28) డిప్లొమో ఇంజినీర్. ప్రస్తుతం చైన్నెలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కోడంబాక్కంలో బస చేసి ఉన్న రాజ్‌కుమార్‌కు పళణిలోని ఓ ప్రైవేటు బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఇందులో కేవలం రూ. 105 బ్యాలెన్స్ పెట్టి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం అతడి బ్యాంక్ ఖాతాలో 9 వేల కోట్లు జమ చేసినట్టుగా సెల్ నెంబర్‌కు వచ్చిన ఎస్ఎంఎస్తో షాక్‌కు గురయ్యాడు. ఇది ఫేక్ మెసేజ్‌గా ఉంటుందని భావించి, తన మిత్రుడి దృష్టికి తీసుకెళ్లాడు. తక్షణం ఈ ఎస్ఎంఎస్ నిజమో కాదో తేల్చుకుందామని తన మిత్రుడి ఖాతాలోకి తన ఖాతా నుంచి తొలుత రూ. 1000, ఆ తర్వాత రూ.20 వేలు బదిలీ చేశాడు. మిత్రుడి ఖాతాలోకి రూ. 21 వేలు బదిలీ కావడంతో రాజ్‌కుమార్ ఆనందానికి అవధులు లేవు. తాను కోటీశ్వరుడైనంత ఆనందంలో మునిగి పోయాడు. ఆనందం ఆవిరి.. ఆనందంలో ఉన్న రాజ్‌కుమార్‌కు ఆ ఎస్ఎంఎస్ వచ్చిన 34వ నిమిషంలో ఖాతాలో ఉన్న నగదు మాయమైంది. తమ పొరబాటును గుర్తించిన బ్యాంకర్లు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా, రాజ్‌కుమార్ మరో ఖాతాకు బదిలీ చేసిన రూ. 21 వేల రాబట్టే ప్రయత్నం మొదలెట్టారు. పట్టభద్రుడైన రాజ్‌కుమార్ తనకు అన్ని వ్యవహారాలు తెలుసని పేర్కొంటూ ఎదురు తిరిగాడు. తన ప్రమేయం లేకుండా, తనకు సమాచారం ఇవ్వకుండా తన ఖాతా నుంచి ఎలా నగదు వెనక్కి తీసుకుంటారని ప్రశ్నించడం మొదలెట్టాడు. పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో బ్యాంకర్ల కాళ్ల బేరానికి వచ్చి, అతడ్ని బుజ్జగించి చైన్నె టీనగర్‌లోని ప్రధాన కార్యాలయానికి రప్పించారు. తర్వాత అతడి మిత్రుడి ఖాతాలో జమ చేసిన రూ. 21 వేలను బ్యాంకర్లు వదులుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా రాజ్‌కుమార్‌కు సొంతంగా కారు కొనుకున్నేందుకు రుణం ఇస్తామన్న ఆఫర్‌ను అధికారులు ఉంచడం గమనార్హం. ఈ వ్యవహారం తాజాగా మీడియాలో రావడంతో రూ.9 వేల కోట్ల వ్యవహారంపై ఐటీ, ఈడీ వర్గాలు దృష్టి పెట్టేనా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. -
చిరంజీవితో పోలికే నాకు మైనస్.. రాజ్ కుమార్ కామెంట్స్ వైరల్!
సినీ ఇండస్ట్రీలో రాజ్ కుమార్ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. 30 ఏళ్లుగా వెండితెరపై తనదైన నటనతో మెప్పించారు. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. టాలీవుడ్లో జూనియర్ చిరంజీవిగా గుర్తు పొందిన రాజ్ కుమార్ ఎన్నో సినిమాల్లో, సీరియల్స్‌లోనూ నటించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన సీరియల్స్‌లో నటిస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రాజ్ కుమార్ మాట్లాడుతూ.. 'చిరంజీవి లాగా పోలికలు ఉండటం నా అదృష్టం. కానీ అలా ఉండటం వల్లే నేను హీరోగా సక్సెస్ కాలేక ఇక్కడే మిగిలిపోయా. నేను చిరంజీవి పోలికలతో ఉండటం చూసేవారికి గొప్పగా ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం అది నాకు మైనస్ పాయింట్. మెగాస్టార్ పోలికలతో ఉన్నందుకు గర్వపడతా. చిరంజీవిలా ఉంటానే కానీ.. ఆయనకు ఎక్కడా కూడా సరిపోను. ఆయనొక దిగ్గజం. నన్ను ఆయనతో పోల్చే సరికి మర్రిచెట్టు కింద కలుపు మొక్కలా అయిపోయా. తెలుగులో జూనియర్ చిరంజీవిగా ఇండస్ట్రీలో గుర్తింపు రావడంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లిపోయా. నేను, శ్రీకాంత్, విక్రమ్, అజిత్, ఆనంద్ ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. చిరంజీవి నన్ను తొక్కేశారన్నారు. అలా జరిగి ఉంటే నేను సీరియల్స్‌లో కూడా కనిపించేవాడిని కాదు.' అంటూ ఎమోషనలయ్యారు. కాగా.. ప్రస్తుతం రాజ్ కుమార్ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరంజీవి చేతుల మీదుగా అవార్డు అందుకోవటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్ కుమార్ ప్రస్తుతం జనని, కేరాఫ్ అనసూయ వంటి సీరియల్స్‌లో నటిస్తున్నారు. -
తెలుగు ప్రేక్షకులకు ఆ మాట ఇస్తున్నా: శివ రాజ్‌కుమార్
‘‘నాన్నగారు (కన్నడ స్టార్ రాజ్‌కుమార్), ఎన్టీఆర్, నాగేశ్వర రావు, శివాజీ గణేశన్, ఎంజీఆర్సార్లు బ్రదర్స్‌లా ఉండేవాళ్లు. ఆ వారసత్వాన్ని తర్వాతి తరంలో మేం ముందుకు తీసుకెళుతున్నాం. తారకరత్నగారిని వెళ్లి చూశాను. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’’ అన్నారు కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్. ఆయన నటించిన 125వ కన్నడ చిత్రం ‘వేద’. ఎ. హర్ష దర్శకత్వంలో శివ రాజ్‌కుమార్ భార్య గీత నిర్మించిన ఈ సినిమాని ‘శివ వేద’ పేరుతో వీఆర్ కృష్ణ మండపాటి ఈ నెల 9న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, మంచి సందేశం ఉన్నాయి. నా తర్వాతి చిత్రాలను కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తానని మాట ఇస్తున్నా’’ అన్నారు. ‘కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఫిబ్రవరి 9న తెలుగులో వస్తున్న ఈ వేధ సినిమా పాన్ ఇండియా లెవల్ లో బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. -
కుప్పంలో టీడీపీ అరాచకం.. మాజీ జెడ్పీటీసీ రాజ్‌కుమార్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత, కుప్పం మాజీ జెడ్పీటీసీ రాజ్‌కుమార్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 24న చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు, పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుప్పం పోలీసులు హైదరాబాద్‌లో రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. చదవండి: (అలా చెప్పడానికి సిగ్గుండాలి.. టీడీపీపై మంత్రి అంబటి ఫైర్) -
ఓలా స్కూటర్లో వచ్చిన మంటలపై సింపుల్ వన్ సీఈఓ ఆసక్తికర ట్వీట్..!
పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు కాలుష్యాన్ని తగ్గిస్తుందంటూ చెబుతూ వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయా? అంటే అవును అనే విధంగా వరుస సంఘటనలు దేశంలో చోటు చేసుకుంటున్నాయి. వేసవి కాలం మొదలైందో లేదో ఒకే రోజు తమిళనాడు, మహారాష్ట్రలలో రెండు చోట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. పూణే నగరంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1 ప్రో బైకు అగ్నికి ఆహుతయ్యింది. రోడ్డు పక్కన ఓ షాపు ముందు నిలిపి ఉంచిన స్కూటరు నుంచి ఉన్నట్టుండి పొగలు రావడం మొదలైంది. క్షణాల్లోనే దట్టమైన పొగలు కాస్తా మంటలుగా మారింది. నిమిషాల వ్యవధిలోనే ఓలా స్కూటర్ అగ్ని కీలల్లో చిక్కుకుని కాలి మసయ్యింది. అక్కడే ఉన్న స్థానికులు ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. దేశ వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న ఓలా స్కూటర్ మంటల్లో చిక్కుకుని తగలబడి పోవడం సంచలనంగా మారింది. ఈ స్కూటరులో అమర్చిన లిథియం ఐయాన్ బ్యాటరీలో ఎక్సోథెర్మిక్ రియాక్షన్ కారణంగానే మంటలు వ్యాపించి ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని.. స్కూటరు డిజైనులో లోపాలు ఉంటే వెంటనే సరి చేయాలని ఓలా స్కూటర్ యూజర్లు డిమాండ్ చేస్తున్నారు. As summer arrives, it’s a real test for survival of #EV in India. #EVonFire #BatteryMalfunction pic.twitter.com/Xxv9qS4KSu — Saharsh Damani, MBA, CFA, MS (Finance) (@saharshd) March 26, 2022 అయితే, ఈ సంఘటనపై ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ వాహన తయారీ సంస్థ సింపుల్ వన్ సీఈఓ పరోక్షంగా స్పందించారు. ఈ సంఘటన గురించి ప్రస్తావించకుండా.. వారు తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి తీసుకుంటున్న భద్రతపై సింపుల్ వన్ సీఈఓ సుహాస్ రాజ్ కుమార్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముంది అంటే?.. #SimpleONE ప్రారంభ రోజుల నుంచి థర్మల్ పనితీరుపై మా ప్రధాన దృష్టి ఉంది. అపూర్వమైన పనితీరును పనితీరు పొందడానికి, థర్మల్ సమస్యలు నివారించడానికి, తీవ్రమైన పరిస్థితులలో కూడా ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచడానికి మేము మా స్వంత థర్మల్ మేనేజ్మెంట్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాము. మాకు మీ #SafetyFirst" అని ట్వీట్ చేస్తూ మరోక ట్వీట్‌ను రీ-ట్వీట్ చేశారు. Thermal performance was one of our prime areas of focus ever since the early days of #SimpleONE To achieve unprecedented performance, we developed our own thermal management system to avoid thermal runways, keeping the temperatures in check even in extreme conditions #SafetyFirst https://t.co/Ea90duQk3L — Suhas Rajkumar (@suhasrajkumar) March 27, 2022 (చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్...తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్..!) -
పునీత్ కుటుంబాన్ని వెంటాడుతున్న ‘గుండె పోటు’!
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని హార్ట్ ఎటాక్స్ వెంటాడుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది జరిగిన సంఘటనలను చూస్తుంటే. అగ్ర కథానాయకుడైన పునీత్ తండ్రి కన్నడ కంఠీరవ, రాజ్‌కుమార్ గుండెపోటుతోనే చనిపోయారు. అలాగే ఆయన సోదరుడు, స్టార్ హీరో శివరాజ్ కుమార్ గతంలో గుండెపోటుతోనే చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. జిమ్ హెవీ వర్కౌట్స్ చేయడం వల్లే శివరాజ్ కుమార్‌కు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అప్పటి నుంచి ఆయన జిమ్‌లో అతిగా కష్టపడటం తగ్గించారు. ఇక నేడు అదే కారణంతో పునీత్ రాజ్‌కుమార్ మరణించడం బాధాకరం. చదవండి: మరణం, డెస్టినీ గురించి పునీత్ రాజ్‌కుమార్ ఏమన్నారంటే.. పునీత్ తండ్రి రాజ్‌కుమార్ 77 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. ఇక 54 ఏళ్ల వయసులో జిమ్‌లో భారీ కసరత్తులు చేస్తుండగా పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్‌కు ఆకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో ఆయనను వెంటనే బెంగళూరు విఠల్మాల్య ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సకాలంలో ఆయనకు వైద్యం అందడంతో ప్రమాదం తప్పింది. అప్పటి నుంచి ఆయన జిమ్‌లో తక్కువగా కనిపిస్తారు. కానీ పునీత్ రాజ్‌కుమార్ మాత్రం ఎక్కువ సమయంలో జిమ్‌లోనే గడుపుతారని తాజాగా వైరల్ అవుతున్న తన జిమ్ వీడియోలు చూస్తే అర్థం అవుతోంది. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి ట్వీట్ వైరల్.. కన్నడ సినీ పరిశ్రమలో పునీత్ రాజ్‌కుమార్.. ఎనర్జిటిక్ అండ్ చార్మింగ్ హీరోగా పేరు కూడా ఉంది. జిమ్‌లోనే కాదూ షూటింగ్ కోసం ఎక్కడికెళ్లినా వర్కౌట్స్ మాత్రం వదలరట. ఫిట్నెస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. తాజాగా జేమ్స్ అనే సినిమాకు సైన్ చేసిన పునీత్.. ఇందులో బాడీ బిల్డర్‌గా కనిపించబోతున్నారట. ఇందుకోసం బాడీ బిల్డర్‌గా తనని తాను మేకోవర్ చేసుకునేందుకు జిమ్‌లో ఓవర్‌గా ఎక్స్ర్సైజులు చేస్తున్నారట. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం వర్కవుట్ చేస్తూ సడెన్‌గా కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన జిమ్ సిబ్బంది, సహాయకులు ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈ డేంజర్ స్ట్రోక్ పునీత్‌ను బలితీసుకుంది. భారత సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది. -
22 ఏళ్ల క్రితం.. పునీత్ రాజ్‌కుమార్ తండ్రిని కిడ్నాప్ చేసిన వీరప్పన్
ఇంటర్నెట్ డెస్క్: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ శుక్రవారం మృతి చెందారు. గుండెపోటుతో ఆయన అకాలమరణం చెందారు. వారి కుటుంబ సభ్యుల బాధ వర్ణించలేకుండా ఉంది. ఈ క్రమంలోనే అభిమానులు, ప్రజలు దాదాపు 22 ఏళ్ల క్రితం పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంలో చోటు చేసుకున్న ఓ సంఘటన గురించి చర్చించుకుంటున్నారు. అదే పునీత్ రాజ్‌కుమార్ తండ్రి కిడ్నాప్. పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ను గంధపు చెక్కల దొంగ వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. వీరప్పన్ నేరాల్లో ఈ సంఘటన ఇప్పటికి కూడా ప్రజలను వెంటాడుతూనే ఉంటుంది. దీని గురించి ఈ జనరేషన్ వారికి పెద్దగా తెలియకపోవచ్చు. తమిళనాడుకు చెందిన వీరప్పన్ కన్నడ సూపర్‌స్టార్‌ను ఎందుకు కిడ్నాప్ చేశాడు.. తర్వాత ఏం జరిగింది వంటి తదితర వివరాలు.. (చదవండి: కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు.. ) ఈ కిడ్నాప్ 2000 సంవత్సరం, జూలై 30న చోటుచేసుకుంది. ఈ సంఘటన జరిగిన సమయంలో తమిళనాడులో కరుణానిధి అధికారంలో ఉన్నారు. సంఘటన జరిగిననాడు.. రాజ్‌కుమార్.. తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని గాజనూరు గ్రామంలో ఉన్న తన ఇంటికి వచ్చారు. అప్పటికి ఎనిమిది నెలల క్రితమే పునీత్ రాజ్‌కుమార్ వివాహం జరిగింది. (ఫోటో కర్టెసీ: ఇండియాటుడే) జూలై 30, రాత్రి 09.30 గంటలకు కిడ్నాప్... రాజ్‌కుమార్ తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నారు. ఆ సమయంలో వీరప్పన్ తన అనుచరలతో కలిసి రాజ్‌కుమార్ ఇంటికి వచ్చి.. ఆయనను కిడ్నాప్ చేశాడు. రాజ్‌కుమార్‌తో పాటు ఆయన అల్లుడు గోవింద్రాజ్, బంధువు నగేష్, అసిస్టెంట్ దర్శకుడు నాగప్పను కూడా కిడ్నాప్ చేశాడు. (చదవండి: తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు) ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో తమిళనాడు ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యిందని.. ఇది క్షమించరాని నేరమని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. (ఫోటో కర్టెసీ: ఇండియాటుడే) రాజ్‌కుమార్ కిడ్నాప్ గురించి ఏడాది ముందే సమాచారం వీరప్పన్‌ను పట్టుకోవడం కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గంధపు చెక్కల స్మగ్లర్.. రాజ్‌కుమార్‌ను టార్గెట్ చేశాడని.. కిడ్నాప్‌కు ఏడాది ముందే అనగా.. 1999లోనే ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయినా ప్రభుత్వం రాజ్‌కుమార్‌కు భద్రత కల్పించడంలో అలసత్వం వహించడంతో సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి ట్వీట్ వైరల్..) ఫలించని చర్చలు.. 108 రోజుల బందీ రాజ్‌కుమార్ కిడ్నాప్ వ్యవహారంపై అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో వీరప్పన్‌తో చర్చలు జరిపింది తమిళ ప్రభుత్వం. నక్కిరన్ పత్రిక ఎడిటర్ ఆర్ఆర్ రాజగోపాల్ ఈ చర్చల్లో కీలక పాత్ర పోషించినప్పటికి ఫలితం లేకపోయింది. అలా 108 రోజుల పాటు రాజ్‌కుమార్‌ను బంధించిన వీరప్పన్.. చివరకు 2000, నవంబర్ 15న ఆయనను వదిలేశాడు. చర్చలు జరిపినా మాట వినని వీరప్పన్.. ఉన్నట్లుండి రాజ్‌కుమార్‌ను విడుదల చేయడం నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది. (చదవండి: ఒక్కసారి కూడా నా తండ్రిని చూడలేదు) 19 ఏళ్ల పాటు సాగిన కేసు.. తమిళనాడు కోర్టులో రాజ్‌కుమార్ కిడ్నాప్ కేసు ఏళ్ల పాటు నడిచింది. ఈ కేసు విచారణ సమయంలో రాజ్‌కుమార్ కుటుంబం ఎవరిని నిలదీయలేదు. కిడ్నాప్ అయిన 19 ఏళ్ల తర్వాత అనగా 2018, సెప్టెంబర్‌లో కోర్టు ఈ కేసులో నిందితులుగా ఉన్న 9 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. రాజ్‌కుమార్ కుటుంబం వీరికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయకపోవడంతో.. వీరంతా నిర్దోషులుగా విడుదల అయ్యారు. కేసు ముగియడానికి ముందే వీరప్పన్, రాజ్‌కుమార్ రెండు ఏళ్ల తేడాతో మృతి చెందారు. సిట్ బృందం చేతిలో 2004లో వీరప్పన్ మృతి చెందగా.. 2006లో రాజ్‌కుమార్ మృతి చెందారు. ఇక చర్చల సమయంలో వీరప్పన్ తన మీద ఉన్న మొత్తం 135 కేసులును ఎత్తేయాల్సిందిగా డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందుకు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు అంగీకరించేదట. చదవండి: వీరప్పన్‌కు ఇచ్చింది రూ.15 కోట్లు! -
రాజ్‌కుమార్ ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్
దివంగత ప్రముఖ కన్నడ నటులు రాజ్‌కుమార్ మనవరాలు, కన్నడ యాక్టర్ రామ్‌కుమార్, పూర్ణిమ (రాజ్‌కుమార్ కూతురు)ల తనయ ధన్యా రామ్‌కుమార్ హీరోయిన్గా పరిచయం కానున్నారు. కన్నడ చిత్రం ‘నిన్నా సానిహకే’లో హీరోయిన్గా నటించారు ధన్య. కోవిడ్ వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఈలోపు కోలీవుడ్ నుంచి కాల్స్ అందుకుంటున్నారట ధన్య. ఇదిలా ఉంటే.. రాజ్‌కుమార్ కుటుంబం నుంచి చిత్రపరిశ్రమలోకి వస్తున్న తొలి హీరోయిన్ ధన్యా రామ్కుమార్నే కావడం విశేషం. ఈ సందర్భంగా ధన్య మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలోకి రావాలని ఆశపడే నా కుటుంబానికి చెందిన అమ్మాయిలకు, బయటివారికి నేనొక ఉదాహరణగా నిలవాలనుకుంటున్నాను. కారణాలు ఏమైనా మా ఫ్యామిలీ మహిళలు సినిమాల్లోకి రాలేదు. మా తాతగారు (రాజ్‌కుమార్) ఒప్పుకోకపోవడం వల్లే అని కొందరు అంటున్నారు. కానీ ఈ విషయం గురించి మా అమ్మని అడిగితే, ఏవో భద్రతాపరమైన కారణాలు అన్నట్లుగా చెప్పారు. ఇప్పుడు ‘మీటూ’ అంటూ నిర్భయంగా మాట్లాడుతున్నట్లు అప్పట్లో నటీమణులకు స్వేచ్ఛగా మాట్లాడే వీలు లేకపోయి ఉండొచ్చు. కానీ మా తాతగారు ఇప్పుడుంటే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులను దృష్టిలో పెట్టుకుని నేను హీరోయిన్గా చేయడానికి ఒప్పుకునేవారు’’ అన్నారు. -
నా కొడుకు చచ్చి నెలైనా స్పందించరా? ఎమ్మెల్యే ఫైర్
లక్నో: ఆక్సిజన్ అందక తన కుమారుడు మృతి చెందాడని.. దానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులైనా చర్యలు తీసుకోలేరా అని అధికార పార్టీ ఎమ్మెల్యే మండిపడ్డారు. కనీసం పోలీసులు ఆస్పత్రిపై కేసు కూడా నమోదు చేయడం లేదని ఎమ్మెల్యే వాపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దియో జిల్లాలోని శాండిల్య నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ అగర్వాల్ కుమారుడు అశిశ్ (35) ఏప్రిల్ 26వ తేదీన మృతి చెందారు. కకోరిలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆశిశ్‌ను చేర్చగా ఉదయం ఆక్సిజన్ 94 ఉండగా సాయంత్రానికి ఆక్సిజన్ స్థాయి తగ్గిందని వైద్యులు చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. బయటి నుంచి ఆక్సిజన్ తీసుకొచ్చి అందిస్తున్నట్లు చెప్పారని ఆ కొద్దిసేపటికి తన కుమారుడు మరణించాడని ఎమ్మెల్యే రాజ్‌కుమార్ వాపోయాడు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మరణించాడని ఎమ్మెల్యే రాజ్‌కుమార్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతోపాటు ముఖ్యమంత్రి, కలెక్టర్, డీజీపీ, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీసీ ఫుటేజీ పరిశీలించి తన కుమారుడి మరణానికి సంబంధించి కేసు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నా బిడ్డ మరణానికి ఆస్పత్రిదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. -
యాంటీ వైరస్
రాజ్‌కుమార్ హీరోగా నటìంచి, నిర్మించిన చిత్రం ‘యాంటీ వైరస్’. సుభాష్ దర్శకతంలో ఎమ్.కె. క్రియేష¯Œ ్స సంస్థ నిర్మించింది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో, నిర్మాత రాజ్ కుమార్ బర్త్ డే సందర్భంగా బుధవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత ప్రపంచ పరిస్థితికి అద్దం పట్టేలా మా సినిమా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుంది. అందరూ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. మా సినిమా కథ కూడా ఇదే’’ అన్నారు. అనూషా, నందిత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: సబ్బి శ్రీనివాస్, సంగీతం: మురళీ లియోన్. -
దర్శకుడు రాజ్‌కుమార్ కన్నుమూత
చిరంజీవి తొలి సినిమా ‘పునాది రాళ్లు’ తెరకెక్కించిన దర్శకుడు రాజ్‌కుమార్ (75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తార్నాకలో గల తన నివాసంలో మృతి చెందారు. ‘పునాదిరాళ్లు’ చిత్రం చిరంజీవికే కాదు రాజ్కుమార్కి కూడా తొలి సినిమాయే. రాజ్‌కుమార్ మొదటి సినిమానే ఐదు నంది అవార్డులు సాధించడం విశేషం. ఆ తర్వాత ‘ఈ సామ్రాజ్యం మాకొద్దు, మన వూరి గాంధీ, ఇంకా తెలవారదేమి, తాండవకృష్ణ తరంగం, మా సిరి మల్లి’ వంటి సినిమాలను తెరకెక్కించారాయన. రాజ్‌కుమార్ స్వస్థలం విజయవాడ దగ్గర ఉయ్యూరు. గూడపాటి రాజ్‌కుమార్ ఆయన పూర్తి పేరు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందారు. ఆ తర్వాతే ఆయన భార్య కూడా చనిపోవడంతో రాజ్‌కుమార్ కుంగిపోయి అనారోగ్యం పాలయ్యారు. ఆయన భౌతిక కాయాన్ని ఉయ్యూరు తీసుకెళ్లారు ఆయన చిన్న కుమారుడు. రాజ్‌కుమార్ మరణం తీరని లోటు. ఆయన ‘పునాది రాళ్లు’ తీయాలనుకున్నప్పుడు నన్నో వేషం వేయమని అడిగారు. అప్పటికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నా శిక్షణ పూర్తి కాలేదు. ఆ విషయం చెప్పినా కూడా నువ్వే చేయాలి అన్నారు. నా నట జీవితానికి ‘పునాది రాళ్లు’ సినిమా పునాది వేసింది. ఈ మధ్యనే ఆయన్ని కలిశాను. అనారోగ్యంతో ఉన్నారని చెబితే అపోలో ఆసుపత్రిలో వైద్యపరీక్షలు కూడా చేయించాం. కోలుకుని నా దగ్గరకు వస్తారనుకుంటే ఇలా జరగడం విచారకరం. రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. – నటుడు చిరంజీవి -
భర్త హత్య.. సహకరించిన ప్రియుడు
రాయగడ: జిల్లాలోని మునిగుడ సమితిలో ప్రజలంతా మంగళవారం అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల్లో నిమగ్నమై ఉండగా, ఓ దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి తన భర్తనే హత్య చేసిందో ప్రబుద్ధురాలు. మునిగుడ సమితి ఆఫీస్‌లో తాత్కాలిక డ్రైవరుగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ చంటి జీరో నైట్ ముగించుకుని రాత్రి 2 గంటలకు సొంతింటికి చేరుకున్నాడు. అదే సమయంలో తన భార్య నివేదిత నాయక్ ప్రియుడితో కలిసి ఉండడాన్ని చూశాడు. దీంతో కోపోద్రేకుడైన రాజ్‌కుమార్ భార్యతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఘర్షణ పెరిగి తీవ్రతరమైంది. ఈ నేపథ్యంలో నివేదిత నాయక్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం వేశారు. వంటింట్లో ఉన్న రొట్టెలకర్ర, పీఠ చెక్కతో రాజ్‌కుమార్ చంటిపై ఇద్దరూ కలిసి దాడి చేసి చంపేశారు. హత్య అనంతరం అతడి మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి, ప్రియుడి కారులో గజపతి జిల్లాలోని ఒడవ ప్రాంతానికి తరలించారు. అక్కడి రోడ్డు పక్కన మృతదేహాన్ని పడేసి ఇద్దరు కలిసి తిరిగి కారులో ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు. మునిగుడ తహసీల్దారు కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తున్న నివేదిత తన భర్త కనిపించడం లేదంటూ మునిగుడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఒడవ ప్రాంతంలో ఆ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంఘటన స్థలాన్ని క్షణ్నంగా పరిశీలించి, పలు ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ ఆధారాలతో నివేదిత నాయక్‌ను ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. రాజ్‌కుమార్ చంటి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
దటీజ్ పూరి జగన్నాథ్..
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి సినిమా ‘పునాదిరాళ్లు’కు దర్శకత్వం వహించిన గూడపాటి రాజ్‌కుమార్ ప్రస్తుతం అనారోగ్యంతో మంచానపడి వైద్య ఖర్చులకు కూడా భారమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని ‘పునాదిరాళ్లకు పుట్టెడు కష్టాలు’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. బుధవారం ప్రముఖ సినీ దర్శకులు పూరి జగన్నాథ్ రూ.50 వేలు, మెహర్ రమేష్ రూ.10 వేలు, కాశీవిశ్వనాథ్ రూ.5 వేలు చొప్పున ఆయనకు ఆర్థిక సహాయం అందించారు. వారి స్పందనకు రాజ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్‌కుమార్ దీనస్థితి గురించి ‘సాక్షి’ ద్వారా తెలుసుకుని ఇంతకుముందు ప్రసాద్స్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్ట్నర్ సురేష్‌రెడ్డి రూ.41వేలు అందజేశారు. ‘మనం సైతం’ తరఫున నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ రూ.25 వేల నగదు అందజేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో హిట్ కొట్టిన పూరి జగన్నాథ్ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 28న దర్శకత్వ విభాగంలో 30 మంది సభ్యులకు 50 వేల చొప్పున 15 లక్షలు సహాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. ప్రతి ఏడాది పూరి జగన్నాథ్ పుట్టినరోజున ఇలాంటి దాతృత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు నటి, నిర్మాత ఛార్మీ ఈ సందర్భంగా వెల్లడించారు. దర్శకులకు సహాయం చేయాలనే ఆలోచన పూరి జగన్నాథ్‌కు రావడం అభినందనీయమని, ఎన్నో కుటుంబాల ఆశీస్సులు ఆయనకు ఉంటాయని కాశీ విశ్వనాథ్ అన్నారు. తాజాగా రాజ్‌కుమార్‌కు కూడా పూరి జగన్నాథ్ సహాయం చేయడంతో ‘దటీజ్ పూరి’ అంటూ అభిమానులు మెచ్చుకుంటున్నారు. (చదవండి: ‘పునాదిరాళ్ల’కు పుట్టెడు కష్టం) -
రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు రాజ్‌కుమార్‌కు ఆర్థిక సాయం అందింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పడ్డారని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ‘సాక్షి’ శుక్రవారం ‘పునాదిరాళ్లకు పుట్టెడు కష్టం’ శీర్షికన కథనం ప్రచురించిన విషయం విదితమే. దీనికి ప్రసాద్స్ క్రియేటివ్ మెంటర్స్ ఫిలిం మీడియా స్కూల్ మేనేజింగ్ పార్ట్నర్ సురేష్‌రెడ్డి స్పందించారు. తార్నాకలో ఉంటున్న దర్శకుడి దగ్గరకు వెళ్లి రూ.41వేలు అందజేశారు. ‘మనం సైతం’ తరఫున... అదే విధంగా ‘మనం సైతం’ తరఫున నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ రూ.25 వేల నగదు అందజేశారు. ‘మనం సైతం’ కుటుంబం నుంచి సాయం చేద్దామని ఆయన గ్రూపులో అభ్యర్థించగానే పలువురు నటులు, సినీ జర్నలిస్టులు, సాంకేతిక నిపుణులు స్పందించారు. ఆ మొత్తాన్ని కాదంబరి కిరణ్ స్వయంగా వెళ్లి రాజ్‌కుమార్‌కు ఇచ్చారు. స్పందించిన ప్రతి ఒక్కరికీ రాజ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. -
‘పునాదిరాళ్ల’కు పుట్టెడు కష్టం
బంజారాహిల్స్: గూడపాటి రాజ్‌కుమార్ (75).. మెగాస్టార్ చిరంజీవి తొలిచిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు. తొలి సినిమాతోనే 5 నంది అవార్డులు అందుకొని ఘనత సాధించారు. తీసినవి కొన్ని సినిమాలే అయినా అవన్నీ సామాజిక ఇతివృత్తాలే. సామాజిక కోణంలో నిర్మించిన ఆ చిత్రాలతో ఎక్కడికో ఎదగాల్సిన ఆయనకు ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి. ముందుకెళ్లే స్థోమత లేక వెనకబడ్డారు. ఎదిగొచ్చిన కొడుకు అనారోగ్యంతో మృతి చెందడం, తర్వాత కొద్ది రోజులకే సతీమణిని కూడా కోల్పోవడం ఆయనకు కోలుకోలేని దెబ్బ. వెనక్కి తిరిగి చూసుకుంటే మెగాస్టార్‌తో మొదటి సినిమాతీశానన్న సంతోషం మాత్రమే మిగలగా... ముందుకు చూసుకుంటే భవిష్యత్తు చీకటిమయమై బతుకు అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంచానికి పరిమితమై వైద్యం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. సినిమా నిర్మాతగా, దర్శకుడిగా, గీత రచయితగా, కథా రచయితగా పని చేసినా ఇప్పటికీ ఫిల్మ్‌నగర్‌లో గానీ, చిత్రపురి కాలనీలో గానీ ఆయనకు సొంతిల్లు లేదు. దీంతో అద్దె ఇంటిలోనే కాలం గడుపుతున్నారు. పైసా బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవడంతో రెండో కొడుకు కష్టంతో బతుకు వెళ్లదీస్తున్నారు. కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన రాజ్‌కుమార్ విజయవాడలో డిగ్రీ పూర్తి చేసి 1966లో హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొంది రెండేళ్ల పాటు నారాయణగూడ కేశవ మెమోరియల్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలోనే సినిమాలపై ఇష్టం పెరిగింది. మంచి ఇతివృత్తాలతో సినిమా తీస్తే బాగుంటుందని భావించారు. కాలేజీ చదివే రోజుల్లోనే నాటకాలు వేస్తూ పాటలు కూడా పాడేవారు. ఆ అనుభవాన్ని సినిమాల్లో రంగరించాలనుకున్నారు. పాతబస్తీ జహనుమాలోనా సదరన్ మూవీస్ స్టూడియోలోకి అడుగుపెట్టారు. తన ఆశయాన్ని నిర్వాహకులతో చెప్పారు. సతీ అనసూయ, రహస్యం సినిమాలకు కో–డైరెక్టర్‌గా పని చేశారు. ఆ స్టూడియోలో మరాఠీ, హిందీ సినిమాల షూటింగ్‌లు జరుగుతుండేవి. రాజ్‌కుమార్ ఆసక్తిని గమనించిన ఆ సినిమాల దర్శకులు కో–డైరెక్టర్‌గా అవకాశమిచ్చారు. అక్కడి నుంచి రాజ్‌కుమార్‌కు సినిమాలపై నమ్మకం పెరిగింది. తన అనుభవంతో ‘పునాదిరాళ్లు’ అనే సినిమాకు కథ రాసుకున్నారు. 1977లో ఈ సినిమా కథ రాసుకోగా, 1978లో ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. ఆస్తులన్నీ సినిమాలకే... తండ్రితో విషయం చెప్పగా ఆస్తులు, పొలాలు అమ్మి ఆయన కొంత డబ్బు సమకూర్చారు. ఇంకేముంది మద్రాసు రైలెక్కారు. ఆ సినిమాలో ఐదుగురు హీరోలుండగా చిరంజీవి, సుధాకర్‌తో పాటు నరసింహరాజును తీసుకున్నారు. సినిమా నిర్మాణం అద్భుతంగా జరిగింది. ట్రయల్స్ చూసినా చాలామంది దర్శకులు విడుదల కాకముందే అభినందించారు. ఆ సినిమా విడుదల కోసం ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎంతోమందిని బతిమిలాడారు. ఓ వైపు రీరికార్డింగ్ పనులు జరుగుతుండగా, అక్కడకు వచ్చిన క్రాంతికుమార్‌కు చిరంజీవి అభినయం బాగా నచ్చి ఎవరితను అని రాజ్‌కుమార్‌ను అడిగారు. మంచి నటన ఉందని రాజ్‌కుమార్ చెప్పగా ‘ప్రాణం ఖరీదు’ సినిమాకు హీరోగా పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత చిరంజీవి వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాజ్‌కుమార్ ఎలాగోలా సినిమా రిలీజ్ చేయగా 5 నంది అవార్డులు వచ్చాయి. ‘ఈ సమాజం నాకొద్దు, మన ఊరి గాంధీ, మా సిరిమల్లె’ తదితర ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించారు. కొద్దిరోజులు టీవీ సీరియళ్లకు కూడా పని చేశారు. ఎంత చేసినా ఆర్థికంగా ఎదగలేకపోయారు. సినిమాలకే ఆస్తులను ఖర్చు పెట్టారు. రెండు నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన రక్తపు విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు. వైద్య ఖర్చులు భరించలేక శక్తిహీనుడయ్యారు. ఇప్పటికే గుండెకు రెండు స్టంట్లు వేశారని వాపోయారు. చిరు స్ఫూర్తి.. ‘బావగారు బాగున్నారా’ సినిమా చేస్తున్న సమయంలో చిరంజీవి నన్ను పిలిపించి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఆయనే నాకు స్ఫూర్తి. ఎవరైనా సినీ పెద్దలు ఆదుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను 70754 42277 నంబర్లో సంప్రదించొచ్చు. – రాజ్‌కుమార్ -
ప్రముఖ నిర్మాత కన్నుమూత
హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, వివాహ్, ప్రేమ్ రతన్ థన్ పాయో లాంటి చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, రాజశ్రీ ఫిలింస్ అథినేత రాజ్ కుమార్ బర్జాత్య గురువారం ఉదయం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. తండ్రి అడుగు జాడల్లో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన రాజ్ కుమార్ ఎన్నో విమర్శకుల ప్రశంసలందుకున్న ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. టెలివిజన్ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రాజ్‌కుమార్. దాదాపు అన్ని ప్రముఖ హిందీ చానల్స్‌లోనూ రాజ్‌కుమార్ నిర్మాణంలో తెరకెక్కిన సీరియల్స్ ప్రసారమయ్యాయి. తన వారసుడిగా సూరజ్ బర్జాత్యను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాజ్‌కుమార్, తనయుడి దర్శకత్వంలో మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, వివాహ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. దాదాపు 70 సంవత్సరాలుగా సినీ రంగంతో సంబంధాలు ఉన్నా రాజ్‌కుమార్ బర్జాత్య మృతి పట్ల బాలీవుడ్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. -
మాజీ ఎమ్మెల్యేకి పదేళ్ల జైలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: బాలికపై అత్యాచారం కేసులో డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎం. రాజ్‌కుమార్ (52)కు పదేళ్ల జైలు శిక్ష, రూ.42 వేల జరిమానా విధిస్తూ చెన్నై ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 2006లో పెరంబలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో కేరళ రాష్ట్రం ఇడిక్కి జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఇతని ఇంట్లో పనిచేసింది. అయితే పనిలో చేరిన కొద్ది రోజులకే ఆ బాలిక తన తల్లికి ఫోన్ చేసి ఇక్కడ ఉండలేనని, తనను తీసుకెళ్లాలని కోరింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పెరంబలూరు ప్రయాణమవుతుండగా, రాజ్‌కుమార్ స్నేహితుడు జయశంకర్ ఫోన్ చేసి అనారోగ్యం కారణంగా బాలికను ఆస్పత్రిలో చేర్పించినట్టు చెప్పాడు. తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లి బాలికను చూడగా స్పృహలేని స్థితిలో కనిపించింది. చికిత్స పొందుతూనే మరణించింది. తన కూతురు మరణంలో పలు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరంబలూరు పోలీసులు కేసు నమోదు చేసి, శవపంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె అత్యాచారానికి గురై మరణించినట్లు తేలింది. దీంతో డీఎంకే మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్, అతని స్నేహితులు జయశంకర్, అన్బరసు, మహేంద్రన్, హరికృష్ణ, పన్నీర్ సెల్వం సహా ఏడుగురిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును సీబీసీఐడీ విచారణ చేపట్టి రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసింది. కేసు పెరంబలూరు న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సమయంలోనే పన్నీర్ సెల్వం చనిపోయాడు. రాజ్‌కుమార్ మాజీ ఎమ్మెల్యే కావడంతో ప్రజా ప్రతినిధుల నేరాల విచారణకు ఏర్పడిన ప్రత్యేక కోర్టుకు ఈ కేసు చేరింది. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శాంతి నిందితులైన మాజీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్, జయశంకర్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ. 42 వేల జరిమానా విధించారు. -
వీరప్పన్ సహా అందరూ నిర్దోషులే
సాక్షి ప్రతినిధి, చెన్నై: కన్నడ సూపర్‌స్టార్ దివంగత రాజ్‌కుమార్‌ను ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. దాదాపు 18 ఏళ్లుగా ఈ కేసును కోర్టు విచారిస్తోంది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళయం కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. నేరం నిరూపితం కాకపోవడం, నేరాన్ని రుజువు చేసే సరైన సాక్ష్యాలు లేకపోవడంతో వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. 2000 జూలై 30న ఈరోడ్ జిల్లా తొట్టకాజనూరులోని రిసార్టుకు భార్య పార్వతమ్మాళ్తో కలసివచ్చిన రాజ్‌కుమార్‌ను ఆరోజు రాత్రి వీరప్పన్ తన సహచరులతో కలసి కిడ్నాప్ చేశాడు. దీంతో వీరప్పన్, అతని అనుచరులు 14 మందిపై కేసు నమోదైంది. తమిళనాడు జర్నలిస్టు నక్కీరన్ గోపాల్‌సహా పలువురు సాగించిన రాయబారాల ఫలితంగా 107 రోజుల తర్వాత రాజ్‌కుమార్ విడుదలయ్యాడు. అయితే, 2004 అక్టోబర్‌లో పోలీస్ ఎన్కౌంటర్లో వీరప్పన్, అతని అనుచరులు గోవిందన్, చంద్రగౌడ తదితరులు హతమయ్యా రు. 2006లో రాజ్‌కుమార్, గత ఏడాది ఆయన భార్య కన్నుమూశారు. -
ఎన్నికల అధికారి దారుణ హత్య
కోల్కత్తా : పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎన్నికల విధులు నిర్వహించడానికి వచ్చిన ఓ ప్రిసైడింగ్ అధికారి దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర దినాజ్పూర్లో జరిగిన ఈ సంఘటన రాష్ట్రం వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రహత్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ రాయ్, రాయ్‌గంజ్‌లోని ఇతహార్ ప్రాంతానికి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిగా వెళ్లారు. పోలింగ్ జరిగే సమయంలో కొందరు అడ్డుకొవడానికి ప్రయత్నించగా ఆయన వారిని ప్రతిఘటించారు. అయితే పోలింగ్ పూర్తైన అనంతరం రాయ్ అకస్మాత్తుగా అదృశ్యమై పోయారు. ఎన్నికల రోజు తన భర్త రాయ్ పోలింగ్ బూత్‌లో ఉండగా రాత్రి 8 గంటలకు మాట్లాడానని, ఆతరువాత మాట్లాడటానికి ప్రయత్నించిన కుదరలేదని ఆయన భార్య అర్పిత తెలిపారు. దీంతో అనుమానం వచ్చి రాయ్ కిడ్నాప్ అయ్యారని ఇతహర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మరుసటి రోజు సోనాదంగి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు పట్టలేనంత స్థితిలో రాయ్ మృతదేహం ముక్కలు ముక్కలుగా పడివుంది. రాయ్ మరణంపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పథకం ప్రకారం రాయ్ ప్రాణాలు తీశారని, దీనిపై సీబీఐ విచారణ చేయాలని అర్పిత డిమాండ్ చేశారు. రాజ్‌కుమార్ రాయ్ దారుణ హత్యపై ఇతర ఎన్నికల అధికారులు, పాఠశాల ఉద్యోగులు బుధవారం నిరసనకు దిగారు. రాయ్ మరణంపై తగిన న్యాయం చేయాలంటూ రోడ్లను దిగ్భందించారు. రాయ్ హత్యపై ఫిర్యాదు చేస్తే పోలీసులు తిరస్కరించారని వారు ఆరోపించారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. అయతే దీనిపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది. కేసు విచారణను సీఐడీకి అప్పగించనున్నట్లు సమాచారం. -
కూత్తాన్ కోసం టీఆర్ పాట
తమిళసినిమా: తమిళ చిత్ర పరిశ్రమలో సకలకళావల్లభుడు ఎవరంటే టి.రాజేందర్ అనే బదులే వస్తుంది. నటుడు, దర్శకుడు, సంగీతదర్శకుడు, చాయాగ్రాహకుడు, గీతరచయిత, గాయకుడు ఇలా పలు విభాగాల్లో నిష్టాతుడైన టీఆర్ గాయకుడిగా తన చిత్రాలకే పాడుకుంటారు. ఆయన పాడాలంటే ఆ పాటలు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంటాయి.అందుకే ఆయనతో తమ చిత్రాల్లో ఒక్క పాట అయినా పాడించాలని దర్శక నిర్మాతలు కోరుకుంటారు. అయితే బయట చిత్రాలకు పాడాలంటే ఆ పాట ఆయన మనసును హత్తుకోవాలి. లేదంటే నిక్కచ్చిగా సారీ అని చెప్పేస్తారు. అలాంటిది నవ నటుడు కథానాయకుడిగా నటిస్తున్న కూత్తాన్ చిత్రానికి ఆయన పాట పాడడం విశేషం. నిలగిరీస్ డ్రీమ్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నీలగిరీస్ మురుగన్ నిర్మిస్తున్నారు. వెంకీ.ఏఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజ్‌కుమార్ అనే నవ నటుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. బాలాజీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం కోసం గీతరచయిత రాఖేష్ రాసిన మాకిస్తా కీంకిస్తా అనే పాటను చిత్ర వర్గాలు టి.రాజేందర్‌తో పాడించాలని భావించారట. దీంతో సంగీత దర్శకుడు బాలాజి టి.రాజేంద్రన్‌ను కలిసి కూత్తన్ చిత్రంలో ఒక పాట పాడాలని కోరగా నో అన్నారట. అనంతరం బాలాజి పాట వినమని కోరగా విన్న టి.రాజేందర్ ఆ పాట ట్యూన్స్ బాగా నచ్చేయడంతో ఈ పాటను ఎవరు పాడినా హిట్ అవుతుందని కితాబిచ్చి తాను పడతానని చెప్పారని చిత్ర దర్శకుడు తెలిపారు. ఈ పాటను నృత్యదర్శకుడు అశోక్రాజా నృత్యదర్శకత్వంలో భారీ ఎత్తున చిత్రీకరించనున్నట్లు ఆయన తెలిపారు. -
సూపర్‌స్టార్‌ను జ్ఞాపకం చేసిన గూగుల్
బెంగళూరు: కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌కు గూగుల్ ఘన నివాళి అర్పించింది. ఆయన 88వ జయంతి సందర్భంగా ప్రత్యేక డూడుల్‌తో ఆకట్టుకుంది. ఓ తెరమీద బ్యాక్ గ్రౌండ్లో గూగుల్ అని ఉండి యువకుడిగా రాజ్‌కుమార్ చిరునవ్వు చిందిస్తుండగా ఎదురుగా ప్రేక్షకులు కూర్చొని ఆయనను చూస్తున్నట్లుగా ఆ డూడుల్ ఉంది. 1929లో అంబరీష్ సింగనల్లూరు పుట్టస్వామయ్య ముత్తురాజుగా జన్మించిన ఆయన వెండి తెర వెలుగుపైకి రాగానే రాజ్‌కుమార్‌గా మారిపోయారు. దాదాపు నాలుగు దశాబ్దాలు కన్నడ చిత్ర పరిశ్రమను ఏలారు. 1954 బేదారా కన్నప్పా అనే కన్నడ చిత్రం ద్వారా సినీలోకంలో అడుగుపెట్టిన ఆయన దాదాపు 200 చిత్రాల్లో నటించింది. ఆయన జీవితం మొత్తం కన్నడ చిత్ర పరిశ్రమకే అంకితం చేశారు. ఆయన మంచి గాయకుడిగా కూడా పేరు సంపాధించుకున్నారు. 300వందల పాటలు కూడా పాడారు. పద్మభూషణ్, దాదా సాహేబ్ పాల్కే వంటి అవార్డులు కూడా పొందారు. ప్రస్తుతం ఆయన కుమారులు శివరాజ్‌కుమార్, పునీత్ రాజకుమార్ కూడా కన్నడ చిత్ర సీమలో ప్రముఖులుగా ఉన్నారు. -
అల్లరి చేస్తున్నాడని చిన్నారికి వాతలు
-
అల్లరి చేస్తున్నాడని చిన్నారికి వాతలు
కృష్ణా: అల్లరి చేస్తున్నాడన్న కోపంతో వాళ్ల పెద్దమ్మ ఓ చిన్నారికి వాతలు పెట్టింది. యనమనలకుదురు ప్రియదర్శినినగర్‌కు చెందిన కోవెల ప్రభు, శైలజ దంపతులకు రాజ్‌కుమార్(6), శివకుమార్(4) ఉన్నారు. నాలుగురోజుల క్రితం ఊరెళుతూ రాజ్‌కుమార్‌ను ఇంటి పక్కనే ఉండే మేడే భవానికి అప్పజెప్పి వెళ్లింది. మంగళవారం రాజ్‌కుమార్ అల్లరి ఎక్కువగా చేస్తుండటంతో విసుగు చెందిన భవాని గరిట కాల్చి చేతులు, కాళ్లపై వాతలు పెట్టింది. ఊరు నుంచి వచ్చిన తర్వాత బిడ్డకు గాయాలైనా పట్టించుకోకుండా వదిలేసింది శైలజ. కాగా, కాలిన గాయాలతో స్ధానిక అంగన్వాడీ కేంద్రానికి మంగళవారం ఉదయం బాలుడు వచ్చాడు. బాలుడి శరీరంపై ఉన్న గాయాలను చూసిన అంగన్వాటీ కార్యకర్త ఏమైందని ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో బాలుడిని హింసించిన ఘటనను నవజీవన్ బాల భవన్ కార్యకర్తల దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లి శైలజ, పెద్దమ్మ భవానీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలపై ప్రేమలేని శైలజ వారి ఆలనాపాలనలను చూడటం మానేసింది. గతంలో ఓ సారి పిల్లలను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది శైలజ. దీంతో విజయవాడ చైల్డ్‌లైన్ నిర్వాహకులు పిల్లల్ని తీసుకువెళ్లి సంరక్షించారు. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్లినట్లు తెలిసింది. కేసును విచారించిన పోలీసులు శైలజ, భవానీలను అదుపులోకి తీసుకున్నారు. -
సింగిల్స్‌కోసం కోహ్లీ ఏం చేశాడంటే..?
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలో ఒక్క జుట్టు, గడ్డం విషయంలో తప్ప ఫిట్‌నెస్‌లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించదు. అతడు ఎప్పుడూ చాలా యాక్టీవ్‌గా ఉంటూ ఫుల్ ఎనర్జిటిక్‌గా అదే పర్సనాలిటీతో దర్శనమిస్తుంటాడు. ఇందుకు ప్రధాన కారణం ఈ పరుగుల వీరుడు తాను తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడంట. ఆట ఆడే సమయంలో సింగిల్స్ ఎక్కువగా తీయాలనే ఉద్దేశంతో అందుకు అడ్డుగా ఉన్న బటర్ చికెన్, మటన్ రోల్స్ మొత్తానికి వదిలేశాడంట. ఈ విషయాన్ని స్వయంగా కోహ్లీ కోచ్ రాజ్ కుమార్ క్రికెట్ నెక్స్ట్‌తో మాట్లాడుతూ చెప్పారు. ఈ ఢిల్లీ క్రికెటర్ ప్రస్తుతం టీమిండియాలో ఉన్నత శిఖరం అధిరోహించడానికి ప్రతి విషయంలో విరాట్ నిబద్ధతే కారణం అని తెలిపారు. సాధారణంగా కోహ్లీ ఏవైనా సరే తాజాగా ఉండేవి మాత్రమే ఉపయోగిస్తాడని, ఇంటికొచ్చినప్పుడు ప్యాకెట్లలో ఉండే పండ్ల రసాలను ఇస్తే వాటికి నో అని చెప్పి ఇంట్లో పండ్లు ఉంటే వాటిని జ్యూస్‌గా తీసి ఇవ్వండని కోరతాడని చెప్పారు. అలాగే, కోహ్లీ అరటిపండ్లు బాగా తింటాడట. ప్రతి మ్యాచ్ ప్రారంభం సమయంలో కనీసం రెండు మూడు అరటిపండ్లు తింటాడని ఆయన చెప్పుకొచ్చారు. -
శిల్పి రాజ్‌కుమార్‌కు ‘స్వర్ణభారతి’ పురస్కారం
కొత్తపేట : కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి, ఏపీ ప్రభుత్వ ఆస్థాన శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ స్వర్ణభారతి కళా పురస్కారం అందుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని ఆతుకూరు కళాభారతి సేవా సంస్థ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం శిల్ప కళలో అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన రాజ్‌కుమార్‌కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌ల చేతుల మీదుగా పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా వుడయార్‌ను స్థానిక కళాసాహితి అధ్యక్షుడు పెన్మెత్స హరిహరదేవళరాజు, ప్రధాన కార్యదర్శి జి.సుబ్బారావు, సభ్యులు ఏబీసీ దేవ్, షేక్ గౌస్, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు తోట వెంకటేశ్వరరావు తదితరులు అభినందించారు. -
గుంటూరులో..?
‘సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే.. అడవిలాంటి అందాలే ఆక్రమించాడే..’ అంటూ ‘సింహా’ చిత్రంలో తన గ్లామర్‌తో కుర్రకారు మతులు పోగొట్టారు బొద్దుగుమ్మ నమిత. ఆ చిత్రం విడుదలై ఆరేళ్లు దాటినా ఆమె మరో తెలుగు చిత్రంలో నటించలేదు. ఆ మాటకొస్తే తమిళంలో కూడా చేయడంలేదు. సహజంగానే బొద్దుగా ఉండే నమిత మరింత బరువు పెరగడంతో అవకాశాలు తగ్గాయనొచ్చు. ఆ విషయం గహ్రించారేమో స్లిమ్ అయ్యారు. తమిళంలో ఆల్రెడీ ఓ సినిమా అంగీకరించారు. తాజాగా ‘గుంటూర్ టాకీస్ 2’తో తెలుగు చిత్ర పరిశ్రమలో రీ–ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త వినిపిస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఎం. నిర్మించిన ‘గుంటూర్ టాకీస్’ ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. ఆ చిత్ర నిర్మాత రాజ్‌కుమార్ దర్శకునిగా మారి, ‘గుంటూర్ టాకీస్ 2’ తెరకెక్కించ నున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ తీయాలను కుంటున్నారట. ఇందులో డాన్ పాత్రకు బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లీయోన్ను తీసుకున్నారనే వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఓ ముఖ్య పాత్రలో నమిత కనిపించనున్నారని టాక్. దర్శక–నిర్మాత ఆమెను సంప్రదించారట. ఇక, నమిత గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. -
రాజ్‌కుమార్ కిడ్నాపైన గెస్ట్‌హౌస్‌లో అధిరన్
కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ను గంధపు చెక్కల స్మగ్లర్ కిడ్నాప్ చేసిన గెస్ట్‌హౌస్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం అధిరన్ అని ఆ చిత్ర దర్శకుడు జేవీ.మోహన్ తెలిపారు. దర్శకుడు కస్తూరిరాజా, కేఎస్.రవికుమార్,పార్తిబన్, అశోక్ వంటి వారి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవంతో జేవీ.మోహన్ మెగాఫోన్ పట్టి తెరపై ఆవిష్కరించిన చిత్రం అధిరన్. పి.మూవీస్, స్మార్ట్ అచీవర్స్ స్క్రీన్ సంస్థల అధినేతలు రాజ్, సురేశ్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నిర్మాతల్లో ఒకరైన సురేశ్‌కుమార్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు.ఆయనకు జంటగా మలయాళ నటి అంజనా నాయకిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి చాయాగ్రహణం మహేశ్, సంగీతాన్ని రఘు, జైల ద్వయం అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ కళాశాలలో చదువుతున్న హీరో ప్రాణ మిత్రుడి కుటుంబం అప్పుల బాధకు గురవుతుందన్నారు.దీంతో హీరో వారి అప్పును తాను తీరుస్తానని రుణం ఇచ్చిన వారికి హామీ ఇస్తాడన్నారు. అయితే అనుకున్న సమయానికి హీరో అప్పు చెల్లించకపోవడంతో తన మిత్రుడు కిడ్నాప్‌నకు గురవుతాడన్నారు. అతన్ని రక్షించడానికి బయలు దేరిన హీరో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? వాటి నుంచి ఎలా బయట పడ్డాడు అన్నదే అధిరన్ చిత్ర ఇతివృత్తం అని వివరించారు. చిత్ర షూటింగ్‌ను కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన సత్యమంగళం ప్రాంతంలోని గెస్ట్‌హౌస్‌లో చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రం అధిరన్ అని, ప్రత్యేక అనుమతితో అక్కడ షూటింగ్ నిర్వహించినట్లు దర్శకుడు తెలిపారు.స్నేహం,ప్రేమ,పోరాటం అంటూ కమర్శియల్ అంశాలతో తెరకెక్కించిన చిత్రం అధిరన్ అని తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. -
క్లౌడ్ కంప్యూటింగ్‌పై పరిజ్ఞానం అవసరం
తిరుపతి, గాంధీ రోడ్డు : సాంకేతిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్‌పై విద్యార్థులు పరిజ్ఞానం పెంచుకోవాలని ఆస్ట్రేలియా మెల్బోర్న్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజ్‌కుమార్‌బుయ్యా తెలిపారు. శనివారం చంద్రగిరి మండలం రంగంపేటలోని శ్రీవిద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలోని ఐటీ విభాగంలో టెక్విప్–2 సౌజన్యంతో ఒకరోజు రీసెర్చ్ ఓరియెంటెడ్ అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్లౌడ్ కంప్యూటింగ్‌ను వివరించారు. నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శ్రీనివాసులురెడ్డి, చెన్నై అన్నా యూనివర్సిటీ ఐటీ ప్రొఫెసర్ తమరైసెల్వి మాట్లాడుతూ బిగ్‌డేటా ఎనలటిక్స్ ప్రాముఖ్యతను వివరించారు. అధ్యాపకులు గోపాలరావు, సుదర్శన్ కుమార్, భగవాన్, కష్ణమాచారి, టెక్విప్–2 కో–ఆర్డినేటర్ దామోదరం, రమణి పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, పరిశ్రమల నుంచి వచ్చిన 123 మంది ఇంజనీర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. -
గల్ఫ్‌లో సందడి చేయనున్న ‘బబ్రువాహన’
బెంగళూరు: డాక్టర్ రాజ్‌కుమార్ ద్విపాత్రాభినయంలో నటించిన అలనాటి చిత్రం ‘బబ్రువాహన గల్ఫ్‌లో కూడా సందడి చేయనుంది. హుణసూరు కృష్టమూర్తి నిర్దేశకత్వంలో 70వ దశకంలో రూపొందించిన ఈ చిత్రం కన్నడ సినిమా రంగంలో కొత్త చరిత్రను సృష్టించిన విషయం విధితమే. తిరిగి ఈ చిత్రాన్ని డిజిటల్ టెక్నాలజీ ద్వారా రంగుల్లోకి మార్చి కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 22న రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేసారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఇప్పటి తరం అభిమానులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. త్వరలో ఈ సినిమా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతుంది. విదేశాల్లో ఉన్న కన్నడ సినిమా అభిమానుల కోరిక మేరకు బబ్రువాహన సినిమాను గల్ఫ్ దేశాలైన దుబాయ్,షార్జా,అబుదాబి,ఓమన్,మస్కత్,సోహార్ తదితర దేశాలలో విడుదల చేయనున్నామని చిత్రవర్గాలు తెలిపాయి. -
198 చిత్రాల్లో నటించా..
భీమవరం : స్వచ్ఛంగా గలగలపారే గోదావరి, మైమరిపించే ప్రకృతి అందాలను సొంతం చేసుకున్న గోదావరి తీరాన్ని తానెప్పటికీ మరిచిపోలేనని సినీ నటి జమున అన్నారు. భీమవరం మావుళ్లమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పాలకొల్లు, నరసాపురం పరిసరాల్లో చిత్రీకరించిన మూగమనసులు చిత్రం తెలుగు, హిందీలో సూపర్‌హిట్‌గా నిలిచి తనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిందన్నారు. 198 చిత్రాల్లో నటించా.. తాను ఇప్పటివరకు 198 చిత్రాల్లో నటించానని జమున తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు ఉన్నాయన్నారు. ఎన్టీ రామారావుతో 30 చిత్రాల్లో నటించగా ఏఎన్ఆర్, రాజకుమార్ వంటి హీరోలతో నటించిన చిత్రాలు పేరు తెచ్చిపెట్టాయని చెప్పారు. సత్యభామగా పేరొచ్చింది సాంఘిక సినిమాల్లో ‘మూగమనసులు’, పౌరాణిక చిత్రాల్లో ‘సత్యభామ’ మంచిపేరు తెచ్చిపెట్టాయని జమున అన్నారు. వ్యక్తిగతంగా ‘పండంటి కాపురం’ చిత్రంలోని రాణిమాలినిదేవి పాత్ర సృంతప్తి నిచ్చిందన్నారు. 25 ఏళ్లు హీరోయిన్గా.. చిత్రసీమలో 25 ఏళ్లపాటు కథానాయికిగా నటించడం పుర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని జమున తెలిపారు. ప్రస్తుత నటులు అయిదారు సినిమాలకు పరిమితం కాగా తాను అన్నేళ్లపాటు నటిగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పేద కళాకారులకు చేయూత సినీ, నాటక రంగంలో పేద కళాకారులకు సేవా చేయాలనే సంకల్పంతో జమున పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుచేశానని చెప్పారు. ద్రాక్షరామసమీపంలో వృద్ధాశ్రమం ఏర్పాటుచేస్తానన్నారు. దీనికి 1,000 గజాల స్థలం కేటాయించామని వృద్ధులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. సినీ రంగం వ్యాపార మయం ప్రస్తుతం సినీ పరిశ్రమ వ్యాపార రంగంగా మారిందని జమున ఆవేదన వ్యక్తం చేశారు. యువతను పెడదోవ పట్టించేలా ఎక్కువగా సినిమాలు వస్తున్నాయని, అశ్లీలత ఎక్కువవుతోందన్నారు. టీవీల వల్ల సినీ పరిశ్రమ దెబ్బతింటుందనే వాదన సరైంది కాదని చెప్పారు. మంచి సినిమాలను థియేటర్లలలో చూడటానికే ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. సన్మానం పూర్వజన్మ సుకృతం సినీ నటిగా తాను పలు సన్మానాలు అందుకున్నా భీమవరం మావుళ్లమ్మ వారి సన్నిధిలో సత్కారం అందుకోవడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని సినీ నటి జమున అన్నారు. ఆదివారం రాత్రి మావుళ్లమ్మ ఆలయం వద్ద కొటికలపూడి గోవిందరావు కళావేదికపై నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జమునను ఘనంగా సన్మానించారు. గోదావరి ప్రాంత ప్రజలకు ఉదార స్వభావం మెండుగా ఉంటుందని, ఇన్నేళ్లుగా తనపై చూపుతున్న ఆదరాభిమానాలే ఇందుకు నిదర్శనమన్నారు. లక్షలాది రూపాయలతో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడంతో పాటు కళాకారులను సత్కరించడం అభినందనీయమన్నారు. -
ఇక్కడి ప్రజల ఆదరణ మరచిపోలేనిది..
రెండు రాష్ట్రాల్లో రాబోయే రోజులు మనవే.. రాజ్‌కుమార్ పార్టీలో చేరడం సంతోషకరం వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి గీసుకొండ : గీసుకొండ మండల ప్రజలు చూపిస్తున్న ఆదరణను ఎన్నటికీ మరచిపోలేమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గీసుకొండ మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్.జగన్మోహన్రెడ్డి వెంట వచ్చిన ఆయన మాట్లాడారు. ఇక్కడి ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వైఎస్సార్ సీపీకి మంచి రోజులు రానున్నాయని అన్నారు. టీఆర్ఎస్ నాయకుడు వీరగోని రాజ్‌కుమార్ వైఎస్సార్సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో పరకాల ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారం చేశారని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ పార్టీలో చేరిన వీరగోని రాజ్‌కుమార్ మా ట్లాడుతూ ప్రజలకు జీతగాళ్లుగా పని చేయాల్సిన ప్రజా ప్రతినిధులు మద్యలో రాజీనామా చేస్తే వారిని పని దొంగలు అనాల్సి వస్తుందని పేర్కొన్నారు. పాలకుల అహంకారంతోనే ఈ ఎన్నికలు రాగా.. ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులను ఓట్లు వేయాలని టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నారని తెలిపారు. నాడు వైఎస్సార్ నీడలో పని చేశామని, ప్రస్తుతం జగన్మోహన్రెడ్డి నాయత్వంలో ముందుకు సాగుతూ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని రాజ్‌కుమార్ పేర్కొన్నారు. తనను తమ్ముడిగా ఆదరించి, తన వెంట వైఎస్సార్సీపీ పార్టీలో చేరడానికి వచ్చిన వారికి ఈ సందర్బంగా రాజ్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ప్రస్తుత ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్ధించారు. కాగా, రాజ్‌కుమార్ వెంట ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ మేరకు ఊకల్ ఎంపీటీసీ పులిచేరి మంజుల, గీసుకొండ ఎంపీటీసీ వీరగోని కవిత, గీసుకొండ పీఏసీఎస్ చైర్మన్ కోల రమేష్, పలువురు సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలతో పాటు సుమారు ఆరు వేల మంది వైఎస్సార్ సీపీలో చేరినట్లు రాజ్‌కుమార్ తెలిపారు. వృద్ధులను ఓటు అడిగిన జగన్మోహన్రెడ్డి రోనాయమాకులలో ఓ ఇంటి వద్ద ఆగి అక్కడి వృద్ధులు అమృతాబాయి, కమలమ్మ, రాధమ్మను వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పలకరించారు. తమ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మంగళహారతులతో స్వాగతం.. వైఎస్.జగన్మోహన్రెడ్డిని కోనాయమాకుల మహిళలు మంగళహారతులతో స్వాగతించారు. గ్రామంలోని ముఖ్య కూడలి వద్ద ఆయన రాకను గమనించిన మహిళలు మంగళహారతులతో ఎదురువెళ్లారు. ఈ సందర్భంగా మహిళలతో జగన్మోహన్రెడ్డి ఆప్యాయంగా మాట్లాడారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. -
కాకినాడలో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ రాజ్‌కుమార్ మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ విషయాన్ని గమనించి సహచరులు వెంటనే కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. ప్రేమ విఫలం కారణంగానే రాజ్‌కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సహచరులు పోలీసులకు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అసెంబ్లీ వద్ద యువకుడి ఆత్మాహుతియత్నం
వరంగల్ జిల్లా తాడ్వాయి ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ ప్రజాసంఘాలు చేపట్టిన చలో అసెంబ్లీలో ఓ యువకుడు అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద ఆత్మాహుతియత్నం చేశాడు. పౌర హక్కుల సంఘాలకు చెందిన రాజ్‌కుమార్ అనే యువకుడు పెట్రోలు పోసుకుని, నిప్పు అంటించుకునే ప్రయత్నం చేస్తుండగా మీడియా ప్రతినిధులు, పోలీసులు గుర్తించి వెంటనే అతడి చేతిలోంచి అగ్గిపెట్టె లాగేసుకున్నారు. భగత్ సింగ్ దేశం కోసం త్యాగం చేసినట్లుగా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని రాజ్ కుమార్ చెప్పాడు. పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆగకుండా.. తాను చచ్చిపోతాననే చెప్పాడు. కాసేపు.. తన పేరు భగత్ సింగ్ అని కూడా అతడు అన్నట్లు తెలుస్తోంది. భ్రష్టుపట్టిన రాజకీయాల నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని రాజ్ కుమార్ అంటున్నాడు. అతడు ఎవరో, ఎక్కడినుంచి వచ్చాడో తెలియలేదు. అతడి మాటలను చూసి, అతడి మానసిక స్థితి ఏంటో కూడా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. చలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో ముందునుంచి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసినా, అతడు మాత్రం భద్రతావలయాన్ని ఛేదించుకుని మరీ పెట్రోలు సీసా పట్టుకుని వెళ్లాడు. అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సీఆర్పీఎఫ్ లాంటి దళాలతో చాలా పటిష్ఠమైన భద్రత ఏర్పాటుచేశారు. డీజీపీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. అయినా కూడా రాజ్ కుమార్ అసెంబ్లీ గేటుకు కేవలం 50 మీటర్ల దూరంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. -
ఒకరి కోసం ఒకరు..
నాయనా భోజనం తిందువు లేరా... ‘‘నాయనా లోహిత్ నేను ఉదయం పనికి వెళ్లినప్పుడు భోజనం పెట్టాను. మరి నేను ఇంటికి వచ్చాను భోజనం పెడతాను లేరా నా కొడుకూ..’’ అంటూ బిడ్డ మృతదేహం వద్ద తల్లి కుసుమ రోదించడం అందరి హృదయాలను కలచి వేసింది. విషాదానికే కన్నీళ్లు తెప్పించే ఘోరం.. కఠిన పాషాణమైనా విని కరిగి పోయేంత బాధ.. అయ్యో... ఎంతహృదయవిదార కం. తవణంపల్లె మండలం పోన్నేడు పల్లెలో శనివారం ఏనోట విన్నా.. ఏమనుసును కదిలించినా.. ఇదే వేదన. పుట్టినప్పటి నుంచి ఒక్కటిగా పెరిగిన ఆవూరి చిన్నారులు.. లోహిత్కుమార్, రాజ్‌కుమార్ మరణంలోనూ స్నేహబంధాన్ని విడువలేదు. తనకు ప్రమాదం తెలిసినా లోహిత్‌ను కాపాడేందుకు రాజ్‌కుమార్ నీటిలో దిగిపోరాడాడు. కానీ కనికరం లేని కసాయి నీటికుంట ఆ స్నేహితులిద్దరినీ పొట్టనపెట్టుకుంది. పైగా ఇద్దరు విద్యార్థులూ.. వారి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క మగ సంతానం కావడంతో పొన్నేడుపల్లె విషాదసంద్రంగా మారింది. తవణంపల్లె: తవణంపల్లె మండలం పొన్నేడుపల్లెలో శనివారం సాయంత్రం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోనూ, స్కూల్లోనూ కలసిమెలసి ఉల్లాసంగా గడిపే ఇద్దరు మిత్రులు(విద్యార్థులు) నీటిగుంటలో పడి మృతి చెందడం అందరినీ తీవ్రంగా కలచివేసింది. కళ్లముందర తిరుతున్న పిల్లలు గంట గడిచే లోపే మృతి చెందడంతో స్థానికులు కన్నీరుమున్నీరుగా ఏడ్చారు. పొన్నేడుపల్లెకు చెందిన ఎ.రవి,కుసుమలకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదే విధంగా అదే గ్రామానిక చెందిన యూగమూర్తి,రాజేశ్వరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రవి కుమారుడు లోహిత్కుమార్(12), యాగమూర్తి కుమారుడు రాజ్‌కుమార్(12) ఇద్దరు చిన్నప్పటి నుంచి మిత్రులు. ఇద్దరు చిత్తూరులో 7వ తరగతి చదువుతున్నారు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో సాయంత్రం సరదాగా సైకిల్ తొక్కుతూ ఆడుకుంటున్నారు. అనపగుట్ట వద్ద ఇద్దరు మిత్రులు బహిర్భూమికి వెళ్లారు. తర్వాత కాళ్లను శుభ్రం చేసుకోవడానికి లోహిత్కుమార్ ముందుగా హంద్రీనీవా కాలువలోకి వె ళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిగుంతలో పడ్డారు. లోహిత్కుమార్ను రక్షించడానికి రాజ్‌కుమార్ యత్నించాడు. ఈ క్రమంలో నీటిలో మునిగి ఇద్దరు మృత్యవాత పడ్డారు. నాన్నా నాకు ఇక దిక్కు ఎవరూ... కుటుంబానికి దిక్కు నీవే అనుకుంటే నాకంటే ముందుగా వెళ్లిపోయావా నాన్నా.. ఇక నాకు దిక్కు ఎవరంటూ మృతుడు రాజేష్‌కుమార్ తండ్రి యూ గమూర్తి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబానికి వారసుడని అంటే మా కు అందని దూరానికి వెళ్లిపోయావానాన్నా.. అంటూ దుక్కించడం చూపరులకు కంటతడి పెట్టించింది. తల్లి రాజేశ్వరి బిడ్డ మృతి సమాచారంతో అపస్మారక స్థితికి చేరుకుంది. తర్వాత ఆమెను అరగొండ అపోలో హాస్పిటల్ చేర్పించి వైద్యం అందించారు. -
హిరానీకి అమీర్ ఖాన్ పరామర్శ
ముంబయి: బైక్‌పై నుంచి పడి స్వల్పంగా గాయపడిన ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పరామర్శించారు. ఆ తర్వాత ఇంతకుముందే హిరానీని కలిశానని, ఆయన బానే ఉన్నారని, సాయంత్ర డిశ్చార్జి అవుతారని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ముంబైలో మంగళవారం ఉదయం ఆయన బైక్ పై నుంచి కింద పడడంతో హీరాని గాయపడ్డారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని అదుపు చేయలేక కిందిపడినట్టు సమాచారం. ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. -
ఆరేళ్ల బాలికపై అత్యాచారం
ఆలస్యం వెలుగులోకి వచ్చిన వైనం పోలీసుల అదుపులో నిందితుడు శ్రీకాళహస్తి: ఓ వుృగాడు ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన శ్రీ కాళహస్తి వుండలంలో గురువారం ఆల స్యంగా వెలుగు చూసింది. సీఐ చిన్నగౌష్ కథనం మేరకు... తొట్టంబేడు వుం డలం, విరూపాక్షపురం దళితవాడకు చెందిన తొండు రాజ్‌కుమార్(25) శ్రీకాళహస్తి వుండలం, రాచగున్నేరి సమీపం లో ఉన్న ఓ ప్రైవేటు కర్మాగారంలో దినకూలీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు రాచగున్నేరి పంచాయుతీ పరిధిలోని ఛటర్జీనగర్ కోళ్లఫారం వద్ద నివాసం ఉంటూ కర్మాగారానికి వెళుతున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆరేళ్ల బాలిక వుంగళవారం సాయుంత్రం తన ఇంటి సమీపంలోని ఇసుకలో ఆడుకుంటుండగా రాజ్‌కువూర్ ఆమెకు వూయు వూటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. బాలిక పై అత్యాచారం చేశాడు. దీంతో ఆ బాలిక ఏ డుస్తూ వచ్చి తన తల్లికి ఆ విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు రాజ్కువూర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటను గురువారం మీడియాకు తెలిపారు. -
ఎస్సెమ్మెస్‌తో పవర్ ఆన్.. ఆఫ్
రూపొందించిన వరంగల్ జిల్లా యువ ఇంజనీర్ ఆత్మకూరు : ఒక్క ఎస్సెమ్మెస్.. టెక్ట్స్ అయినా, వాయిస్ అయినా ఇట్టే పవర్ ఆన్ అవుతుంది... ఆఫ్ అవుతుంది. ఏ ఊర్లో ఉన్నా ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు ఆన్ చేయొచ్చు.. ఆఫ్ చేయొచ్చు. దీన్ని ఆత్మకూరు మండలంలోని కామారం గ్రామానికి చెందిన ఓ యువ ఇంజీనీరింగ్ రూపొం దించాడు. గ్రామానికి చెందిన తోట రాజ్‌కుమార్ పెంబర్తిలోని విద్యాభారతి ఇంజినీరింగ్‌కళాశాలలో 2011లో బీటెక్(ఈసీఈ) పూర్తిచేశాడు. ఈఏడాది వరంగల్‌లోని పాత్‌ఫైండర్ కాలేజీలో ఎంటెక్ పూర్తిచేశాడు. ఇతను ఎస్సెమ్మెస్ ద్వారా పవర్ ఆన్.. ఆఫ్ విధానాన్ని రూపొందించాడు. ఈపరికరాన్ని ఎలా రూపొందించాడో అతని మాటల్లోనే...‘మనం నిజజీవితంలో వాడే ఫ్యాన్, బల్బ్ తదితర విద్యుత్ ఉపకరణాలను స్విచ్‌ల ద్వారా కాకుండా మెస్సేజ్, వాయిస్‌ల ద్వారా కంట్రోల్ చేయవచ్చు. బ్లూ టూత్ లేదా ఏఎంఆర్ వాయిస్ అనే అప్లికేషన్‌తో వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. 8051 మైక్రో కంట్రోల్ పరికరంతో మన ఇంట్లో వస్తువుల అనుసంధానం ద్వారా వీటిని కంట్రోల్ చేయవచ్చు. ఇందులో ఎంబడ్డెడ్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఎల్సీడీ, క్రిస్టల్ ఆస్కిలేటర్, 8051 మైక్రో కంట్రోలర్, జీఎస్ఎం సెట్, మ్యాక్స్232, పీసీ, బ్లూటూత్, రిలేస్, ఫ్యాన్, లైట్ ఉపయోగించాలి. దీనిలో జీఎస్ఎం సెట్ చేసి ఉంటుంది. ఇందులో ఒక సిమ్‌కార్డు ఉంచి ఆనబర్కు మెసేజ్ చేయడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఇందులో ముఖ్యమైంది ఏఆర్ఎంటీ(ఎల్పీసీ2148) ప్రాసెసర్ ఫిక్స్ చేయబడి ఉండి మన ఆదేశాలను తీసుకొని బైనరీ ఫామ్‌కు మార్చుకొని మనకు అవుట్‌పుట్‌ని అందిస్తాయి. దీన్ని ఇంటర్నెట్ మరియు మొబైల్ద్వారా ఎస్సెమ్మెస్ చేసి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు. వాయిస్ కంట్రోల్ అయితే 20 మీటర్ల దూరం నుంచి బ్లూటూత్సహాయంతో , ఆటోమేటిక్ కాల్లిఫ్టర్, జీఎస్ఎం సెట్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు. ఈపరికరంతో బహుళ అంతస్తుల భవనాలు, కంపెనీలు, షోరూంలు, సంస్థలు, గృహాల్లో తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువగా లబ్ధి పొందవచ్చు.’ తనకు ఆర్థికసాయం చేస్తే ఈపరికరాన్ని మార్కెట్లోకి తీసుకువస్తానని రాజ్‌కుమార్ పేర్కొన్నారు. -
ఏడాది స్నేహం.. మూడు నెలల జీవనం..
జీవితానికి శాశ్వత సెలవ్ పుంగనూరు: ఏడాది క్రితం అనుకోకుండా ఒకరికొకరు తారసపడ్డారు. ఆ పరిచయంతో సెల్‌ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తరువాత వారి మధ్య సాగిన మాటలు స్నేహానికి దారితీశాయి. మూడు నెలల పాటు సహజీవనం ప్రారంభించారు. ఏమైందో ఏమో వారిద్దరూ ఈ జీవితం చాలించుకోవాలనుకున్నారు. ఇద్దరూ కొత్తదుస్తులు ధరించారు. దేవునికి పూజలు చేశారు. కావాల్సిన తినుబండరాలు తెచ్చుకుని ఇద్దరూ కలసి తిన్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో విషం తాగి తనువు చాలించిన సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుంగనూరు పట్టణంలోని కొత్తయిండ్లలో నివాసం ఉన్న శమంతకమణి కుమారుడు రాజ్‌కుమార్ (36) గంగవరం మండలం కీలపట్ల జెడ్పీ హైస్కూల్లో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. గత ఏడాది రాజ్‌కుమార్ వైఎస్ఆర్ జిల్లాకు పనిపై వెళ్లాడు. ఆ జిల్లా పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిగారిపల్లెకు చెందిన ఓబయ్య భార్య సుగుణ (34) తారసపడింది. వారిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఆ పరిచయం సహజీవనం వరకు వచ్చింది. అక్టోబర్‌లో సుగుణ పుంగనూరులోని కొత్తయిండ్లలో ఉన్న రాజ్‌కుమార్ ఇంటికి వచ్చింది. అలా కలిసి జీవిస్తుండగా సుగుణ తల్లిదండ్రులతో పాటు భర్త ఓబయ్య ఆ ప్రాంతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పుంగనూరుకు వచ్చి సుగుణ, రాజ్‌కుమార్‌ను తీసుకెళ్లారు. విచారణలో తన భర్త ఓబయ్య చెడు అలవాట్లకు బానిసై, తనను వేధిస్తున్నాడని తెలిపింది. తనకు భర్త అవసరం లేదని పెద్దమనుషుల సమక్షంలో తెగేసి చెప్పి, తిరిగి పుంగనూరుకు చేరుకుంది. దీంతో ఆ కేసును కడప జిల్లా పోలీసులు మూసివేశారు. ఇలావుండగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. రాజ్‌కుమార్ మద్యానికి బానిసకావడం, సుగుణ పెళ్లైయిన విషయాన్ని దాచిపెట్టడంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలకు దారి తీసినట్లు తెలిసింది. దీంతో ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం రాత్రి 11 గంటలకు నిద్రించేందుకు గదిలోకి వెళ్లారు. కొద్దిసేపటికి ఇరువురు విషం తాగారు. ఆ బాధ భరించలేక సుగుణ కేకలువేస్తూ బయటకు పరుగులుతీసింది. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన రాజ్‌కుమార్‌తో పాటు సుగుణను చుట్టుపక్కల వారు 108లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇరువురూ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇరువురి శవాలను పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి తల్లి శమంతకమణి ఫిర్యాదు మేరకు ఎస్ఐ గంగిరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
స్టెతస్కోప్ వదిలేసి చోరీల బాట
దొంగగా అవతారమెత్తిన ఆర్ఎంపీ అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు రూ.9 లక్షల సొత్తు స్వాధీనం పరారీలో మరో నిందితుడు వరంగల్ క్రైం : వైద్యంపై వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఓ ఆర్ఎంపీ దొంగగా అవతారమెత్తాడు. అప్పటికే ఇళ్లకు కన్నాలేసే విద్యలో ఆరితేరిన తన అన్నతమ్ముడిలాగే తాను చోరీల బాటపట్టాడు. చివరికి వరంగల్ సీసీఎస్ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతడి నుంచి పోలీసులు రూ.9 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా కథనం ప్రకారం. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం రామారం గ్రామాని కి చెందిన రాంటెంకి రాజ్‌కుమార్ అలియాస్ రాజు ఆర్ఎంపీగా పనిచేస్తుండేవాడు. అతడి అన్న శ్రీనివాస్, తమ్ముడు సారయ్య ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ జల్సాలు చేసేవారు. గతంలో ఆదిలాబాద్, కరీంనగర్లో దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లిన వారిద్దరు మేలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలోనే ఆర్ఎంపీగా పనిచేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో రాజ్‌కుమార్ కూడా దొంగతనాలకు పాల్పడాలనే ఆలోచనకు వచ్చాడు. అనంతరం అతడు తన తమ్ముడు సారయ్యతో కలిసి చోరీలకు పాల్పడ్డాడు. ఇద్దరు కలిసి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో దొంగతనాలు చేశారు. వీరు తాళం వేసిన ఎనిమిది ఇళ్లలో చోరీలకు పాల్పడ డమేగాక.. పది మంది మహిళల మెడలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సహకార నగర్, ఎక్సైజ్‌కాలనీ, మిల్స్‌కాలనీ పరిధిలోని శివనగర్ , మామునూరు పరిధిలోని గణేష్‌నగర్, కాజీపేటలోని ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. సుబేదారి పోలీ స్‌స్టేషన్ పరిధిలోని విజయ్పాల్కాలనీ, రాంనగర్, అశోకకాలనీ, మట్టెవాడ పరిధిలోని మర్రి వెంకటయ్య కాలనీ, బ్యాంకు కాలనీ, ఇంతెజార్గంజ్ పరిధిలోని గిర్మాజీపేట, కాజీపేట రైల్వేక్వార్టర్స్ ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లారు. రాజ్‌కుమార్ తాను చోరీ చేసిన సొత్తును బుధవారం వరంగల్ బులియన్ మార్కెట్లో అమ్ముకునేందుకు రాగా సమాచారం అందుకున్న సీసీఎస్ సీఐ ఆదినారాయణ తన సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.9 లక్షల విలువైన 442 గ్రాముల బంగా రం, వంద గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడైన రాజ్‌కుమార్ తమ్ముడు సారయ్య పరారీలో ఉన్నాడు. -
మదినిండా అప్పాజీ
ఘనంగా డాక్టర్ రాజ్‌కుమార్ స్మారక ఆవిష్కరణ దిగివచ్చిన తారాలోకం గాజనూరు నుంచి స్మారక స్థలి వద్దకు చేరుకున్న రాజ్థ్రం దాదాపు 54ఏళ్ల పాటు కన్నడ చిత్రసీమను ఏలిన కన్నడ కంఠీరవుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ రాజ్‌కుమార్ స్మరణతో బెంగళూరులోని కంఠీరవ స్టేడియం మారుమోగింది. శాండల్‌వుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లకు చెందిన తారాలోకం కంఠీరవ స్టేడియానికి తరలివచ్చింది. అభిమానులంతా ‘అన్నగారు’ అంటూ ఎంతో భక్తితో పిలుచుకునే డాక్టర్ రాజ్‌కుమార్ స్మారక ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా కంఠీరవ స్టేడియం సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులతో కిక్కిరిసింది. - సాక్షి, బెంగళూరు కంఠీరవ స్టేడియంలోని రాజ్‌కుమార్ సమాధి వద్ద ఏర్పాటైన రాజ్‌కుమార్ స్మారకాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సూపర్‌స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటి బి.సరోజాదేవి, రెబల్‌స్టార్ అంబరీష్, క్రేజీస్టార్ రవిచంద్రన్‌తోపాటు రాజ్‌కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్, కుటుంబసభ్యులు శివరాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్‌రాజ్‌కుమార్, రాష్ట్ర మంత్రులు ఉమాశ్రీ, రోషన్‌బేగ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక స్మారకం ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో అభిమానులు కంఠీరవ స్టూడియోకు తరలివచ్చారు. రాజ్‌కుమార్ సమాధిని దర్శించే అభిమానులకు ఆయన వివిధ సినిమాల్లో కనిపించిన వేషధారణలను సైతం కళ్లముందు నిలిపేందుకు సమాధికి ఇరువైపులా రాతిఫలకాలపై ఏర్పాటుచేసిన ఛా యాచిత్రాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయనే చెప్పవచ్చు. ఇక స్మారక ఆవిష్కరణ సందర్భంగా కంఠీరవ స్టూడియో అంతా రాజ్‌కుమార్ కటౌట్లు, పోస్టర్లతో నిండిపోయింది. రాజ్‌కుమార్ ఆశయాలను ప్రజలకు మరింత చేరువచేసే ఉద్దేశంతో రాజ్‌కుమార్ స్వగ్రామం గాజనూరు నుంచి బయలుదేరి అన్ని జిల్లా కేంద్రాల్లో సంచరించిన రాజ్థ్రం శనివారం నాటికి కంఠీరవ స్టేడియంలోని స్మారకం వద్దకు చేరుకుంది. ఈ రథానికి రాజ్‌కుమార్ కుటుంబసభ్యులు, అభిమానులు ఘ నంగా స్వాగతం పలికారు. రాజ్‌కుమార్ సినీ విశేషాలను గుర్తు చేసుకునేందుకు గాను నగరంలోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో తారలు సందడి చేశారు. ‘అప్పాజీ’ చివరి కోరిక తీరలేదు.... ఇక స్మారక ఆవిష్కరణ సందర్భంగా డాక్టర్ రాజ్‌కుమార్ కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ మాట్లాడుతూ...మరణానికి చేరువగా ఉన్న రో జుల్లో మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించాలని అప్పాజీ(డాక్టర్ రాజ్‌కుమార్) ఆశించారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామిపై అప్పాజీ కి ఎంతో భక్తి భావం ఉండేది. ఎప్పుడు సమయం దొరికినా రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లేవారు. మరణించే సమయానికి ముందు గురు రాఘవేంద్ర స్వామిని దర్శించాలని భావించారు. అయితే ఆ చివరి కోరిక తీరలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. -
స్ఫూర్తి ప్రదాత రాజ్‌కుమార్
కంఠీరవుడి ప్రేరణతో నేత్రదానానికి సిద్ధమన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొదటి, చివరి ఆటోగ్రాఫ్ రాజ్‌కుమార్‌దే: రజనీకాంత్ ఎంతో ఎత్తుకు ఎదిగినా సాధారణ జీవితం గడిపారు : చిరంజీవి ఘనంగా డాక్టర్ రాజ్‌కుమార్ స్మారకం ఆవిష్కరణ బెంగళూరు: ‘నేత్రదానం చేసి డాక్టర్ రాజ్‌కుమార్ ఈ సమాజానికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. అదే ప్రేరణతో నేనూ నేత్రదానం చేయడానికి నిర్ణయించుకున్నాను’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. అక్కడికక్కడే నేత్రదానానికి సంబంధించిన సమ్మతి పత్రాలపై ఆయన సంతకం చేశారు. శనివారమిక్కడి కంఠీరవ స్టూడియోలో డాక్టర్ రాజ్‌కుమార్ స్మారకాన్ని లాంఛనంగా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. డాక్టర్ రాజ్‌కుమార్ వంటి మహోన్నత నటుడిని ఆదర్శనీయ వ్యక్తిగా కీర్తించడంతో పాటు ఆయన ఆదర్శాలను కూడా పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. దేశంలో ఎన్నో లక్షల మంది ప్రజలు అంధత్వంతో బాధపడుతున్నారని, నేత్రదానం వల్ల వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సాధ్యమవుతుందని, ఇదే సందేశాన్ని రాజ్‌కుమార్ అందించారని తెలిపారు. కన్నడ సాంస్కృతిక రాయబారిగా వెలిగిన ఘనత రాజ్కుమార్కే దక్కుతుందని శ్లాఘించారు. సామాజిక, పౌరాణిక, చరిత్రాత్మక సినిమాలతో పాటు బాండ్ శైలి సినిమాల్లో సైతం రాజ్‌కుమార్ తన అమోఘ ప్రతిభను కనబరిచారని కొనియాడారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ భౌతికంగా లేకపోయినప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచేఉంటారని అన్నారు. మొదటి, చివరి సంతకం రాజ్‌కుమార్‌దే: రజనీకాంత్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూపర్‌స్టార్ రజనీకాంత్ కన్నడ భాషలో అనర్గళంగా రాజ్‌కుమార్ ఘనతను వర్ణించారు. కళా సరస్వతి వరపుత్రుడిగా జన్మించిన రాజ్‌కుమార్ ఇప్పటికీ ప్రజల మనసుల్లో సజీవంగా ఉన్నారని అన్నారు. ‘బేడర కన్నప్ప’తో చిత్రసీమలోకి అడుగుపెట్టిన రాజ్‌కుమార్ కన్నడ చిత్రసీమను 54 ఏళ్ల పాటు నిర్విరామంగా ఏలారని అన్నారు. భారతీయ చిత్రరంగంలో ఇంత సుదీర్ఘకాలం కథానాయకుడిగా కొనసాగిన మరే వ్యక్తినీ తానింత వరకు చూడలేదని అన్నారు. కనకదాసు, పురందర దాసు, బసవణ్ణ వంటి మహనీయుల పాత్రలతో పాటు రావణాసురుడు, హిరణ్యకసిపుడు వంటి పాత్రల్లో సైతం రాజ్‌కుమార్ అద్భుత నటనా ప్రతిభను కనబరిచారని శ్లాఘించారు. రాజ్‌కుమార్‌ను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన ఉదంతాన్ని సైతం రజనీ తనదైన శైలిలో అభివర్ణించారు. ‘రాజ్‌కుమార్ వంటి మహానటుడిని వనదేవత కూడా ఓ సారి చూడాలనుకుంది. అందుకే ఆయన్ను తన వద్దకు పిలిపించుకుంది. 108 రోజుల పాటు ఆయన్ను చూసి సంతోషంతో మళ్లీ పంపించేసింది’ అని పేర్కొన్నారు. ‘నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నగరంలోని శని మహాత్ముడి ఆలయం వద్దకు వెళ్లిన సమయంలో డాక్టర్ రాజ్‌కుమార్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నేను నా జీవితంలో తీసుకున్న మొదటి, చివరి ఆటోగ్రాఫ్ రాజ్‌కుమార్‌దే. ఆ తర్వాత ఎవ్వరి వద్ద ఆటోగ్రాఫ్ తీసుకోలేదు’ అని రజనీకాంత్ గత స్మృతులను అభిమానులతో పంచుకున్నారు. ఎంతో ఎత్తుకు ఎదిగినా సాధారణ జీవితమే: చిరంజీవి కన్నడ సినీపరిశ్రమలో ఎంతో ఎత్తుకు ఎదిగినా అత్యంత సాధారణ జీవితం గడిపిన మహావ్యక్తి డాక్టర్ రాజ్‌కుమార్ అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ‘నేను ఎన్నో సార్లు రాజ్‌కుమార్‌ను కలిశాను. ఎప్పుడు కలిసినా తెలుగులోనే మాట్లాడేవారు. ఆయనకు దేశ, విదేశాల్లో ఎంతో మంది అభిమానులున్నప్పటికీ ఆయనలో ఏ కోశాన గర్వం కనిపించేది కాదు. ఆయనలో ఓ గొప్ప మానవతావాదిని కూడా చూశాను. కర్ణాటక ప్రభుత్వం రాజ్‌కుమార్ స్మారకాన్ని ఏర్పాటు చేసినందుకు నేను వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని చిరంజీవి తెలిపారు. -
ఆ రేడియో అందరికీ కావాలి!
బాలీవుడ్ భామ అనుష్కశర్మ ఓ రేడియోపై మనసు పడ్డారు. ఆ ట్రాన్సిస్టర్ గొప్పతనం ఏంటి? అదంటే అనుష్కకు ఎందుకంత ఇష్టం అనుకుంటున్నారా? ప్రస్తుతం ఆమిర్‌ఖాన్‌కు జోడీగా అనుష్క ‘పీకే’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా రేడియోను అడ్డుపెట్టుకొని ఆమిర్ నగ్నంగా నిలబడ్డ స్టిల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ స్టిల్ పుణ్యమా అనీ, ఆమిర్‌కు దీటుగా ఆ రేడియో కూడా పాపులారిటీని సొంతం చేసుకుంది. కథలో ఆ రేడియోది కీలక పాత్ర అట. ప్రచారంలో కూడా దానికంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమదే. ఒక జ్ఞాపకంగా ఆ రేడియోను తన వద్దే దాచుకోవాలని భావించారట ఈ ముద్దుగుమ్మ. చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, కథానాయ కుడు ఆమీర్ఖాన్ల ముందు తన కోరిక చెప్పారట అనుష్క. అయితే... వాళ్లిద్దరూ ససేమిరా అన్నారట. ఈ విషయాన్ని రాజ్‌కుమార్ హిరానీ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘అనుష్క ఆ రేడియా అడిగిన మాట నిజం. అయితే... ఆమెలాగే... మేము కూడా దానిపై మమకారం పెంచుకున్నాం. దాన్ని గుర్తుగా దాచుకోవాలని ఆమిర్‌కీ, నాకూ కూడా ఉంది’’ అని పేర్కొన్నారు రాజ్‌కుమార్. ఇంతమంది మనసు దోచిన ఆ ట్రాన్సిస్టర్ గొప్పతనమేంటో తెలుసుకోవాలంటే... ‘పీకే’ వచ్చేదాకా ఆగాలి. -
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా బంగారద మనుష్య!
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా సాక్షి, బెంగళూరు : కన్నడ సినీ రంగంలో డెబ్బైయవ దశకంలో ట్రెండ్‌ను సృష్టించిన సినిమా ‘బంగారద మనుష్య’. కన్నడ కంఠీరవుడు డాక్టర్ రాజ్‌కుమార్, ప్రముఖ నటి భారతి జంటగా నటించిన ఈ సినిమాకు సిద్ధలింగయ్య దర్శకత్వం వహించారు. ప్రముఖ రచయిత టీకే రామారావ్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు చదువుకున్న వారు కూడా వ్యవసాయ రంగంలోకి రావాల్సిన ప్రాధాన్యతను చాటిచెప్పింది. ఈ సినిమా విడుదల 42 ఏళ్లు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా.. అందుకో కారణం ఉందండోయ్. త్వరలోనే ఈ సినిమా తమిళంలో రీమేక్ అయి రానుందని గాంధీ వర్గాల సమాచారం. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ‘బంగారద మనుష్య’ తమిళంలో రీమేక్ కానుంది. ప్రస్తుతం ‘లింగా’ సినిమా షూటింగ్లో రజనీ బిజీగా ఉన్నారు. అయితే లింగా కంటే ముందుగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రజనీకాంత్ ఆప్తమిత్రుడు రాజ్ బహద్దూర్ మాట్లాడుతూ....‘1972లో నేను బస్‌డ్రైవర్‌గా రజనీ అదే బస్‌కు కండక్టర్‌గా ఉన్న సమయంలో ‘బంగారద మనుష్య’ సినిమా విడుదలైంది. అప్పట్లో మేమిద్దరం కలిసి ఆ సినిమా చూశాం. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ సినిమాను రజనీకాంత్‌తో రీమేక్ చేయించాలని నేను అనుకున్నాను. ఇదే విషయాన్ని రజనీకాంత్ వద్ద ప్రస్తావించినపుడు మళ్లీ మేమిద్దరం కలిసి ఆ సినిమా చూశాం. ఈ సినిమా రీమేక్‌లో కథానాయకుడిగా కనిపించేందుకు రజనీ కూడా ఆసక్తి కనబరుస్తున్నారు’ అని తెలిపారు. ప్రస్తుతం రజనీ ‘లింగా’ సినిమాతో బిజీగా ఉండడం వల్ల బహుశా వచ్చే ఏడాది ‘బంగారద మనుష్య’ రీమేక్ వర్షన్ సెట్స్ పకి వెళ్లే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
చైన్‌స్నాచర్ శివ కేసులో ముగ్గురి అరెస్ట్
-
చైన్‌స్నాచర్ శివ కేసులో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: చైన్‌స్నాచర్ శివ గ్యాంగ్ కేసులో మొత్తం ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శివ భార్య నాగలక్ష్మితో పాటు ముత్తూట్ ఫైనాన్స్ ఓంకార్ నగర్ బ్రాంచ్ మేనేజర్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చంపాపేట బ్రాంచ్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3.75 కేజీల బంగారం, రూ.4.5లక్షల నగదు, 2 కార్లు, బైక్‌తో పాటు విలువైన ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శివ గ్యాంగ్‌పై సుమారు 700 చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ సీవీ ఆనంద్ తెలిపారు. చైన్‌స్నాచర్ శివ ఆగస్ట్‌లో జరిగిన పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. -
సినిమాకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
3.5 తులాల బంగారం, 860 గ్రాముల వెండి వస్తువుల అపహరణ క్లూస్ టీంతో ఆధారాలు సేకరించిన క్రైం డీఎస్పీ ఖిలావరంగల్ : తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన నగరంలోని శివనగర్ ప్రాంతంలోని సాయిగణేష్‌నగర్‌లో శనివారం అర్ధరాత్రి జరి గింది. ఇంట్లోని బీరువా తాళం తీసి 3.5 తులాల బంగారం, 860 గ్రాముల వెండితోపాటు ఒక సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. మిల్స్‌కాలనీ ఎస్సై వెంకటరావు కథన ప్రకారం.. సాయిగణేష్‌నగర్‌కు చెందిన బొజ్జ రంజిత, రాజ్‌కుమార్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం రాత్రి 9.30 గంటలకు సినిమాకు వెళ్లారు. ఇంటికి తాళం వేసి వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరపడ్డారు. బీరువాపైన ఉన్న తాళం చెవితో తాళాన్ని తీసి సుమారు 90 వేల విలువైన 3.5 తులాల బంగారం, 860 గ్రాముల వెండితోపాటు సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. వారు సినిమా చూసి ఇంటికొచ్చేసరికి ఇంట్లో లైట్లు వేసి.. ఇంటి ముందు గడియ విరిగి కనిపించింది. డోర్‌ను నెట్టగా రాకపోవడంతో దొంగలు.. దొంగలు అని అరవడంతో దుండగులు ఇంటి వెనక ప్రహరి దూకి పారిపోయారు. బాధితులు ఇంట్లోకి వెళ్లి చూడగా రెండు బెడ్రూముల్లో దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో వారు వెంటనే 100కు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే మిల్స్‌కాలనీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆదివారం ఉదయం సీసీఎస్ డీఎస్పీ రాజమహేంద్రనాయక్, మిల్స్‌కాలనీ ఎస్సై బి.వెంకట్రావు, క్లూస్ టీంతో చేరుకుని క్షుణంగా పరిశీలించారు. ఇంటి యజమాని బొజ్జ రాజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తకు తోడుగా...పతిభక్తి చాటుకున్న నాగలక్ష్మి
ఇదీ గజదొంగ శివ స్నాచింగ్‌ల సంఖ్య భార్య రెక్కీ టార్గెట్ పూర్తిచేసేది శివ, జగదీష్, రాజ్‌కుమార్ ముగ్గురి అరెస్టు సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో చనిపోయిన కరుడుగట్టిన చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ సభ్యులు విచారణలో వెల్లడించిన అంశాలు పోలీసుల దిమ్మెతిరిగి పోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ గ్యాంగ్ గత రెండేళ్లలో సైబరాబాద్, హైదరాబాద్, మెదక్ జిల్లాలలో 300 వరకు స్నాచింగ్‌లకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుకోగా.. విచారణలో 700 స్నాచింగ్‌లకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు. ఇందులో సైబరాబాద్ పరిధిలోనే 500 చోరీలకు పాల్పడ్డారు. అందులో ఈ ఏడాది 250 స్నాచింగ్‌లకు పాల్పడి రికార్డు సృష్టించారని క్రైమ్ ఇన్చార్జి డీసీపీ జి.జానకీషర్మిల, ఏసీపీ రామ్ కుమార్‌లు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో గ్యాంగ్‌లీడర్ శివ మృతి చెందగా అతని భార్య నాగలక్ష్మి (30)తో పాటు అతని ఇద్దరు అనుచరులు జగదీష్ (30), రాజ్‌కుమార్ (23)లను సైబారాబాద్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 30 లక్షల విలువైన 30 తులాల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రెండు బైక్‌లతో పాటు అతని ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఈ ముగ్గురినీ తిరిగి పోలీసు కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించే అవకాశాలున్నాయని జానకీషర్మిల అన్నారు. జూనియర్ ఆర్టిస్ట్ అయ్యేందుకు వచ్చి... రాజమండ్రికి చెందిన నాగలక్ష్మి, ఆమె సోదరి జూనియర్ ఆర్టిస్టుల య్యేందుకు 2005లో హై దరాబాద్‌కు వచ్చి కృష్ణానగర్‌లో స్థిరపడ్డారు. సోదరి టీవీ జూనియర్ ఆర్టిస్ట్‌గా చేరింది. కృష్ణానగర్‌లోని బంధువుల వద్దకు వచ్చే క్రమంలో నాగలక్ష్మితో శివకు పరిచయం ఏర్పడి ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్తకు తోడుగా... భర్త చేసే నేరాలలో తాను సైతం పాల్గొని పతిభక్తి చాటుకుంది నాగలక్ష్మి. ఆమె రెక్కీ ని ర్వహించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే శివ అతని అనుచరులు జగదీష్, రాజ్‌కుమార్ రంగంలోకి దిగి స్నాచింగ్ చేసేవారు. బస్తీలు, కాలనీలలో నాగలక్ష్మి తిరుగుతూ స్కూల్, గుడికి వెళ్లేవారిని, ఇంటి ముందు ముగ్గు వేస్తున్న వారిని గుర్తించి భర్తకు సమాచారం చేరవేసేది. వెంటనే ఒక్కరు..లేదా ముగ్గురూ కలిసి వెళ్లి ‘టార్గెట్’ పూర్తి చేసుకెళ్లేవారు. కడచూపునకు సైతం నిరాకరించిన తల్లిదండ్రులు.... నెల్లూరులో ఉంటున్న తల్లిదండ్రులు ప్రసన్న, మస్తానయ్య కుమారుడు శివ నేరబాట పట్టడంతో అతనిపై ఆశలు వదిలేసుకున్నారు. కాల్పుల్లో చనిపోయాడని తెలిసి కన్నీరుపెట్టారు. అయితే, ఆఖరి చూపు చూసేందుకు నిరాకరించారు. దీంతో పోలీసులు శివ మృతదేహా న్ని కృష్ణానగర్‌లో ఉంటున్న తోడల్లుడు దుర్గాప్రసాద్‌కు అప్పగించగా.. ఇక్కడే ఆదివా రం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఒంటరైన కొడుకు... ఒకపక్క తండ్రి శివ మృతదేహం.. మరోపక్క చూద్దామంటే కనిపించని తల్లి నాగలక్ష్మి... దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారి ఏకైక కుమారుడు శ్రీను (4)ను చూసి స్థానికులు కన్నీరుపెట్టారు. శివ ఇంట్లో పెరుగుతున్న ఉదయ్‌సాయి (8) తోడల్లుడి కుమారుడని తెలిసింది. రికవరీ కోసం ప్రయత్నాలు... వందలాది గొలుసు చోరీలకు పాల్పడిన శివ గ్యాంగ్ నుంచి సొత్తు రికవరీ చేసే పనిలో పడ్డారు క్రైమ్ పోలీసులు. స్నాచింగ్చేసి తెచ్చిన బంగారాన్ని నాగలక్ష్మి ముత్తూట్, శ్రీరామ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టింది. వీటికి సంబంధించిన రసీదులపై నాగలక్షితో పాటు శివ పేరు కూడా ఉన్నాయి. తాకట్టు పెట్టడమే కాకుండా కొంత బంగారాన్ని వీరు విక్రయించి జల్సా చేసినట్టు విచారణలో తేలింది. ఆ 24 మందీ టార్గెట్... నేరగాడు హైదరాబాద్ రావాలంటేనే దడ పుట్టే విధంగా నిఘా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో సైబరాబాద్ పోలీసులు దానికి తగ్గట్టు కార్యాచర ణ రూపొందిస్తున్నారు. శివ బాటలో పయణిస్తున్న 24మంది కరుడుగట్టిన స్నాచర్లను గుర్తించారు. వారి ఫొటోలు, వివరాలను అన్ని శాంతి భద్రతలు, సీసీఎస్ ఠాణాకు సైబారాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం పంపించి అధికారులను అప్రమత్తం చేశారు. వీరిలో ఏ ఒక్కరు కనిపించినా వెంటనే అరెస్టు చేయాలని సూ చించారు. వీరిలో కొందరిపై 100కు పైగా, మరికొందరిపై 50కి పైగా స్నాచింగ్ కేసులున్నాయి. కాగా శివ గ్యాంగ్ బారిన పడిన మహిళలు అభినందులు తెలుపుతూ ఆది వారం సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఎస్సెమ్మెస్‌లు పంపారు. శివ గ్యాంగ్ దాడి లో మూడు నెలల క్రితం గాయపడి అప స్మారక స్థితికి చేరిన రాంగోపాల్ భార్య వా రం రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. కాగా, శివ దాడిలో గాయపడిన ఎస్ఐ వెంకట్ ఆస్పత్రిలో కోలు కుంటు న్నాడు -
సెపక్‌తక్రాపై సోదర త్రయం పట్టు
క్రికెట్.. ఫుట్‌బాల్.. హాకీ.. టెన్నిస్.. బ్యాడ్మింటన్ ఇలా ప్రముఖ క్రీడలను ఎలా ఆడతారనే విషయంలో అందరికీ ఓ అవగాహన ఉంటుంది. అయితే సెపక్తక్రా అనే ఆట మాత్రం కాస్త విభిన్నమైనదే. నిజానికి చాలామందికి ఇలాంటి ఆట ఒకటి ఉందనే విషయం కూడా తెలీదంటే అతిశయోక్తి కాదు. అంతకన్నా విచిత్రం ఈ ఆట ఆడే విధానం. వాలీబాల్ కోర్టును తలపిస్తూ ఉండే ఫీల్డ్‌లో బంతిని కాలితో, తలతో మాత్రమే ఆడడం ఈ ఆట ప్రత్యేకత. మలేసియా, థాయ్‌లాండ్, కొరియా దేశాల్లో ఈ ఆట చాలా పాపులర్. భారత్‌లో అయితే మణిపూర్ క్రీడాకారులు బాగా ఆడతారు. అయితే మన దగ్గర కడు పేదరికంలో పుట్టి పెరిగిన ముగ్గురు అన్నదమ్ములు సెపక్తక్రా మీద మమకారం పెంచుకున్నారు. ఫ్లయింగ్ కిక్, సీజర్ కట్, టో ట్యాప్ (అరికాలి పాదంతో బంతిని కొట్టడం) వంటి షాట్లతో రెచ్చిపోతున్నారు. అందరూ ఆడడం అంత సులువుకాని ఈ క్రీడను అవలీలగా ఆడుతూ ముందుకెళుతున్నారు. (రాజ్‌కుమార్, విజయవాడ స్పోర్ట్స్) కొమ్ము నాగేంద్రబాబు, క్రాంతి, సాయిప్రభు ముగ్గురూ అన్నదమ్ములు. తండ్రి చెప్పుల షాపులో పనిచేస్తుంటాడు. ఆయనకు వచ్చే చాలీచాలని జీతంతో ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఎదురైనా ఈ సోదర త్రయం మాత్రం సెపక్తక్రా మీద మమకారాన్ని వీడ లేదు. పౌష్టికాహార లోపంతో వీరికి కనీసం సాధారణ క్రీడాకారులకుండే దేహదారుఢ్యం కూడా ఉండదు. బక్కపలుచని ఆకారాలతోనే జల్లెడలా ఉండే బంతిపై అదుపు సాధించారు. ఏ అవకాశాన్నీ వదులుకోకూడదనే ఉద్దేశంతో తమ ఈ ఆకారాలనే అనుకూలంగా మలుచుకున్నామని నాగేంద్రబాబు చెబుతున్నాడు. వాస్తవానికి ఈ ఆటను వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడితే ఎంతటి బలాడ్యుడైనా అలసిపోవాల్సిందే. కాళ్లను అదే పనిగా పైకి లేపి షాట్ ఆడాల్సి రావడమంటే మాటలు కాదు. కానీ తమకు మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడినా అలసటనేది దరి చేరదని చెబుతున్నాడు. ప్రాక్టీస్ చేయడానికి ఎవరూ లేకపోతే గోడకు బంతిని కొడుతూ ఆడుకుంటారు. జాతీయ స్థాయి పోటీల్లో 15 మందితో కూడిన మూడు జట్లు ఏపీ తరఫున పాల్గొంటాయి. వీరిలో బాగా ఆడే ఐదుగురిని ఒక టీమ్‌గా ఎంపిక చేసి రెగో ఈవెంట్లో ఆడిస్తారు. ఆయా వయసు కేటగిరీ జట్లలో నాగేంద్ర సోదరులు కూడా తప్పకుండా ఉంటారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వెనుక నివసించే వీరు ఏ మాత్రం సమయం దొరికినా స్టేడియంలోనే గడుపుతుంటారు. ఫ్లయింగ్ కిక్, సీజర్ కట్, టో ట్యాప్ (అరికాలి పాదంతో బంతిని కొట్టడం) వంటి షాట్లతో రెచ్చిపోతారు. తండ్రి అనారోగ్యంతో ఇంటికే పరిమితం కాగా పెద్దవాడైన నాగేంద్రబాబు నగర పోలీసు కమిషనరేట్‌లో హోంగార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానిస్టేబుల్ కావాలని ప్రయత్నం చేసినా చెస్ట్ సరిపోలేదు. ప్రస్తుతం డిస్టెన్స్‌లో డిగ్రీ ఫైనలియర్ చదువుతూ చెస్ట్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇద్దరు తమ్ముళ్లు కూడా ఇంటర్ పూర్తి చేశారు. కొసమెరుపు: గతంలో ఎంసెట్‌లో సీటు దక్కించుకునేందుకు స్పోర్ట్స్ కేటగిరీ కింద ఈ ఆటను కూడా పరిగణనలోకి తీసుకునేవారు. ప్రస్తుతం ఆ అవకాశాన్ని తొలగించారు. దశాబ్దకాలంగా ఒళ్లు హూనం చేసుకుని ఆడి చదువు కీలక దశకు చేరిన సమయంలో ఈ ఆట అక్కరకు రాకపోవడం వీరికి ఊహించని పరిణామమే. అయినప్పటికీ ఈ త్రయానికి సెపక్‌తక్రాపై మమకారం, మక్కువ తగ్గకపోవడం విశేషం. సోదరత్రయం సాధించిన పతకాలు కొమ్ము నాగేంద్రబాబు: సబ్ జూనియర్, జూనియర్ స్థాయి పోటీల్లో పాల్గొన్న తొలి సారే రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2004లో ఒడిశాలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్‌లో రజతం, 2006లో చండీగఢ్‌లో సబ్ జూనియర్ నేషనల్స్‌లో రెండు రజత పతకాలు కైవసం చేసుకున్నాడు. 2007లో రాజస్థాన్‌లో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో, 2008లో కర్ణాటకలో జరిగిన నేషనల్స్‌లో వరుసగా రెండు రజత పతకాలు సాధించాడు. 2009లో అసోంలో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో, 2010లో జార్ఖండ్‌లో జరిగిన జాతీయ క్రీడల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. క్రాంతి: 2006లో ఢిల్లీలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్‌లో రజతం, 2007లో గోవాలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్లోరజతం, 2009లో హైదరాబాద్ లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్‌లో రెండు స్వర్ణ పతకాలు కైవసం చేసుకోవడమే కాకుండా బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు. సాయిప్రభు: 2012లో కర్నూలులో జరిగిన అంతర్ జిల్లా చాంపియన్‌షిప్‌లో తృతీయ స్థానం పొందాడు. 2012లో రాజస్థాన్‌లో జరిగిన 16వ జూనియర్ నేషనల్స్‌లో కాంస్య పతకం సాధించాడు. -
మహేష్‌నే ఫాలో అవుతున్న పవర్‌స్టార్!
-
కిక్కు..లక్కు
నెల్లూరు (క్రైమ్) : మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది. అధికారులు లాటరీ ద్వారా విజేతలను ఎంపిక చేసి దుకాణాలను కేటాయించారు. 2014-15 సంవత్సరానికి జిల్లాలోని 348 మద్యం దుకాణాల కేటాయింపు కోసం శనివారం నగరంలోని కస్తూరిభా కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న లక్కీ డ్రా ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతోంది. 321 దుకాణాలకు 3,988 మంది పోటీ పడ్డారు. ఏజేసీ రాజకుమార్ సమక్షంలో డ్రా ప్రక్రియను ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన డ్రా ప్రక్రియ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. జిల్లాలో 15 ఎక్సైజ్ సర్కిల్స్ ఉండగా రాత్రి 10.30 గంటల వరకు కేవలం ఆరు ఎక్సైజ్ సర్కిల్స్‌కు సంబంధించిన లాటరీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారులు, వారి అనుచరులతో జిల్లా పోలీసు కార్యాలయం నుంచి కేవీఆర్ పెట్రోల్ బంకు వరకు సందడి వాతావరణం నెలకొంది. పాస్ ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించారు. ఒక్కో దుకాణానికి ఒకటి, రెండు దరఖాస్తులు పడగా, కొన్ని దుకాణాలకు పదుల సంఖ్యలో దరఖాస్తులు దాఖలు కావడంతో ఎవరికి దుకాణం వస్తుందోనన్న ఆందోళన వ్యాపారుల్లో వ్యక్తమైంది. మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు మహిళలు సైతం పోటీపడ్డారు. నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ జిల్లాలకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేసి డ్రా తీశారు. ఏజేసీ రాజకుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వై. చైతన్యమురళీ సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. దీంతో దుకాణాల కేటాయింపు కార్యక్రమం శరవేగంగా ముందుకు సాగింది. లక్కీ డ్రా కార్యక్రమాన్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ పి. శ్రీమన్నారయణరావు, నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ ఈఎస్‌లు డాక్టర్ కె. శ్రీనివాస్, పి. సుబ్బారావు, వెంకటాచలం తహశీల్దార్ సుధాకర్ పర్యవేక్షించారు. సింగిల్ దరఖాస్తులు 81 జిల్లాలోని 81 మద్యం దుకాణాలకు ఒక్కొక్క దరఖాస్తు దాఖలయ్యాయి. నెల్లూరు జిల్లా ఎక్సైజ్ పరిధిలో 33, గూడూరు జిల్లా పరిధిలో 48 దుకాణాలకు ఒక్కో దరఖాస్తే దాఖలు కావడంతో దరఖాస్తు దారులకే దుకాణాలు కేటాయించారు. నెల్లూరు నగరంలోని జేమ్స్‌గార్డెన్, నారాయణరెడ్డిపేట మద్యం దుకాణలకు మాత్రం ఒక్కో దానికి 106 దరఖాస్తులు వంతున దాఖలయ్యాయి. 27 దుకాణాలకు దరఖాస్తులు నిల్ నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ జిల్లాల పరిధిలోని 27 దుకాణాలను దక్కిం చుకునేందుకు వ్యాపారులు అనాసక్తి ప్రదర్శించారు. దీంతో ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాలేదు. జలదంకి మండలం చామదల, గట్టుపల్లి, బోగోలు మండలం కోవూరుపల్లి, కలిగిరి మండలం గంగిరెడ్డిపాళెం, కావలి మండలం ఆనెమడుగు, వరికుంటపాడు, కొండాపురం మండలం కొమ్మి, ఇందుకూరుపేట మండలం కొత్తూరు, కుడితిపాళెం మద్యం దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. గూడూరు డివిజన్‌లోనూ 16 దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. దీంతో తిరిగి వాటికి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. కొత్తదుకాణాల ఏర్పాటు జూలై ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీ అమలవుతుంది. లాటరీ ద్వారా దుకాణాలు సొంతం చేసుకున్న వ్యాపారులు ఎక్సైజ్‌శాఖ నిబంధనల మేరకు దుకాణాల్లో అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది కొత్తగా ఎక్సైజ్‌శాఖ బార్కోడ్ విధానం అమల్లోకి తెచ్చింది. దీంతో దుకాణాల్లో కంప్యూటర్ బిల్లింగ్ ద్వారా అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఎమ్మార్పీ ఉల్లంఘన జరిగే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో ఏఈఎస్‌లు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. సర్కారుకు రూ. 9.97 కోట్లు రాబడి జిల్లాలో 321 దుకాణాలకు వచ్చిన 3,988 దరఖాస్తులకు రూ.9.97 కోట్లు ఆదాయం ఎక్సైజ్‌శాఖకు చేకూరింది. గతేడాది దరఖాస్తుల రూపేణ ఎక్సైజ్ శాఖకు రూ.7.05కోట్లు ఆదాయం వచ్చింది. గతంతో పోలిస్తే సుమారు రూ.2.92 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి చేరింది. ప్రతి నాలుగు నెలలకోసారి 1/3వ వంతు లెసైన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వీటి ద్వారా సంవత్సరం మొత్తంలో సుమారు రూ. 133 కోట్లు ఆదాయం ఆబ్కారీశాఖకు లభించనుంది. ఇప్పటికే మొదటి విడత ఆదాయం సుమారు రూ.44 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అన్ని షాపుల్లో మద్యం విక్రయాల ద్వారా ఈ ఏడాది ఎక్సైజ్‌శాఖకు సుమారు రూ.800 కోట్లకుపైగానే ఆదాయం లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటు తగదు
కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం సాక్షి, బెంగళూరు: కావేరీ నీటి పంపిణీ విషయమై నిర్వహణా మండలి ఏర్పాటు చేయాలనే కేంద్రం నిర్ణయంపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. నీటి నిర్వహణ మండలిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని చెబుతూ కన్నడ చళువళి వాటాల్ పార్టీ అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ ఆధ్వర్యంలో రాజ్‌కుమార్ అభిమానుల సంఘం అధ్యక్షుడు సా.రా.గోవిందు తదితరులు శనివారం ఆందోళన నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. వాటాళ్ నాగరాజు మాట్లాడుతూతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒత్తిళ్లకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ తలొగ్గడం సమంజసంగా లేదని విమర్శించారు. నీటి నిర్వహణా మండలి ఏర్పాటైతే కావేరితో పాటు రాష్ట్రంలోని ఇతర జలాశయాలు కూడా మండలి పరిధిలోకి వెళ్తాయని, తద్వారా కర్ణాటకకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వేళ కేంద్రం నీటి నిర్వహణ మండలి ఏర్పాటుకు ముందుకు వెళ్తే రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులందరూ రాజీనామాలు చేసి కన్నడ సంస్థల ఆధ్వర్యంలో కర్ణాటక బంద్, జైల్ భరో వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నీటి ని ర్వహణా మండలి ఏర్పాటు చేయకుండా నరేంద్ర మోడీపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అఖిల పక్ష సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయిం చడం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. -
ఫ్లోర్ లీడర్లతో మేయర్ భేటీ
సాక్షి, సిటీబ్యూరో: డెబ్రిస్(నిర్మాణ వ్యర్థాల) తొలగింపునకు ప్రతి డివిజన్‌కు ఒక వాహనాన్ని కేటాయించాల్సిందిగా గత స్టాండింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా మేయర్ మాజిద్ హుస్సేన్ కమిషనర్‌కు సూచించారు. సుదీర్ఘ విరామం తర్వాత మేయర్ మాజిద్ బుధవారం డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లతో సమావేశమయ్యారు. ప్రజావసరాల దృష్ట్యా చేపట్టాల్సిన పనుల గురించి సమావేశంలో చర్చించారు. ఆమేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి సదరు పనులు వెంటనే చేయాల్సిందిగా క మిషనర్‌కు సూచించారు. వాటిల్లో ముఖ్యాంశాలు.. డెబ్రిస్ తొలగింపు పనులు వెంటనే పూర్తిచేయాలి. కార్పొరేటర్ల బడ్జెట్ నిధుల (కోర్ ఏరియా వారికి రూ. 1.50 కోట్లు, శివారు ప్రాంతాల వారికి రూ. 2 కోట్లు)నుంచి స్వల్పకాలిక టెండర్లు పిలిచి అవసరమైన పనులు వెంటనే చేపట్టాలి. బీటీ ప్లాంట్లలో ఏవైనా అవకతవకలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలే తప్ప బీటీ ప్లాంట్లను మూసివేయరాదు పాట్‌హోల్స్ పనులు వెంటనే పూర్తిచేసి జాబితా సిద్ధం చేయాలి. డివిజన్ల వారీగా కొత్త రహదారుల వివరాలు 26న ‘షాబ్- ఎ- మైరాజ్’ను పురస్కరించుకొని మసీదుల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాత్కాలిక వీధిదీపాల ఏర్పాటు. శ్మశానవాటికల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు. రూ. 5లకే భోజనం అమలు తీరుపై నివేదిక. అదనంగా ఏర్పాటు చేయాల్సిన కేంద్రాల జాబితా. నాలాల డీసిల్టింగ్ పనులపై నివేదిక తిరిగి 23వ తేదీన జరుగనున్న సమీక్ష సమావేశానికి పై నివేదికల తో సంబంధిత అధికారులంతా హాజరుకావాలి. సమావేశంలో ఫ్లోర్‌లీడర్లు దిడ్డి రాంబాబు(కాంగ్రెస్), ఎండి నజీరుద్దీన్(ఎంఐఎం), సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి(టీడీపీ), బంగారి ప్రకాశ్(బీజేపీ), జీహెచ్ఎంసీ సెక్రటరీ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రవేశానికి వేళాయె!
ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్ దరఖాస్తుల గడువు జూన్ 16 పోస్టల్ దరఖాస్తులకు జూన్ 21 జూలై 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ జూలై 28 నుంచి తరగతులు గ్రామీణ విద్యార్థులకు పెద్దపీట నూజివీడు, న్యూస్‌లైన్ : ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం బుధవారం ప్రారంభం కానుంది. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ(ఆర్కే వ్యాలీ), బాసర ట్రిపుల్ ఐటీలలో 2014-15 విద్యాసంవత్సర ప్రవేశాలకు విశ్వవిద్యాలయ కులపతి రాజ్‌కుమార్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో దరఖాస్తుల స్వీకరణకు రంగం సిద్ధమైంది. ఆరు సంవత్సరాల సమీకృత బీటెక్ డిగ్రీ కోర్సుకు సంబంధించి మొదటి సంవత్సరంలో చేరేందుకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పదోతరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు జూన్ 16 (రాత్రి 8 గంటల వరకు) ఆఖరు తేదీ కాగా, ముద్రిత దరఖాస్తులను జూన్ 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు విశ్వవిద్యాలయానికి పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు అయిన రూ.150 చెల్లించినట్లుగా తెలిపే బ్యాంక్ చలానా గాని, ఏపీ ఆన్లైన్ రసీదు గాని జతచేయాలి. పదోతరగతికి సంబంధించిన మార్కుల జాబితాను, హాల్‌టికెట్లను కూడా జతచేసి పంపాలి. దరఖాస్తు చేసుకున్నవారిలో ఎంపిక చేసిన జాబితాను జూలై ఎనిమిదిన ప్రకటిస్తారు. జూలై 23, 24 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 27న వెయిటింగ్ జాబితాలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, జూలై 28 నుంచి తరగతులు ప్రారంభిస్తారు. సీట్ల కేటాయింపు జరిగేదిలా... రాష్ట్రంలోని మూడు ట్రిపుల్ ఐటీలకు కేటాయించిన మూడువేల సీట్లలో రెండు శాతం మాజీ సైనిక ఉద్యోగుల (కాప్) పిల్లలకు కేటాయిస్తారు. వికలాంగులకు మూడు శాతం, ఎన్సీసీ కోటా కింద ఒక శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.05 శాతం చొప్పున కేటాయించనున్నారు. నాలుగు కేటగిరీలకు కలిపి మొత్తం 195 సీట్లు పోగా మిగిలిన 2,805 సీట్లలో ఓపెన్ కేటగిరీ కింద 15 శాతం అంటే 421 సీట్లు కేటాయిస్తారు. మిగిలిన 2,384 సీట్లలో ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంతానికి 1001 (42 శాతం) సీట్లు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతానికి 858 (36 శాతం) సీట్లు, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంతానికి 525 (22 శాతం) సీట్లు కేటాయించారు. -
ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని బాసర, ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. 3 వేల మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించే నోటిఫికేషన్ ను ఆర్జేయూకేటీ వైస్ ఛాన్సలర్ రాజ్ కుమార్ విడుదల చేశారు. జూన్ నెల 21 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుందని, జూన్ 16 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని ఓ ప్రకటనలో వెల్లడించారు. జూలై 8న విద్యార్థుల ఎంపిక, జూలై 23, 24 కౌన్సిలింగ్ జరుగుతుందన్నారు. జూలై 28న తరగతులు ప్రారంభిస్తామని వీసీ ఓ ప్రకటనలో తెలిపారు. -
చదువుకునేందుకు వచ్చాం.. చచ్చేందుకు కాదు
భైంసా/ముథోల్, న్యూస్‌లైన్ : ‘సార్ మేమంతా ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాం. చచ్చిపోవటానికి కాదు. ప్లీజ్ సార్.. మా మాట వినండి.. ఆడ పిల్లల ఇబ్బందులు తెలుసుకోండి సార్..’ అంటూ ఏడుస్తూ బాసర ట్రిపుల్ ఐటీ పిల్లలు తమ బాధలను రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి ఆఫ్ టెక్నాలజీ (ఆర్జేయూకేటీకే) వైస్‌చాన్స్‌లర్ రాజ్‌కుమార్‌కు మొరపెట్టుకున్నారు. సమస్యలపై సమాధానం చెప్పాలంటూ విద్యార్థులు పట్టుబట్టి వీసీని ఘెరావ్ చేశారు. ఒకింత అసహనానికిలోనై పోలీసులతో కార్యాలయానికి చేరుకున్న వీసీ రాజ్‌కుమార్ వెనకాలే పిల్లలంతా వెళ్లారు. కార్యాలయం ముందే కూర్చుని వీసీ కోసం ఎదురుచూశారు. తదుపరి వచ్చిన వీసీ రాజ్‌కుమార్‌కు ఇబ్బందులను, వేధింపులను విద్యార్థులు తేటతెల్లం చేశారు. వెలువెత్తిన సమస్యలు.. బాసర ట్రిపుల్‌ఐటీలో సమస్యల పరిష్కారం కోరుతూ ఎనిమది రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం ట్రిపుల్ఐటీ ప్రాంగణంలో వేల మంది విద్యార్థులతో వీసీ రాజ్‌కుమార్, ప్రొఫెసర్ల బృందం చర్చలకు దిగింది. వీసీ రాజ్‌కుమార్ సమస్యలపై ట్రిపుల్ఐటీ విద్యార్థుల లక్ష్యంపై ప్రసంగంలో పలు సూచనలు చేశా రు. వేల మంది విద్యార్థులతో ఉన్న కళాశాలలో ఇబ్బం దులు ఉంటాయని, వాటిని త్వరలోనే పరిష్కారం చేస్తామని తెలిపారు. శనివారం విద్యార్థులు మాట్లాడిన తీరు తనను బాధించిందన్నారు. దీంతో అక్కడే ఉన్న ఓ వి ద్యార్థి వీసీ కాళ్లు పట్టుకుని తండ్రిలా క్షమించాలని వేడుకున్నాడు. అనంతరం విద్యార్థులు సమస్యలపై ప్రశ్నిం చారు. తీసుకునే చర్యలను ఇప్పుడే వివరించాలని విద్యార్థులు పట్టుబట్టడంతో వీసీ అసహనంతో వెళ్లిపోయారు. విద్యార్థినులంతా తమ సమస్యలు వినాలంటూ మానవహారంగా ఏర్పడి వీసీని చుట్టుముట్టారు. మళ్లీ వచ్చి చర్చలు ప్రారంభించినా ఏ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. చర్చలు సఫలం కాకుండానే ఎలా వెళ్లిపోతారని విద్యార్థులు వేడుకున్నా వీసీ పోలీసులతో కలిసి కార్యాలయానికి చేరుకున్నారు. వెనకాలే వెళ్లిన విద్యార్థులు చాలాసేపు అక్కడే నిరీక్షించారు. తదుపరి ఆయన వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. బాసర ట్రిపుల్‌ఐటీలో వీసీగా మీరు కష్టపడితే.. ఇక్కడ పనిచేసే వారు మా భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని, తాము కోరే విధంగా ఆ ఐదుగురిని శాశ్వతంగా తప్పిస్తే యూనివర్సిటీకి మంచి పేరు వస్తుందన్నారు. తల్లిదండ్రులు తమపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే తమ బతుకులు ఇలా నాశనమవుతున్నాయంటూ విద్యార్థులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎనిమిది రోజులుగా నిద్రహారాలు మాని నిరసనలు చేపట్టామని ఆవేదన చెందారు. కమిటీ వేశాం.. సమస్యల పరిష్కారానికి ప్రొఫెసర్ల కమిటీ వేశామని, త్వరలోనే విద్యార్థులు సూచించిన విషయాలపై తమ నిర్ణయం వెల్లడిస్తామని వీసీ రాజ్‌కుమార్ చెప్పుకొచ్చారు. ఇక్కడే నిర్ణయం వెల్లడించాలని కోరడం సరికాదన్నారు. మెస్ నిర్వహణ విషయంలోనూ సభ్యులతో మాట్లాడుతానని, విద్యార్థులు తరగతులకు వెళ్లాలని వీసీ రాజ్‌కుమార్ సూచించారు. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వీసీతో ఆవరణలో వేలాది మంది విద్యార్థులు చేపట్టిన చర్చలు విఫలమయ్యాయి. సాయంత్రం 6 గంటల నుంచి 10 మంది విద్యార్థుల బృందాలను ఏర్పాటు చేసి మాట్లాడేందుకు వీసీ అవకాశం ఇచ్చారు. ఇలా బృందాలను కార్యాలయంలోకి పిలిపించుకుని జరిగిన విషయాలను తెలుసుకున్నారు. మీ వెంటే నేను... ఇదిలా ఉంటే.. ట్రిపుల్ఐటీకి చేరుకున్న ఎమ్మెల్యే వేణుగోపాలాచారి వీసీతో చర్చించాక విద్యార్థులతో మాట్లాడారు. ‘మీతోపాటే నేను’ ఉంటానని, ‘మీ సమస్యలు వీసీ దృష్టికి తీసుకెళ్లానని’ చెప్పారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాంరెడ్డిని పిలిపించి మార్చి 20వరకు నీటి సమస్య తీరే లా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆ అధికారితో చెప్పించారు. తాత్కాలికంగా భైంసా మున్సిపాలిటీ నుం చి ట్రిపుల్ఐటీకి ట్యాంకర్లను పంపిస్తామని తెలిపారు. అత్యవసర వైద్య సేవల కోసం భైంసా ఏరియా ఆస్పత్రి లో చర్చించినట్లు వెల్లడించారు. కాగా.. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల చర్చలు రాత్రి కూడా వీసీతో కొనసాగాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో విద్యార్థులు కూడా తమ నిరసన కొనసాగిస్తున్నారు. -
రూ.20 వేల కోసం మేనల్లుడి హత్య
హైదరాబాద్: నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఐదేళ్ల బాలుడు యాశ్ రాజ్‌కుమార్ హత్య కేసులో అత్తాపూర్‌కు చెందిన వినోద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 20 వేల రూపాయల కోసం హత్య చేసినట్లు రాజ్‌కుమార్ మేనమామ వినోద్ పోలీసులకు చెప్పాడు. మంగళ్‌హాట్ ధూల్‌పేట్ ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్, పప్పి దంపతుల కుమారుడు యశ్‌రాజ్ కుమార్ నార్సింగ్‌లోని పిరంచెరువు సమీపంలో గత నెలలో దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. నాంపల్లి ఝాన్సీ చౌరాహీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఎల్‌కెజి చదువుతున్న యాశ్ రాజ్‌కుమార్ సొంత మేనమామ వినోద్ ఇరవై వేల రూపాయల కోసం కిడ్నాప్ చేసి, హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి గొంతుకు ఉరి బిగించి హత్య చేసి, ఆ తర్వాత బండరాయితో ముఖంపై మోదారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి శవాన్ని తగులబెట్టారని పోలీసులు తెలిపారు. -
రాజ్‌కుమార్ హత్యకేసులో మేనమామ అరెస్ట్
-
వద్దే వద్దు
చిత్ర పరిశ్రమ బంద్ సంపూర్ణం రాష్ర్ట వ్యాప్తంగా థియేటర్ల మూత పలుచోట్ల ‘డబ్బింగ్ భూతం’ దిష్టిబొమ్మల దహనం బెంగళూరులో భారీ ర్యాలీ రాజ్‌కుమార్ సమాధి నుంచి సెంట్రల్ కాలేజీ వరకు ప్రదర్శన హాజరైన అగ్ర తారాగణం బెంగళూరు, న్యూస్‌లైన్ : అనువాద (డబ్బింగ్) చిత్రాలకు వ్యతిరేకంగా కన్నడ చిత్ర పరిశ్రమ సోమవారం చేపట్టిన బంద్ సంపూర్ణంగా జయప్రదమైంది. సినీ తారలతో పాటు చిత్ర పరిశ్రమ అంతా ఒకే తాటిపై నిలిచి డబ్బింగ్ సినిమాలు వద్దే వద్దని నినదించాయి. రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. నగరంలోని రాజ్‌కుమార్ సమాధి వద్ద నుంచి మైసూరు బ్యాంకు సర్కిల్ వరకు డబ్బింగ్‌కు వ్యతిరేకంగా తొలుత బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం సెంట్రల్ కాలేజీ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. అగ్ర తారాగణం సహా చిత్ర పరిశ్రమకు చెందిన అందరూ ఇందులో పాల్గొన్నారు. అనంతరం కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ తన తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమకు డబ్బింగ్ చిత్రాలు అవసరం లేదని పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు కొందరు నిర్మాతలు స్వార్థంతో డబ్బింగ్ చిత్రాల పాట పాడుతున్నారని ఆరోపించారు. అదే జరిగితే కన్నడ చిత్ర పరిశ్రమ వీధిన పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తుది శ్వాస వరకు డబ్బింగ్ చిత్రాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. ఈగ ఫేం సుదీప్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో డబ్బింగ్ చిత్రాలు వస్తే కన్నడ చిత్ర పరిశ్రమ అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. డబ్బింగ్ చిత్రాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ తాము ఏ భాషా చిత్రాలకూ వ్యతిరేకం కాదని అన్నారు. డబ్బింగ్ చిత్రాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా సుదీర్ఘ కాలం పోరాటం చేయడానికి కూడా సిద్ధమేనన్నారు. డబ్బింగ్ సినిమాలు కావాలంటున్న వారికి కన్నడిగులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ ఆందోళనకు నాయకత్వం వహించిన కన్నడ చళువళి వాటాల్ పక్షం అధ్యక్షుడు వాటాల్ నాగరాజ్ మాట్లాడుతూ డబ్బింగ్ చిత్రాల వల్ల కన్నడ సంస్కృతి దెబ్బ తింటుందని హెచ్చరించారు. కన్నడ భాష, సంస్కృతులను కాపాడుకోవాలంటే డబ్బింగ్ చిత్రాలకు అవకాశం కల్పించకూడదని తెలిపారు. దీనిపై కన్నడిగులందరూ పోరాటానికి సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కన్నడ అభివృద్ది ప్రాధికార అధ్యక్షుడు, నటుడు ముఖ్యమంత్రి చంద్రు మాట్లాడుతూ డబ్బింగ్ భూతం వల్ల కన్నడ చిత్ర పరిశ్రమ దెబ్బ తింటుందని హెచ్చరించారు. డబ్బింగ్ చిత్రాలను అడ్డుకోవడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలని కోరారు. ఇదే సందర్భంలో నటీ నటులు జగ్గేష్, తార, నవీన్ కృష్ణ, ప్రేమ్, వినోద్ రాజ్, సాధు కోకిల, మాలాశ్రీ, సుధారాణి, శృతి, భావన, రాధిక పండిత్, అలనాటి నటీమణులు భారతి విష్ణువర్ధన్, లీలావతి, ప్రేమా చౌదరి, ప్రమీళ జోషాయ్, డాక్టర్ రాజ్‌కుమార్ అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సా.రా. గోవిందు, కర్ణాటక రక్షణా వేదిక నాయకులు శివరామే గౌడ, ప్రవీణ్ కుమార్‌శెట్టి, కన్నడ సేన కుమార్, దళిత సంఘం నాయకుడు మూర్తి ప్రభృతులు పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా నగరంలో అనేక చోట్ల కన్నడ సంఘాలు ‘డబ్బింగ్ భూతం’ దిష్టి బొమ్మలను దహనం చేశాయి. -
ఉసురు తీసిన విద్యుత్
కొలిమిగుండ్ల, న్యూస్‌లైన్ : పని చేస్తున్న చోటే మృత్యువు పొంచి ఉందని, అది ఆమెను కబలిస్తుందని ఎవరికి తెలుసు. ఆ ప్రాంతం మీదుగా మరోచోటుకు వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్ తీగలు తగిలి తెగిపోవడం, సమీప ధోబీఘాట్‌లో బట్టలుతుకుతున్న ఓ మహిళ వాటికి బలి కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. మృత్యువొడి చేరేందుకేనన్నట్టు ధోబిఘాట్‌లోని మిగతా వారంతా భోజనం చేసి సేద తీరుతుండగా ఆమె మాత్రం అక్కడే ఉండిపోయింది. కాసేపటికే అనంతలోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చాకలి నడిపి నాగన్న భార్య రంగమ్మ (45) కులవృత్తి ద్వారా జీవనం సాగిస్తోంది. రోజులాగే ఆదివారం కూడా బట్టలుతికేందుకు స్థానిక ప్రాథమిక పాఠశాల సమీపంలోని ధోబి ఘాట్‌కు వెళ్లింది. మధ్యాహ్న సమయంలో అందరూ భోజనం చేసి సేదతీరుతుండగా రంగమ్మ అప్పుడే బట్టలుతికేందుకు ధోబీఘాట్లోకి దిగింది. ఇంతలో గ్రామ పొలాల్లో కొనుగోలు చేసిన శనగ పొట్టును జమ్మలమడుగు తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్ పాఠశాల సమీపానికి చేరగానే విద్యుత్ తీగలు తగిలి తెగిపడ్డాయి. సరిగ్గా తీగల కిందే ధోబీఘాట్‌లో రంగమ్మ ఉండడంతో క్షణాల్లో ఆమె ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ప్రమాదం జరిగిన తర్వాత కూడా తీగలకు విద్యుత్ సరఫరా ఉండడంతో స్థానికులు అక్కడికి వెళ్లే సాహసం చేయలేదు. మరోవైపు ట్రాక్టర్లో ఉన్నోళ్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. తర్వాత విద్యుత్ సిబ్బంది సరఫరా నిలిపేయడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్ల ముందే తల్లి రంగమ్మ గిలాగిలా కొట్టుకుంటూ మరణించడాన్ని తట్టుకోలేక ఆమె కూతురు ఆర్తనాదాలు చేసింది. ఎస్ఐ రాజ్‌కుమార్ సిబ్బందితో ఘటనాస్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు తప్పిన ముప్పు.. తీగలు తెగిపడిన సమయంలో స్కూల్ బయట విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థులు అటు వెళ్లకుండా హెచ్ఎం సుంకన్న జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం.. తీగలు కిందుగా వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్నా విద్యుత్ సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా ఒక నిండు ప్రాణం బలై పోయిందని గ్రామస్తులు ఆవేదన చెందారు. రజకులందరూ పనిలో ఉన్నా, తరగతుల విరామ సమయంలో ఘటన జరిగి ఉన్నా ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉండేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. -
అయోమయం..!
=తేలని మేయర్, డిప్యూటీ రాజీనామాల వ్యవహారం =పార్టీ నేతలకు, కార్పొరేటర్లకూ స్పష్టత లేని వైనం సాక్షి, సిటీబ్యూరో : ఆశావహుల హడావుడి తప్ప.. మేయర్, డిప్యూటీ మేయర్ల మార్పునకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. కాంగ్రెస్-ఎంఐఎం కూటమి ఒప్పందం మేరకు, మేయర్ మాజిద్‌హుస్సేన్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్‌ల గడువు ముగిసినందున.. వారి స్థానాల్లో కొత్త మేయర్‌గా కాంగ్రెస్ అభ్యర్థి, కొత్త డిప్యూటీ మేయర్‌గా ఎంఐఎం అభ్యర్థి ఎన్నిక కావాల్సి ఉంది. ఒప్పందం మేరకు నడచుకుంటామని ఎంఐఎం చెబుతున్నప్పటికీ.. కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఇందుకు సంబంధించి రెండు పార్టీలు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేయర్, డిప్యూటీ మేయర్ల మార్పునకు సంబంధించిన ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందంటే.. ఏ పార్టీ కార్పొరేటర్లు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. వారే కాదు.. మేయర్, డిప్యూటీ మేయర్లు సైతం అంతా అధిష్ఠానం చూసుకుంటుం దంటున్నారే తప్ప.. తామెప్పుడు రాజీనామాలు చేయాల్సి ఉంటుందో తమకే తెలియదంటున్నారు. మరోవైపు.. వారి పార్టీ అభ్యర్థికి మేయర్ పదవి అప్పగించడంపై కాంగ్రెస్ నేతలు ఆసక్తి, చొరవ చూపడం లేరని ఎంఐఎం వర్గాలు సైతం భావిస్తున్నాయి. ‘ఒప్పందానికి అనుగుణంగా నడచుకోవాలని కాంగ్రెస్ నుంచి ఎంఐఎంకు లేఖ ఇచ్చారంటున్నారు. ఆ ఉత్తరానికి తగిన జవాబు ఆశించడం కానీ.. త్వరగా ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తి కానీ కాంగ్రెస్ నుంచి లేవు. వీటిని బట్టి చూస్తుంటే.. కాంగ్రెస్‌కు మేయర్ మార్పుపై పెద్దగా ఆసక్తి ఉన్నట్లు కనిపించడం లేదు’ అంటూ జీహెచ్ఎంసీలోని ఎంఐఎం ముఖ్యనాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఎవరు ముందు రాజీనామా చేయాలి..? మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరి మార్పు జరగనున్నందున తొలుత ఎవరు రాజీనామా చేయాలనేది ఇప్పుడు జీహెచ్ఎంసీలో చర్చనీయాంశంగా మారింది. జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు డిప్యూటీ మేయర్ రాజీనామాను మేయర్ ఆమోదించాల్సి ఉండగా, మేయర్ రాజీనామాను మేయర్ అధ్యక్షతన సమావేశమయ్యే కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంది. ఇది అమలయ్యేందుకు డిప్యూటీ మేయర్ తొలుత రాజీనామా చేయాలని దారుస్సలాం వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా.. మేయర్ ముందే రాజీనామా చేసినా.. కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందేంతవరకు మేయర్‌గా కొనసాగుతారు కనుక.. మేయరే తొలుత రాజీనామా చేసి కౌన్సిల్ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని.. సమావేశానికి ఒక్కరోజు ముందుగా డిప్యూటీ మేయర్ రాజీనామా చేసినా సరిపోతుందంటున్నారు. గతంలో మేయర్ కార్తీకరెడ్డి, డిప్యూటీ మేయర్ జాఫర్హుస్సేన్లు ఇలాగే రాజీనామాలు చేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పట్లో 2011 డిసెంబర్5న కార్తీకరెడ్డి మేయర్ పదవికి రాజీనామా లేఖ ఇచ్చి.. ఆమోదం కోసం డిసెంబర్ 17న కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిసెంబర్ 16న డిప్యూటీ మేయర్ రాజీనామా చే శారు. కౌన్సిల్ సమావేశానికి ముందుగా ఆయన రాజీనామాను ఆమోదించారు. కార్తీకరెడ్డి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం ఆమె రాజీనామాను ఆమోదించింది. మేయర్ రాజీనామాపై అనుమానాలు మేయర్ మాజిద్ రాజీనామా చేసే సూచనలు కనిపించడం లేదు. పెపైచ్చు.. జీహెచ్ఎంసీ ఆవరణలో ముసుగు కప్పి ఉన్న విగ్రహాలను తన హయాంలోనే తరలిస్తానని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. అంటే.. మరికొంత కాలం ఉంటారన్నమాటేగా అన్న వ్యాఖ్యానాలూ వినిపిస్తున్నాయి. అంతే కాదు.. ప్రతినెలా మొదటి శనివారం మేయర్ అధ్యక్షతన జరిగే ‘ ఫేస్ టు ఫేస్’ కార్యక్రమానికి సంబంధించి ఒకరోజు ముందు పత్రికాప్రకటన విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి మాత్రం రెండు రోజుల ముందుగా ప్రకటన విడుదల చేశారు. ఎందుకలా అంటే.. ‘మేయర్ రాజీనామా చేయరు.. కొనసాగుతారు..’ అని చెప్పడానికేన నే సమాధానం వెలువడింది. -
ఓటరు జాబితా సిద్ధం చేయండి
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తాజా ఓటరు జాబితాను సిద్ధం చేయూలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితా తాజా పరుచుట, ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లపై ఓటరు నమోదు అధికారుల(ఈఆర్ఓ)తో కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22తో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ముగిసిందన్నారు. నేరుగా, ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. దరఖాస్తును తిరస్కరిస్తే... కారణాలను తెలియజేయాలన్నారు. వీఆర్వోలు తనిఖీలు చేసి సంబంధిత రిజిస్టర్లలో సంతకాలు చేయూలన్నారు. ఓటర్ల వివరాలు అప్డేట్ చేసేందుకు అవసరమైన కంప్యూటర్లను సమకూర్చుకుని డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకోవాలన్నారు. జనవరి 4 నాటికి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించి ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఆన్లైన్ ద్వారా 62,290 దరఖాస్తులు అందాయని, వాటిలో పెండింగ్ ఉన్నవాటిని త్వరితగతిన పరి ష్కరించాలన్నారు. నవంబర్, డిసెంబర్ నెలలో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఫారం-6 లో 38,644, ఫారం-7లో 3,719, ఫారం-8లో 1353, ఫారం-8ఓలో 452 దరఖాస్తులు అందాయన్నారు. డూప్లికేట్, రీ డూప్లికేట్ దరఖాస్తులు అధికంగా ఉన్నాయని, వాటిని జాగ్రత్తగా గమనించాలన్నారు. పేరు, చిరునామా, ఫొటో తదితర వివరాల్లో ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఓటర్ల కార్డుల్లో వివరాలు, ఫొటోలు వేర్వేరుగా ఉండడం వల్ల సమస్య లు తలెత్తుతాయన్నారు. జిల్లాకు చెందిన సీనియర్ రోల్ అబ్జర్వర్లు జాబితాలను పరిశీలిస్తారన్నారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 1200 మంది ఓటర్లు దాటకుండా జాగ్రత్త వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు, పోలింగ్ సిబ్బంది శిక్షణకు, రిజర్వులో ఉంచేందుకు అవసరమైన ఈవీఎంల అంచనాలు తయూరుచేసి ప్రతిపాదనలు పంపించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో అవసరమైన సెక్షన్, రూట్ అధికారుల సంఖ్య, పోలింగ్‌కు అవసరమైన సిబ్బంది వివరాలు అందించాలన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు, వ్యయూన్ని పరిశీలించేందుకు మండలాల వారీగా బృందాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. అలాగే, వీడియోగ్రాఫర్ల్ సంఖ్యను తెలపాలన్నారు. సమావేశంలో డీఆర్వో నూర్‌బాషా ఖాసిం, జెడ్పీ సీఈవో టి.కైలాశ్గిరీశ్వర్, ఆర్టీవోలు జి.గణేష్‌కుమార్, వి.విశ్వేశ్వరరావు, ఎన్.తేజ్‌భరత్, డీఆర్డీఏ పీడీ పి.రజనీకాంతరావు, హెచ్.వరప్రసాదరావు, కె.వెంకటేశ్వర్లు, ఆర్.గున్నయ్య, కె.సాల్మన్‌రాజు పాల్గొన్నారు. -
ప్రేక్షకులు నాతో మాట్లాడతారు
ప్రేక్షకులు తనతో నేరుగా మాట్లాడతారని బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా పేర్కొంది. ‘మీతో సంభాషించే సమయంలో సలాడ్ తింటే ఏమీ అనుకోరుగదా’ అని కాస్తంత మొహమాటంగా మీడియాని అడిగింది. రాంబో రాజ్‌కుమార్ సినిమా ప్రమోషన్కోసం నగరంలో రోజంతా గడిపిన సోనాక్షి... దేశరాజధాని నగరంలో జరగనున్న ప్రమోషన్ ఈవెంట్లకు హాజరయ్యేందుకు సన్నద్ధమవుతోంది. ‘రాంబో రాజ్‌కుమార్ సినిమా విడుదల నన్ను ఎంతో ఉత్తేజానికి లోనుచేసింది. ‘ఇది హాస్యప్రధాన చిత్రం. ప్రభుదేవాతో కలసి చేయడం ఇది రెండోసారి. తొలిసారి రౌడీ రాథోడ్‌లో ప్రభుదేవాతో నటించా. ప్రతి సినిమాతోనూ మా బంధం బలపడుతోంది. ఆయనతో కలసి పనిచేస్తున్నందుకు నేను ఇలా మాట్లాడడం లేదు. ఓ ప్రేక్షకురాలిగా ఈ సినిమాలను నేను సైతం ఆస్వాదిస్తా. చిత్రనిర్మాణంలో ఆయన శైలి ఆయనదే’ అని అంది. ఇదిలాఉంచితే ప్రభుదేవా దర్శకత్వ శైలి, సోనాక్షిని రాంబో రాజ్‌కుమార్ సినిమాలో చూపించిన తీరు రౌడీ రాథోడ్‌ను మరిపిస్తుంది. ‘రాంబో రాజ్‌కుమార్ సినిమా కథనం భిన్నంగా ఉంటుంది. రౌడీ రాథోడ్ సినిమాకు దీనికి ఎటువంటి పొంతనా లేదు. ఈ రెండు సినిమాల్లో కథానాయకలు వేర్వేరు. వాళ్ల చుట్టూ అల్లిన కథ కూడా విభిన్నంగానే ఉంటుంది’ అని సలాడ్ కప్పువైపు చూస్తూ చెప్పింది. ‘ఈ మసాలా సినిమాల్లో నటించడానికి కారణం వాటిని వ్యక్తిగతంగా చూసి ఆనందించ డమే. సినిమా చూసే సమయంలో అందరి మాదిరిగానే నేను కూడా బిగ్గరగా అరుస్తుంటా. ఇష్టమైన సినిమాలు చూస్తూ ఆనంద తాండవం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి’ అని తన మనసులో మాట తెలియజేసింది. కేవలం డబ్బు సంపాదన కోసం సినిమాలు చేయడం లేదంది. 40 ఏళ్లు దాటిన తర్వాత తాను నటించిన సినిమాలు చూస్తూ కాలం గడ పాలనుకుంటున్నానంటూ ముగించింది. -
నిరాశ కిరణాలు
సాక్షి, మంచిర్యాల : రాజీవ్ యువకిరణాలు అక్రమాలకు చిరునామాగా మారాయి. పలు ఏజెన్సీలు నిరుద్యోగులకు ఓ రంగంలో శిక్షణ ఇచ్చి.. మరో రం గంలో కిందిస్థాయి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఇంకొన్ని ఏజెన్సీలైతే ఉద్యోగాలు కల్పించకు న్నా, కల్పించినట్టు అధికారులను నమ్మంచి నిధులు పక్కదారి పట్టిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం శిక్షణ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చినా నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారు. శిక్షణ తీసుకున్న వారికి ఎక్కడ ఉపాధి కల్పించారో వివరాలు ఏజెన్సీలు సమర్పించడం లేదు. ఈ అవినీతిలో అధికారుల పా త్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేరు మారిన.. తీరు మార లేదు.. కుటుంబానికో ఉద్యోగం, వార్షికాదాయం రూ.60వేల నుంచి రూ.లక్ష వరకు పెంచాలనే లక్ష్యంతో 2005-06లోనే ప్రభుత్వం ఎంప్లాయీమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) పథకం ప్రవేశపెట్టింది. పద్దెనిమిదేళ్ల నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్న నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగవకాశాలు కల్పిచాలని నిర్ణయించింది. కానీ ఆశించిన లక్ష్యం నెరవేరకపోవడంతో దీనిస్థానంలో 2011లో రాజీవ్ యువ కిరణాలు పథకాన్ని అమలు చేసింది. గ్రామీణ విద్యార్థుల కోసం నిర్వహించే కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతను డీఆర్డీఏ- ఐకేపీకు, అర్బన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మోప్మాకు అప్పగించింది. కానీ, పథక నిర్వహణపై పర్యవేక్షణ లేకపోవడం, మెరుగైన శిక్షణ అందకపోవడంతో నిరుద్యోగులు ఉపాధి అవకాశాలకు నోచుకోవడం లేదు. అధికారుల అసమర్థతను ఆసరాగా చేసుకుని, పలు ఏజెన్సీలు బోగస్ విద్యార్థులను సృష్టించి డబ్బులు కాజేస్తున్నారు. గత నెలలో నిర్మల్‌లోని ఓ ఏజెన్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన పథక రాష్ట్ర క్వాలిటీ కం ట్రోల్ సెల్ బృందం ఈ అక్రమాన్ని గుర్తించిం ది. ఇతరుల వేలిముద్రలు, విద్యార్థుల సంఖ్య ఎక్కువ చూపుతూ డబ్బులు కాజేస్తునృ్నట్లు నిర్ధారించింది. దీంతో సదరు ఏజెన్సీకి బిల్లులు నిలిపేయాలని అధికారులను ఆదేశించింది. 16 కేంద్రాలు.. 641 మంది.. పస్తుతం డీఆర్డీఏ ఆధ్వరృ్యంలో జిల్లా పరిధిలోని పశ్చిమ ప్రాంతంలో ఆదిలాబాద్ న్యాక్‌లో ఫ్లంబింగ్, సానిటేషన్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, జనరల్ వర్క్స్ సూపర్వైజర్, నిర్మల్‌లోని సీఎంసీలో కంప్యూటర్ మెన్టేషన్, హార్డ్‌వేర్, టెలిసెల్స్, శ్రీ టెక్‌లో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, స్కిల్ప్రోలో సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్, భైంసాలోని సింక్సర్వో, అపెక్లలో కంప్యూటర్ మెన్టేషన్, హార్డ్‌వేర్ రంగాల్లో 361 మంది నిరుద్యోగులు శిక్షణ పొందుతున్నారు. తూర్పు జిల్లా మంచిర్యాలలోని సాహితీ, డాటా ప్రో ఏజెన్సీలలో కంప్యూటర్ మెన్టేషన్, హార్డ్‌వేర్, ఐఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్మెంట్, శ్రీటెక్లో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, సీఎంసీ లో టెలిసెల్స్, కాగజ్‌నగర్ సీఎంసీలో టెలిసెల్స్ రంగాల్లో 280 మంది శిక్షణ పొందుతున్నారు. వీటితోపాటు ఐటీడీఏ పరిధిలో మరో మూడు కేంద్రాలున్నాయి. ఒక్కో కోర్సు కాలపరిమితి ఒక్కో విధంగా ఉంటుంది. కనీస కాలపరిమితి సెక్యూరిటీగార్డు శిక్షణకు 15 రోజులుంటే, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కోర్సుకు గరిష్టంగా 75 రోజులుంటుంది. ప్రతి విద్యార్థికి కోర్సును బట్టి బోధన కోసం రూ.2 వేల నుంచి రూ.7 వేల వరకు కేటాయిస్తుంది. దీంతోపాటు వారికి ఉచితంగా వసతి, భోజనం కోసం ప్రతి నెలా రూ.2,400లు విడుదల చేస్తోంది. పక్కదారి పట్టిన లక్ష్యం నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్న ఏజెన్సీలు వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమవుతున్నాయి.ఆయా కంపెనీలు ఇచ్చే వేతనం రూ. 6వేల లోపు ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో విద్యార్థులు పని వదిలేసి ఇంటి కి చేరుకుంటున్నారు. మరోపక్క పొందిన శిక్షణతో సంబంధం లేని ఉద్యోగాలు కల్పించడంతో చాలా మంది వెనుదిరుగుతున్నారు. దీంతో ప్రభుత్వం విద్యార్థుల వసతి, భోజనం, శిక్షణ కోసం పెట్టిన ఖర్చంతా వృథా అవుతోంది. కేంద్రాలు రద్దు అక్టోబర్ 19న అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో శిక్షణ ఇచ్చిన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఏజెన్సీ నిర్వాహకుల వైఫల్యంపై కలెక్టర్ అహ్మద్ బాబు మండిపడ్డారు. పథక ం అమలు పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శించిన డీపీఎం(జాబ్స్) యాదగిరిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. ఇకపై పథకాన్ని తానే పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తానని హెచ్చరించారు. పస్తుతం కొనసాగుతున్న కేంద్రాల గడువు పూర్తయిన తర్వాత 15 మంది జిల్లా అధికారులతో ‘ప్రేరణ’ కమిటీ ఏర్పాటు చేసి శిక్షణతోపాటు ప్రతీ యువతీయువకుడికి ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ఐటీడీఏ పరిధిలో కొనసాగుతున్న మూడు కేంద్రాలు రద్దయ్యాయి. కలెక్టర్ మార్గదర్శకాలు అందిన వెంటనే మళ్లీ పునఃప్రారంభిస్తామని ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్(జాబ్స్) రాజ్‌కుమార్ తెలిపారు. -
నటుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కు అస్వస్థత!
కన్నడ నటుడు, నిర్మాత రాఘవేంద్ర రాజ్ కుమార్ అనారోగ్య కారణంతో ఆస్పత్రిలో చేరారు. రాఘవేంద్ర ప్రముఖ నటుడు, దివంగత రాజ్ కుమార్ కుమారుడు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించినట్టు సన్నిహితులు తెలిపారు. రాఘవేంద్ర రాజ్ కుమార్ బుధవారం ఉదయం 9.15 నిమిషాలకు ఆస్పత్రిలో చేర్పించారని..ఆయనకు చికిత్సనందిస్తున్నామని కొలంబియా ఆసియా ఆస్పత్రిలోని వైద్యులు డాక్టర్ మేధ హూల్గోల్ తెలిపారు. ఆస్పత్రిలో చేరిన రాఘవేంద్రకు వైద్యుల బృందం వెంటనే చికిత్సను అందించారని.. త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు. మెదడులో రక్తం గడ్గకట్టింది. వైద్యులు చికిత్స చేసి తొలగించారు అని రాఘవేంద్ర సోదరుడు శివరాజ్ కుమార్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం రాఘవేంద్ర పరిస్థితి మెరుగు పడిందని శివరాజ్ అన్నారు. ఉదయం జాగింగ్ చేస్తున్న సమయంలో అనారోగ్యానికి గురవ్వడంతో ఆస్పత్రికి తరలించామని శివరాజ్ తెలిపారు. -
‘జస్టిస్ చౌదరి’తో సంబంధం లేదు
‘‘ఇందులో నేను ద్విపాత్రాభినయంలో కనిపిస్తాను. సిగార్ పైప్ తాగుతూ దర్పాన్ని ప్రదర్శించే శంకర్ నారాయణ్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. చాలామంది జస్టిస్ చౌదరి గెటప్‌లా ఉందంటున్నారు. ఆ సినిమాతో ఎటువంటి సంబంధం లేదు. నేను బాలీవుడ్ నటుడు సంజీవ్ కుమార్ అభిమానిని. ‘త్రిశూల్’ సినిమాలో ఆయన గెటప్ అంటే చాలా ఇష్టం. ఆ సినిమా స్ఫూర్తితోనే ఈ గెటప్ వేశాను’’ అని రాజ్‌కుమార్ చెప్పారు. ఆయన కథానాయకుడిగా నృత్యదర్శకురాలు తార దర్శకత్వంలో రూపొందిన ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘సినిమాలతోనే తొలుత నా ప్రయాణం మొదలైంది. తర్వాత బుల్లితెరపై బిజీ అయ్యాను. అయినా సినిమాపై మక్కువ పోలేదు. అందుకే హీరోగా నా రీఎంట్రీని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాను’’ అని తెలిపారు. కథలో ప్రాధాన్యతను బట్టి కేరెక్టర్ ఆర్టిస్టుగా ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమని ఆయన వెల్లడించారు. -
‘విభజన’తో కేంద్రానికి ముప్పే
కొత్తపేట, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజనకు కట్టుబడితే కేంద్ర ప్రభుత్వానికి ముప్పు తప్పదని రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. తిరుపతిలో అలిపిరి ముఖద్వారం వద్ద నెలకొల్పనున్న టీటీడీ మాజీ చైర్మన్ దివంగత డి. ఆదికేశవులు నాయుడు కాంస్య విగ్రహం కొత్తపేటలో ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ శిల్పశాలలో రూపు దిద్దుకుంటోంది. తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనిని పరిశీలించేందుకు వెంకటరమణ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుతో కలిసి శనివారం ఇక్కడి శిల్పశాలకు వచ్చారు. ఈ సందర్భంగా రౌతు విలేకరులతో మాట్లాడుతూ ప్రముఖ శిల్పి రాజ్‌కుమార్ వుడయార్ రూపొందించిన విగ్రహాలతో రాజమండ్రిలో వుడయార్ ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. -
చౌహాన్‌ను వదలని లోకాయుక్త
న్యూఢిల్లీ: మంత్రి రాజ్‌కుమార్ చౌహాన్‌ను లోకాయుక్త గండం వీడేలా లేదు. పన్ను ఎగవేసిన ఓ రిసార్ట్‌ను రక్షించే ప్రయత్నం చేసిన మంత్రిని బర్త్ఫ్ రఫ్ చేయాల్సిందేనని లోకాయుక్త జస్టిస్ మన్మోహన్ సరీన్ మరోసారి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. మంత్రి ఆర్కే చౌహాన్‌ను కేబినెట్ నుంచి తొలగించేందుకు ఆదేశించాలంటూ తాను చేసిన సిఫార్సును రాష్ట్రపతి తిరస్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మరోమారు సమీక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లోకాయుక్త జస్టిస్ సరీన్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఒక లేఖ రాశారు. తన సిఫార్సును తిరస్కరిస్తూ పూర్వ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని లేదా తన నివేదికను ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఆయన ప్రణబ్‌కు విజ్ఞప్తి చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన మంత్రి చర్య తీవ్రమైనదని, అందువల్ల అతడిని దోషిగా పరిగణించి మంత్రిగా కొనసాగకుండా తొలగించేలా ఆదేశించాలని లోకాయుక్త ఫిబ్రవరి, 2011లో అప్పటి రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. ఈ సిఫార్సును ప్రతిభా పాటిల్ జూన్, 2011లో తిరస్కరించారు. రాష్ట్రపతి నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన లోకాయుక్త, నైతిక విలువలను అమలు చేసే విషయంలో ఇటువంటి ప్రతిబంధకాలు సామాన్యమేనని వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, ఇందుకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయమే నిదర్శనమని మంత్రి ఆర్కేచౌహాన్ స్పందించారు. లోకాయుక్త సిఫార్సును దేశ అత్యున్నత కార్యాలమే తిరస్కరించిందని, ఇక దానిపై తాను వ్యాఖ్యానించడానికి ఏమీ లేదని పేర్కొన్నారు. దక్షిణ ఢిల్లీలోని టివోలీగార్డెన్ రిసార్ట్‌లో సోదా చేసేందుకు వెళ్లిన వాణిజ్య పన్నుల బృందాన్ని మంత్రి బెదిరించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఫిబ్రవరి 20, 2010లో రిసార్ట్‌లో సోదాకు వెళ్లిన బృందానికి నాయకత్వం వహిస్తున్న వాణిజ్య పన్నుల కమిషనర్‌కు మంత్రి చౌహాన్ టెలిఫోన్ చేశారని లోకాయుక్త తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ప్రజా ప్రతినిధిగా ఉన్న తనకు ప్రజల నుంచి అనేక ఫోన్లు వస్తుంటాయని అలా వచ్చిన ఓ ఫోన్‌కు తాను స్పందించానని చౌహాన్ చెప్పారు. ఈ ఉదంతంపై ఓ నివేదిక ఇవ్వాలని కేంద్ర హోం శాఖ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఊహాజనితమైన భావన ఆధారంగా లోకాయుక్త సిఫార్సు చేశారంటూ ఢిల్లీ ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. అనంతరం హోం శాఖ నివేదిక మేరకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ లోకాయుక్త సిఫార్సును తిరస్కరించారు. -
బారిష్టర్ శంకర్‌నారాయణ్
‘‘తన వాగ్దాటితో ఎంతటివారినైనా బోల్తా కొట్టించగల న్యాయవాది శంకర్‌నారాయణ్. ఆయనో కేసు టేకప్ చేస్తే, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాల్సిందే. అలాంటి బారిష్టర్ జీవితంలో ఓ కేసు మూలంగా ఏర్పడిన మలుపులే ఈ సినిమా నేపథ్యం’’ అని దర్శకురాలు తార చెప్పారు. రాజ్‌కుమార్ హీరోగా నందవరం శ్రీ చౌడేశ్వరీ దేవీ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి రామారాజ్కుమార్ సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘బారిష్టర్ శంకర్‌నారాయణ్’. వచ్చే నెల 2న పాటల్ని విడుదల చేస్తున్నామని, ఈ సినిమా తనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందని రాజ్‌కుమార్ తెలిపారు. అలంగ్రిత, అలియా త్రివేది నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాకేత్, కెమెరా: ముప్పాళ్ల మహేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎల్.వేణుగోపాల్. -
తక్కువ ధరకు ఉపకరణాలు ఆఫర్ చేస్తాం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్ ఉపకరణాల విక్రయ రంగంలో ఉన్న బెంగ ళూరుకు చెందిన పాయ్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో ప్రవేశించింది. హైదరాబాద్‌లో రెండు శాంసంగ్ బ్రాండ్ స్టోర్లను ప్రారంభించిన ఈ సంస్థ డిసెంబరుకల్లా అయిదు మల్టీ బ్రాండ్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. దక్షిణాదిన ఎలక్ట్రానిక్ ఉపకరణాల అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉన్నందునే ఇక్కడ అడుగు పెట్టామని సంస్థ ఎండీ ఎస్.రాజ్‌కుమార్ పాయ్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. 13 ఏళ్లుగా కర్ణాటక కస్టమర్లకు నమ్మకమైన బ్రాండ్‌గా నిలిచామని చెప్పారు. వ్యవస్థీకృతరంగ ఔట్లెట్లతో పోలిస్తే తక్కువ ధరకు ఉపకరణాలను విక్రయిస్తున్నామని పేర్కొన్నారు. పండగ ఆఫర్లు పారదర్శకంగా అందిస్తామని అన్నారు. ధరలు మరింత పెరుగుతాయి.. రూపాయి పతనం కారణంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు మరో 8% దాకా పెరుగుతాయని రాజ్‌కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే ఉపకరణాన్నిబట్టి 20 శాతం దాకా హెచ్చాయని చెప్పారు. ఉత్పత్తుల అమ్మకాలు దేశవ్యాప్తంగా స్వల్పంగా తగ్గినా, పరిశ్రమ వృద్ధి 10 శాతం ఉంటుందని వివరించారు. పాయ్ ఇంటర్నేషనల్‌కు కర్ణాటకలో 56 ఔట్లెట్లు ఉన్నాయి. సెల్ఫోన్ల విక్రయానికై పాయ్ మొబైల్ స్టోర్లు 18 ఉన్నాయి. వచ్చే ఏడాది మొబైల్ స్టోర్లను హైదరాబాద్‌లోనూ నెలకొల్పనున్నారు. 2012-13లో పాయ్ ఇంటర్నేషనల్ రూ.511 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్లు అంచనా వేస్తోంది. రూ.40 వేల కోట్ల ఎలక్ట్రానిక్ ఉపకరణాల విపణిలో ఆంధ్రప్రదేశ్ వాటా 7.5 శాతముంది.