బైక్పై నుంచి పడి స్వల్పంగా గాయపడిన ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పరామర్శించారు.
ముంబయి: బైక్పై నుంచి పడి స్వల్పంగా గాయపడిన ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీని ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పరామర్శించారు. ఆ తర్వాత ఇంతకుముందే హిరానీని కలిశానని, ఆయన బానే ఉన్నారని, సాయంత్ర డిశ్చార్జి అవుతారని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ముంబైలో మంగళవారం ఉదయం ఆయన బైక్ పై నుంచి కింద పడడంతో హీరాని గాయపడ్డారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని అదుపు చేయలేక కిందిపడినట్టు సమాచారం. ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు.