ప్రేక్షకులు నాతో మాట్లాడతారు
ప్రేక్షకులు నాతో మాట్లాడతారు
Published Wed, Dec 4 2013 4:38 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
ప్రేక్షకులు తనతో నేరుగా మాట్లాడతారని బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా పేర్కొంది. ‘మీతో సంభాషించే సమయంలో సలాడ్ తింటే ఏమీ అనుకోరుగదా’ అని కాస్తంత మొహమాటంగా మీడియాని అడిగింది. రాంబో రాజ్‌కుమార్ సినిమా ప్రమోషన్‌కోసం నగరంలో రోజంతా గడిపిన సోనాక్షి... దేశరాజధాని నగరంలో జరగనున్న ప్రమోషన్ ఈవెంట్లకు హాజరయ్యేందుకు సన్నద్ధమవుతోంది. ‘రాంబో రాజ్‌కుమార్ సినిమా విడుదల నన్ను ఎంతో ఉత్తేజానికి లోనుచేసింది. ‘ఇది హాస్యప్రధాన చిత్రం. ప్రభుదేవాతో కలసి చేయడం ఇది రెండోసారి. తొలిసారి రౌడీ రాథోడ్‌లో ప్రభుదేవాతో నటించా. ప్రతి సినిమాతోనూ మా బంధం బలపడుతోంది.
ఆయనతో కలసి పనిచేస్తున్నందుకు నేను ఇలా మాట్లాడడం లేదు. ఓ ప్రేక్షకురాలిగా ఈ సినిమాలను నేను సైతం ఆస్వాదిస్తా. చిత్రనిర్మాణంలో ఆయన శైలి ఆయనదే’ అని అంది. ఇదిలాఉంచితే ప్రభుదేవా దర్శకత్వ శైలి, సోనాక్షిని రాంబో రాజ్‌కుమార్ సినిమాలో చూపించిన తీరు రౌడీ రాథోడ్‌ను మరిపిస్తుంది. ‘రాంబో రాజ్‌కుమార్ సినిమా కథనం భిన్నంగా ఉంటుంది. రౌడీ రాథోడ్ సినిమాకు దీనికి ఎటువంటి పొంతనా లేదు. ఈ రెండు సినిమాల్లో కథానాయకలు వేర్వేరు. వాళ్ల చుట్టూ అల్లిన కథ కూడా విభిన్నంగానే ఉంటుంది’ అని సలాడ్ కప్పువైపు చూస్తూ చెప్పింది.
‘ఈ మసాలా సినిమాల్లో నటించడానికి కారణం వాటిని వ్యక్తిగతంగా చూసి ఆనందించ డమే. సినిమా చూసే సమయంలో అందరి మాదిరిగానే నేను కూడా బిగ్గరగా అరుస్తుంటా. ఇష్టమైన సినిమాలు చూస్తూ ఆనంద తాండవం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి’ అని తన మనసులో మాట తెలియజేసింది. కేవలం డబ్బు సంపాదన కోసం సినిమాలు చేయడం లేదంది. 40 ఏళ్లు దాటిన తర్వాత తాను నటించిన సినిమాలు చూస్తూ కాలం గడ పాలనుకుంటున్నానంటూ ముగించింది.
Advertisement
Advertisement