Rowdy Rathore
-
లాగి లెంపకాయ కొట్టిన సింగర్
ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగే పాటల వేడుక వివాదానికి వేదికగా మారడమంటే ఇదే! ఆవేశాన్ని అదుపు చేసుకోకపోతే, ఆనక అనవసరమైన తలనొప్పులు తప్పవని ప్రముఖ పంజాబీ గాయకుడు, గీత రచయిత, కంపోజర్ మికా సింగ్‌కు ఇప్పుడు తెలిసొచ్చినట్లుంది. నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఒక సంగీత విభావరిలో ప్రేక్షకులలో ఉన్న ఒక డాక్టర్‌ను లాగి లెంపకాయ కొట్టిన ఈ ప్రముఖ గాయకుడు ఇప్పుడు పోలీసు కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘ఢింక చిక...’ (హిందీ చిత్రం - ‘రెడీ’), ‘చింతా తా చిత చితా...’ (హిందీ చిత్రం - ‘రౌడీ రాథోడ్’) లాంటి మాస్పాటలతో దేశాన్ని ఉర్రూతలూపిన మికా సింగ్ మాత్రం తాను అంతలా సహనం కోల్పోవడం వెనుక కారణం ఉందంటున్నారు. తాగి వచ్చిన సదరు డాక్టర్ తాను ఎన్నిసార్లు చెప్పినా ఆ విభావరిని చూడడానికి వచ్చిన ఆడవారికీ, పిల్లలకూ జాగా ఇవ్వలేదనీ, పైగా చేతి మధ్యవేలును పైకి ఎత్తి, అసభ్యమైన సైగలు చేశారనీ ఆరోపిస్తున్నారు. ‘‘వేదిక మీదకు పిలిచి మరీ ‘మీ ఇంట్లో వాళ్ళ ముందు అలాగే అసభ్యమైన సైగలు చేస్తావా’ అని మందలించాను. తాగేసి ఉన్న అతను మళ్ళీ అలాగే సైగలు చేయడంతో ఒక లెంపకాయ ఇచ్చాను’’ అని మికా సింగ్ తన ప్రవర్తనను సమర్థించుకున్నారు. తెలుగులో కూడా ‘బలుపు’ (పాపులర్ పాట ‘పాతికేళ్ళ చిన్నది...’), ‘అదుర్స్’ (‘పిల్లా నా వల్ల కాదు...’ పాట), ‘మిర్చి’ (‘యాహూ.. యాహూ...’ పాట) లాంటి పాటలతో ఆకట్టుకున్న ఈ గాయకుడు ఇప్పుడు పాట కన్నా తన ప్రవర్తనతో వార్తల్లోకి ఎక్కడం విచిత్రమే. చెంపదెబ్బ తిన్న డాక్టర్ మాత్రం మికా సింగ్ తనను పక్కకు తప్పుకొమ్మంటూ అసభ్యకరంగా చెప్పారనీ, బౌన్సర్ల ద్వారా తనను వేదిక మీదకు తెప్పించి, తన మాట వినలేదంటూ కొట్టారనీ ప్రత్యారోపణ చేస్తున్నారు. మొత్తానికి, ఢిల్లీలోని నేత్ర వైద్యుల సంఘం ఆనందం కోసం ఏర్పాటుచేసుకున్న విభావరి చివరకు ఆవేశకావేశాలకు వేదికైందన్న మాట. -
గుండె లోతుల్లో నుంచి అనిపిస్తేనే...
హిందీ చలనచిత్ర సీమలో ఇటీవల అందరినీ ఆకర్షిస్తున్న నటి - సోనాక్షీ సిన్హా. ఇప్పటి వరకు ఆమె నటించిన చిత్రాల్లో వంద కోట్ల వసూళ్ళు సాధించిన ‘మసాలా’ సినిమాలు అనేకం. సల్మాన్ ఖాన్ ‘దబంగ్’ (తెలుగు ‘గబ్బర్ సింగ్’కు మాతృక)తో సినీ రంగానికి వచ్చిన ఆమె ఆ తరువాత వరుసగా ‘రౌడీ రాథోడ్’, ‘బుల్లెట్ రాజా’, ‘ఆర్... రాజ్‌కుమార్’, ‘దబంగ్ 2’, ‘సన్ ఆఫ్ సర్దార్’ చిత్రాల్లో అలరించారు. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చే నెల మొదటి వారంలో రానున్న ‘హాలీడే - ఎ సోల్జర్ ఈజ్ నెవర్ ఆఫ్ డ్యూటీ’ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన ఆమె కనిపించనున్నారు. ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హాకు కుమార్తె అయిన సోనాక్షి అదృష్టం ఇప్పుడు ఎంతలా ఉందంటే, ఆమె ఏ సినిమాలో నటిస్తే అది వసూళ్ళ వాన కురిపిస్తోంది. ఇక, ఆమె ఇమేజ్ ఎంత వరకు పాకిందంటే, చివరకు కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రజనీకాంత్ కొత్త సినిమా ‘లింగ’లో కూడా ఆమెనే హీరోయిన్గా తీసుకున్నారు. బాక్సాఫీస్ వసూళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టే సినీ రంగంలో సోనాక్షీ సిన్హా ఇప్పుడు అభినయ ప్రధాన చిత్రాల వైపు మొగ్గుచూపుతున్నారు. ‘‘ఓ పక్కన వంద కోట్లు వసూలు చేసే భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూనే, మరో పక్కన ‘లూటేరా’ లాంటి అభినయ ప్రధాన చిత్రాలు చేయాలని ఉంది. ఈ రెంటికీ మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నా’’ అని సోనాక్షి తన మనసులో మాట వెల్లడించారు. ‘‘నా మటుకు నాకు ‘లూటేరా’ లాంటి మరిన్ని సినిమాల్లో నటించాలని ఉంది. కానీ, అలాంటి సమగ్రమైన స్క్రిప్టులు చాలా అరుదుగా వస్తాయి. అందుకే, ఇప్పుడు ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నా. స్క్రిప్టు వినగానే, ఈ సినిమా చేయాలని నా గుండె లోతుల్లో నుంచి అనిపిస్తేనే, ఓకే చెబుతున్నా’’ అని ఆమె వివరించారు. ‘‘అలాగని మసాలా సినిమాలంటే నాకు ద్వేషమేమీ లేదు. వాటిని చూడడమన్నా, అందులో నటించడమన్నా ఇష్టమే. కాకపోతే, వాటికీ, అభినయ ప్రధాన చిత్రాలకూ మధ్య సమతూకం పాటించాలనే నా తపన’’ అన్నారామె. రానున్న ‘హాలీడే’ చిత్రంలో పట్టణ ప్రాంత కాలేజీ అమ్మాయిగా నటిస్తున్న ఆమె... కథలో భాగంగా బాక్సర్‌గా కనిపిస్తారు. బడిలో చదువుకొనే రోజుల నుంచి ఆటలన్నా, అందులోనూ బాక్సింగ్ క్రీడ అన్నా ఇష్టమైన సోనాక్షి ఈ సీరియస్ థ్రిల్లింగ్ చిత్రంలోని తన పాత్ర మనసుకు ఎంతో నచ్చిందన్నారు. అన్నట్లు ఈ పాత్రపోషణ కోసం ప్రముఖ భారతీయ బాక్సింగ్ యోధుడు విజేందర్ సింగ్ నుంచి కొన్ని మెలకువలు కూడా నేర్చుకున్నారు. ఆ సంగతి ఆమె ఆనందంగా చెప్పారు. ఎంతైనా... మనసుకు నచ్చిన పాత్ర, సినిమా వస్తే ఏ నటికైనా, నటుడికైనా అంతకన్నా ఇంకేం కావాలి! -
రెండూ ముఖ్యమే
దబంగ్, రౌడీ రాథోడ్ లాంటి మసాలా సినిమాలతోపాటు నటనకు ఎక్కువ అవకాశం ఉండే లుటేరా వంటి సినిమాలూ తనకు ముఖ్యమేనని సోనాక్షి సిన్హా చెబుతోంది. సల్మాన్ సినిమా దబంగ్‌తో బాలీవుడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె తదనంతరం రౌడీ రాథోడ్, బుల్లెట్‌రాజా, ఆర్..రాజ్‌కుమార్, దబంగ్ 2, సన్ ఆఫ్ సర్దార్ వంటి సినిమాల్లో కనిపించింది. వీటిలో చాలా సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న హాలిడే సోనాక్షి తాజా సినిమా. ‘లుటేరా వంటివి మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ఇలాంటి మంచి స్క్రిప్టు ఉన్నవి చాలా తక్కువగా వస్తాయి. మసాలా సినిమాలను కూడా నేను బాగా ఇష్టపడతాను. ఇలాంటి వాటిలో నటించేందుకు అభ్యంతరం ఏమీ లేదు. ఈ రెండు రకాల సినిమాల మధ్య సమతౌల్యం పాటిస్తాను. కథ ఎంపికలో మనసు చెప్పిందే చేస్తాను. వద్దనుకుంటే తిరస్కరించడానికి వెనుకాడను’ అని చెప్పింది. ఇక హాలీడేలో సోనాక్షి ఆధునిక కాలేజీ యువతిగా కనిపిస్తుంది. తమిళ దర్శకుడు మురుగదాస్ తీసిన ఈ సినిమా వచ్చే నెల ఆరున థియేటర్లకు వస్తుంది. ఇందులో పాత్ర తన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని, క్రీడాకారిణిగానూ కనిపిస్తానని ఈ బ్యూటీ చెప్పింది. స్కూలు వయసులో చాలా ఆటలు ఆడేదానినని , ఇందులో బాక్సర్ స్టూడెంట్‌గా కనిపిస్తానని తెలిపింది. ఉగ్రవాదం చుట్టూ తిరిగే ఈ సినిమాలో తన పాత్ర ఎంతో సరదాగా ఉంటుందని చెప్పింది. ‘సెలవుల కోసం ఇంటికి వచ్చిన సైనికుడిగా కొన్ని అక్రమాల గురించి తెలుస్తుంది. ప్రాణాలకు తెగించి ఆ సమస్యను పరిష్కరిస్తాడు. హీరోయిన్ బాక్సింగ్ చేయాలి కాబట్టి ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ దగ్గర కొంచెం సాధన కూడా చేశాను. నగర జీవితం నాకు అలవాటే కాబట్టి కాలేజీ యువతి పాత్ర చేయడం పెద్దగా కష్టం అనిపించలేదు’ అని సోనాక్షి సిన్హా వివరించింది. -
రెండూ ముఖ్యమే
ముంబై: దబంగ్, రౌడీ రాథోడ్ లాంటి మసాలా సినిమాలతోపాటు నటనకు ఎక్కువ అవకాశం ఉండే లుటేరా వంటి సినిమాలూ తనకు ముఖ్యమేనని సోనాక్షి సిన్హా చెబుతోంది. సల్మాన్ సినిమా దబంగ్‌తో బాలీవుడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె తదనంతరం రౌడీ రాథోడ్, బుల్లెట్‌రాజా, ఆర్..రాజ్‌కుమార్, దబంగ్ 2, సన్ ఆఫ్ సర్దార్ వంటి సినిమాల్లో కనిపించింది. వీటిలో చాలా సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న హాలిడే సోనాక్షి తాజా సినిమా. ‘లుటేరా వంటివి మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ఇలాంటి మంచి స్క్రిప్టు ఉన్నవి చాలా తక్కువగా వస్తాయి. మసాలా సినిమాలను కూడా నేను బాగా ఇష్టపడతాను. ఇలాంటి వాటిలో నటించేందుకు అభ్యంతరం ఏమీ లేదు. ఈ రెండు రకాల సినిమాల మధ్య సమతౌల్యం పాటిస్తాను. కథ ఎంపికలో మనసు చెప్పిందే చేస్తాను. వద్దనుకుంటే తిరస్కరించడానికి వెనుకాడను’ అని చెప్పింది. ఇక హాలీడేలో సోనాక్షి ఆధునిక కాలేజీ యువతిగా కనిపిస్తుంది. తమిళ దర్శకుడు మురుగదాస్ తీసిన ఈ సినిమా వచ్చే నెల ఆరున థియేటర్లకు వస్తుంది. ఇందులో పాత్ర తన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని, క్రీడాకారిణిగానూ కనిపిస్తానని ఈ బ్యూటీ చెప్పింది. స్కూలు వయసులో చాలా ఆటలు ఆడేదానినని , ఇందులో బాక్సర్ స్టూడెంట్‌గా కనిపిస్తానని తెలిపింది. ఉగ్రవాదం చుట్టూ తిరిగే ఈ సినిమాలో తన పాత్ర ఎంతో సరదాగా ఉంటుందని చెప్పింది. ‘సెలవుల కోసం ఇంటికి వచ్చిన సైనికుడిగా కొన్ని అక్రమాల గురించి తెలుస్తుంది. ప్రాణాలకు తెగించి ఆ సమస్యను పరిష్కరిస్తాడు. హీరోయిన్ బాక్సింగ్ చేయాలి కాబట్టి ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ దగ్గర కొంచెం సాధన కూడా చేశాను. నగర జీవితం నాకు అలవాటే కాబట్టి కాలేజీ యువతి పాత్ర చేయడం పెద్దగా కష్టం అనిపించలేదు’ అని సోనాక్షి సిన్హా వివరించింది. -
ప్రేక్షకులు నాతో మాట్లాడతారు
ప్రేక్షకులు తనతో నేరుగా మాట్లాడతారని బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా పేర్కొంది. ‘మీతో సంభాషించే సమయంలో సలాడ్ తింటే ఏమీ అనుకోరుగదా’ అని కాస్తంత మొహమాటంగా మీడియాని అడిగింది. రాంబో రాజ్‌కుమార్ సినిమా ప్రమోషన్కోసం నగరంలో రోజంతా గడిపిన సోనాక్షి... దేశరాజధాని నగరంలో జరగనున్న ప్రమోషన్ ఈవెంట్లకు హాజరయ్యేందుకు సన్నద్ధమవుతోంది. ‘రాంబో రాజ్‌కుమార్ సినిమా విడుదల నన్ను ఎంతో ఉత్తేజానికి లోనుచేసింది. ‘ఇది హాస్యప్రధాన చిత్రం. ప్రభుదేవాతో కలసి చేయడం ఇది రెండోసారి. తొలిసారి రౌడీ రాథోడ్‌లో ప్రభుదేవాతో నటించా. ప్రతి సినిమాతోనూ మా బంధం బలపడుతోంది. ఆయనతో కలసి పనిచేస్తున్నందుకు నేను ఇలా మాట్లాడడం లేదు. ఓ ప్రేక్షకురాలిగా ఈ సినిమాలను నేను సైతం ఆస్వాదిస్తా. చిత్రనిర్మాణంలో ఆయన శైలి ఆయనదే’ అని అంది. ఇదిలాఉంచితే ప్రభుదేవా దర్శకత్వ శైలి, సోనాక్షిని రాంబో రాజ్‌కుమార్ సినిమాలో చూపించిన తీరు రౌడీ రాథోడ్‌ను మరిపిస్తుంది. ‘రాంబో రాజ్‌కుమార్ సినిమా కథనం భిన్నంగా ఉంటుంది. రౌడీ రాథోడ్ సినిమాకు దీనికి ఎటువంటి పొంతనా లేదు. ఈ రెండు సినిమాల్లో కథానాయకలు వేర్వేరు. వాళ్ల చుట్టూ అల్లిన కథ కూడా విభిన్నంగానే ఉంటుంది’ అని సలాడ్ కప్పువైపు చూస్తూ చెప్పింది. ‘ఈ మసాలా సినిమాల్లో నటించడానికి కారణం వాటిని వ్యక్తిగతంగా చూసి ఆనందించ డమే. సినిమా చూసే సమయంలో అందరి మాదిరిగానే నేను కూడా బిగ్గరగా అరుస్తుంటా. ఇష్టమైన సినిమాలు చూస్తూ ఆనంద తాండవం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి’ అని తన మనసులో మాట తెలియజేసింది. కేవలం డబ్బు సంపాదన కోసం సినిమాలు చేయడం లేదంది. 40 ఏళ్లు దాటిన తర్వాత తాను నటించిన సినిమాలు చూస్తూ కాలం గడ పాలనుకుంటున్నానంటూ ముగించింది. -
ఆ ఇద్దరితో కెమిస్ట్రి అదిరింది: సోనాక్షి సిన్హా
సినిమాల ఎంపికలో తనకు ప్రణాళికలు లేవు అని బాలీవుడ్ తార సోనాక్షి సిన్హా తెలిపింది. 'దేనికైనా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోను. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్నే ఎంపిక చేసుకుంటాను. కథ వినేటప్పడు థియేటర్లలో చప్పట్లు కొడతారని, విజిల్స్ మోగుతాయని అనిపిస్తే దాన్ని ఎంపిక చేసుకుంటాను'. అని సోనాక్షి తెలిపింది. లుటేరా చిత్రం తర్వాత వస్తున్న 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దుబారా' తనకు ఫర్ ఫెక్ట్ చిత్రం అని అన్నారు. వన్స్ అపాన్ ఏ టైమ్.. చిత్రంలో తాను జాస్మిన్ పాత్ర పోషిస్తున్నానను. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ ఖాన్ ల క్యారెక్టర్స్ తో తన కెమిస్ట్రి అదిరిందని వెల్లడించారు. ఆ ఇద్దరితో నటించడం తను చాలెంజ్ గా నిలిచింది అన్నారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు మిలన్ లుథ్రియా. ఆగస్టు 15 తేదిన విడుదల అవుతున్న ఈ చిత్రంలో సొనాలీ బింద్రా మళ్లీ కనిపించనుంది.