ఆ ఇద్దరితో కెమిస్ట్రి అదిరింది: సోనాక్షి సిన్హా
ఆ ఇద్దరితో కెమిస్ట్రి అదిరింది: సోనాక్షి సిన్హా
Published Mon, Aug 12 2013 9:44 PM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
సినిమాల ఎంపికలో తనకు ప్రణాళికలు లేవు అని బాలీవుడ్ తార సోనాక్షి సిన్హా తెలిపింది. 'దేనికైనా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోను. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్నే ఎంపిక చేసుకుంటాను. కథ వినేటప్పడు థియేటర్లలో చప్పట్లు కొడతారని, విజిల్స్ మోగుతాయని అనిపిస్తే దాన్ని ఎంపిక చేసుకుంటాను'. అని సోనాక్షి తెలిపింది. లుటేరా చిత్రం తర్వాత వస్తున్న 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దుబారా' తనకు ఫర్ ఫెక్ట్ చిత్రం అని అన్నారు.
వన్స్ అపాన్ ఏ టైమ్.. చిత్రంలో తాను జాస్మిన్ పాత్ర పోషిస్తున్నానను. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ ఖాన్ ల క్యారెక్టర్స్ తో తన కెమిస్ట్రి అదిరిందని వెల్లడించారు. ఆ ఇద్దరితో నటించడం తను చాలెంజ్ గా నిలిచింది అన్నారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు మిలన్ లుథ్రియా. ఆగస్టు 15 తేదిన విడుదల అవుతున్న ఈ చిత్రంలో సొనాలీ బింద్రా మళ్లీ కనిపించనుంది.
Advertisement
Advertisement