Lootera
-
బుక్... లక్!
‘అమ్మాయి.. నువ్వు పుస్తకాలు చదివితే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది’... నాలుగైదేళ్ల క్రితం సోనాక్షీ సిన్హాకు ఓ పెద్ద జ్యోతిష్కుడు ఇచ్చిన సలహా ఇది. వెంటనే ఈ బ్యూటీ బోల్డన్ని పుస్తకాలు కొన్నారేమో అనుకుంటున్నారా? అదేం లేదు. సోనాక్షి ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ, ఈ మధ్య ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయట. ఆ విషయం గురించి సోనాక్షీ మాట్లాడుతూ – ‘‘నేను జాతకాలను నమ్మను. ఆ జ్యోతిష్కుడు నన్ను బుక్స్ చదవమన్నా చదవలేదు. విచిత్రం ఏంటంటే.. మూడేళ్ల క్రితం నేను చేసిన ‘లుటేరా’ రచయిత ఒ. హెన్రీ రాసిన కథ ఆధారంగా తీసినది. ఈ నెలలో విడుదలకు సిద్ధమవుతున్న ‘నూర్’ సబా ఇంతియాజ్ రాసిన నవల ఆధారంగా తీసిన చిత్రం. ‘లుటేరా’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు మంచి విజయం సాధించింది. ‘నూర్’ ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. సినిమా కూడా హిట్టవుతుంది. ఈ ఆరేళ్లల్లో నేను 20కి పైగా సినిమాలు చేస్తే, వాటిలో ‘లుటేరా’, ‘నూర్’ నా హార్ట్‌కి బాగా దగ్గరయ్యాయి. సో.. పుస్తకాలకూ, నాకూ నిజంగానే ఏదైనా కనెక్షన్ ఉండి ఉంటుందా? ఆ జ్యోతిష్కుడు చెప్పినట్లు పుస్తకాలు నాకు కలిసొస్తాయా? ఏమో.. ఇలాంటివాటి మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. ఏదో యాదృచ్ఛికంగా జరిగిందనిపిస్తోంది’’ అన్నారు. -
రెండూ ముఖ్యమే
దబంగ్, రౌడీ రాథోడ్ లాంటి మసాలా సినిమాలతోపాటు నటనకు ఎక్కువ అవకాశం ఉండే లుటేరా వంటి సినిమాలూ తనకు ముఖ్యమేనని సోనాక్షి సిన్హా చెబుతోంది. సల్మాన్ సినిమా దబంగ్‌తో బాలీవుడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈమె తదనంతరం రౌడీ రాథోడ్, బుల్లెట్‌రాజా, ఆర్..రాజ్‌కుమార్, దబంగ్ 2, సన్ ఆఫ్ సర్దార్ వంటి సినిమాల్లో కనిపించింది. వీటిలో చాలా సినిమాలు రూ.100 కోట్ల క్లబ్లో చేరాయి. అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న హాలిడే సోనాక్షి తాజా సినిమా. ‘లుటేరా వంటివి మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. ఇలాంటి మంచి స్క్రిప్టు ఉన్నవి చాలా తక్కువగా వస్తాయి. మసాలా సినిమాలను కూడా నేను బాగా ఇష్టపడతాను. ఇలాంటి వాటిలో నటించేందుకు అభ్యంతరం ఏమీ లేదు. ఈ రెండు రకాల సినిమాల మధ్య సమతౌల్యం పాటిస్తాను. కథ ఎంపికలో మనసు చెప్పిందే చేస్తాను. వద్దనుకుంటే తిరస్కరించడానికి వెనుకాడను’ అని చెప్పింది. ఇక హాలీడేలో సోనాక్షి ఆధునిక కాలేజీ యువతిగా కనిపిస్తుంది. తమిళ దర్శకుడు మురుగదాస్ తీసిన ఈ సినిమా వచ్చే నెల ఆరున థియేటర్లకు వస్తుంది. ఇందులో పాత్ర తన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందని, క్రీడాకారిణిగానూ కనిపిస్తానని ఈ బ్యూటీ చెప్పింది. స్కూలు వయసులో చాలా ఆటలు ఆడేదానినని , ఇందులో బాక్సర్ స్టూడెంట్‌గా కనిపిస్తానని తెలిపింది. ఉగ్రవాదం చుట్టూ తిరిగే ఈ సినిమాలో తన పాత్ర ఎంతో సరదాగా ఉంటుందని చెప్పింది. ‘సెలవుల కోసం ఇంటికి వచ్చిన సైనికుడిగా కొన్ని అక్రమాల గురించి తెలుస్తుంది. ప్రాణాలకు తెగించి ఆ సమస్యను పరిష్కరిస్తాడు. హీరోయిన్ బాక్సింగ్ చేయాలి కాబట్టి ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ దగ్గర కొంచెం సాధన కూడా చేశాను. నగర జీవితం నాకు అలవాటే కాబట్టి కాలేజీ యువతి పాత్ర చేయడం పెద్దగా కష్టం అనిపించలేదు’ అని సోనాక్షి సిన్హా వివరించింది. -
రణవీర్‌తో లిప్‌లాక్‌కు సోనాక్షి నో!
బికినీ, లిప్‌లాక్... బాలీవుడ్లో ఈ రెండూ కామన్. వీటికి ‘సై’ అనని కథానాయికలు అక్కడ నిజంగా అరుదే. కానీ... శత్రుఘ్నసిన్హా తనయ సోనాక్షి సిన్హా కేవలం వీటి కారణంగా ఓ భారీ సినిమానే తృణప్రాయంగా వదిలేశారట. ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశమైన విషయం ఇది. ఇంతకీ సోనాక్షి తిరస్కరించిన ఆ సినిమా ఏంటనుకుంటున్నారా? విషయం ఏంటంటే... ‘రామ్‌లీలా’తో స్టార్‌స్టేటస్ సొంతం చేసుకున్న రణవీర్‌సింగ్ హీరోగా ‘లుటేరా’ దర్శకుడు విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఇందులో నాయికగా ముందు సోనాక్షిని అనుకున్నారు. అయితే... కథ రీత్యా బికినీ ధరించాల్సిఉంది. అలాగే... ఓ లిప్‌లాక్ కూడా ఉంది. ఈ విషయాలను తెలుసుకున్న సోనాక్షి నిర్మొహమాటంగా ఆ సినిమా చేయనని చెప్పాశారట. అయితే, సోనాక్షి ఈ సినిమాను కాదనడానికి అసలు కారణం ఇది కాదని మరో వాదన కూడా ఉంది. ఇటీవల రిలీజైన ‘రామ్‌లీలా’ చిత్రంలో తొలుత సోనాక్షి పేరును సంజయ్‌లీలా భన్సాలీ పరిశీలనలోకి తీసుకున్నారట. అయితే... దీపికా పదుకొనే వైపు రణవీర్ మొగ్గుచూపడంతో ఆ చిత్రంలో నటించే అవకాశం సోనాక్షికి మిస్ అయినట్టు సమాచారం. అందుకే టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగా రణవీర్‌కి ‘నో’ చెప్పారట సోనాక్షి. -
పార్టీ, పబ్ లకు వెళ్లేంత తీరికెక్కడిది: సోనాక్షి
'దబాంగ్', 'రౌడీ రాథోడ్', 'లుటేరా', తాజా 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దుబారా' చిత్రాలతో సోనాక్షి సిన్హా బాలీవుడ్ హీరోయిన్ల టాప్ జాబితాలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. తన కేరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ.. రూమర్లకు, సహచర నటులతో ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటంలో సోనాక్షి సిన్హా తగిన చర్యలు జాగ్రత్తగానే తీసుకుంటోంది. రూమర్లకు, సెన్సెషనల్ వార్తలకు ఎలా దూరం ఉంటున్నారనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ... పబ్, ఫార్టీలకు వెళ్లను. నాకు ప్రైవేట్ జీవితం గడపడమే ఇష్టం. అంతేకాక నిజంగా చెప్పాలంటే నాకు సమయం లేదు అని అన్నారు. నాకు షూటింగ్ లతోనే సమయం గడిచిపోతుంటే.. పార్టీ, పబ్ లకు వెళ్లే తీరిక ఎక్కడుంటుంది అని సోనాక్షి సిన్హా ప్రశ్నించింది. అంతేకాక అసభ్యకరమైన పాత్రలను తనకు ఎవరూ కూడా ఇప్పటి వరకు ఆఫర్ చేయలేదని.. తనకు ఎలాంటి పాత్రలు సరిపోతాయో సినీ నిర్మాతలకు తెలుసునని సోనాక్షి తెలిపింది. -
మా కుటుంబాన్ని లాగొద్దు! - సోనాక్షి సిన్హా
న్యూఢిల్లీ: ‘మీ ప్రయోజనాల కోసం నా గురించి ఏమైనా రాసుకోండి. కానీ నా కుటుంబాన్ని మాత్రం వివాదాల్లోకి లాగొద్దు. ఒకవేళ అదే జరిగితే నేను కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంద’ని మీడియాకు వార్నింగ్ ఇచ్చింది నటి సోనాక్షి సిన్హా. ‘లుటేరా’ సినిమా షూటింగ్ జరుగుతుండగా సోనాక్షి తల్లి పూనమ్ సిన్హా సెట్స్‌లోకి వచ్చిందని, ఆ సమయంలో రణ్వీర్ సింగ్‌తో చిత్రీకరిస్తున్న పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నానా హంగామా చేసిందనే కథనాలు మీడియాలో ప్రసారం కావడంపై స్పందిస్తూ సోనాక్షి ఇలా వార్నింగ్ ఇచ్చింది. ‘సినిమాల ఎంపికలో మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ జోక్యం చేసుకోరు. ఆ విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎందుకంటే వారికి నాపై పూర్తి నమ్మకముంది. షూటింగ్ స్పాట్‌కు మా అమ్మ వచ్చిందని, చిత్రీకరిస్తున్న సన్నివేశాలపట్ల అభ్యంతరం చెప్పిందంటూ మీడియాలో వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలే. మా అమ్మ షూటింగ్ స్పాట్‌కు వచ్చేది కేవలం నాకు తినిపించేందుకే. అంతేతప్ప సినిమా విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోదు. చిత్ర దర్శకుడు విక్రమాదిత్య మోత్వానేతో కూడా అమ్మ చాలా సన్నిహితంగా ఉంటుంది. చిత్ర బృందమంతా అమ్మను ఇష్టపడతారు. సినిమా కోసం సంతకాలు చేసేముందే కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుంటాను. తుది నిర్ణయం నాదే అయినప్పటికీ వారిని అలా అడగడం నాకు అలవాటు. ఇప్పటిదాకా నా ఇష్టాన్ని వారెప్పుడూ కాదనలేదు. వారికి ఇబ్బంది పెట్టే పనులేవీ నేను చేయలేదు. అయినప్పటికీ సొంత ప్రయోజనాల కోసం ఇలాంటి లేనిపోని కథనాలు రాస్తున్నారు. కావాలంటే నా పేరును వాడుకోండి. అంతేగానీ నా కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగితే అందుకు వ్యతిరేకంగా నేను వ్యవహరించవలసి ఉంటుంద’ని పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పింది సోనమ్. -
ఆ ఇద్దరితో కెమిస్ట్రి అదిరింది: సోనాక్షి సిన్హా
సినిమాల ఎంపికలో తనకు ప్రణాళికలు లేవు అని బాలీవుడ్ తార సోనాక్షి సిన్హా తెలిపింది. 'దేనికైనా ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోను. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్నే ఎంపిక చేసుకుంటాను. కథ వినేటప్పడు థియేటర్లలో చప్పట్లు కొడతారని, విజిల్స్ మోగుతాయని అనిపిస్తే దాన్ని ఎంపిక చేసుకుంటాను'. అని సోనాక్షి తెలిపింది. లుటేరా చిత్రం తర్వాత వస్తున్న 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దుబారా' తనకు ఫర్ ఫెక్ట్ చిత్రం అని అన్నారు. వన్స్ అపాన్ ఏ టైమ్.. చిత్రంలో తాను జాస్మిన్ పాత్ర పోషిస్తున్నానను. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ ఖాన్ ల క్యారెక్టర్స్ తో తన కెమిస్ట్రి అదిరిందని వెల్లడించారు. ఆ ఇద్దరితో నటించడం తను చాలెంజ్ గా నిలిచింది అన్నారు. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు మిలన్ లుథ్రియా. ఆగస్టు 15 తేదిన విడుదల అవుతున్న ఈ చిత్రంలో సొనాలీ బింద్రా మళ్లీ కనిపించనుంది.