రణవీర్‌తో లిప్‌లాక్‌కు సోనాక్షి నో! | Sonakshi Sinha refuses to wear bikini ever | Sakshi
Sakshi News home page

రణవీర్‌తో లిప్‌లాక్‌కు సోనాక్షి నో!

Published Fri, Dec 27 2013 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

రణవీర్‌తో లిప్‌లాక్‌కు సోనాక్షి నో!

రణవీర్‌తో లిప్‌లాక్‌కు సోనాక్షి నో!

బికినీ, లిప్‌లాక్... బాలీవుడ్‌లో ఈ రెండూ కామన్. వీటికి ‘సై’ అనని కథానాయికలు అక్కడ నిజంగా అరుదే. కానీ... శత్రుఘ్నసిన్హా తనయ సోనాక్షి సిన్హా కేవలం వీటి కారణంగా ఓ భారీ సినిమానే తృణప్రాయంగా వదిలేశారట. ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైన విషయం ఇది. ఇంతకీ సోనాక్షి తిరస్కరించిన ఆ సినిమా ఏంటనుకుంటున్నారా? విషయం ఏంటంటే... ‘రామ్‌లీలా’తో స్టార్‌స్టేటస్ సొంతం చేసుకున్న రణవీర్‌సింగ్ హీరోగా ‘లుటేరా’ దర్శకుడు విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. 
 
ఇందులో  నాయికగా ముందు సోనాక్షిని అనుకున్నారు. అయితే... కథ రీత్యా బికినీ ధరించాల్సిఉంది. అలాగే... ఓ లిప్‌లాక్ కూడా ఉంది. ఈ విషయాలను తెలుసుకున్న సోనాక్షి నిర్మొహమాటంగా ఆ సినిమా చేయనని చెప్పాశారట. అయితే, సోనాక్షి ఈ సినిమాను కాదనడానికి అసలు కారణం ఇది కాదని మరో వాదన కూడా ఉంది. ఇటీవల రిలీజైన ‘రామ్‌లీలా’ చిత్రంలో తొలుత సోనాక్షి పేరును సంజయ్‌లీలా భన్సాలీ పరిశీలనలోకి తీసుకున్నారట. అయితే... దీపికా పదుకొనే వైపు రణవీర్ మొగ్గుచూపడంతో ఆ చిత్రంలో నటించే అవకాశం సోనాక్షికి మిస్ అయినట్టు సమాచారం. అందుకే టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగా రణవీర్‌కి ‘నో’ చెప్పారట సోనాక్షి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement