మా కుటుంబాన్ని లాగొద్దు! - సోనాక్షి సిన్హా
మా కుటుంబాన్ని లాగొద్దు! - సోనాక్షి సిన్హా
Published Wed, Aug 14 2013 12:57 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
న్యూఢిల్లీ: ‘మీ ప్రయోజనాల కోసం నా గురించి ఏమైనా రాసుకోండి. కానీ నా కుటుంబాన్ని మాత్రం వివాదాల్లోకి లాగొద్దు. ఒకవేళ అదే జరిగితే నేను కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంద’ని మీడియాకు వార్నింగ్ ఇచ్చింది నటి సోనాక్షి సిన్హా. ‘లుటేరా’ సినిమా షూటింగ్ జరుగుతుండగా సోనాక్షి తల్లి పూనమ్ సిన్హా సెట్స్లోకి వచ్చిందని, ఆ సమయంలో రణ్వీర్ సింగ్తో చిత్రీకరిస్తున్న పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నానా హంగామా చేసిందనే కథనాలు మీడియాలో ప్రసారం కావడంపై స్పందిస్తూ సోనాక్షి ఇలా వార్నింగ్ ఇచ్చింది.
‘సినిమాల ఎంపికలో మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ జోక్యం చేసుకోరు. ఆ విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎందుకంటే వారికి నాపై పూర్తి నమ్మకముంది. షూటింగ్ స్పాట్కు మా అమ్మ వచ్చిందని, చిత్రీకరిస్తున్న సన్నివేశాలపట్ల అభ్యంతరం చెప్పిందంటూ మీడియాలో వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలే. మా అమ్మ షూటింగ్ స్పాట్కు వచ్చేది కేవలం నాకు తినిపించేందుకే. అంతేతప్ప సినిమా విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోదు. చిత్ర దర్శకుడు విక్రమాదిత్య మోత్వానేతో కూడా అమ్మ చాలా సన్నిహితంగా ఉంటుంది. చిత్ర బృందమంతా అమ్మను ఇష్టపడతారు.
సినిమా కోసం సంతకాలు చేసేముందే కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుంటాను. తుది నిర్ణయం నాదే అయినప్పటికీ వారిని అలా అడగడం నాకు అలవాటు. ఇప్పటిదాకా నా ఇష్టాన్ని వారెప్పుడూ కాదనలేదు. వారికి ఇబ్బంది పెట్టే పనులేవీ నేను చేయలేదు. అయినప్పటికీ సొంత ప్రయోజనాల కోసం ఇలాంటి లేనిపోని కథనాలు రాస్తున్నారు. కావాలంటే నా పేరును వాడుకోండి. అంతేగానీ నా కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగితే అందుకు వ్యతిరేకంగా నేను వ్యవహరించవలసి ఉంటుంద’ని పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పింది సోనమ్.
Advertisement
Advertisement