ఆ రేడియో అందరికీ కావాలి! | PK Aamir Khan’s Love Is A Waste Of Time With Anushka Sharma | Sakshi
Sakshi News home page

ఆ రేడియో అందరికీ కావాలి!

Published Sat, Nov 15 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

ఆ రేడియో అందరికీ కావాలి!

ఆ రేడియో అందరికీ కావాలి!

బాలీవుడ్ భామ అనుష్కశర్మ ఓ రేడియోపై మనసు పడ్డారు. ఆ ట్రాన్సిస్టర్ గొప్పతనం ఏంటి? అదంటే అనుష్కకు ఎందుకంత ఇష్టం అనుకుంటున్నారా? ప్రస్తుతం ఆమిర్‌ఖాన్‌కు జోడీగా అనుష్క ‘పీకే’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా రేడియోను అడ్డుపెట్టుకొని ఆమిర్ నగ్నంగా నిలబడ్డ స్టిల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ స్టిల్ పుణ్యమా అనీ, ఆమిర్‌కు దీటుగా ఆ రేడియో కూడా పాపులారిటీని సొంతం చేసుకుంది.

కథలో ఆ రేడియోది కీలక పాత్ర అట. ప్రచారంలో కూడా దానికంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమదే. ఒక జ్ఞాపకంగా ఆ రేడియోను తన వద్దే దాచుకోవాలని భావించారట ఈ ముద్దుగుమ్మ. చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, కథానాయ కుడు ఆమీర్‌ఖాన్‌ల ముందు తన కోరిక చెప్పారట అనుష్క. అయితే... వాళ్లిద్దరూ ససేమిరా అన్నారట.

ఈ విషయాన్ని రాజ్‌కుమార్ హిరానీ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘అనుష్క ఆ రేడియా అడిగిన మాట నిజం. అయితే... ఆమెలాగే... మేము కూడా దానిపై మమకారం పెంచుకున్నాం. దాన్ని గుర్తుగా దాచుకోవాలని ఆమిర్‌కీ, నాకూ కూడా ఉంది’’ అని పేర్కొన్నారు రాజ్‌కుమార్. ఇంతమంది మనసు దోచిన ఆ ట్రాన్సిస్టర్ గొప్పతనమేంటో తెలుసుకోవాలంటే... ‘పీకే’ వచ్చేదాకా ఆగాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement