PK Movie
-
'వారికి కథ బాగా నచ్చింది'
ముంబై: ప్రాంతంతో సంబంధం లేకుండా 'పీకే' సినిమాను ఆదరిస్తున్నామని దర్శకుడు రాజకుమార్ హిరానీ అన్నారు. చైనాలో 'పీకే' సినిమా వసూళ్లే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈ సినిమాకు చైనాలో వస్తున్న స్పందన తనను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. పీకే సినిమా కథ చైనీయులకు బాగా ఆకట్టుకుందని తెలిపారు. ఈ కథ వారికి కొత్తగా అనిపించిందని పేర్కొన్నారు. చైనాలో 16 రోజులుగా 4500 స్క్రీన్లపై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న పీకే' సినిమా రూ.100 కోట్లు వసూళ్లు దాటినట్టు వార్తలు వచ్చాయి. చైనాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా పీకే' రికార్డు సృష్టించింది. మే 22న చైనాలో ఈ సినిమా విడుదల చేశారు. -
చైనాలో రికార్డు సృష్టించిన పీకే
బీజింగ్: ఆమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా 'పీకే' కొత్త రికార్డు సృష్టించింది. చైనాలో విజయవంతంగా ఆడుతున్న పీకే 100 కోట్లు రూపాయల వసూళ్లు సాధించింది. భారత్ వెలుపల ఒకే దేశంలో ఇంత మొత్తం వసూలు తొలి బాలీవుడ్ సినిమాగా పీకే ఘనత సాధించింది. గల నెల 22 న చైనాలో 4600 స్క్రీన్లపై పీకే విడుదలైంది. విడుదలయిన 16 రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమీర్ ఖాన్, అనుష్క వర్మ హీరోహీరోయిన్లుగా నటించిన 'పీకే' బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 615 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. -
చైనాలో 'పీకే' రికార్డు
బీజింగ్: ఆమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'పీకే' చైనాలోనూ కనక వర్షం కురిపిస్తోంది. మే 22న ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేశారు. పీకే చిత్రం రెండు వారాల్లో 86 కోట్ల రూపాయలు వసూలు చేసింది. చైనాలో సినిమా విశ్లేషకుల నుంచి పీకేకు ప్రశంసలు వస్తున్నాయి. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారత్‌లో రికార్డు వసూళ్ల సాధించిన సంగతి తెలిసిందే. చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా 'పీకే'గా నిలిచింది. అమెరికా-కెనడాలో ఈ చిత్రం సాధించిన వసూళ్లను చైనాలో అధిగమించడం మరో విశేషం. చైనాలో పీకే చిత్రం 5000 స్క్రీన్లపై ప్రదర్శితమవుతోంది. 2009లో బాలీవుడ్ చిత్రం త్రి ఇడియట్స్ చిత్రం కూడా చైనాలో ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు పీకే అంతకుమించిన విజయం సాధించింది. -
'చైనాలో మా సినిమాను విడుదల చేస్తాం'
ముంబై: విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన 'పీకే' సినిమాను చైనా ప్రేక్షకులు ఆమోదిస్తారన్న నమ్మకాన్ని దర్శకుడు రాజకుమార్ హిరాణి వ్యక్తం చేశారు. తన గత చిత్రం '3 ఇడియట్స్'కు చైనాలో మంచి స్పందన వచ్చిందని ఆయన గుర్తు చేశారు. 'పీకే సినిమా చైనాలో విడుదల కానుంది. ప్రచారం కోసం మేమంతా చైనా వెళతాం. చైనాలో 3500 నుంచి 4000 ధియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారని విన్నాను' అని హిరాణి పేర్కొన్నారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నడానికి వచ్చిన ఆయన ఈ విషయం వెల్లడించారు. పీకే సినిమా ఇప్పటికే పాకిస్థాన్, ఆస్ట్రేలియా, సింగపూర్, న్యూజిలాండ్, మలేసియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాల్లో విడుదలైంది. చైనాలో జూలైలో విడుదలకానుంది. దేవుడు పేరుతో మోసాలు చేసే దొంగస్వాముల పట్ల అప్రమత్తంగా ఉండాలనే ఇతివృత్తంతో తెరకెక్కిన 'పీకే' కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజపుత్, సంజయ్ దత్ ముఖ్యపాత్రల్లో నటించారు. -
ఆ సినిమాలో తప్పు ఏముంది?: హైకోర్టు
న్యూఢిల్లీ: ఆమిర్‌ఖాన్ 'పీకే' సినిమాలో ఎటువంటి అభ్యంతరకర దృశ్యాలు లేవని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. హిందూ మతాన్ని, ఆచారాలను అవమానించే అంశాలేవీ సినిమాలో లేవని స్పష్టం చేసింది. 'పీకే'లో ఎటువంటి తప్పు లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ ఎండ్లా నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. సినిమాలో ఏం తప్పు ఉంది అని పిటిషనర్ ను ప్రశ్నించింది. ఇందులో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నట్టు తమకేమీ అనిపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అజయ గౌతమ్ అనే వ్యక్తి దాఖలు చేసిన 'పిల్'పై కోర్టు బుధవారం విచారణ జరిపింది. -
'కొన్ని సీన్లపై అభ్యంతరం తెలిపా'
నర్సింగ్ పూర్(మధ్యప్రదేశ్): ఆమిర్‌ఖాన్ 'పీకే' సినిమాలో కొన్ని సీన్లపై అభ్యంతరం తెలిపినట్టు కేంద్ర సెన్సార్ బోర్డు(సీబీఎఫ్ సీ) సభ్యుడు సతీష్ కళ్యాణకర్ వెల్లడించారు. తన అభ్యంతరాలను బోర్డు సీఈవో ముందు పెట్టానని తెలిపాయి. అయితే తన అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వలేకపోయానని చెప్పారు. తాను అభ్యంతరం వ్యక్తం చేసిన దృశ్యాలను సినిమా నుంచి తొలగించలేదన్నారు. సెన్సార్ బోర్డు సభ్యులు కొందరు సోమవారం శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఆశ్రమాన్ని సందర్శించారు. 'పీకే' సినిమా విషయంలో నియమాల ఉల్లంఘన జరిగిందని కళ్యాణకర్ ఒప్పుకున్నారు. ఏ మతానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతీయకూడని విధంగా సినిమాలు ఉండాలని నిర్దేశిత నియమాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. హిందూ మతాన్ని కించపరిచే విధంగా పీకే సినిమాలో దృశ్యాలున్నాయని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి విదితమే. -
'పీకే'కు వినోద పన్ను మినహాయింపు
ఆగ్రా: ఆమిర్‌ఖాన్ 'పీకే' సినిమాకు ఉత్తరప్రదేశ్ పభుత్వం వినోదపన్ను మినహాయింపు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని విశ్వహిందూ పరిషత్, హిందూ జాగరణ మంచ్, భజరంగ్ దళ్ ధ్వజమెత్తాయి. వినోద పన్ను మినహాయింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే 'పీకే' సినిమాలో ఎటువంటి తప్పులు లేవని, మతాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిని గురించి ఇందులో చూపించారని బాబా రాందేవ్ అనుచరుడు వేద్ ప్రతాప్ వైదిక్ వ్యాఖ్యానించారు. -
పీకే సినిమాపై నిరసన
సాక్షి, న్యూఢిల్లీ: అమీర్‌ఖాన్ నటించిన పీకే చిత్రం మత విశ్వాసాలను దెబ్బతీసేదిగా ఉందని, దానిపై నిషేధం విధించాలని కోరుతూ హిందూసేన కార్యకర్తలు పీకే సినిమాను ప్రదర్శిస్తోన్న డిలైట్ సినిమా హాలు ఎదుట మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆందోళనకారులు పీకే సినిమా హాలు బయట ఉన్న పోస్టరును చించివేశారు. థియేటర్ కిటీకీని ధ్వంసం చేశారని హాలు సిబ్బంది చెప్పారు. ఈ సందర్భంగా సినిమా దర్శక నిర్మాతలపైన, నటీనటులపైనా ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పోలీసులు నిరసనకారులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. నిరసన ప్రదర్శన కారణంగా మధ్యాహ్నం 12.15 గంటల షో ఆలస్యంగా ప్రారంభమైంది. నోయిడా, గాజియాబాద్‌లలో పీకేను నిషేధించాలన్న డిమాండ్ వినిపించింది. నోయిడాలో సినిమా పోస్టరును , గాజియాబాద్‌లో అమీర్‌ఖాన్ ఫొటోను తగులబెట్టారు. పీకేను నిషేధించాలి : వీహెచ్‌పీ న్యూఢిల్లీ : నగరంలో బాలివుడ్ నటుడు అమీర్‌ఖాన్ నటించిన పీకే’ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నదని, తక్షణమే ఆ సినిమాపై నిషేధం విధించాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు డిమాండ్ చేశారు. దర్యాగంజ్, డిలైట్ , పీవీఆర్ ప్రియా ధియేటర్ల వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా మాట్లాడారు. పీకే సినిమా హిందువులను కించపర్చే విధంగా ఉన్నదని, తక్షణమే నిషేధించాలని సెన్సార్ చైర్‌పర్సన్‌కు విజ్ఞప్తి చేశారు. పలుచోట్ల సినిమా ధియేటర్ల వద్ద ఆందోళనలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని, ధియేటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. -
'పీకే సినిమా చూడొద్దని చెప్పండి'
న్యూఢిల్లీ: ఆమిర్‌ఖాన్ 'పీకే' సినిమా విడుదలకు అనుమతి ఇవ్వడాన్ని సెన్సార్ బోర్డు అధ్యక్షురాలు లీలా సామ్సన్ సమర్థించుకున్నారు. తమ పని తాము చేశామని పేర్కొన్నారు. పీకే సినిమా చూడొద్దని రాజకీయ పార్టీలు, సైద్ధాంతిక సంస్థలు తమ మద్దతుదారులకు చెప్పాలని ఆమె సలహాయిచ్చారు. పీకే సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ హిందూ మత సంస్థలు దేశవ్యాప్తంగా చేస్తున్న ఆందోళన గురించి అడిగినప్పుడు ఆమె ఈవిధంగా స్పందించారు. అయితే 'పీకే' సినిమా ద్వారా ఏ మతాన్ని అగౌరవపరచలేదని ఆ చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ వివరణ ఇచ్చారు. ఏ మతాన్ని కించపరచాలన్న ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. -
'పీకే' సినిమా పోస్టర్లు దగ్ధం
భోపాల్: బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్ నటించిన 'పీకే' సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. హిందూ మతాన్ని,ఆచారాలను కించపరిచారనే ఆరోపణలతో కాషాయ సంస్థలు మంగళవారం కూడా ఆందోళనలు చేపట్టాయి. మధ్యప్రదేశ్ మాల్వా ప్రాంతంలోని నీముచ్ లో పీకే సినిమా ప్రదర్శనను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు పోస్టర్లను చించేసి తగులబెట్టారు. కాషాయ జెండాలు చేబూని సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ వద్దకు చేరుకున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. సినిమా ప్రదర్శనకు అంతరాయం కలగకుండా చూశారు. -
పీకే సినిమాకు ఐఎస్ఐ పెట్టుబడి: స్వామి
పీకే సినిమా తీయడానికి డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ప్రశ్నించారు. ఆ సినిమాకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ పెట్టుబడి పెట్టిందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. పీకే సినిమాపై వెంటనే ప్రభుత్వం విచారణ జరిపించాలని స్వామి డిమాండ్ చేశారు. అమీర్ ఖాన్ పీకే సినిమాపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు హిందూ సంస్థలు దీనిపై ఫిర్యాదులు చేయగా, ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యడు కూడా వాటికి మద్దతు తెలిపారు. ఇప్పుడు ఏకంగా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి కూడా ఆరోపణలు గుప్పించారు. -
పికే చిత్రం పై వివాదాలు
-
pk ఫిలాసఫి
-
'పీకే' తెలివైన సినిమా: కశ్యప్
ముంబై: ఆమిర్‌ఖాన్ 'పీకే' సినిమాపై ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రశంసలు కురిపించారు. మత సంబంధ సున్నితమైన విషయాన్ని చాలా తెలివిగా తెరకెక్కించారని అన్నారు. 'ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను చాలా తెలివిగా తీశారు. ఎటువంటి వివాదాలకు తావులేకుండా మతం, దేవుడు, స్వాములపై సినిమా తీయడం మామూలు విషయం కాదు. రాజ్‌కుమార్ హిరానీ ఎంతో సాహసంతో ఈ సినిమా తెరకెక్కించారు' అని అనురాగ్ కశ్యప్ ప్రశంసించారు. తాము ఇలాంటి సినిమాలు వెనుకాడతామని, కాని హిరానీ, నిర్మాత విదూ వినోద్ చోప్రా, హీరో ఆమిర్ ఖాన్ ధైర్యంగా ముందుకెళ్లారని పేర్కొన్నారు. -
'అమిర్ పీకే చిత్రం అద్భుతంగా ఉంది'
న్యూఢిల్లీ:బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్ నటించిన 'పీకే'చిత్రం సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా ఆ సినిమాను ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ వీక్షించారు. 'నేను పీకే చిత్రాన్ని పార్టీ సభ్యులతో కలిసి షహీబాబాద్ లో చూశాను. నిజంగా పీకే ఒక అద్భుతమైన చిత్రం'అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలకు, హీరో అమిర్ కు అభినందనలు తెలియజేశారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో బయట విందులతో పాటు సినిమాలకు కూడా దూరమైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం కాస్త వెసులుబాటు దొరకడంతో కేజ్రీవాల్ మూవీలను వీక్షిస్తున్నారు. -
'పీకే' పోస్టర్ పై పిటిషన్
ముంబై: బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ పై దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు ముంబై కోర్టు శుక్రవారం అంగీకరించింది. ఆమిర్‌ఖాన్ హీరోగా నటించిన 'పీకే' సినిమాలో అశ్లీల దృశ్యాలు, అభ్యంతకర మాటలున్నాయంటూ హేమంత్ పాటిల్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా నిర్మాత విదూ వినోద్ చోప్రా, దర్శకుడు రాజు హిరాణిలతో పాటు సెన్సార్ బోర్డుపైనా దావా వేశారు. అయితే సెన్సార్ బోర్డుపై పిటిషన్ ను కోర్టు అంగీకరించలేదు. ఆమిర్‌ఖాన్ నగ్నంగా రైల్వే ట్రాక్ పై నిలబడి ట్రానిస్టర్ అడ్డుపెట్టుకున్న పోస్టర్ పై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు ఈ సీన్ తొలగించాలని కోర్టును కోరారు. అయితే పీకే సినిమా ఈ రోజు(19-12-2014) విడుదలైంది. ఈ దావాపై తదుపరి విచారణను కోర్టు జనవరి 22కు వాయిదా వేసింది. ఆమిర్‌ఖాన్ నగ్న పోస్టర్ పై నిషేధం విధించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. 'మీకు నచ్చక పోతే సినిమా చూడడం మానుకోండి' అంటూ అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ కు చురక అంటించింది. -
వావ్.. వాటే టేస్ట్
‘ఎప్పట్నుంచో హైదరాబాద్ బిర్యానీ తినాలని కోరిక. అదంటే చాలా ఇష్టం. చాలాసార్లు ఈ సిటీకి వచ్చినా తినాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఈసారి మిస్ కాలేదు’ అంటూ బిర్యానీ టేస్ట్‌ని ఎంజాయ్ చేశాడు బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్. ‘పీకే’ చిత్రం ప్రమోషన్లో భాగంగా మంగళవారం నగరానికి వచ్చిన ఆయన మాదాపూర్‌లోని ప్యారడైజ్ హోటల్లో బిర్యానీ రుచి చూశాడు. షూటింగ్ నిమిత్తం ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి రుచుల్ని ఆస్వాదించడం తన హాబీ అని అన్నాడు. - సెంట్రల్ యూనివర్సిటీ -
ఆ రేడియో అందరికీ కావాలి!
బాలీవుడ్ భామ అనుష్కశర్మ ఓ రేడియోపై మనసు పడ్డారు. ఆ ట్రాన్సిస్టర్ గొప్పతనం ఏంటి? అదంటే అనుష్కకు ఎందుకంత ఇష్టం అనుకుంటున్నారా? ప్రస్తుతం ఆమిర్‌ఖాన్‌కు జోడీగా అనుష్క ‘పీకే’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రచారంలో భాగంగా రేడియోను అడ్డుపెట్టుకొని ఆమిర్ నగ్నంగా నిలబడ్డ స్టిల్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ స్టిల్ పుణ్యమా అనీ, ఆమిర్‌కు దీటుగా ఆ రేడియో కూడా పాపులారిటీని సొంతం చేసుకుంది. కథలో ఆ రేడియోది కీలక పాత్ర అట. ప్రచారంలో కూడా దానికంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమదే. ఒక జ్ఞాపకంగా ఆ రేడియోను తన వద్దే దాచుకోవాలని భావించారట ఈ ముద్దుగుమ్మ. చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, కథానాయ కుడు ఆమీర్ఖాన్ల ముందు తన కోరిక చెప్పారట అనుష్క. అయితే... వాళ్లిద్దరూ ససేమిరా అన్నారట. ఈ విషయాన్ని రాజ్‌కుమార్ హిరానీ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘‘అనుష్క ఆ రేడియా అడిగిన మాట నిజం. అయితే... ఆమెలాగే... మేము కూడా దానిపై మమకారం పెంచుకున్నాం. దాన్ని గుర్తుగా దాచుకోవాలని ఆమిర్‌కీ, నాకూ కూడా ఉంది’’ అని పేర్కొన్నారు రాజ్‌కుమార్. ఇంతమంది మనసు దోచిన ఆ ట్రాన్సిస్టర్ గొప్పతనమేంటో తెలుసుకోవాలంటే... ‘పీకే’ వచ్చేదాకా ఆగాలి. -
ట్రాన్సిస్టర్.. పీకే!
‘అందం చూడవయా... ఆనందించవయా’ అంటూ ఆమిర్‌ఖాన్ ‘పీకే’ పోస్టర్లో నగ్నంగా కనిపించి పిచ్చెక్కిస్తుంటే... దానిపై సెటైర్లు పేల్చి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు అతడి థిక్ దోస్త్ సల్మాన్‌ఖాన్. ‘ఈ మధ్య ఆమిర్ తన ట్రాన్సిస్టర్ అమ్మేసి ఐప్యాడ్‌తో తిరుగుతున్నాడు’ అంటూ బిగ్‌బాస్ షోలో నర్మగర్భంగా కామెంట్ చేశాడు కండల వీరుడు. ‘దూమ్ 3లో నేను ధరించినలాంటి హ్యాట్ పెట్టుకున్న సల్మాన్... మరి ఇప్పుడు పీకే పోస్టర్లో నాలా మారిపోతాడా’ అంటూ నవ్వుతూనే అడిగిన ఆమిర్‌కు కౌంటరే సల్మాన్ తాజా కామెంట్. ఇంతకీ ట్రాన్సిస్టర్ ట్విస్ట్ అర్థమైందా..! ‘పీకే’ పోస్టర్లో ఆమిర్ ఆచ్ఛాదనగా వాడుకున్నది. -
'పీకే కోసం సల్మాన్ న్యూడ్ గా మారాలి'
ముంబై: సల్మాన్ ఖాన్ ను బట్టల్లేకుండా చూడాలనుకుంటున్నట్టు ఆమిర్ ఖాన్ వెల్లడించాడు. పీకే' సినిమా పోస్టర్ లో ఆమిర్ ఖాన్ నగ్నంగా కనిపించాడు. ఇదే ఫీట్ సల్మాన్ ఖాన్ చేస్తే చూడాలనివుందని అతడు పేర్కొన్నాడు. ఆమిర్ ఖాన్ ప్రతినాయక పాత్ర పోషించిన 'ధూమ్ 3'ని సల్మాన్ ప్రమోట్ చేశాడు. ఆమిర్ పెట్టుకున్న టోపీ పెట్టుకుని 'బిగ్ బాస్' రియాల్టి షో పాల్గొన్నాడు సల్మాన్. 'బిగ్ బాస్ లో ధూమ్ 3కి సల్మాన్ ప్రచారం చేశాడు. ఇప్పుడు పీకే సినిమాకు అతడు ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు సల్మాన్ చొక్కా మాత్రమే విప్పాడు. ఇప్పుడు ఫ్యాంట్ విప్పాలి. సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ షిప్‌కు ఇది పరీక్ష' అని ఆమిర్ ఖాన్ పేర్కొన్నాడు. స్నేహితుడి కోసం సల్మాన్ న్యూడ్ గా మారతాడో, లేదో చూడాలి. -
ట్రౌజర్ ఎందుకు... ట్రాన్సిస్టర్ చాలు....
-
బట్టల్లేకుండా రైలు పట్టాలపై ఆమిర్ ఖాన్!
బాలీవుడ్ లో చొక్కాలు విప్పే హీరోలు అనగానే సల్మాన్‌ఖాన్, జాన్అబ్రహం, హృతిక్ రోషన్ గుర్తుకు వస్తారు. అయితే ఈ జాబితాలోకి మిస్టర్ పెర్పెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కూడా చేరాడు. సల్మాన్, జాన్, హృతిక్ చొక్కాలు మాత్రమే విప్పితే ఆమిర్ ఏకంగా ఒంటిమీదున్న బట్టలన్ని విప్పేసి అందరీని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న 'పీ.కే.' సినిమా కోసం ఈ ఫీట్ చేశాడు. దీంతో 'పీ.కే.' ఫస్ట్‌లుక్ చర్చనీయాంశంగా మారింది. ఒంటిమీద నూలు పోగులేకుండా రైలు పట్టాలపై నిలబడి కోపంగా చూస్తున్నట్టుగా పోస్టర్ లో ఉంది. ఆమిర్ ఖాన్ ఆచ్చాదనగా ఒక పాత టేప్ రికార్డర్ ను మాత్రమే అడ్డుపెట్టుకోవడం విశేషం. సినిమా ఇంట్రడక్షన్ సీన్ లోనే ఆమిర్ బేర్ బాడీతో కన్పించనున్నాడు. ఇంతకుముందెన్నడూ అతడు ఇలాంటి సీన్లు చేయలేదు. భూమిపైకి వచ్చిన గ్రహాంతరజీవి పాత్రను ఆమిర్ ఖాన్ ఈ సినిమాలో పోషించాడు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై వ్యంగాస్త్రంగా ఈ సినిమాను హిరానీ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఆమిర్, హిరానీ కాంబినేషన్ లో వచ్చిన త్రీఇడియట్స్ ఘన విజయం సాధించింది. 'పీ.కే.' ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.