
'కొన్ని సీన్లపై అభ్యంతరం తెలిపా'
నర్సింగ్ పూర్(మధ్యప్రదేశ్): ఆమిర్ఖాన్ 'పీకే' సినిమాలో కొన్ని సీన్లపై అభ్యంతరం తెలిపినట్టు కేంద్ర సెన్సార్ బోర్డు(సీబీఎఫ్ సీ) సభ్యుడు సతీష్ కళ్యాణకర్ వెల్లడించారు. తన అభ్యంతరాలను బోర్డు సీఈవో ముందు పెట్టానని తెలిపాయి. అయితే తన అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వలేకపోయానని చెప్పారు. తాను అభ్యంతరం వ్యక్తం చేసిన దృశ్యాలను సినిమా నుంచి తొలగించలేదన్నారు.
సెన్సార్ బోర్డు సభ్యులు కొందరు సోమవారం శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఆశ్రమాన్ని సందర్శించారు. 'పీకే' సినిమా విషయంలో నియమాల ఉల్లంఘన జరిగిందని కళ్యాణకర్ ఒప్పుకున్నారు. ఏ మతానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతీయకూడని విధంగా సినిమాలు ఉండాలని నిర్దేశిత నియమాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. హిందూ మతాన్ని కించపరిచే విధంగా పీకే సినిమాలో దృశ్యాలున్నాయని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి విదితమే.