'ఆదిపురుష్' రామాయణం ఆధారంగా తీశారు. అయితే చేతులెత్తి రాముడిని మొక్కాల్సిన ప్రేక్షకులు.. దర్శకుడిని బండబూతులు తిట్టారు. ఎందుకంటే కథని వక్రీకరించి, ఇష్టమొచ్చినట్లు తీయడమే దీనికి కారణం. సరే ఈ చిత్రం గురించి అందరూ మర్చిపోయారు అనుకునేలోపు మరో మూవీ కొత్త కాంట్రవర్సీలు సృష్టించేందుకు రెడీ అయిపోయింది. ఎందుకంటే ఇది దేవుడి సినిమా, సెన్సార్ బోర్డ్ మాత్రం 'A' సర్టిఫికెట్ ఇచ్చింది. ఇంతకీ ఏంటి విషయం?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ)
త్వరలో రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ప్రత్యేకం. ఎందుకంటే ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తుంటాడు. కానీ గత రెండేళ్లలో అతడి చిత్రాలన్నీ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అలాంటి అక్షయ్ శివుడిగా నటించిన మూవీ 'ఓ మై గాడ్ 2'. 2012లో వచ్చిన 'OMG' చిత్రానికి ఇది సీక్వెల్. తొలి భాగంలో దేవుడిగా కనిపించిన అక్షయ్.. రెండో పార్ట్‌లో అదే పాత్ర పోషించాడు. ఆగస్టు 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
గొడవ ఎందుకు?
ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి కొన్నాళ్ల ముందొచ్చిన టీజర్ వరకు చూస్తే ఇది దేవుడి సినిమా అనిపించేలా చేశారు. కానీ ఇందులో అంతకు మించిన కాన్సెప్ట్ ఏదో ఉందని గత కొన్నాళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే గత రెండు వారాల నుంచి సెన్సార్ బోర్డు దగ్గర ఈ సినిమా మల్లగుల్లాలు పడింది. తొలుత 'U/A' సర్టిఫికెట్ ఇచ్చి, కొన్ని సీన్స్ తీసేయాలని చెప్పారు. దర్శకనిర్మాతలు దీనికి ఒప్పుకోలేదట. దీంతో 'A' సర్టిఫికెట్(పెద్దలు మాత్రమే) ఇచ్చినట్లు తెలుస్తోంది. అలానే 27 కట్స్ చెప్పారట. సినిమాలో కంటెంట్ దీనంతటికి కారణం.
(ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?)
'OMG 2' కథేంటి?
బాలీవుడ్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఓ కుర్రాడు గే. కాలేజీలో ఈ విషయం తెలియడంతో అందరూ అతడిని ఏడిపిస్తారు. ఆ బాధ తట్టుకోలేక ఓ రోజు ఆత్మహత్య చేసుకుంటాడు. అదే కాలేజీలో ఫ్రొఫెసర్(పంకజ్ త్రిపాఠి)కి ఈ విషయం తెలిసి బాధపడతాడు. పిల్లలకు సె*క్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని, కాలేజీలో ఆ పాఠాలు కంపల్సరీ చేస్తాడు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది. భగవంతుడు కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు భూమ్మీదకు వచ్చిన శివుడు.. ఈ సమస్యని ఎలా పరిష్కరించాడు అనేది పాయింట్ అని టాక్.
పోస్టర్‌లో అక్షయ్ శివుడిగా కనిపించడంతో పైన చెప్పిన స్టోరీ లైన్ నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే శివుడిని అర్థనారీశ్వరుడిగా కొలుస్తుంటారు. శివుడు-పార్వతి కలిసి ఒకే శరీరంలో ఉంటే ఈ పేరుతో పిలుస్తారు. అలానే అబ‍్బాయిలో అమ్మాయి లక్షణాలు ఉంటే గే అని పిలుస్తుంటారు!! దీన్నిబట్టి చూస్తే 'ఓ మై గాడ్ 2' సినిమా బాక్సాఫీస్ దగ్గర కాంట్రవర్సీలు సృష్టించేలా కనిపిస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో? ఒకవేళ ఇదే గనుక స్టోరీ అయితే మాత్రం థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో?
(ఇదీ చదవండి: సాయితేజ్ పక్కనున్న వ్యక్తిని గుర్తుపట్టారా? స్టార్ హీరో కొడుకు!)
Comments
Please login to add a commentAdd a comment