OMG 2 Movie
-
ఓటీటీలో 'ఓ మై గాడ్ 2' తెలుగు వర్షన్ వచ్చేసింది
బాలీవుడ్ హిట్ సినిమా ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్’ (2012) చిత్రానికి సీక్వెల్‌గా విడుదలైన ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్ 2’ కూడా బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించారు. కానీ ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో బాలీవుడ్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సినిమాపై పలు అభ్యంతరాలు రావడంతో సుమారు 20కి పైగా సీన్లను సెన్సార్ వారు కట్ చేశారు.గడ ఏడాది ఆగష్టులో విడుదలైన ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్ 2’ ఇప్పటికే హిందీ వర్షన్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. అయితే, తాజాగా తెలుగు వర్షన్ జియో సినిమా అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు ఆరు నెలలుగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.అమిత్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సుమారు. రూ. 221 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. వరుస డిజాస్టర్స్‌తో కొనసాగుతున్న అక్షయ్ కుమార్‌కు ఓ మై గాడ్ 2 కొంతమేరకు ఊరటనిచ్చింది. -
రూ.20 కోట్ల బడ్జెట్ సినిమా.. షారుక్ ఖాన్ పఠాన్‌కే షాకిచ్చింది!
సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా కోట్లలో వసూళ్ల సాధించడమంటే మాటలు కాదు. ఎంతటి స్టార్ హీరోల చిత్రాలైన ఒక్కోసారి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడిన సంఘటనలు కూడా చూశాం. కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించినప్పటికీ హిట్ కాకపోతే నష్టం భరించక తప్పదు. అయితే ఈ ఏడాదిలో బాలీవుడ్లో చాలా చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే హిట్‌గా నిలిచాయి. ఈ ఏడాదిలో థియేట్రికల్‌గా ఎక్కువ క్రేజ్ ఉన్న చిత్రాల్లో ఇటీవలే రిలీజైన షారుక్ ఖాన్ జవాన్ మొదటిస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: స్టార్ హీరోతో ఒక్క సినిమా చేసింది.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిని!) అయితే రెండోస్థానంలో ఎవరూ ఊహించని విధంగా ఆదాశర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది కేరళ స్టోరీ నిలిచి రికార్డ్ సృష్టించింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ పఠాన్, గదర్-2, ఓఎంజీ-2 చిత్రాలను వెనక్కి నెట్టింది. 2023లో ఆడియన్స్ అత్యధికంగా ఇష్టపడిన హిందీ థియేట్రికల్ చిత్రాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. వసూళ్ల పరంగా చూస్తే.. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పఠాన్ సైతం రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కేవలం రూ. 20 కోట్ల రూపాయల చిన్న బడ్జెట్‌తో సుదీప్తో సేన్ తెరకెక్కించిన ది కేరళ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా రూ. 304 కోట్లు రాబట్టింది. సన్నీ డియోల్ నటించిన గదర్ 2 రూ. 650 కోట్లతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అక్షయ్ కుమార్ ఓఎంజీ- 2 రూ.220 కోట్లకు పైగా వసూలు చేసింది. (ఇది చదవండి: సినిమాల్లోకి వస్తానని అస్సలు ఊహించలేదు: ప్రియా ప్రకాశ్) View this post on Instagram A post shared by Ormax Media (@ormaxmedia) -
ఓటీటీలోకి ‘ఓ మై గాడ్ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..?
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఓ మై గాడ్ 2’. అక్షయ్ దేవుడి పాత్రలో నటించి మెప్పించిన ఓ మై గాడ్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఆగస్ట్ 11న థియేటర్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. . లైంగిక విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ దర్శకుడు అమిత్ రాయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో అక్షయ్ శివుడి దూతగా నటించాడు. పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, గోవింద్ నామ్‌దేవ్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. అక్టోబర్ 8 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ ఎక్స్(ట్విటర్)వేదికగా తెలియజేసింది. OMG 2 కథేంటంటే..? శివ భక్తుడి కాంతి శరణ్ ముగ్దల్(పంకజ్ త్రిపాఠి) తన గ్రామంలోని ఆలయం పక్కనే పూజా స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అతని కొడుకు వివేక్(ఆరుష్ వర్మ) స్కూల్లో అసభ్యకరంగా ప్రవర్తించడంతో సస్పెండ్‌కు గురవుతాడు. అంతేకాదు అతను స్కూల్ వాష్‌రూమ్‌లో చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో పరువు పోయిందని భావించిన ముగ్దల్.. భార్య, కొడుకుని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడతాడు. అదే సమయంలో దేవదూత(అక్షయ్ కుమార్)ప్రత్యేక్షమై.. కొడుకు చేసిన పనికి భయపడకుండా దానిపై పోరాటం చేయాలని సూచిస్తాడు. దేవదూత మాటలు విన్న ముగ్దల్ ఎలాంటి పోరాటం చేశాడు? అతను కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది. ఈ పోరాటంలో ముగ్దల్‌కు దేవదూత ఎలాంటి సహాయం చేశాడు? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. We’ve got great news for you, and OMG can you tell we’re 2 excited? #OMG2 arrives 8 October, on Netflix! pic.twitter.com/1XLpd1sVej — Netflix India (@NetflixIndia) October 3, 2023 -
అక్షయ్ కుమార్ పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
అక్షయ్ కుమార్ కీలక పాత్రలో అమిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఓ మై గాడ్ 2' ఎన్నో వివాదాల మధ్య విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, గోవింద నామ్‌దేవ్ కీలక పాత్రలు పోషించారు. అయితే దీని కోసం అక్షయ్ కుమార్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధరే స్పందించారు. ఈ సినిమా కోసం అక్షయ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటి వరకు రూ.150కోట్లు వసూళ్లు చేసిందని చిత్రబృందం ప్రకటించింది. అక్షయ్ కుమార్ శివుడి పాత్రను పోషించగా ఆయన భక్తుడిగా పంకజ్ త్రిపాఠి నటించారు. (ఇదీ చదవండి: రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన మెగాస్టార్.. ఎంతో తెలుసా..?) అక్షయ్ రెమ్యునరేషన్‌పై 'ఓమైగాడ్2' నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధరే ఇలా స్పందించారు 'ఈ సినిమా ప్రకటించిన సమయం నుంచి అక్షయ్ రెమ్యునరేషన్‌పై వస్తున్న వార్తలు చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన భారీగా పారితోషికం తీసుకున్నారని ప్రచారం జరిగింది. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఈ సినిమా కోసం అక్షయ్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే సినిమాకు బడ్జెట్ విషయంలో లోటుపాట్లు ఉంటే ఆయనే ఆర్థికంగా సాయం చేశారు. మా మధ్య ఉన్న స్నేహం ఇప్పటిది కాదు. 'ఓ మైగాడ్' మొదటి భాగం వచ్చినప్పటి నుంచి మేము కలిసి సినిమాలు తీస్తున్నాం.' అని అన్నారు. ఈ సినిమా నిర్మాతల్లో అక్షయ్ కూడా ఒకరని అజిత్ అంధరే తెలిపారు. కాబట్టి సినిమాకు వచ్చిన లాభాల్లో మాత్రమే ఆయనకు షేర్ ఉంటుందని చెప్పారు. -
ఒక్క వీకెండ్.. నాలుగు సినిమాలు.. రికార్డ్ కలెక్షన్స్!
పెద్ద సినిమాలు ఎప్పుడూ ఒకే టైంలో విడుదల చేయరు. ఎందుకంటే థియేటర్ల సమస్య, కలెక్షన్స్ తగ్గుదల లాంటివి వస్తాయని దర్శకనిర్మాతలు భయపడుతుంటారు. అయితే గత వీకెండ్ మాత్రం ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. వీటి రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే వసూళ్లలో మాత్రం సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఏంటా రికార్డ్? గత వారం రజినీకాంత్ 'జైలర్', చిరు 'భోళా శంకర్', అక్షయ్ కుమార్ 'ఓ మై గాడ్ 2', సన్నీ డియోల్ 'గదర్ 2'. వీటిలో రజినీ, సన్నీ చిత్రాలకు హిట్ టాక్ రాగా.. అక్షయ్ మూవీకి మిక్స్డ్ టాక్, చిరు సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితేనేం వీకెండ్లో మాత్రం దుమ్ముదులిపే వసూళ్లు దక్కించుకున్నాయి. మొత్తంగా ఈ నాలుగు సినిమాలకు ఆగస్టు 11-13 మధ్య రూ.390 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) దేశ సినీ చరిత్రలో ఓ వీకెండ్ ఇన్ని కోట్ల కలెక్షన్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని ఓ నోట్ రిలీజ్ చేసింది. అలానే మూడు రోజుల్లో ఏకంగా 2.10 కోట్ల మంది థియేటర్లలోకి వచ్చారని పేర్కొంది. కరోనా తగ్గుదల తర్వాత థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండటం ఆనందంగా ఉందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఏయే సినిమాలకు ఎంత? ఈ నాలుగు సినిమాల్లో 'జైలర్' కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రూ.32 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన రజినీ చిత్రం.. ఓవరాల్‌గా రూ.300 కోట్ల మార్క్ దాటేసినట్లు సమాచారం. మరోవైపు 'గదర్ 2' వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.134 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అలానే అక్షయ్ 'ఓ మై గాడ్ 2' చిత్రం రూ.50 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. చిరు 'భోళా శంకర్'కు రూ.20 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా గత వీకెండ్ సినీ ప్రియులకు వినోదం పంచింది. చాలారోజుల తర్వాత బాక్సాఫీస్ బద్దలైపోయేలా చేసింది. BIGGGEST NEWS… ⭐️ #Jailer ⭐️ #Gadar2 ⭐️ #OMG2 ⭐️ #BholaaShankar 🔥 COMBINED Gross BO of ₹ 390 cr+ 🔥 COMBINED Footfalls of 2.10 cr+ 🔥 ALL-TIME Theatrical Gross #BO record in 100+ year history Note: 11 - 13 Aug 2023 weekend Multiplex Association of India and Producers Guild… pic.twitter.com/kofNvtXNpc — taran adarsh (@taran_adarsh) August 14, 2023 (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ కి సర్జరీ.. కారణం అదే!) -
ఆ హీరోని చెంపదెబ్బ కొట్టినా, అతనిపై ఉమ్మినా..రూ.10 లక్షలు నజరానా!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం 'ఓ మై గాడ్ 2'(OMG 2). భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. ఫలితంగా ఫస్ట్‌డే రూ. 10 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లైంగిక విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ దర్శకుడు అమిత్ రాయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో అక్షయ్ శివుడి దూతగా నటించాడు. ఆ పాత్రే ఇప్పుడు వివాదానికి కారణమైంది. (చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) శివుడి భక్తులను అవమానించేలా సినిమా ఉందంటూ కొన్ని హిందూ సంఘాలు ‘ఓ మై గాడ్ 2’ చిత్రబృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రీయ హిందూ పరిషత్ సభ్యులు కొన్ని థియేటర్ల ముందు అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇక ఆగ్రాకు చెందిన ఓ హిందూ సంస్థ అయితే అక్షయ్ కుమార్‌ను చెంపదెబ్బ కొట్టినా, ఉమ్మివేసినా రూ. 10లక్షల బహుమతి అందజేస్తామని ప్రకటించింది. OMG 2 కథేంటంటే..? శివ భక్తుడి కాంతి శరణ్ ముగ్దల్(పంకజ్ త్రిపాఠి) తన గ్రామంలోని ఆలయం పక్కనే పూజా స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అతని కొడుకు వివేక్(ఆరుష్ వర్మ) స్కూల్లో అసభ్యకరంగా ప్రవర్తించడంతో సస్పెండ్‌కు గురవుతాడు. అంతేకాదు అతను స్కూల్ వాష్‌రూమ్‌లో చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో పరువు పోయిందని భావించిన ముగ్దల్.. భార్య, కొడుకుని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడతాడు. అదే సమయంలో దేవదూత(అక్షయ్ కుమార్)ప్రత్యేక్షమై.. కొడుకు చేసిన పనికి భయపడకుండా దానిపై పోరాటం చేయాలని సూచిస్తాడు. దేవదూత మాటలు విన్న ముగ్దల్ ఎలాంటి పోరాటం చేశాడు? అతను కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది. ఈ పోరాటంలో ముగ్దల్‌కు దేవదూత ఎలాంటి సహాయం చేశాడు? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. -
దేవుడి సినిమాకు 'A' సర్టిఫికెట్.. మరో కాంట్రవర్సీ?
'ఆదిపురుష్' రామాయణం ఆధారంగా తీశారు. అయితే చేతులెత్తి రాముడిని మొక్కాల్సిన ప్రేక్షకులు.. దర్శకుడిని బండబూతులు తిట్టారు. ఎందుకంటే కథని వక్రీకరించి, ఇష్టమొచ్చినట్లు తీయడమే దీనికి కారణం. సరే ఈ చిత్రం గురించి అందరూ మర్చిపోయారు అనుకునేలోపు మరో మూవీ కొత్త కాంట్రవర్సీలు సృష్టించేందుకు రెడీ అయిపోయింది. ఎందుకంటే ఇది దేవుడి సినిమా, సెన్సార్ బోర్డ్ మాత్రం 'A' సర్టిఫికెట్ ఇచ్చింది. ఇంతకీ ఏంటి విషయం? (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్.. తెలుగులోనూ) త్వరలో రిలీజ్ బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ప్రత్యేకం. ఎందుకంటే ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తుంటాడు. కానీ గత రెండేళ్లలో అతడి చిత్రాలన్నీ దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అలాంటి అక్షయ్ శివుడిగా నటించిన మూవీ 'ఓ మై గాడ్ 2'. 2012లో వచ్చిన 'OMG' చిత్రానికి ఇది సీక్వెల్. తొలి భాగంలో దేవుడిగా కనిపించిన అక్షయ్.. రెండో పార్ట్‌లో అదే పాత్ర పోషించాడు. ఆగస్టు 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. గొడవ ఎందుకు? ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి కొన్నాళ్ల ముందొచ్చిన టీజర్ వరకు చూస్తే ఇది దేవుడి సినిమా అనిపించేలా చేశారు. కానీ ఇందులో అంతకు మించిన కాన్సెప్ట్ ఏదో ఉందని గత కొన్నాళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే గత రెండు వారాల నుంచి సెన్సార్ బోర్డు దగ్గర ఈ సినిమా మల్లగుల్లాలు పడింది. తొలుత 'U/A' సర్టిఫికెట్ ఇచ్చి, కొన్ని సీన్స్ తీసేయాలని చెప్పారు. దర్శకనిర్మాతలు దీనికి ఒప్పుకోలేదట. దీంతో 'A' సర్టిఫికెట్(పెద్దలు మాత్రమే) ఇచ్చినట్లు తెలుస్తోంది. అలానే 27 కట్స్ చెప్పారట. సినిమాలో కంటెంట్ దీనంతటికి కారణం. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?) 'OMG 2' కథేంటి? బాలీవుడ్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఓ కుర్రాడు గే. కాలేజీలో ఈ విషయం తెలియడంతో అందరూ అతడిని ఏడిపిస్తారు. ఆ బాధ తట్టుకోలేక ఓ రోజు ఆత్మహత్య చేసుకుంటాడు. అదే కాలేజీలో ఫ్రొఫెసర్(పంకజ్ త్రిపాఠి)కి ఈ విషయం తెలిసి బాధపడతాడు. పిల్లలకు సె*క్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని, కాలేజీలో ఆ పాఠాలు కంపల్సరీ చేస్తాడు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది. భగవంతుడు కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు భూమ్మీదకు వచ్చిన శివుడు.. ఈ సమస్యని ఎలా పరిష్కరించాడు అనేది పాయింట్ అని టాక్. పోస్టర్లో అక్షయ్ శివుడిగా కనిపించడంతో పైన చెప్పిన స్టోరీ లైన్ నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే శివుడిని అర్థనారీశ్వరుడిగా కొలుస్తుంటారు. శివుడు-పార్వతి కలిసి ఒకే శరీరంలో ఉంటే ఈ పేరుతో పిలుస్తారు. అలానే అబ్బాయిలో అమ్మాయి లక్షణాలు ఉంటే గే అని పిలుస్తుంటారు!! దీన్నిబట్టి చూస్తే 'ఓ మై గాడ్ 2' సినిమా బాక్సాఫీస్ దగ్గర కాంట్రవర్సీలు సృష్టించేలా కనిపిస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో? ఒకవేళ ఇదే గనుక స్టోరీ అయితే మాత్రం థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో? (ఇదీ చదవండి: సాయితేజ్ పక్కనున్న వ్యక్తిని గుర్తుపట్టారా? స్టార్ హీరో కొడుకు!) -
'ఆదిపురుష్' దెబ్బకు ఇరకాటంలో ఆ సినిమా!
OMG 2 Movie Controversy: 'చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం' అని తెలుగులో ఓ సామెత ఉంది. మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ తీరు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే గత నెలలో రిలీజైన 'ఆదిపురుష్' విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు మరోసారి అలా జరగకుండా ముందే జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. దీంతో స్టార్ హీరో నటించిన ఓ సినిమా ఇరకాటంలో పడిందనిపిస్తుంది. అక్షయ్‌కి దెబ్బ మీద దెబ్బ బాలీవుడ్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్‌ది సెపరేట్ రూటు. వేరే ఎవరికీ సాధ్యం కాని విధంగా యమ ఫాస్ట్ గా సినిమాలు చేస్తుంటాడు. ఏడాదికి 5-6 మూవీస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లుగా ఇతడికి అస్సలు కలిసి రావడం లేదు. గతేడాది ఆరు సినిమాలు రిలీజ్ చేస్తే.. అన్నీ బోల్తా కొట్టాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే 'సెల్ఫీ' అని ఓ రీమేక్ తో వచ్చాడు కానీ ఘోరంగా ఫ్లాప్ అయింది. (ఇదీ చదవండి: పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!) దేవుడే రక్షించాలి ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేస్తున్న సినిమా 'ఓ మై గాడ్ 2'. గతంలో వచ్చిన హిట్ చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో శివుడి పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు. తాజాగా టీజర్ విడుదల చేశారు. స్టోరీ ఏంటనేది పెద్దగా చూపించకుండా, కేవలం పాత్రల్ని పరిచయం చేశారంతే. ఈ సినిమా హిట్ అయితేనే అక్షయ్ కాస్తయినా కుదురుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే కష్టమే. కాంట్రవర్సీ కాన్సెప్ట్! ఈ మధ్యే రిలీజైన 'ఆదిపురుష్' విషయంలో సెన్సార్ బోర్డు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. హనుమాన్ డైలాగ్స్ వల్ల చాలామంది తిట్టారు. ఇప్పుడు 'ఓ మై గాడ్ 2'కి అలా జరగక ముందే సెన్సార్ బోర్డు కళ్లు తెరుచుకున్నట్లు తెలుస్తోంది. కథ విషయంలో అభ్యంతరం చెప్పడంతో పాటు రివిజన్ కమిటీ వద్దకు ఈ సినిమాను పంపిందట. టీజర్ లో చూపించినట్లు ఇది దేవుడి సినిమానే అయినప్పటికీ.. అసలు కాన్సెప్ట్ సెక్స్ ఎడ్యుకేషన్, ఎల్జీబీటీక్యూ(ట్రాన్స్‌జెండర్ బైసెక్సువల్ లెస్బియన్) అని తెలుస్తోంది. ఇప్పుడిది కాస్త కాంట్రవర్సీగా మారింది. ఆగస్టు 11న థియేటర్లలోకి రావాల్సి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో ఏంటో? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 19 మూవీస్)