బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం 'ఓ మై గాడ్ 2'(OMG 2). భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్‌ని సంపాదించుకుంది. ఫలితంగా ఫస్ట్‌డే రూ. 10 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లైంగిక విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ దర్శకుడు అమిత్ రాయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో అక్షయ్ శివుడి దూతగా నటించాడు. ఆ పాత్రే ఇప్పుడు వివాదానికి కారణమైంది.
(చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు)
శివుడి భక్తులను అవమానించేలా సినిమా ఉందంటూ కొన్ని హిందూ సంఘాలు ‘ఓ మై గాడ్ 2’ చిత్రబృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రీయ హిందూ పరిషత్ సభ్యులు కొన్ని థియేటర్ల ముందు అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇక ఆగ్రాకు చెందిన ఓ హిందూ సంస్థ అయితే అక్షయ్ కుమార్‌ను చెంపదెబ్బ కొట్టినా, ఉమ్మివేసినా రూ. 10లక్షల బహుమతి అందజేస్తామని ప్రకటించింది.
OMG 2 కథేంటంటే..?
శివ భక్తుడి కాంతి శరణ్ ముగ్దల్(పంకజ్ త్రిపాఠి) తన గ్రామంలోని ఆలయం పక్కనే పూజా స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అతని కొడుకు వివేక్(ఆరుష్ వర్మ) స్కూల్లో అసభ్యకరంగా ప్రవర్తించడంతో సస్పెండ్‌కు గురవుతాడు. అంతేకాదు అతను స్కూల్ వాష్‌రూమ్‌లో చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
దీంతో పరువు పోయిందని భావించిన ముగ్దల్.. భార్య, కొడుకుని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడతాడు. అదే సమయంలో దేవదూత(అక్షయ్ కుమార్)ప్రత్యేక్షమై.. కొడుకు చేసిన పనికి భయపడకుండా దానిపై పోరాటం చేయాలని సూచిస్తాడు. దేవదూత మాటలు విన్న ముగ్దల్ ఎలాంటి పోరాటం చేశాడు? అతను కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది. ఈ పోరాటంలో ముగ్దల్‌కు దేవదూత ఎలాంటి సహాయం చేశాడు? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ.
Comments
Please login to add a commentAdd a comment