Hindu outfits
-
ఆ హీరోని చెంపదెబ్బ కొట్టినా, అతనిపై ఉమ్మినా..రూ.10 లక్షలు నజరానా!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం 'ఓ మై గాడ్ 2'(OMG 2). భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ని సంపాదించుకుంది. ఫలితంగా ఫస్ట్‌డే రూ. 10 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లైంగిక విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ దర్శకుడు అమిత్ రాయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో అక్షయ్ శివుడి దూతగా నటించాడు. ఆ పాత్రే ఇప్పుడు వివాదానికి కారణమైంది. (చదవండి: సిద్ధార్థ్... నాతో నటించడానికి భయపడ్డాడు: ప్రముఖ నటుడు) శివుడి భక్తులను అవమానించేలా సినిమా ఉందంటూ కొన్ని హిందూ సంఘాలు ‘ఓ మై గాడ్ 2’ చిత్రబృందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రీయ హిందూ పరిషత్ సభ్యులు కొన్ని థియేటర్ల ముందు అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇక ఆగ్రాకు చెందిన ఓ హిందూ సంస్థ అయితే అక్షయ్ కుమార్‌ను చెంపదెబ్బ కొట్టినా, ఉమ్మివేసినా రూ. 10లక్షల బహుమతి అందజేస్తామని ప్రకటించింది. OMG 2 కథేంటంటే..? శివ భక్తుడి కాంతి శరణ్ ముగ్దల్(పంకజ్ త్రిపాఠి) తన గ్రామంలోని ఆలయం పక్కనే పూజా స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అతని కొడుకు వివేక్(ఆరుష్ వర్మ) స్కూల్లో అసభ్యకరంగా ప్రవర్తించడంతో సస్పెండ్‌కు గురవుతాడు. అంతేకాదు అతను స్కూల్ వాష్‌రూమ్‌లో చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో పరువు పోయిందని భావించిన ముగ్దల్.. భార్య, కొడుకుని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడతాడు. అదే సమయంలో దేవదూత(అక్షయ్ కుమార్)ప్రత్యేక్షమై.. కొడుకు చేసిన పనికి భయపడకుండా దానిపై పోరాటం చేయాలని సూచిస్తాడు. దేవదూత మాటలు విన్న ముగ్దల్ ఎలాంటి పోరాటం చేశాడు? అతను కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది. ఈ పోరాటంలో ముగ్దల్‌కు దేవదూత ఎలాంటి సహాయం చేశాడు? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ. -
మరో పోరాటానికి హిందూ సంఘాలు
తిరువనంతపురం : కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరోదించడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. న్యాయస్థానం తీర్పును ఏకీభవించిన కేరళ ప్రభుత్వం మహిళల ఆలయంలోకి రావచ్చునని పేర్కింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పలు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని శ్రీ రామ సేన, హనుమాన్ సేన, శ్రీ అయ్యప్ప ధర్మసేన వంటి హిందూ సంఘాలు ప్రకటించాయి. శబరిమల ఆలయంలోకి మహిళ ప్రవేశంపై దాఖలపై పిటిషన్‌ను జస్టిస్ దీపక్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారిస్తూ.. ఆలయాలు ప్రవేటు ఆస్తులు కావని, మహిళలను ఆలయంలోని రాకుండా ఆడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
'పీకే'పై ఆందోళన, థియేటర్లపై రాళ్లదాడి
న్యూఢిల్లీ : ఆమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పీకే సినిమాపై ఉత్తరాది రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. భోపాల్, అహ్మదాబాద్‌లోని "పీకే' సినిమా ఆడుతున్న పలు థియేటర్లను వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు ముట్టడించారు. ఓ మతాన్ని కించపరచారంటూ వారు...సినిమా థియేటర్లపై రాళ్లదాడి చేశారు. ఈ సంఘటనల్లో థియేటర్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా 'పీకే'పై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హిందువులే కాకుండా ముస్లింలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధం విధించాలంటూ పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్‌పీ, బజ్రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి, అఖిల భారత మహాసభ ఆరోపించాయి. మరోవైపు ఈ చిత్రంపై వివాదం రేగినా అందులోని సన్నివేశాలను తొలగించేందుకు మాత్రం సెన్సార్ బోర్డు నిరాకరించింది. -
'పీకే మూవీ నుంచి ఎటువంటి సీన్స్ తొలగించం'
ఢిల్లీ: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన పీకే చిత్రంలో అభ్యంతకరమైన సీన్స్ ఉన్నాయని.. వాటిని తక్షణమే తొలగించాలని నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు స్పందించింది. పీకే చిత్రంలోని ఎటువంటి సన్నివేశాలను తొలగించాల్సిన అవసరం లేదని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. దీనిపై సెన్సార్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) చైర్ పర్సన్ లీలీ శాంసన్ మాట్లాడుతూ.. ఇప్పటికే చిత్రం విడుదలైన నేపథ్యంలో ఎటువంటి సీన్స్ లను తొలగించేందుకు బోర్డు సిద్ధంగా లేదని పేర్కొన్నారు. డిసెంబర్ 19వ తేదీన విడుదలైన 'పీకే' చిత్రంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై హిందువులే కాకుండా ముస్లింలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధం విధించాలంటూ ఆదివారం పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్‌పీ, బజ్రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి, అఖిల భారత మహాసభ ఆరోపించాయి. -
ఆమిర్‌ఖాన్ 'పీకే'పై పెరుగుతున్న వివాదాలు!
న్యూఢిల్లీ/లక్నో: బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ నటించిన తాజా చిత్రం 'పీకే'పై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హిందువులే కాకుండా ముస్లింలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధం విధించాలంటూ ఆదివారం పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్‌పీ, బజ్రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి, అఖిల భారత మహాసభ ఆరోపించాయి. సినిమాపై నిషేధం విధించడంతోపాటు చిత్రంతో సంబంధం ఉన్న వారందరినీ సమాజం నుంచి వెలివేయాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ డిమాండ్ చేశారు. హిందూ సంస్కతిని తక్కువ చేసి చూపే వారి చిత్రాలను ప్రజలు చూడరాదన్నారు. ఇస్లాం, క్రై స్తవ మతాల గురించి ఏదైనా మాట్లాడే ముందు వంద సార్లు ఆలోచించే వ్యక్తులు హిందూ మతం గురించి ఏమాత్రం ఆలోచించకుండా వారికి తోచిన విధంగా మాట్లాడటమో లేదా వారికి నచ్చినట్లుగా సినిమాల్లో చూపించడమో చేయడం మంచి పద్దతి కాదన్నారు. రాందేవ్ డిమాండ్‌కు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా మద్దతు పలికింది. అత్యధికుల మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలు చిత్రం నుంచి తొలగించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్బీ) సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ కోరారు. భావస్వేచ్చ అంటే ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం కాదని అయన పేర్కొన్నారు. మత సామరస్యానికి హాని కలిగించే సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించాలని ఆయన అన్నారు. ఈ చిత్రంపై వివాదం రేగినా ఇందులోని సన్నివేశాలను తొలగించేందుకు మాత్రం సెన్సార్ బోర్డు నిరాకరించింది. మరోవైపు ఈ వివాదంపై ఆమిర్‌ఖాన్ స్పందిస్తూ అన్ని మతాలను తాము గౌరవిస్తామన్నారు. ఈ చిత్రాన్ని తన హిందూ స్నేహితులు చూశారని, వారెవరూ అటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదన్నారు.