ఆమిర్‌ఖాన్ 'పీకే'పై పెరుగుతున్న వివాదాలు! | Hindu outfits demanding a ban on the film PK | Sakshi
Sakshi News home page

ఆమిర్‌ఖాన్ 'పీకే'పై పెరుగుతున్న వివాదాలు!

Published Sun, Dec 28 2014 10:51 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

ఆమిర్‌ఖాన్ 'పీకే'పై పెరుగుతున్న వివాదాలు!

ఆమిర్‌ఖాన్ 'పీకే'పై పెరుగుతున్న వివాదాలు!

న్యూఢిల్లీ/లక్నో: బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ నటించిన తాజా చిత్రం 'పీకే'పై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హిందువులే కాకుండా ముస్లింలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధం విధించాలంటూ ఆదివారం పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్‌పీ, బజ్‌రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి, అఖిల భారత మహాసభ ఆరోపించాయి. సినిమాపై నిషేధం విధించడంతోపాటు చిత్రంతో సంబంధం ఉన్న వారందరినీ సమాజం నుంచి వెలివేయాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ డిమాండ్ చేశారు.

హిందూ సంస్కతిని తక్కువ చేసి చూపే వారి చిత్రాలను ప్రజలు చూడరాదన్నారు. ఇస్లాం, క్రై స్తవ మతాల గురించి ఏదైనా మాట్లాడే ముందు వంద సార్లు ఆలోచించే వ్యక్తులు హిందూ మతం గురించి ఏమాత్రం ఆలోచించకుండా వారికి తోచిన విధంగా మాట్లాడటమో లేదా వారికి నచ్చినట్లుగా సినిమాల్లో చూపించడమో చేయడం మంచి పద్దతి కాదన్నారు. రాందేవ్ డిమాండ్‌కు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా మద్దతు పలికింది. అత్యధికుల మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలు చిత్రం నుంచి తొలగించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్బీ) సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ కోరారు. భావస్వేచ్చ అంటే ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం కాదని అయన పేర్కొన్నారు. మత సామరస్యానికి హాని కలిగించే సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించాలని ఆయన అన్నారు.

ఈ చిత్రంపై వివాదం రేగినా ఇందులోని సన్నివేశాలను తొలగించేందుకు మాత్రం సెన్సార్ బోర్డు నిరాకరించింది. మరోవైపు ఈ వివాదంపై ఆమిర్‌ఖాన్ స్పందిస్తూ అన్ని మతాలను తాము గౌరవిస్తామన్నారు. ఈ చిత్రాన్ని తన హిందూ స్నేహితులు చూశారని, వారెవరూ అటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement