బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఓ మై గాడ్ 2’. అక్షయ్ దేవుడి పాత్రలో నటించి మెప్పించిన ఓ మై గాడ్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఆగస్ట్ 11న థియేటర్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. . లైంగిక విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ దర్శకుడు అమిత్ రాయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో అక్షయ్ శివుడి దూతగా నటించాడు. పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్, గోవింద్ నామ్‌దేవ్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. అక్టోబర్ 8 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ ఎక్స్(ట్విటర్)వేదికగా తెలియజేసింది.
OMG 2 కథేంటంటే..?
శివ భక్తుడి కాంతి శరణ్ ముగ్దల్(పంకజ్ త్రిపాఠి) తన గ్రామంలోని ఆలయం పక్కనే పూజా స్టోర్ నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అతని కొడుకు వివేక్(ఆరుష్ వర్మ) స్కూల్లో అసభ్యకరంగా ప్రవర్తించడంతో సస్పెండ్‌కు గురవుతాడు. అంతేకాదు అతను స్కూల్ వాష్‌రూమ్‌లో చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
దీంతో పరువు పోయిందని భావించిన ముగ్దల్.. భార్య, కొడుకుని తీసుకొని వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడతాడు. అదే సమయంలో దేవదూత(అక్షయ్ కుమార్)ప్రత్యేక్షమై.. కొడుకు చేసిన పనికి భయపడకుండా దానిపై పోరాటం చేయాలని సూచిస్తాడు. దేవదూత మాటలు విన్న ముగ్దల్ ఎలాంటి పోరాటం చేశాడు? అతను కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది. ఈ పోరాటంలో ముగ్దల్‌కు దేవదూత ఎలాంటి సహాయం చేశాడు? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ.
We’ve got great news for you, and OMG can you tell we’re 2 excited? #OMG2 arrives 8 October, on Netflix! pic.twitter.com/1XLpd1sVej
— Netflix India (@NetflixIndia) October 3, 2023
Comments
Please login to add a commentAdd a comment