'చైనాలో మా సినిమాను విడుదల చేస్తాం' | Hope people in China love PK, says Rajkumar Hirani | Sakshi
Sakshi News home page

'చైనాలో మా సినిమాను విడుదల చేస్తాం'

Published Wed, Apr 29 2015 4:42 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

'చైనాలో మా సినిమాను విడుదల చేస్తాం'

'చైనాలో మా సినిమాను విడుదల చేస్తాం'

ముంబై: విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ నటించిన 'పీకే' సినిమాను చైనా ప్రేక్షకులు ఆమోదిస్తారన్న నమ్మకాన్ని దర్శకుడు రాజకుమార్ హిరాణి వ్యక్తం చేశారు. తన గత చిత్రం '3 ఇడియట్స్'కు చైనాలో మంచి స్పందన వచ్చిందని ఆయన గుర్తు చేశారు.

'పీకే సినిమా చైనాలో విడుదల కానుంది. ప్రచారం కోసం మేమంతా చైనా వెళతాం. చైనాలో 3500 నుంచి 4000 ధియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారని విన్నాను' అని హిరాణి పేర్కొన్నారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నడానికి వచ్చిన ఆయన ఈ విషయం వెల్లడించారు.

పీకే సినిమా ఇప్పటికే పాకిస్థాన్, ఆస్ట్రేలియా, సింగపూర్, న్యూజిలాండ్, మలేసియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాల్లో విడుదలైంది. చైనాలో జూలైలో విడుదలకానుంది. దేవుడు పేరుతో మోసాలు చేసే దొంగస్వాముల పట్ల అప్రమత్తంగా ఉండాలనే ఇతివృత్తంతో తెరకెక్కిన 'పీకే' కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ రాజపుత్, సంజయ్ దత్ ముఖ్యపాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement