'వారికి కథ బాగా నచ్చింది' | China is enjoying story of PK movie, says Rajkumar Hirani | Sakshi
Sakshi News home page

'వారికి కథ బాగా నచ్చింది'

Published Thu, Jun 11 2015 7:03 PM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

'వారికి కథ బాగా నచ్చింది'

'వారికి కథ బాగా నచ్చింది'

ముంబై: ప్రాంతంతో సంబంధం లేకుండా 'పీకే' సినిమాను ఆదరిస్తున్నామని దర్శకుడు రాజకుమార్ హిరానీ అన్నారు. చైనాలో 'పీకే' సినిమా వసూళ్లే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈ సినిమాకు చైనాలో వస్తున్న స్పందన తనను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. పీకే సినిమా కథ చైనీయులకు బాగా ఆకట్టుకుందని తెలిపారు. ఈ కథ వారికి కొత్తగా అనిపించిందని పేర్కొన్నారు.

చైనాలో 16 రోజులుగా 4500  స్క్రీన్లపై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న పీకే' సినిమా రూ.100 కోట్లు వసూళ్లు దాటినట్టు వార్తలు వచ్చాయి. చైనాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమాగా పీకే' రికార్డు సృష్టించింది. మే 22న చైనాలో ఈ సినిమా విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement