గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: శు.నవమి ప.2.13 వరకు, తదుపరి దశమి,నక్షత్రం: అశ్విని సా.4.45 వరకు, తదుపరి భరణి,వర్జ్యం: ప.12.58 నుండి 2.30 వరకు, తిరిగి రా.1.41 నుండి 3.11 వరకు, దుర్ముహూర్తం: ప.11.45 నుండి 12.29 వరకు,అమృతఘడియలు: ఉ.10.02 నుండి 11.28 వరకు.
సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం : 5.37
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం...ఇతరుల నుండి ధనలాభం. వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ప్రముఖుల పరిచయం. వృత్తి, వ్యాపారాలు మరింత సమర్థంగా నిర్వహిస్తారు.
వృషభం....వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు. రుణాల కోసం యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
మిథునం....పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తీరతాయి. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కార్యసిద్ధి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.
కర్కాటకం....ఉద్యోగాన్వేషణలో విజయం. పలుకుబడి పెరుగుతుంది. కీలక నిర్ణయాలు. వస్తులాభాలు. పనులు మరింత వేగంగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
సింహం... వ్యవహారాలు ముందుకు సాగని పరిస్థితి. దూరప్రయాణాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. బంధువులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు ఎదురవుతాయి.
కన్య....ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుమిత్రుల నుండి ఒత్తిడులు రావచ్చు. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.
తుల....పరపతి పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. కార్యజయం. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు తీరతాయి.
వృశ్చికం...పరిచయాలు పెంచుకుంటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
ధనుస్సు...రుణభారాలు తప్పదు. వ్యవహారాలలో చికాకులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.
మకరం...కష్టానికి ఫలితం ఉండదు. వివాదాలకు దూరంగా ఉండండి. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బా«ధ్యతలు పెరుగుతాయి.. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
కుంభం....పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవదర్శనాలు. కుటుంబంలో ఉత్సాహంగా ఉంటుంది. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.
మీనం....అనుకున్న కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి. దూరప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. మానసిక ఆందోళన. ఇంటాబయటా సమస్యలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment