
చైనాలో 'పీకే' రికార్డు
బీజింగ్: ఆమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'పీకే' చైనాలోనూ కనక వర్షం కురిపిస్తోంది. మే 22న ఈ చిత్రాన్ని చైనాలో విడుదల చేశారు. పీకే చిత్రం రెండు వారాల్లో 86 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
చైనాలో సినిమా విశ్లేషకుల నుంచి పీకేకు ప్రశంసలు వస్తున్నాయి. రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారత్లో రికార్డు వసూళ్ల సాధించిన సంగతి తెలిసిందే. చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా 'పీకే'గా నిలిచింది. అమెరికా-కెనడాలో ఈ చిత్రం సాధించిన వసూళ్లను చైనాలో అధిగమించడం మరో విశేషం. చైనాలో పీకే చిత్రం 5000 స్క్రీన్లపై ప్రదర్శితమవుతోంది. 2009లో బాలీవుడ్ చిత్రం త్రి ఇడియట్స్ చిత్రం కూడా చైనాలో ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు పీకే అంతకుమించిన విజయం సాధించింది.