చైనాలో రికార్డు సృష్టించిన పీకే | Aamir Khan's PK Makes History With Rs 100 Crore in China | Sakshi
Sakshi News home page

చైనాలో రికార్డు సృష్టించిన పీకే

Published Sun, Jun 7 2015 3:12 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

చైనాలో రికార్డు సృష్టించిన పీకే

చైనాలో రికార్డు సృష్టించిన పీకే

బీజింగ్: ఆమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా 'పీకే' కొత్త రికార్డు సృష్టించింది. చైనాలో విజయవంతంగా ఆడుతున్న పీకే 100 కోట్లు రూపాయల వసూళ్లు సాధించింది. భారత్ వెలుపల ఒకే దేశంలో ఇంత మొత్తం వసూలు తొలి బాలీవుడ్ సినిమాగా పీకే ఘనత సాధించింది. గల నెల 22 న చైనాలో 4600 స్క్రీన్లపై పీకే విడుదలైంది. విడుదలయిన 16 రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
 

రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమీర్ ఖాన్, అనుష్క వర్మ హీరోహీరోయిన్లుగా నటించిన 'పీకే' బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 615 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement