‘సీక్రెట్‌ సూపర్‌స్టార్’ జైత్రయాత్ర | Aamir Khan Secret Superstar to hit 100 million mark in China | Sakshi
Sakshi News home page

‘సీక్రెట్‌ సూపర్‌స్టార్’ జైత్రయాత్ర

Feb 5 2018 7:21 PM | Updated on Feb 5 2018 7:21 PM

Aamir Khan Secret Superstar to hit 100 million mark in China - Sakshi

ఆమిర్‌ ఖాన్‌, జైరా వసీమ్

న్యూఢిల్లీ: చైనాలో ఆమిర్‌ఖాన్‌ ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’  జైత్రయాత్ర కొనసాగుతోంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా 100 మిలియన్‌ డాలర్ల మైలురాయిని అధిగమించే దిశగా దూసుకెళ్తోంది. జనవరి 19న చైనాలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 584.60 కోట్లు (91.29 మిలియన్‌ డాలర్లు) వసూలు చేసినట్టు ప్రముఖ ట్రేడ్‌ ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. తాజాగా విడుదలైన కొత్త సినిమాలను తట్టుకుని చైనా బాక్సాఫీస్‌ వద్ద అగ్రస్థానంలో కొనసాగుతోందని తెలిపారు. గతేడాది అక్టోబర్‌ 19న భారత్‌లో ఈ చిత్రం విడుదలైంది. 2017లో  ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ సినిమాగా నిలిచింది.

ఆమిర్‌ఖాన్‌ సినిమాలకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంతకుముందు ఆయన ప్రధానపాత్రలో నటించిన ‘దంగల్‌’ కూడా చైనాలో అనూహ్య విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ను అదేస్థాయిలో ఆదరిస్తున్నారు. జైరా వసీమ్‌, మెహర్‌ విజ్‌, రాజ్‌ అరున్‌, తిర్థ్‌ శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement