Zaira Wasim
-
'దంగల్' నటి ఇంట్లో విషాదం.. ట్వీట్ వైరల్
'దంగల్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి జైరా వాసిం ఇంట్లో విషాదం నెలకొంది. ఈమె తండ్రి జహిద్ వాసిం మృతి చెందారు. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) ద్వారా జైరా బయటపెట్టింది. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు, ఆమె అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప' విలన్‌కి అరుదైన వ్యాధి.. దీని వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే?)ఇకపోతే జమ్ము కాశ్మీర్లో పుట్టి పెరిగిన జైరా వాసిం.. ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమాలో గీతా ఫొగట్ పాత్రలో బాలనటిగా ఆకట్టుకుంది. దీని తర్వాత ఆమిర్ ఖాన్‌తో 'సీక్రెట్ సూపర్ స్టార్' అనే మూవీలో మరోసారి కలిసి నటించింది. 'స్కై ఈజ్ పింక్' అనే చిత్రంలోనూ కీలక పాత్ర పోషించింది. నటిగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ 2019లో తాను ఇండస్ట్రీకి బైబై చెప్పేసింది. ఇకపై నటించనని క్లారిటీ ఇచ్చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ నమిత విడాకులు తీసుకోనుందా?)My father, Zahid Wasim, has passed away. Please remember him in your prayers and ask Allah to forgive his shortcomings, make his grave peaceful, protect him from its torment, ease his journey from here ahead and grant him the highest level of Jannah and Maghrirah.— Zaira Wasim (@ZairaWasimmm) May 28, 2024 -
సినిమాలకి గుడ్ బై చెప్పిన రెండేళ్లకి.. సోషల్ మీడియాలో ‘దంగల్’ నటి
ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ మూవీ ‘దంగల్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. అందులో చిన్నప్పటి గీతా ఫోగట్‌గా నటించిన జైరా వసిమ్ అంతకంటే ఎక్కువ పాపులారిటీ సాధించింది. సినిమా సక్సెస్ తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడమే కాకుండా మంచి అవకాశాలు సైతం ఆమె తలుపుతట్టాయి. వాటిన్నింటినీ కాదంటూ సినిమాలకి గుడ్‌బై చెప్పింది ఈ నటి. అయితే రెండేళ్ల తర్వాత తాజాగా జైరా వసిమ్ మళ్లీ సోషల్ మీడియాలో అభిమానులను పలకరించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బుర్ఖాలో ఉన్న తన ఫోటో ఒకటి షేర్ చేసింది జైరా. పోస్ట్ చేసిన గంటలోనే ఈ పిక్కి 60వేలకి పైగా లైక్స్ వచ్చాయి. అయితే తన విశ్వాసాలకి ఈ గ్లామర్ ప్రపంచం సరిపోదంటూ 2019లో బాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసింది. సోషల్ మీడియాలో, నెట్టింట్లో ఉన్న తన ఫోటోలన్నింటినీ తొలగించాలని ఫ్యాన్స్‌ని కోరింది. కాగా చాలా కాలం తర్వాత ఇలా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. చదవండి: కొడుకు కోసం మళ్లీ కలిసిన బాలీవుడ్ మాజీ జంట View this post on Instagram A post shared by Zaira Wasim (@zairawasim_) -
ప్లీజ్, నా ఫొటోలు తీసేయండి: నటి విన్నపం
'దంగల్' సినిమాతో పదహారేళ్లకే ప్రేక్షకులకు దగ్గరైన నటి జైరా వసీమ్. అయితే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రెండేళ్లకే సినిమాలకు స్వస్తి పలుకుతూ గతేడాది అభిమానులకు షాకిచ్చారు. జాతీయ అవార్డు పొందిన జైరా చివరిసారిగా ప్రియాంక చోప్రా నటించిన 'ది స్కై ఈజ్ పింక్' సినిమాలో కనిపించారు. తాజాగా ఆమె మరోసారి అభిమానులకు షాకిచ్చారు. సోషల్ మీడియాలో తన ఫొటోలు తొలగించాలన్న నటి విన్నపంతో ఆమె అభిమానుల హృదయం మరోసారి ముక్కలైంది. (చదవండి: ఒకరి బాధకు మీరు కారణం కాకండి: బాలీవుడ్ హీరోయిన్) 'అందరికీ హాయ్!! నా మీద ప్రేమాభిమానాలు కురిపించి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీరంతా నాకో సాయం చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి నా ఫొటోలు తొలగించండి. అలాగే ఫ్యాన్ పేజీలకు కూడా ఇదే చెప్పండి. ఇంటర్నెట్ నుంచి నా ఫొటోలను తొలగించడం ఎలాగో అసాధ్యం. కాబట్టి ఇకపై నా ఫొటోలు ఏవీ షేర్ చేయకండి. అన్నింట్లో మద్దతుగా నిలిచిన మీరు ఈ విషయంలో కూడా నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా. నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నా. మీరు చేసే సాయం వల్ల నాకు ప్రయోజనం దక్కుతుంది' అని జైరా వసీం అభ్యర్థించారు. 'తన ఫొటోలను వాడొద్దన్న విషయాన్ని ఏడాదిగా ఫ్యాన్ పేజీలకు చెప్తూ వస్తున్నానని, అయినా దాన్ని పట్టించుకోనివారు మరోసారి ఈ అభ్యర్థనను ఆలకించండి' అని చెప్పుకొచ్చారు. తరచూ వివాదాల్లో నిలిచే జైరా మే నెలలోనూ ట్రోలింగ్ బారిన పడ్డారు. మే నెలలో దేశంలోని పలు రాష్ట్రాలపై మిడతల దండు దాడి చేసింది. ఈ దాడిని సమర్థించేలా.. 'మానవ చర్యల పాపాల ఫలితమే మిడతల దాడి. వరదలు, ఇతరత్రా వాటికి కూడా మానవ చర్యల తప్పిదాలే అసలైన కారణం. ఖురాన్లో దీన్ని పేర్కొన్నట్లు'గా ఆమె పోస్ట్ పెట్టారు. దీంతో మతాన్ని ఉటంకిస్తూ కామెంట్లు చేయడం మీద నెటిజన్లు ఆమెను దుమ్మెత్తిపోశారు. వెరసి.. ట్రోలింగ్ బెడద తట్టుకోలేక నటి ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను తాత్కాలికంగా డిలీజ్ చేశారు. (చదవండి: ఇప్పటికి నా భార్యకి లవ్ లెటర్స్ రాస్తాను) -
ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్
తన మీద వస్తున్న ట్రోల్స్‌కు గట్టి సమాధానమిచ్చారు బాలీవుడ్ నటి జైరా వసీమ్. ట్రోల్స్‌కు బదులు సానుభూతి చూపించాలని నెటిజన్లను కోరుతూ ఆమె హృదయ పూర్వక లేఖ రాశారు. ప్రతి ఒక్కరూ కఠిన విమర్శలను తట్టుకోలేరని అన్నారు. జాతీయ అవార్డు గ్రహీత, దంగల్ ఫేమ్ జైరా వసీమ్ ఇకపై సినిమాల్లో నటించనని గతేడాది వెల్లడించిన విషయం తెలిసిందే. తనకు వచ్చే పాత్రల ద్వారా మా మతవిశ్వాసాన్ని కోల్పోతున్నాని, అందుకే ఇకపై సినిమాల్లో నటించనని స్పష్టం చేశారు. జైరా చివరి సారిగా ప్రియాంక చోప్రా నటించిన 'ది స్కై ఈజ్ పింక్' చిత్రంలో కనిపించారు. ఇక ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి జైరాను అనేకమంది ప్రశ్నిస్తున్నారు. జైరా ఈ నిర్ణయం తీసుకోవడానికి కేవలం మతం కారణాలు మాత్రమే కాకుండా వేరే కారణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. (మన కథ ముగిసింది: నీతూ కపూర్ ) వీటిపై తాజాగా జైరా వసీమ్ స్పందిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘపోస్టు చేశారు. ‘‘ఒకరి మాటలు, పనులు, తెలివి తక్కువ జోకులు ఇతరులపై అధిక ప్రభావం చూపుతాయి. ఒకరి బాధలు, కష్టాలకు మీరు కారణం కాకండి. మీరు చేసే జోక్స్ వారి ఆత్మగౌరవంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. ఏ వ్యక్తి అయినా అతను కేవలం మీ వల్లే ఓడిపోయానని అనుకుంటున్నాడని మీరు ఊహించుకోండి. మీ జోక్, మీమ్ , కామెంట్లు సరాదాగా అనిపించవచ్చు. కానీ ఎదుటి వాళ్లకు అనేక సమస్యలను, ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ప్రతి ఒక్కరూ ధైర్యవంతులుగా జన్మించలేరు.సున్నితమైన వ్యక్తులు కూడా ఉంటారు. వారు ఇలాంటి విమర్శలను తట్టుకోలేరు. మీ మాటలు ఒకరు ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణమవుతాయి. కొంతమంది వాటిని తట్టుకోలేరు’’. అని పేర్కొన్నారు. (‘గతంలో ఎప్పుడూ చూడని విధంగా..’) View this post on Instagram A post shared by Zaira Wasim (@zairawasim_) on May 1, 2020 at 4:20pm PDT ప్రజలపై ప్రతి ఒక్కరూ సానుభూతి చూపించాలని జైరా వసీమ్ కోరారు. ‘‘మనం ఒరిని తప్పు పడుతున్నాము. కానీ ఒకరిని చూసి ముసిముసిగా నవ్వడం ద్వారా వారిని అపహాస్యం చేసినవారవుతాం. అలా చేయకుండా అందరిపై సానుభూతి, సహాయం, వారికి సలహాలు ఇవ్వండి. దీని ద్వారా వాళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతుంది. వారి ఎదుగుదలకు సహాయపడండి. ఒకరి ప్రవర్తనలో మార్పు వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ జీవితమనే ప్రయాణంలో మనమందరం ఒకరి లోపాలను ప్రేమతో, సానుభూతితో సరిదిద్దుకుందాం’’. అంటూ జైరా వసీమ్ భావోద్వేగంతో ముగించారు. (ఇండస్ట్రీ నాకు తగదు; నష్టమేమీ లేదు!) -
నువ్వే అందంగా ఉన్నావు.. కాదు నువ్వే..
సినిమా షూటింగ్‌లతో, బిజినెస్ ఈవెంట్లతో బిజీ బిజీగా ఉండే గ్లోబల్ స్టార్ ప్రియాంకాకు కాస్త విరామం దొరికనట్లుగా ఉంది. ఏ మాత్రం కూడా ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా తన మేనకోడలు స్కై కృష్ణాతో స్విమ్మింగ్ చేస్తూ సరదాగా గడుపుడుతన్న ప్రియాంక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో స్విమ్మింగ్ సూట్లో ప్రియాంక ఇంకా తన మేనకోడలు కృష్ణాలు ముద్దు ముద్దుగా ఉన్నారంటూ నేటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలాగే స్విమ్మింగ్ ఫూల్ ఉన్న వారిద్దరు.. ఎవరు అందంగా ఉన్నారు.. నువ్వే చాలా అందంగా ఉన్నావు కాదు నువ్వే చాలా క్యూట్‌గా ఉన్నావు’ అంటూ వాదించుకుంటున్న ఈ వీడియోకు ప్రియాంక సన్నీహితులు హర్ట్ ఇమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా క్యూబాకు చెందిన అమెరికా నటుడు అనాబెల్లె అకోస్టా ‘ తను చాలా పెద్దది అంటూ కామెంట్ చేయగా సోషలైట్ నటుడైన పారిస్ హిల్టన్ కళ్లలో హర్ట్ ఉండే ఎమోజీని పెట్టాడు. ఇక సినిమాల విషయానికోస్తే ఈ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక నటించిన తాజా చిత్రం ‘ దీ స్కై ఇజ్ పింక్’ అక్టోబర్ మొదటి వారంలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రియాంక రోగనిరోధక శక్తి లోపంతో జన్మించిన అమ్మాయిగా ఈ సినిమాలో కనిపించారు. ఇది గురుగాన్కు చెందిన ఐశా చౌదరి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో ఐశా తన ఆరోగ్యం క్షిణించే వరకు తన కుటుంబంతో కలిసి ఈ వ్యాధిని తగ్గించడానికి 2015 వరకు పోరాటం చేస్తుంది. అలాగే ఈ సినిమాలో ప్రియాంకతోపాటు ఫర్హాన్ అక్తర్, జైరా వసీం కూడా నటించారు. View this post on Instagram We’re so cute ! @sky.krishna ❤️ #positiveaffirmations #blessednotstressed #girllove 📸 @divya_jyoti A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Oct 16, 2019 at 8:51pm PDT -
‘ఆమెకు నిర్ణయం తీసుకునే సత్తా ఉంది’
ముంబై: బాలీవుడ్ నటి జైరా వసీమ్ అత్యంత ప్రతిభావంతురాలని, దంగల్‌లో ఆమె నటనకు జాతీయ అవార్డు వచ్చిందని గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా అన్నారు. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ వంటి సినిమాలలో జైరా నటన అమోఘమని కొనియాడారు. భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే సత్తా తనకు ఉందని ప్రియాంకా ప్రశంసించారు. తన మత ఆచారాలకు ఆటంకం కలుగుతున్న కారణంగా.. ఇక మీదట బాలీవుడ్లో నటించబోనని జైరా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆమె నిర్ణయాన్ని బాలీవుడ్లో పలువురు సమర్థించగా, మరికొందరు వ్యతిరేకించారు. ప్రస్తుతం జైరా, ప్రియాంక కాంబినేషనల్లో ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ప్రియాంక సమాధానమిచ్చారు. మోటివేషనల్ స్పీకర్ ఈషా చౌదరి తల్లిదండ్రుల ప్రేమకథగా ఈ చిత్రం రూపొందిందని అన్నారు. ఇక ఈ సినిమాలో ఈషాగా జైరా నటిస్తుండగా..ఆమె తల్లిదండ్రులుగా ఫర్హాన్ అక్తర్, ప్రియాంకా చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. కూతురు ఈషాకు రోగనిరోదక వ్యవస్థ లోపం కారణంగా వచ్చే పల్మనరీ ఫైబ్రోసిస్ ఉన్నట్లు డాక్టర్లు నిర్దారించగా, కూతురు కోసం తల్లడిల్లే తల్లి పాత్రలో ప్రియాంకా కనిపించనున్నారు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం.. అందులోనూ కూతురికి అనారోగ్యం వంటి దుస్థితిని ఎదుర్కొనే అదితి పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఇక నటుడు రోహిత్ శరీఫ్ ఈ సినిమాలో జైరాకు అన్నగా నటిస్తున్నాడు. -
ప్రియాంకకు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన బాలీవుడ్ చిత్రం ‘ది స్కై ఈజ్ పింక్’ ట్రైలర్ నిన్న విడుదలయ్యింది. షోనాలీ బోస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫర్హాన్ అక్తర్, జైరా వసీం కీలక పాత్రలు పోషించారు. చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురై.. 15 ఏళ్లకే మంచి వక్తగా, కవయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ ట్రైలర్‌పై బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తుండగా.. ఓ సన్నివేశంపై మహారాష్ట్ర పోలీసులు చేసిన కామెంట్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ట్రైలర్లో ప్రియాంక, ఫర్హాన్ అక్తర్‌లు తమ కుమార్తె అనారోగ్యం గురించి చర్చిస్తూ.. వీలైనంత త్వరలోనే ఓ బ్యాంక్‌ను దోపిడి చేయాలి.. అలాగైతేనే తనకు వైద్యం చేయించగల్గుతాం అని మాట్లాడుకుంటారు. ఈ సన్నివేశంపై మహారాష్ట్ర పోలీసులు స్పందిస్తూ.. ‘ప్రియాంక బ్యాంక్ దోపిడికి పాల్పడితే.. ఐపీసీ సెక్షన్ 393 ప్రకారం ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు’ అంటూ ట్విటర్లో ‘స్కై ఈజ్ పింక్’ టీమ్‌ను ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్‌పై ప్రియాంక వెంటనే స్పందిస్తూ.. ‘అరెరే రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి పోయాం కదా. అయితే ప్లాన్ బీని అమలు చేద్దాం’ అంటూ రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్ల సంభాషణ నెటిజనులను ఆకట్టుకుంటుంది. ఈ నెల 13న టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 'స్కై ఈజ్ పింక్' సినిమాను ప్రదర్శించనున్నారు. -
అసలు అలా ఎందుకు చేశానో?!
‘దంగల్’ స్టార్ జైరా వసీం సినిమాల నుంచి తప్పుకొంటున్నానని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె నటించిన తాజా సినిమా ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొనబోనని స్పష్టం చేశారు. ఇందుకు నిర్మాతలు కూడా సమ్మతించారు. అయితే సినిమా ప్రచారం కోసమే జైరా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందంటూ కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అదే విధంగా ఇకపై మత విశ్వాసాలకు లోబడి ఉండేందుకే ఇండస్ట్రీని వీడుతున్నానన్న జైరా ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేన్సర్‌తో పోరాడుతున్న బెంగాల్ నటి నఫీసా అలీ కూడా జైరా నిర్ణయంపై స్పందించారు. ఆ భగవంతుడు ప్రతీ ఒక్కరికీ కలలు నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చాడు..కాబట్టి ఎవరూ ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘ సరికొత్త నేను.. వయస్సు మీద పడి తెల్లజట్టు వచ్చింది. అయినా ఇప్పటికీ సానుకూల దృక్పథంతోనే ఉన్నా. 20 ఏళ్ల ప్రాయంలో ఎలా ఉన్నానో కూడా నాకు గుర్తుంది. ఇక నటి జైరా వసీం విషయంలో నేను చాలా ఫీలవుతున్నాను. ఏ పని చేయాలో నిర్ణయించుకునే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అదే విధంగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛా-స్వాతంత్ర్యాలు ఉంటాయి. ప్రస్తుతం యువత ఎన్నో ఒత్తిళ్లతో సతమవుతోంది. అయితే చాయిస్ తీసుకునే అవకాశం లభించినపుడు కచ్చితంగా సరైన దాన్ని ఎంచుకోవడమే మంచిది. ఎందుకంటే నేను ఇప్పటికి ఒక్కసారి గత జీవితంలోకి తొంగి చూసుకుంటే... నాన్న మాట ఎందుకు విన్నాను. నిజానికి నా మనసు మాట విని ఉంటే బాగుండేది కదా అని పశ్చాత్తాపడుతుంటాను’ అని నఫీసా అలీ తన అనుభవాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అదే విధంగా ఈ పోస్టు కొంత మందికైనా ధైర్యాన్ని ఇస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఇక తనకు ఇంకా సినిమాల్లో నటించే ఓపిక ఉందని... పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఉంటే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. తన భావోద్వేగాలను ప్రతిబింబించేందుకు తప్పక సినిమాల్లో నటిస్తానని, తన నిర్ణయాన్ని సవాలు చేసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. భారత్ ఒక ప్రత్యేక దేశమని.. ఇక్కడ విభజన రాజకీయాలు చెల్లవు కాబట్టి లౌకిక భావన పెంపొందించాలని సంప్రదాయవాదులకు చురకలంటించారు. కాగా బెంగాల్లో జన్మించిన నఫీసా ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. నసీఫా తాతయ్య వాజిద్ అలీ ప్రముఖ రచయిత. ఇక ఆమె మేనత్త జైబ్-ఉన్నీసా- హమీదుల్లా స్త్రీవాదిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఒవేరియన్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న నసీఫా చికిత్స తీసుకుంటున్నారు. View this post on Instagram This is the new me ... older , grey and feeling positive . "I saw myself when I was 20 and I just felt for young actor Zaira Wasim . I thought let me put this message out that work is something which is your choice, it is your freedom, your independent right. There are many pressures young people are surrounded by... but if you have a choice, make you sure you think and make the right choice." "Because I always look back and say why did I give in, why did I listen to my father, I should have listened to myself “. A post shared by nafisa ali sodhi (@nafisaalisodhi) on Jul 2, 2019 at 1:18am PDT -
ఆకాశానికే ఊపిరి పోసింది
ఊపిరి ఉండేదే ఆకాశంలో. అవును. అంత తేలిగ్గా ఉంటుంది మరి. మనం పిచ్చివాళ్లం.ఊపిరి మనది అనుకుంటాం. నలుగురికి ప్రాణం పోసేదే ఊపిరి. జీవం ఇచ్చేదే ఊపిరి. ధైర్యం చూపేదే ఊపిరి. ఆయేషాకు పందొమ్మిదేళ్లు. ఊపిరి ఆగిపోయింది. మనందరికీ ఊపిరిగా మిగిలిపోయింది. ది స్కై ఈజ్ పింక్. అక్టోబర్ 11న రిలీజ్ కావలసిన బాలీవుడ్ పిక్చర్. ఏమిటిప్పుడు! రిలీజ్ అవడం లేదా? అవుతోంది. ప్రోమోషన్ టూర్లకు కూడా నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఒక్కరు మాత్రం ‘సారీ.. అయామ్ నాట్ అవైలబుల్’ అన్నారు. ఆ మాట అన్నది జైరా వసీమ్! సినిమాలో మెయిన్ క్యారెక్టర్ తనదే. చిన్నమ్మాయి కనుక నిర్మాతలు పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. ‘ఇట్సాల్ రైట్’ అని చిరునవ్వు నవ్వారు. అసలు ఈ చిన్నమ్మాయి (19) జూన్ 29నే ఒక పెద్ద ప్రకటన చేశారు. ఇక మీదట తను సినిమాల్లో నటించబోవడం లేదని! కారణం కూడా చెప్పారు. మతవిశ్వాసాలకు లోబడి ఉండబోతున్నానని. అలా అని సోషల్ మీడియాలో పెద్ద పోస్టే పెట్టారు. అభినందించినవారు అభినందించారు. విమర్శించినవారు విమర్శించారు. అన్నిట్లోకీ పెద్ద అభినందన ఒమర్ అబ్దుల్లా పెట్టిన ట్వీట్. ‘తనకు ఏది హ్యాపీగా అనిపిస్తే అదే చెయ్యనివ్వండి. మనమెవరం మధ్యలో మాట్లాడేందుకు!’ అన్నారు అబ్దుల్లా. జమ్మూకశ్మీర్ లీడర్ ఆయన. ఒకప్పటి ముఖ్యమంత్రి కూడా. ఇక జైరాకు వచ్చిన అతి చెత్త విమర్శ.. సినిమా ప్రమోషన్లో భాగంగా కోసం ‘యాక్ట్’ చేస్తోందని! జైరా వసీమ్‌కు యాక్ట్ చేసే అవసరం లేదని ఇప్పటివరకు ఆమె నటించిన రెండు సినిమాల్లో ఆమె చేసిన యాక్షన్ చూస్తే అర్థమౌతుంది. ‘దంగల్’, ‘సీక్రెట్ సూపర్ స్టార్’.. రెండూ శుభ్రమైన సినిమాలు. టీన్స్‌ని ఇన్స్పైర్ చేసేవి. త్వరలో రాబోతున్న మూడో సినిమా ‘ది స్కై ఈజ్ పింక్’ కూడా అలాంటిదే. ఐషా చౌదరి అనే టీనేజ్ అమ్మాయి బయోపిక్ అది. దంగల్‌లోని గీతా ఫోగట్, సీక్రెట్ సూపర్ స్టార్‌లోని ఇన్సియా మాలిక్, ఇప్పుడీ స్కై ఈజ్ పింక్లోని ఐషాలకు జైరా సరిగ్గా సరిపోయారు. మొదటి సినిమా.. కూతురు మీద తండ్రి పెట్టుకున్న ఆశల్ని కూతురు నెరవేర్చడం. రెండో సినిమా.. కూతురు ఆశల్ని పట్టించుకోని తండ్రికి తెలియకుండా కూతురు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడం. మూడో సినిమా.. చిన్న వయసులోనే శ్వాసకోశ వ్యాధి బారిన పడిన ఓ టీనేజర్.. మనుషులు తమ ఆశల్ని, ఆశయాల్ని నెరవేర్చుకునేలా మోటివేట్ చేయడం. కథలో లైఫ్ ఉంది. కథను సినిమాగా తీసిన వాళ్లలో స్కిల్ ఉంది. సినిమాలో ముఖ్యపాత్రగా నటించిన జైరాలో టాలెంట్ ఉంది. ఇన్ని ఉన్నప్పుడు మూవీ ప్రమోషన్ నుంచి జైరా క్విట్ అవడంలో వ్యూహం ఏముంటుంది? మనసులో ఉన్నదాన్ని క్లియర్‌గా చెప్పే వయసునింకా ఆమె దాటి రానేలేదు. అదలా ఉంచితే, ‘ది స్కై ఈజ్ పింక్’ను.. ఆ చిత్రంలో జైరా తల్లిగా నటించిన ప్రియాంక చోప్రా గానీ, తండ్రిగా నటించిన ఫర్హాన్ అఖ్తర్ గానీ సాదాసీదా స్టార్లేమీ కారు. సినిమాను వాళ్లు ప్రమోట్ చేయగలరు. చిత్ర దర్శకురాలు సోనాలీ బోస్‌కు ఉన్న ఫేస్ వాల్యూ తక్కువేమీ కాదు. సినిమాను ఆమె ప్రమోట్ చేయగలరు. చిత్ర నిర్మాతలు సిద్ధార్థ్‌రాయ్ కపూర్, రోనీ స్య్రూవాలా! ప్రమోషన్లో వాళ్లను మించినవారెవరు? వీళ్లందరూ చేయకున్నా పోయిందేమీ లేదు. ‘ది స్కై ఈజ్ పింక్’ రిలీజ్ అయ్యాక ఆ సినిమా తనకు తాను ప్రమోట్ చేసుకోగలదు. అంత జీవితం ఉంది కథలో. జీవితం కోసం థియేటర్లకు వెళతారా ప్రేక్షకులు! జీవితంలో ఊపిరి ఆడకే కదా ఆ రెండున్నర గంటలు బతికేందుకు వెళతారు. కావచ్చు. కానీ ఐషా జీవితంలో పదిమందిని బతికించే శక్తి ఉంది. బతకమని ఇన్స్పైర్ చేసే గుణం ఉంది. అందుకే ‘ది స్కై ఈజ్ పింక్’ కు కథానాయిక అయింది. ∙∙ ఐషా జీవితంలోని తొలి రోజు 1996 మార్చి 27. ఆ రోజున ఆమె పుట్టింది. ఐషా జీవితంలోని చివరి రోజు 2015 జనవరి 24. ఆ రోజు ఆమె మరణించింది. ఈ మధ్యలోని పందొమ్మిదేళ్లలో చివరి నాలుగేళ్లు ఆమె తన స్పీచ్‌లతో యువతను మోటివేట్ చేశారు. పద్దెనిమిదేళ్ల వయసుకే పుణెలోని టెడ్‌లో (టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్, డిజైన్) స్పీకర్‌గా పని చేశారు. ‘మై లిటిల్ ఎపిఫనీస్’ అనే పుస్తకం రాశారు. ఆమె చనిపోవడానికి ముందు రోజు ఆ పుస్తకం రిలీజ్ అయింది. జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో పుస్తకావిష్కరణ అనంతరం ఐషా గుర్గావ్లో కన్నుమూశారు. ఐషా తండ్రి నిరేన్ చౌదరి. అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ కంపెనీ ‘యమ్ బ్రాండ్’ దక్షిణాసియా విభాగంలో పెద్ద ఉద్యోగి. తల్లి అదితి.. మెంటల్ హెల్త్ వర్కర్. అన్నయ్య ఇషాన్. ఇదీ ఐషా ఫ్యామిలీ. ఢిల్లీలో ఉంటారు. పుట్టుకతోనే ఐషాకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంది. ఆరేళ్ల వయసులో బోన్‌మ్యారో మార్పిడి జరిగింది. సైడ్ ఎఫెక్ట్‌గా పల్మనరీ ఫైబ్రోసిస్ వృద్ధి చెందింది. చివరికి శ్వాసకోశాలు దెబ్బతిని ఐషాను మృత్యువు లాక్కెళ్లింది. ఆమెతో పాటు ఆమె తన ప్రసంగాలతో నిలబెట్టవలసిన ఎంతోమంది జీవితాల్లోని భాగ్యాన్ని కూడా! అయితే ఐషా గురించి ఇదంతా పైపై కథ. ఐషా లోపల ఇంకో జీవితం ఉంది. అది.. ఆలోచనల జీవితం. మనిషి ఆలోచనలే మనిషి అనుకుంటే.. ఐషా ఇంకా బతికే ఉన్నట్లు. ‘మై లిటిల్ ఎపిఫనీస్’ ఆమెను సజీవంగా ఉంచినట్లు. ∙∙ ఐషా తన జీవితాన్ని ఎలా అర్థం చేసుకుందో, జీవితంలో తను ఏం కనిపెట్టిందో, జీవితంలో ఏది ముఖ్యమని గ్రహించిందో, జీవితాన్ని తను ఏ విధంగా అవలంబించిందో అదే.. మై లిటిల్ ఎపిఫనీస్. ఇంత చిన్న వయసులోనా! అందుకే కదా.. జైనా వసీమ్ ఆ పాత్రకు చక్కగా సరిపోయారు. ‘ఎపిఫనీ’ అంటే అవగాహన పరచుకోవడం. ‘నాకొక కొత్త జత షూ కావాలి.. ఈసారి నా నుంచి నేను పరుగెత్తి పోడానికి’ అని పుస్తకంలో ఒక చోట రాసుకున్నారు ఐషా. జీవితం నుంచి వెళ్లిపోయే రోజున ‘ఎక్కడికెళతావ్..’ అని మనం పెంచుకుంటున్న కుక్కపిల్ల కూడా బలంగా కాళ్లకు చుట్టేసుకుంటుందని ఆమెకు మాత్రం తెలియదా? ఐషాను అంటుకుని ఎప్పుడూ కోబో, రోలో అనే రెండు పెంపుడు కుక్కలు ఉండేవి. రోలో చనిపోయింది. పుస్తకం ప్రారంభంలోనే రెండు మూడు పేజీల తర్వాత రోలో గురించి ఉంటుంది. ‘మై డియరెస్ట్ డార్లింగ్, రోలో.. మాటలు రావడం లేదు. బేబీ.. నువ్వు లేకుండా నాకు ఊపిరి అందుతుందా? నా జీవితానికి కాంతివి నువ్వు. నా వేకువకు కారణం నువ్వు. నా శక్తివి. నువ్వే అన్నీ. నా అనారోగ్యాన్ని నీ కళ్లలోకి తీసుకున్నావు. మరీ అంతగా తీసుకోవద్దని చెప్పేలోపే అకస్మాత్తుగా నాకన్నా ముందే నువ్వు వెళ్లిపోయావు. నిన్నెప్పటికీ మర్చిపోలేను’ అని రాసుకున్నారు ఐషా. ఐదువేల పదాల ఆలోచనలున్న ఈ పుస్తకం చెప్పేదొక్కటే. మనిషి చనిపోవచ్చు... ఆశ చావకూడదని. తన స్పీచ్‌లలో.. అంత చిన్న వయసులో ఐషా ప్రతిచోటా ఇదే మాట చెప్పేవారు. బహుశా ఈ మాటలే ఆమె కూడా తన మరణాన్ని తేలిగ్గా తీసుకునేలా చేసి ఉండాలి. ఇంగ్లిష్‌లో ‘ఇన్ ది పింక్’ అనే మాట ఉంది. గుడ్ కండిషన్లో ఉందని చెప్పడం. ‘ఇన్ ది పింక్ ఆఫ్ హెల్త్’ అంటే.. ఇన్ వెరీ గుడ్ హెల్త్ అని. ఐషా ఊపిరి ఆకాశానికి చేరుకుంది. ఆకాశాన్ని ఆరోగ్యవంతం చేసింది. అందుకేనా ఈ చిత్రానికి ‘ది స్కై ఈజ్ పింక్’ అని పేరు పెట్టారు! జీవిత పరమార్థంపై ఐషా ఇచ్చిన ప్రసంగం నాకు స్ఫూర్తిని ఇచ్చింది. – దీపక్ చోప్రా, ప్రముఖ రచయిత, ప్రజావక్త -
సినిమా ప్రమోషన్‌కు గుడ్‌బై చెప్పిన జైరా
దంగల్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జైరా వసీమ్ ‘ఇక నుంచి తాను సినిమాల్లో నటించబోనని’ ఇటివలే ‘సోషల్’ మాధ్యమంలో ప్రకటించారు. తాను తీసుకొన్న నిర్ణయంలో భాగంగానే జైరా, తన రాబోయే చిత్రం ‘ది స్కై ఈజ్ పింక్’ ప్రమోషన్లలో భాగం కావడం లేదని పేర్కొంది. ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్ జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగానే సినిమా ప్రమోషన్లను ఆగస్టు చివరి నాటికి ముగించాలని చిత్ర బృందం భావిస్తుండగా, సినిమా ప్రచార కార్యక్రమాల్లో తాను పాల్గోనబోనని జైరా మూవీ మేకర్లను అభ్యర్థించింది. జైరా తీసుకున్న నిర్ణయానికి ‘ది స్కై ఈజ్ పింక్’ నిర్మాణ బృందం తమ మద్దతు ప్రకటించారు. తమ చిత్రంలో ‘ఆయేషా చౌదరీ’ పాత్రకు ప్రతిభావంతులైన జైరాను నటిగా పొందడం తమ అదృష్టమని, సినిమా షూటింగ్ ఆద్యంతం ఆమె పూర్తి ప్రొఫెషనల్‌గా ఉన్నట్లు వారు తెలిపారు. ‘సినిమాల నుంచి తప్పుకుంటానని జైరా తీసుకొన్న నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఆమెకు ఎల్లవేళలా తమ మద్దతు ఉంటుందని‘ నిర్మాణ బృందం పీటీఐకి ఇచ్చిన ఓ ప్రకటనలో తెలిపారు. జైరా సినిమాలు మానేయడానికి గల కారణాలను వివరిస్తూ జైరా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటివలే ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. కాగా, దంగల్ చిత్రంలో ఆమె చేసిన నటనకుగాను ఉత్తమ సహాయ నటిగా ‘జాతీయ చలనచిత్ర అవార్డు’ కూడా అందుకున్నారు. -
ఇండస్ట్రీ నాకు తగదు; కేవలం రెండు సినిమాలకే..
‘కేవలం రెండు సినిమాల్లో నటించిన వారు ఇండస్ట్రీకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఎలాంటి నష్టం లేదు. అన్నీ ఇచ్చిన ఇండస్ట్రీ నుంచి కృతఙ్ఞతా భావంతో వెళ్లిపోతే బాగుంటుంది. పరిశ్రమపై వారి దురభిప్రాయాలను వారితో అంటిపెట్టుకుంటేనే బాగుంటుంది’ అంటూ బాలీవుడ్ నటి రవీనా టాండన్.. జైరా వసీమ్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ‘దంగల్’ సినిమాలో ఆమిర్ ఖాన్ కుమార్తె పాత్రలో కనిపించిన జైరా... సినిమాల నుంచి తప్పుకొంటున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు..‘ ‘‘ఐదేళ్ల క్రితం నేను తీసుకున్న నిర్ణయం (యాక్టర్‌గా మారాలని) నా జీవితాన్ని మార్చేసింది. ఎంతో ప్రేమను, అభిమానాన్ని ఇచ్చింది. ఈ ఇండస్ట్రీకి నేను తగినదాన్ని అయినా ఇండస్ట్రీ నాకు తగదనిపిస్తోంది.. నా ప్రశాంతతను కోల్పోయే పని చేయదలుచుకోలేదు.. అందుకే ఇండస్ట్రీ నుంచి వైదొలగాలనుకుంటున్నాను’’ అని ట్విటర్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో జైరా వ్యాఖ్యలపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం మతం కారణంగా లేదా మరే ఇతర కారణాల వల్లనో ఇండస్ట్రీలో అవకాశాలు చేజారవని, కేవలం ప్రతిభ కారణంగానే ఇక్కడ నిలదొక్కుకోగలుగుతారని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఖాన్ల త్రయంతో పాటు వహీదా రెహమాన్, నర్గిస్, షబానా అజ్మీ, జీనత్ వంటి ఎంతోమంది ముస్లిం నటీనటులు ఇండస్ట్రీలో అగ్రపథాన నిలిచారని.. వారెవరికీ రాని ఇబ్బందులు జైరాకే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పందించిన నటి రవీనా టాండన్..‘ ఇండస్ట్రీని ఎల్లవేళలా ప్రేమిస్తాను. ప్రతీ ఒక్కరికి ఎన్నో అవకాశాలు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్లిపోవడం అనేది వ్యక్తిగత నిర్ణయం. అయితే వెళ్లేముందు.. మన ప్రతిభ నిరూపించుకునేందుకు అవకాశమిచ్చిన ఇండస్ట్రీని కించపరిచేలా మాట్లాడటం సరైంది కాదు. ఇక్కడ అందరూ కలిసే పనిచేస్తారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా అంతా భుజం భుజం కలిపి పనిచేస్తారు’ అని జైరా తీరును విమర్శించారు. ఇక మరికొంత మంది మాత్రం తన జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు జైరాకు ఉందని.. ఆమెను విమర్శించేందుకు మీరెవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఈ విషయంపై స్పందించారు. ‘ జైరా వసీం నిర్ణయాన్ని సవాల్ చేసేందుకు మీరెవరు? తనకు సంతోషాన్నిచ్చే పనులనే తను చేస్తుంది. తను ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. I standby and love my industry,all the opportunities it gives to everyone. Exit is your choice,reason,by all means.Just do not demean it for everyone else.The industry where all work shoulder to shoulder,no differences,caste,religion or where you come from. #Respect #indianfilms https://t.co/hRJKTfI9J8 — Raveena Tandon (@TandonRaveena) June 30, 2019 -
మత విశ్వాసాన్ని కాపాడేందుకే : జైరా
జాతీయ అవార్డు గ్రహీత, దంగల్ ఫేమ్ జైరా వసీమ్ ఇకపై సినిమాల్లో నటించనని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆదివారం వెల్లడించారు. తనకు వచ్చే పాత్రల ద్వారా మా మతవిశ్వాసాన్ని కోల్పోతున్నాని, అందుకే ఇకపై సినిమాల్లో నటించనని స్పష్టం చేశారు. 'నేను బాలీవుడ్లో అడుగుపెట్టి 5 సంవత్సరాలయింది. దంగల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాకు అనతికాలంలోనే బాలీవుడ్లో మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. సినిమాల్లో నేను పోషించే పాత్రల ద్వారా ఇప్పటి యువతకు ఒక రోల్‌మోడల్‌గా నిలవాలని అనుకున్నాను. అయితే ఈ ఐదేళ్లలో కెరీర్ పరంగా సంతృప్తిగా ఉన్నా, నిజ జీవితంలో మాత్రం సంతోషంగా లేను. నాకు వస్తున్న పాత్రల ద్వారా ఎక్కడ నేను మత విశ్వాసాన్ని కోల్పోతానేమోనని భయంగా ఉంది. నిత్యం ఖురాన్‌ను పఠిస్తున్న నాకు జీవితం ముగిసిపోయేలోగా సమాజానికి నావంతుగా ఏదైనా మంచి చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాను. సినిమా ఫీల్డ్‌లో ఉంటూ నాకున్న భాద్యతలను సక్రమంగా నిర్వర్తించలేనని, అందుకే సినిమాలను వదిలేస్తున్నాన'ని జైరా వసీమ్ పేర్కొన్నారు. 2016లో విడుదలైన దంగల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు జైరా వసీమ్. మొదటి సినిమాతోనే ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 2017లో సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలో నటించి మరో ఘన విజయాన్ని దక్కించుకున్నారు. ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు అవార్డును తీసుకున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్ నటిస్తున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే జైరా వసీమ్ సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. -
కొబ్బరికాయ కొట్టారు
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా కొబ్బరికాయ కొట్టి దిష్టి తీశారు. దిష్టి తీసింది మనుషులకు కాదు. కొత్త లొకేషన్‌కి. ఎందుకంటే..‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రం కోసం. సోనాలి బోస్ దర్శకత్వంలో ఫర్హాన్ అక్తర్, ప్రియాంకా చోప్రా, ‘దంగల్’ ఫేమ్ జైరా వసీమ్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ముంబైలో పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం తాజా షెడ్యూల్ లండన్‌లో ప్రారంభమైంది. చిత్రీకరణకు అంతరాయం కలగకుండా లొకేషన్‌కు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టారు ప్రియాంక. ఇటీవల ప్రియాంక, నిక్ జానస్ల నిశ్చితార్థం జరిగింది. నిక్, ప్రియాంకల వివాహం రాజస్తాన్‌లోని జోధాపూర్లో నవంబర్‌లో జరుగనుందని బాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. -
నాలుగు గెటప్స్‌లో...
ప్రియంకా చోప్రా హిందీ సినిమాల్లో కనిపించి సుమారు రెండేళ్లు అయిపోయింది. అయితే ఈ గ్యాప్‌ని మర్చిపోయేంత స్పెషల్‌గా తనతాజా చిత్రం ఉండేలా చూసుకుంటున్నారామె. ఈ సినిమాలో 21ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారట. ప్రియాంకా చోప్రా, ఫర్హాన్ అక్తర్, జైరా వసీమ్ ముఖ్య పాత్రల్లో సోనాలి బోస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్కై ఈజ్ పింక్’. ఈ సినిమాలో జరీనా తల్లిగా ప్రియాంక కనిపించనున్న సంగతి తెలిసిందే. చిన్న వయసులో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అసలు బ్రతకడమే కష్టమని డాక్టర్స్ చెప్పినా మోటివేషనల్ స్పీకర్‌గా, ఒక పుస్తక రచయితగా కూడా తన ప్రతిభ చాటుకున్న అయేషా చౌదరి కథనే ఈ చిత్రానికి మూలం. ఇందులో అయేషా పాత్రలో జైరా కనిపిస్తారు. ఈ చిత్రం ఉద్వేగంగాను, స్ఫూర్తినిచ్చే విధంగానూ ఉంటుందట. 30 ఏళ్ల కాలంలో జరిగే కథ కావడంతో వయసులోని వివిధ దశల వారీగా ప్రియాంకా లుక్స్ ఉండనున్నాయట. -
18 ఏళ్ల కూతురికి తల్లి!
ప్రియాంకా చోప్రా తల్లి పాత్రలో కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. హీరోయిన్గా స్టార్ స్టేటస్‌తో దూసుకెళ్తున్నవారు తల్లి పాత్రలో నటించేందుకు అంతగా ఆసక్తి చూపరు. అయితే.. ఇందుకు కొందరు మినహాయింపు. పాత్ర నచ్చాలే కానీ చాలెంజింగ్‌గా తీసుకుని నటిస్తారు. ఇప్పుడు ప్రియాంక కూడా తల్లి పాత్రను ఓ చాలెంజ్‌గా తీసుకోబోతున్నారట. ఆ మధ్య వరుస హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవల బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో ‘భరత్’ చిత్రంలో నటిస్తున్నారు ప్రియాంక. ఆ సినిమా తర్వాత సోనాలి బోస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో 18 ఏళ్ల కూతురికి తల్లిగా నటించనున్నారట ఈ బ్యూటీ. అయేషా చౌదరి అనే యువతి 18 ఏళ్లకే ‘ఇమ్యునోడెఫిషియన్సీ’ వ్యాధితో (రోగ నిరోదక శక్తి లోపించడం) మృతి చెందారట. ఆమె జీవితం ఆధారంగానే ఈ సినిమా ఉండనుందని సమాచారం. అయేషా పాత్రలో ‘దంగల్’ ఫేమ్ జైరా వసీమ్ నటించనుండగా, ఆమె తల్లిగా ప్రియాంక నటిస్తారట. ఈ చిత్రంలో ప్రియాంక భర్తగా అభిషేక్ బచ్చన్ కనిపించనున్నారట. ఈ ఏడాది ఆఖర్లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. -
చనిపోవాలనుకున్నా: నటి సంచలన పోస్ట్
‘‘నిజానికి అది నరకం అన్న సంగతి కూడా నేను గుర్తించలేకపోయా. కొందరు ‘చిన్నపిల్లవేగా నీకేంటమ్మా సమస్య’ అనేవాళ్లు. ఇంకొందరేమో ‘లైఫ్‌లో ఇదొక ఫేజ్ అంతే’ అని చెప్పేవాళ్లు. నాకు రాత్రుళ్లు ఉన్నట్టుండి దిగ్గున మెలకువ వచ్చేది. అప్పటిదాకా నిద్రపోలేదన్న సంగతి గుర్తొచ్చి ఏడుపొచ్చేది. నాలో కోపం ఎందుకు పెరుగుతోందో కూడా ఆలోచించుకోలేకపోయా.. అసహనంతో అన్నం ఎక్కువగా తినడంతో లావైపోయా. చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నా... ప్రతి సందర్భంలోనూ నేను చేసేది కరెక్టే అనిపించేది. అమ్మానాన్నలు, డాక్టర్లు చెప్పేది పనికిరాని విషయంగా అనిపించేది..’ అంటూ తన ఒకప్పటి తన దీనస్థితిని గుర్తుచేసుకున్నారు ‘దంగల్’ ఫేం జైరా వసీం. ఆ స్థితి భయంకరమైన డిప్రెషన్ అని గుర్తించిన తర్వాత కోలుకోవడానికి సమయం పట్టిందని, ఆ మాయదారి జబ్బు ఎప్పుడైనా, ఎవరికైనా ఎదురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. గుండెలు పిండేసే రీతిలో ఈ మేరకు ఆమె రాసిన లేఖ చర్చనీయాంశమైంది. ‘‘పాతికేళ్లు దాటినవాళ్లకే డిప్రెషన్ ఉంటుందని ఎక్కడో చదివా. కానీ అతి తప్పు కౌమార దశ(10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు)లోనూ దాని బారినపడతారు. అందుకు నేనే ఉదాహరణ. నాలుగేళ్ల చికిత్స తర్వాతగానీ కోలుకోలేకపోయా. ఇప్పుడు నా గురించి నేను స్పష్టంగా, ధైర్యంగా ఆలోచించగలనన్న నమ్మకం ఏర్పడింది. కొన్నాళ్లపాటు అన్నింటికీ.. ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నా. రాబోయే పవిత్ర రంజాన్ మాసం అందుకు అనువైనదిగా భావిస్తున్నా. దయచేసి మీ ప్రార్థనల్లో నన్ను గుర్తుచేసుకోండి. ఎత్తుపల్లాల్లో నాకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా నా ఫ్యామిలీకి ఒట్టి థ్యాంక్స్ చెబితే సరిపోదు..’’ అని జైరా పేర్కొన్నారు. జైరా లేఖ యథాతథంగా.. -
‘సీక్రెట్ సూపర్‌స్టార్’ జైత్రయాత్ర
న్యూఢిల్లీ: చైనాలో ఆమిర్‌ఖాన్ ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ జైత్రయాత్ర కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా 100 మిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించే దిశగా దూసుకెళ్తోంది. జనవరి 19న చైనాలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 584.60 కోట్లు (91.29 మిలియన్ డాలర్లు) వసూలు చేసినట్టు ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. తాజాగా విడుదలైన కొత్త సినిమాలను తట్టుకుని చైనా బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో కొనసాగుతోందని తెలిపారు. గతేడాది అక్టోబర్ 19న భారత్‌లో ఈ చిత్రం విడుదలైంది. 2017లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ సినిమాగా నిలిచింది. ఆమిర్‌ఖాన్ సినిమాలకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంతకుముందు ఆయన ప్రధానపాత్రలో నటించిన ‘దంగల్’ కూడా చైనాలో అనూహ్య విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ను అదేస్థాయిలో ఆదరిస్తున్నారు. జైరా వసీమ్, మెహర్ విజ్, రాజ్ అరున్, తిర్థ్ శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. -
బంపర్ హిట్: బడ్జెట్ 15 కోట్లు, కలెక్షన్ 450 కోట్లు!
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్ సినిమాలకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ప్రధానపాత్రలో నటించిన ‘దంగల్’కు అనూహ్య విజయాన్ని అందించిన చైనా ఆడియన్స్ తాజాగా ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ను అదేస్థాయిలో ఆదరిస్తున్నారు. జనవరి 19న చైనాలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. వారం రోజుల్లోనే రూ. 264.61 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ‘దంగల్’ సినిమాను మించి ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ తొలిరోజు రికార్డు వసూళ్లు రాబట్టడం విశేషం. తొలిరోజే ఈ సినిమా భారీస్థాయిలో 6.79 మిలియన్ డాలర్లు (రూ. 43.35 కోట్లు) రాబట్టింది. భారత్‌లో ఓ మోస్తరుగా ఆడిన ఈ చిత్రానికి చైనాలో భారీ ఓపెనింగ్స్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘దంగల్’ తో చైనాలో ఆమిర్‌ఖాన్ ఇమేజ్ శిఖరస్థాయికి చేరింది. ఆయనకు ఉన్న పాపులారిటీ కారణంగానే ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ భారీ ఓపెనింగ్ కలెక్షన్లు రాబట్టింది. మున్ముందు వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 450 కోట్లు రాబట్టినట్టుగా అంచనా. కేవలం రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బంఫర్ వసూళ్లు సాధిస్తుండటంతో బయ్యర్ల పంట పండింది. జైరా వసీమ్, మెహర్ విజ్, రాజ్ అరున్, తిర్థ్ శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. #SecretSuperstar continues to work wonders in China... Week 1 should close at $ 45 million+, which is SPLENDID... Fri $ 6.90 mn Sat $ 10.55 mn Sun $ 9.90 mn Mon $ 5.02 mn Tue $ 4.88 mn Wed $ 4.41 mn Total: $ 41.66 million [₹ 264.61 cr] — taran adarsh (@taran_adarsh) 25 January 2018 -
నేనైతే కాలు విరగొట్టేదాన్ని: కంగనా
ఇటీవల విమాన ప్రయాణంలో వేధింపులకు గురైన బాలీవుడ్ నటి జైరా వసీం తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కొంత మంది జైరా ను నిందించటంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించారు. విమానంలోనే గట్టిగా నిలదీయకుండా ప్రయాణం అయిపోయిన తరువాత జైరా స్పందించటం పబ్లిసిటీ స్టంట్ అంటూ కొందరు ఆరోపించారు. ఈ విషయంపై స్పందించిన కంగనా.. పదిహేడేళ్ల అమ్మాయి తనకు జరిగిన వేధింపులకు సంబంధించి మాట్లాడిందంటే ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. అంతేగాని ఆమెనే విమర్శించటం కరెక్ట్ కాదని తెలిపారు. ప్రముఖ రచయిత్రి శోభాడే రాసిన ‘70 అండ్ టు హెల్ విత్ ఇట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా, జైరాకు జరిగిన వేధింపులపై స్పందించారు. వీడియోలో ఆ వ్యక్తి జైరా చైర్ పై కాలు పెట్టినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అయినా ఆమెను ఎందుకు నిందిస్తున్నారని ప్రశ్నించింది. అదే నేను ఆ పరిస్థితుల్లో ఉంటే అతని కాలు విరగొట్టేదాన్నన్నారు. -
అతనేం జైరాను వేధించలేదు : ప్రత్యక్ష సాక్షి
సాక్షి, సినిమా : బాలీవుడ్ నటి జైరా వసీమ్ లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తీసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో ఆమెపై ముంబైకి చెందని ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తోటి ప్రయాణికుడు ఒకరు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో నిందితుడు జైరాను వేధించలేదని పేర్కొనటం విశేషం. ఈ మేరకు నిందితుడు వికాస్ సచ్దేవ్ తరపు న్యాయవాది హెచ్ ఎస్ ఆనంద్ బుధవారం కోర్టులో వాదనలు వినిపించారు. ‘‘నేను అదే విమానంలో ప్రయాణించా. వారికి సమీపానే నేను కూర్చుని ఉన్నా. అతను సీటుపై కాలుపెట్టిన మాట వాస్తవం. అయితే ఫ్లైట్ టేకాఫ్ తీసుకున్నాక కూడా అతను కాలును అలాగే ఉంచాడు. అతనేం లైంగిక వేధింపులకు పాల్పడలేదు. ముంబైలో విమానం ల్యాండ్ అయ్యాక ఆమె అతనిపై గట్టిగా అరిచింది. వెంటనే కాలు పెట్టినందుకు అతను క్షమాపణలు కూడా తెలియజేశాడు. వివాదం అంతటితో సర్దుమణిగింది కూడా’’ అని చతుర్వేది అనే ప్రయాణికుడు ముంబై పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనిని ఆధారంగా చేసుకుని అతనికి బెయిల్ మంజూరు చేయాలని న్యాయవాది ఆనంద్ జడ్జిని కోరారు. అయితే మరికొందరు ప్రయాణికులతోపాటు, బాధితురాలి స్టేట్మెంట్ను(సీఆర్పీసీ 164 సెక్షన్ ప్రకారం) ఇంకా రికార్డు చేయని పక్షంలో అతన్ని కస్టడీకి అనుమతించాలని పోలీసులు న్యాయమూర్తిని అభ్యర్థించారు. కానీ, నిందితుడు జమ్ము కశ్మీర్‌కు చెందిన వ్యక్తని.. అతనికి సీఆర్పీసీ వర్తించని అతని తరపున న్యాయవాది వాదన వినిపించగా.. దానిని కోర్టు తోసిపుచ్చింది. చివరకు అతనిని డిసెంబర్ 22వరకు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. అయితే సచ్దేవ్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. దానిపై విచారణను 15వ తేదీకి వాయిదా వేశారు. బాలీవుడ్లో పెరిగిపోతున్న మద్దతు.. కాగా, నటి జైరా వసీమ్‌కు మద్దతు పెరిగిపోతూ వస్తోంది. పలువురు బాలీవుడ్ నటులు ఇప్పటికే ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేయగా.. తాజాగా అమీర్‌ఖాన్ భార్య కిరణ్, నటి కంగనా రనౌత్ స్పందించారు. జైరా స్థానంలో తాను ఉండి ఉంటే అతని కాళ్లు విరగొట్టి ఉండేదానినని కంగనా వ్యాఖ్యానించారు. మరోవైపు క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా ఘటనను తీవ్రంగా ఖండించారు. -
జైరా వాసింను వేధించిన నిందితుడి అరెస్ట్
ముంబాయి : దంగల్ సినిమా నటి జైరా వాసింను వేధించిన నిందితుడు వికాస్ సచ్దేవ్(39)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన భర్త వికాస్ అమాయకుడని భార్య దివ్వ పేర్కొంది. జైరాను వేధింపులకు గురిచేయాలని తన భర్తకు ఎలాంటి ఉద్దేశం లేదని తెలిపారు. మా కుటుంబంలో ఇటీవలే ఒకరు చనిపోయారని, ఆ కార్యక్రమానికి వెళ్లి 24 గంటలుగా నిద్ర పోకపోవడం వల్ల వికాస్ ఇబ్బంది పడ్డాడని వెల్లడించారు. ఈ విషయాన్ని విస్తారా ఎయిర్‌లైన్స్ సిబ్బందికి తెలిపానని, అతని నిద్రపోయేటపుడు ఇబ్బందిపెట్టవద్దని తెలిపాని అన్నారు. వికాస్ తన కాలిని ముందున్న సీటుపై పెట్టుకుని మాత్రమే నిద్రపోయారని, జైరాని వేధించాలని తన భర్తకు ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పారు. ఈ ఘటన పట్ల పలువురు ప్రముఖులు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. -
ఆ నటిని కావాలని తాకలేదు!
సాక్షి, ముంబై: దంగల్ నటి జైరా వసీంపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అంధేరికి చెందిన వికాస్ సచ్దేవ్ అనే 36 ఏళ్ల వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. జైరా వసీం మైనర్ అయినందున నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదుచేశారు. అయితే, నిందితుడు మాత్రం తాను ఉద్దేశపూర్వకంగా జైరా వసీంను తాకలేదని పోలీసులకు తెలిపాడు. తన కాలివేలు ఆమెను తాకిందని చెప్పగానే.. ఆమెకు క్షమాపణ కూడా చెప్పానని వివరణ ఇచ్చాడు. ఢిల్లీలో అంత్యక్రియలకు హాజరైన తాను నిద్రలేక చాలా అలసటతో ఉన్నానని, అందువల్ల తనను డిస్టర్బ్ చేయవద్దని క్యాబిన్ సిబ్బందిని కోరానని, విమాన ప్రయాణంలో పూర్తిగా పడుకోవాలని భోజనం కూడా చేయలేదని అతను తెలిపాడు. ఈ ఘటనపై విస్తారా ఎయిర్‌లైన్స్ వాదన కూడా కొంతమేరకు నిందితుడి వాదనతో ఏకభవించడం గమనార్హం. తమ విమానంలో జరిగిన ఘటనపై విస్తారా ఎయిర్‌లైన్స్ ఇప్పటికే డీజీసీఏకు నివేదిక అందించింది. శనివారం రాత్రి విస్తారా విమానంలో ఢిల్లీ నుంచి ముంబై వెళుతుండగా.. జైరాపై వికాస్ వేధింపులకు పాల్పడ్డాడు. విమానం దిగగానే బాధితురాలు ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా బయటపెట్టింది. కన్నీటిపర్యంతమవుతూ.. తనను అసభ్యంగా తాకాడని ఆమె తెలిపింది. అయితే, వికాస్ భార్య దివ్య కూడా జైరా వసీం వాదనను తప్పుబడుతోంది. "ఢిల్లీ నుంచి ఆయన తిరిగొచ్చారు. ఆయన మామ చనిపోయాడు. దీంతో ఆయన మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఆ స్థితిలో ఆయన బ్లాంకెట్ అడిగి తీసుకొని పడుకున్నారు. ఆమె ఆరోపణలు నన్ను షాక్‌కు గురిచేశాయి' అని దివ్య తెలిపారు. -
నటిపై లైంగిక వేధింపులు..
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటి జైరా వసీమ్ పై లైంగిక వేధింపుల కేసు వివాదం మరింత ముదురుతోంది. ఎయిర్ విస్తారాలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న సమయంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఆరోపించింది. విమానంలో తనకు ఎవరూ సాయం చేయలేదంటూ చేసిన వ్యాఖ్యలపై ఎయిర్ లైన్స్ అధికారులు స్పందించారు. ముంబైలో విమానం దిగే వరకూ తనపై జరిగిన లైంగిక వేధింపుల విషయాన్ని సిబ్బంది దృష్టికి జైరాగానీ, ఆమె తల్లి గానీ తీసుకురాలేదని స్పష్టం చేశారు. మాకు విషయం తెలిసిన వెంటనే వారిని సంప్రదించాం. ఫిర్యాదు చేయాలనుకుంటే సహకరిస్తామని ఎయిర్ లైన్స్ సిబ్బంది చెప్పగా అందుకు జైరా, ఆమె తల్లి నిరాకరించినట్లు ఆ అధికారి వెల్లడించారు. నటికి ఎదురైన వేధింపుల వివాదం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ముంబై పోలీసులు స్పందించారు. జైరా వసీమ్‌ను ప్రత్యేకంగా కలిసిన ముంబై పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేసి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఎయిర్ విస్తారాలో ఢిల్లీ నుంచి ముంబైకి వస్తున్న సమయంలో తన వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి సీటుపై కాలుపెట్టి, అసభ్యంగా తాకాడని ఆమె ఓ వీడియో ద్వారా ఆరోపించగా వేధింపుల ఘటన వెలుగుచూసింది. -
ఫ్లైట్‌లో అసభ్యప్రవర్తన.. దంగల్ నటి ఆవేదన
-
ఫ్లైట్‌లో అసభ్యప్రవర్తన.. దంగల్ నటి ఆవేదన
సాక్షి, ముంబై : దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రాలతో గుర్తింపు దక్కించుకున్న నటి జైరా వసీమ్(17) లైంగిక వేధింపులకు గురైంది. ఫ్లైట్‌లో ఆమెతో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఫ్లైట్ దిగాక తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించింది. ఇలా జరగాల్సింది కాదు. నేను చాలా బాధతో ఉన్నా అని ఆమె ఆ పోస్టులో రోదిస్తూ తెలిపింది. శనివారం ఎయిర్ విస్తారాలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న క్రమంలో ఆమెకు ఈ అనుభవం ఎదురైంది. నిద్రిస్తున్న సమయంలో సదరు వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడంట. తన వెనకాల కూర్చున్న ఆ మధ్యవయస్కు వ్యక్తి ఆమె సీటుపై కాలు పెట్టిన వీడియోను ఆమె చిత్రీకరించింది. తర్వాత ఫ్లైట్ ప్రయాణిస్తున్న క్రమంలో ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడంట. వెలుతురు సరిగ్గా లేకపోవటం ఆసరాగా చేసుకుని నిందితుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె అంటోంది. అమ్మాయిల భద్రత ఎలా ఉందో తెలిసిపోతోంది.. సాయం చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని ఆమె వీడియోలో తెలిపింది. కాగా, ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. -
దంగల్ బాటలో సీక్రెట్ సూపర్ స్టార్
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కీలక పాత్రలో తెరకెక్కిన సీక్రెట్ సూపర్ స్టార్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్‌తో పాటు ఓవర్సీస్ లో మంచి వసూళ్లను సాధిస్తున్న ఈ సినిమాను త్వరలో చైనాలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత నటుడు ఆమిర్ ఖాన్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వెల్లడించారు. ఆమిర్ హీరోగా తెరకెక్కిన దంగల్ గతంలో చైనాలో రిలీజ్ అయి అక్కడ కూడా వసూళ్ల సునామి సృష్టించింది. ఇప్పుడు అదే బాటలో సీక్రెట్ సూపర్ స్టార్ కూడా మరోసారి సత్తా చాటుతుందన్న నమ్మకంతో ఉన్నాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. జైరా వసీం ప్రధాన పాత్రలో తెరకెక్కిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాకు అద్విత్ చందన్ దర్శకుడు. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఘన విజయం సాధించటంతోపాటు రికార్డ్ కలెక్షన్లతో సత్తా చాటింది. ఇప్పుడు మరిన్ని రికార్డ్ ల మీద కన్నేసిని ఆమిర్ టీం సీక్రెట్ సూపర్‌స్టార్ ను చైనాలో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఆ మూవీకి రవితేజ 'ఫిదా'!
సాక్షి, హైదరాబాద్ : 'రాజా ది గ్రేట్' మూవీతో మరో సక్సెస్ అందుకున్న టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ ఓ బాలీవుడ్ మూవీని ప్రశంసల్లో ముంచెత్తారు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'సీక్రెట్ సూపర్ స్టార్'ను తాను నిన్న చూశానని మూవీ అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియా ద్వారా రవితేజ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. 'సీక్రెట్ సూపర్ స్టార్' చూశాను. నిజాయితీతో కూడిన గొప్ప సినిమా ఇది. అందరూ ఈ మూవీని ప్రేమిస్తారు. జైరా వసీంతో పాటు అందులో కీలకపాత్రల్లో నటించిన వారి ఫెర్మార్మెన్స్ చాలా బాగుంది. దర్శకుడు అద్వైత్ చందన్ తెలివితేటల్ని మనం గుర్తించాలి. టాలెంట్, కఠోరశ్రమ ఉంటే ఇలాంటి ప్రయత్నాల్ని ప్రపంచం కచ్చితంగా గుర్తిస్తుంది. అలాంటి మూవీలు విజయాన్ని సాధిస్తాయని' సీక్రెట్ సూపర్‌స్టార్ యాష్ స్టాగ్‌తో వరుస ట్వీట్లు చేశారు హీరో రవితేజ. గాయనిగా ఎదగాలనుకుంటున్న ఓ ముస్లిం బాలిక కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎదుర్కొన్న అడ్డంకులు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాకు అద్వైత్ చౌహాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడిగా నటిస్తున్న ఆమిర్ స్వయంగా ఆమిర్ ఖాణ్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మించారు. జైరా వసీం ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. -
'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమా రివ్యూ
టైటిల్ : సీక్రెట్ సూపర్ స్టార్ తారాగణం : ఆమిర్ ఖాన్, జైరా వసీమ్, మెహర్ విజ్, రాజ్ అరున్, తిర్థ్ శర్మ దర్శకుడు : అద్వైత్ చందన్ జానర్ : డ్రామా చిత్ర నిడివి : 2:30 గంటలు సాక్షి, హైదరాబాద్ : తన చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా ఎప్పుడూ సామాజిక అంశాలనే ఇతివృత్తంగా తీసుకొని చిత్రాలు నిర్మించే ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్. ఆయన స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తూ గతంలో రైతుల సమస్యలు, సామాజిక రుగ్మతలపై చిత్రాలను నిర్మించి అందించిన ఆయన మరోసారి సామాజిక అంశాన్నే ఇతివృత్తంగా తీసుకొని ఒక కొత్త డైరెక్టర్‌తో చేసిన ప్రయోగం సీక్రెట్ సూపర్‌స్టార్. దంగల్ భారీ విజయం సాధించిన తర్వాత మరోసారి ఆయన స్వయంగా నటించిన చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్. ఈ చిత్రంలో ఆయన పాత్ర ఏమిటి? ఈ సినిమా నేపథ్యం ఏమిటి? ఈ చిత్రం ద్వారా మరోసారి సమాజానికి సందేశం ఇవ్వడంలో విజయం సాధించారా అనే విషయాలు తెలుసుకునేందుకు ఇప్పుడు కథలోకి వెళదాం. కథ: బరోడా ప్రాంతానికి చెందిన ఇన్సియా మాలి(జైరా వసీమ్) అనే 15 ఏళ్ల బాలికకు ఒక ఆశయంతో ముందుకెళ్లాలని ఉంటుంది. కానీ ఉదాసీనత లేని తండ్రి ప్రవర్తన, అతడికి కొడుకుపై మాత్రమే ఉండే ప్రేమ కారణంగా అది కాస్త నీరుగారిపోతుంది. ఆమె తల్లి కూడా తండ్రి బాధితురాలే. ఇంట్లో ఎప్పుడూ మనశ్శాంతి లేకుండా గొడవపడే స్వభావం అతడిది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్సియా తిరిగి తన ఆశయాన్ని బతికించుకుంటుందా? కఠినమైన మనస్తత్వం ఉన్న తండ్రి నుంచి తల్లిని రక్షించుకుంటుందా? ఒక వేళ తన డ్రీమ్‌ను బతికించుకుంటే అందుకు సహాయపడింది ఎవరు? అందుకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది అనేది మిగతా కథ. సినిమా సమీక్ష: ఆమిర్ ఖాన్ చిత్ర నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ సినిమా రూపొందడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. పైగా దంగల్ చిత్రంలో తనకు కూతురుగా (చిన్నప్పటి పాత్రలో) నటించిన జైరా వసీమ్‌తో కలిసి ఆమిర్ మరోసారి నటించడం ప్రేక్షకుల్లో థియేటర్ వైపు రావడానికి మరింత ఆసక్తిని రేపింది. ఈ సినిమాలో శక్తి కుమార్ అనే మ్యూజిక్ డైరెక్టర్పాత్రలో నటించిన ఆమిర్ ఖాన్ తెరమీదకు వచ్చిన ప్రతిసారి చాలా వినూత్నంగా కనిపించారు. ఆయన హావభావాలు, చిన్నారి ఇన్సియాకు మార్గదర్శకత్వం చేసే ప్రతిసారి ఆయన మోడ్రన్ మాస్టర్‌ను తలిపిస్తుంటారు. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ విధానం చాలా బాగుంది. దర్శకుడు అద్వైత్ చవాన్‌కు ఈ సినిమా తొలిచిత్రమే అయిన అదరగొట్టేశారు. ఆమిర్ ఖాన్ అడుగుజాడల్లోనే నడిచి ఆయన మార్గదర్శకత్వంలోనే ముందుకెళుతున్న ఆయన ఒక హృదయాన్ని హత్తుకునే చిత్రమే ఇచ్చారని చెప్పాలి. సినిమాలో సంతోషం, దుఃఖం, భావోద్వేగం, ఎవరికివారుగా తమకు అపాధించుకునే అంశాలువంటివి సమపాళ్లలో ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఇక సినిమా కథ విషయానికి వచ్చినప్పుడు సహజంగా ప్రతి ఇంట్లో జరిగే విషయాలే అనిపిస్తుంది. ఏం జరుగుతుందో ముందే ఊహించగలిగినప్పటికీ చూపించిన విధానం మాత్రం సూపర్. ప్రేమలేని దాంపత్యంలో ఒక భర్తతో భార్య ఎలాంటి ఇబ్బందులకు గురవుతుందో, ఆ వాతావరణంలో పెరిగే పిల్లలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో మన జీవితాల్లో చూసినట్లే ఉంటుంది. ముఖ్యంగా ఓ మంచి గాయని అవ్వాలనుకున్న ఇన్సియా మాలికి తండ్రి అడ్డు చెప్పడం, కర్కషంగా వ్యవహరించడం, తండ్రికి ఎదురు చెప్పే సాహసం చేయడం, భర్తకు తెలియకుండా భార్య కూతురుకు సాయం చేయడంవంటి సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి. తండ్రి ప్రవర్తన, తల్లి పడుతున్న ఇబ్బందులు చూస్తూ తాను ఎదుర్కొనే మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడంలో జైరా వసీమ్ సక్సెస్ అయింది. ఈ సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించింది. కఠినమైన పరిస్థితుల్లో తన లక్ష్యంకోసం పోరాడి విజయం సాధించేందుకు పడే తపన ప్రతి ఒక్క నేటి విద్యార్థిని విద్యార్థులకు స్ఫూర్తి దాయకంగా ఉంటుంది. తల్లిదండ్రులకైతే కనువిప్పు కలిగిస్తుంది. సంప్రదాయాలు, కట్టుబాట్లు అంటూ ఇన్సియాను ఆమె తండ్రి అణిచివేసే సందర్భాల్లో జైరా నటన మిస్మరేజింగ్ అని చెప్పక తప్పదు. ఇక ఉదాసీనత లేని భర్త వ్యవహారన్ని భరించే భార్య పాత్రలో నజ్మా(మెహర్), ఆమె కొడుకుగా గుడ్డు (కబీర్) పాత్రలో చాలా బాగా నటించారు. తుది పలుకు : ఈ సీక్రెట్ సూపర్స్టార్లో మీ పిల్లల్ని చూసుకోవచ్చు - యం. నాగేశ్వరరావు, సాక్షి, ఇంటర్నెట్ డెస్క్ -
ఈ ఏడాది బెస్ట్ సినిమా ఇదే..!
సాక్షి, ముంబై: సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన తాజా సినిమా 'సీక్రెట్ సూపర్ స్టార్'ను సోమవారం తన సన్నిహితులు, మిత్రులు, బాలీవుడ్ సెలబ్రిటీలకు చూపించారు. ముంబైలో జరిగిన ఈ స్పెషల్ షోకు హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ సినిమాను చూసి.. అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చారు. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఏకంగా ఈ ఏడాది వచ్చిన బెస్ట్ సినిమా ఇదేనంటూ ఆకాశానికెత్తారు. ఆమిర్ 'దంగల్' సినిమాలో నటించిన జైరా వసీం ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలకానుంది. గాయనిగా ఎదగాలనుకుంటున్న ఓ ముస్లిం బాలిక కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎదుర్కొన్న అడ్డంకులు నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాకు అద్వైత్ చౌహాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రముఖ సంగీత దర్శకుడిగా నటిస్తున్న ఆమిర్ స్వయంగా ఆమిర్ ఖాణ్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను చూసిన బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'సీక్రెట్ సూపర్ స్టార్ ఈ ఏడాది ఉత్తమ చిత్రం. సినిమా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. నటులంతా మంచి అభినయం కనబర్చారు. ఆమిర్ ఖాన్‌కు, అద్వైత్కు అభినందనలు' అని నవాజుద్దీన్ సిద్ధిఖీ ట్వీట్ చేశారు. యువ హీరో రాజ్‌కుమార్ రావు, 'దంగల్' ఫేమ్ సనా ఫాతియా షైక్, దర్శకురాలు అశ్వినీ అయ్యార్ తదితరులు సినిమాను ప్రశంసిస్తూ.. ట్వీట్లు చేశారు. #SecretSuperstar D Best Film of d year.V Inspiring.Commendable Performances by all d Actors including Tirth. Congrats @aamir_khan #AdvaitC. — Nawazuddin Siddiqui (@Nawazuddin_S) 17 October 2017 #SecretSuperstar Such a heartwarming&inspiring film. Do urselves a favour, go watch it. Take a bow team. @aamir_khan sir, u had me in splits — Rajkummar Rao (@RajkummarRao) 16 October 2017 #secretsuperstar is a story which does not leave U.Truly from the heart!Huge hug #zaira @aamir_khan #advait #kiranrao just speechless.Proud😊 — Ashwiny Iyer Tiwari (@Ashwinyiyer) 16 October 2017 #advaitchandan has created such a beautiful film! All the actors were just outstanding! #secretsuperstar #ZairaWasim 😘❤️ — fatima sana shaikh (@fattysanashaikh) 16 October 2017 #SecretSuperstar! Supperb Film👍. Great performances 👏👏. #ZairaWasim👌👌. @aamir_khan is just the perfect icing on this cake! @advaitchandan🙏🙏 — Avinash Gowariker (@avigowariker) 16 October 2017 -
ప్రమాదం నుంచి బయటపడ్డ నటి
శ్రీనగర్ : బాలీవుడ్ చిత్రం 'దంగల్'లో తన సహజ నటనతో మెప్పించిన నటి జైరా వాసిమ్ తృటిలో ప్రాణాలతో బయటపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైరా వాసిమ్ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి గురువారం బౌలేవార్డ్ రోడ్ సమీపంలో దాల్ లేక్‌లో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు. జైరా వాసిమ్‌తో పాటు వాహనంలో ప్రయాణిస్తున్నఓ వ్యక్తికి గాయాలు అయినట్లు ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. అయితే జైరాకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. కాగా కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జైరా వసీమ్ (దంగల్ ఫేమ్) రాయని డైరీ
ఎగ్జామ్స్ దగ్గరికొచ్చేస్తున్నాయి! డాడీ ఇవాళ కూడా అన్నారు.. ‘‘ఇన్సీ.. లైఫ్‌లో టెన్త్ అనేది రియల్ దంగల్’’ అని. నిజానికి అది మమ్మీ అనవలసిన మాట. మమ్మీ టీచర్. కానీ నా గురించి తనకేమీ బెంగలేదు. డాడీకి కూడా నాపై నమ్మకం. బాగా చదువుతానని. ‘దంగల్’ తర్వాతే ఆయన నా చదువు గురించి కాస్త ఆందోళనగా మాట్లాడుతున్నారు! అంతకుముందు అలా ఉండేది కాదు. నా చదువు గురించి తప్ప, లోకంలోని అన్ని విషయాలూ ఆయన నాతో మాట్లాడేవారు. నేను సినిమాల్లోకి వెళ్లడం కూడా డాడీకి ఇష్టమే. ‘ఇన్సీ’ అనేది నెక్స్ట్ మూవీలో నా పేరు. ఆ పేరుతోనే డాడీ నన్నిప్పుడు పిలుస్తున్నారు! సాయంత్రం డాడీ బ్యాంకు నుంచి వచ్చారు. మమ్మీ కూడా అదే టైమ్‌కి వచ్చింది. వచ్చీ రావడంతోనే ‘‘హౌయూ బేబీ’’ అంటూ నా రూమ్‌లోకి వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టి, కిచెన్‌లోకి వెళ్లిపోయింది మమ్మీ. బ్యాంకు నుండి రాగానే డాడీకి మమ్మీ గ్రీన్ టీ ఇవ్వాలి. టీ తాగుతూ డాడీ నాతో మాట్లాడ్డానికి వచ్చేస్తారు. టీ ఇచ్చేది మమ్మీ. మాట్లాడేది నాతో. ఇక చూడాలి మమ్మీ ఫీలింగ్స్. ‘‘మీ డాడీకి నాతో మాట్లాడ్డానికి టైమ్ దొర కడం లేదు పాపం’’ అంది మమ్మీ. డాడీ నవ్వారు. ‘‘మార్చి తర్వాత మాట్లాడుకుందాం’’ అన్నారు. మమ్మీ.. డాడీ వైపు వింతగా చూసింది. ‘‘మీ కూతురు టెన్త్ మాత్రమే రాయబోతోంది. అంతరిక్షంలోకి వెళ్లడం లేదు. అలా కౌంట్ డౌన్ ఫేస్ పెట్టేయకండి’’ అంది. డాడీ నా వైపు చూశారు. ‘‘అంతరిక్షం నా కూతురికి లెక్క కాదు. అయినా తనిప్పుడు ఉన్నది అంతరిక్షంలోనే కదా. అంతా కలసి దంగల్ స్పేస్‌షిప్‌లో పైకి పంపించేశారు. అక్కడి నుంచి భద్రంగా కిందికి ఎలా దిగిరావాలో చెబుతున్నాను’’ అన్నారు. డాడీ భయం అర్థమైంది. ఎగ్జామ్స్ అంటే నాకేం భయం లేదు. మమ్మీకి, డాడీకి అసలే లేదు. డాడీ భయం వేరే ఉంది. లేని పోని కాంట్రవర్సీల్లోకి నన్ను లాగేస్తారని, నా మనసు పాడవుతుందనీ. ‘‘బరి లోపల కుస్తీకి కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి ఇన్సీ. బరి బయట లోకంలో అవేవీ ఉండవు. నువ్వసలు పోటీలోనే ఉండవు. కానీ నిన్ను బరిలోకి లాగేస్తారు. నువ్వు గెలిచావనో, ఓడావనో తీర్పు కూడా ఇచ్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి’’ అని చెప్పారు డాడీ. డాడీ చెప్పింది నిజమే. సెంట్రల్ మినిస్టర్ గోయెల్‌జీ నన్ను ఇలాగే బరిలోకి నెట్టేశారు! ముఖానికి ముసుగు వేసుకుని ఉన్న ఓ యువతి ఫొటోను ట్వీటర్లో షేర్ చేసి, ‘మన అమ్మాయిలంతా ఆంక్షల సంకెళ్లను తెంచుకుని జైరా వసీమ్‌లా స్వేచ్ఛా విహంగమై బయటికి వచ్చేయాలి’ అని కామెంట్ పెట్టారు!! నాకూ, ఆ ఫొటోలో ముసుగు వేసుకుని ఉన్న యువతికీ పోలిక ఏమిటో నాకు అర్థం కాలేదు. ‘‘అమ్మాయిలకు ఆ ముసుగే అందమూ స్వేచ్ఛా.. సర్ జీ’’ అని రిప్లయ్ పెట్టాను. మాధవ్ శింగరాజు -
‘దంగల్’ జైరాకు బాలీవుడ్ మద్దతు
ముంబై: వేర్పాటువాదంతో కశ్మీర్ అట్టుడుకుతున్నవేళ ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తీని ‘దంగల్’ ఫేమ్, బాలీవుడ్ నటి జైరా వసీమ్(16) కలవడం, వేర్పాటువాదుల నుంచి తీవ్ర అభ్యంతరాలు, వెంటనే జైరా క్షమాపణల నేపథ్యంలో ఆమెకు బాలీవుడ్ ప్రముఖులు బాసటగా నిలిచారు. దంగల్ సినిమాలో రెజ్లర్ ‘గీత ఫొగట్’ చిన్ననాటి పాత్రలో అద్భుతంగా నటించిన కశ్మీర్ అమ్మాయి జైరా.. ‘కశ్మీర్ యువతకు రోల్‌మోడల్’ అనే వార్తలు మీడియాలో విస్తృతమవడం, వేర్పాటువాదుల అభ్యంతరంతో జైరా ఫేస్బుక్, ట్విటర్లో క్షమాపణలు చెప్పింది. ‘నన్ను ఎవరూ(కశ్మీర్యువత) ఆదర్శంగా తీసుకోవద్దు’ అని వ్యాఖ్యానించింది. దీనిపై బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ‘జైరా నాకు రోల్‌మోడల్’ అని బాలీవుడ్ స్టార్ ఆమిర్‌ఖాన్ అన్నారు. ‘జీవితంలో ఎంతో ఎదగాల్సిన 16ఏళ్ల అమ్మాయిని తన మానాన తనను వదిలేయండి. వివాదాల్లోకి లాగకండి. ఆమెకు మనందరం అండగా ఉందాం’ అని ట్విటర్లో వ్యాఖ్యానించారు. అనుపమ్‌ఖేర్, శ్రద్ధకపూర్, జావేద్ అక్తర్, ప్రీతిజింటా, సోనూ నిగమ్ తదతరులు జైరాకు మద్దతుప్రకటించారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సైతం ఆమెకు బాసటగా నిలిచారు. జైరా విషయంలో ఉదారవాదులు ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. -
గంభీర్ ఫైర్ అయ్యాడు
న్యూఢిల్లీ: ‘దంగల్’ నటి జైరా వసీంకు టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ బాసటగా నిలిచాడు. ఆమె చేసిన తప్పేంటని నిలదీశాడు. జైరాతో బలవంతంగా క్షమాపణ చెప్పించడం అవమానకరమని పేర్కొన్నాడు. ఈ వ్యవహారమంతా లింగ వివక్షతో కూడుకున్నట్టు కనబడుతోందని మండిపడ్డాడు. ‘దంగల్ సినిమాలో నటించడం లేదా కశ్మీర్ సీఎం ముఫ్తీని కలవడం ఇస్లాంకు విరుద్ధమని చెప్పడం దారుణమైన అణచివేత. ఆమెతో బలవంతంగా క్షమాపణ చెప్పించడం అవమానకరం. ఈ వ్యవహారంలో లింగ వివక్ష స్పష్టంగా కనబడుతోంది. జైరాను అడిగినట్టే ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ లను ప్రశ్నించగలరా? అభద్రతా భావంతోనే జైరా వసీం లాంటి బాలికపై విమర్శలు చేస్తున్నార’ని గంభీర్ ట్వీట్ చేశాడు. జైరా వసీంకు రెజ్లర్స్ గీతా పొగట్, బబితా పొగట్ కూడా అండగా నిలిచారు. తామంతా ఆమె వెంటే ఉంటామని భరోసాయిచ్చారు. Calling @zairawasim "unislamic" for acting in Dangal or meeting @MehboobaMufti is naked suppression. Ashamed dat she had 2 apologise. — Gautam Gambhir (@GautamGambhir) 17 January 2017 Calling @zairawasim "unislamic" for acting in Dangal or meeting @MehboobaMufti is naked suppression. Ashamed dat she had 2 apologise. — Gautam Gambhir (@GautamGambhir) 17 January 2017 Men will be men. Insecure 2 see a girl like @zairawasim get wings. Sadly we think "Maahri Choriyan AAJ B Choron se kum hain." @aamir_khan — Gautam Gambhir (@GautamGambhir) 17 January 2017 -
జైరాకు అండగా నిలిచిన ఆమిర్ ఖాన్
-
జైరాకు అండగా నిలిచిన ఆమిర్ ఖాన్
దంగల్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకున్న కశ్మీరీ నటి జైరా వసీం, అంతే వేగంగా వివాదాల్లోనూ చిక్కుకుంది. తను నటించిన దంగల్ ఘనవిజయం సాధించిన తరువాత కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కలిసిన జైరాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జైరా, ముఖ్యమంత్రిని కలవడాన్ని కశ్మీర్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులకు ముడిపెడుతూ కొందరు ఆమెను రోల్ మోడల్‌గా చిత్రీకరిస్తూ ప్రచారం చేశారు. అదే సమయంలో ఆమె చర్యను తప్పు పడుతూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. తన పై వస్తున్న కామెంట్స్‌కు వివరణ ఇచ్చిన జైరా వసీం, సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు కోరింది. అయినా కామెంట్స్ ఆగకపోవటంతో బాలీవుడ్ ఆమెకు అండగా నిలిచింది. ఇప్పటికే పలువరు బాలీవుడ్ ప్రముఖులు జైరాకు మద్దతుగా ట్వీట్ చేయగా తాజాగా దంగల్ హీరో ఆమిర్ కూడా జైరాకు అండగా నిలిచాడు. 'జైరా.. నువ్వు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మేమంతా నీతోనే ఉన్నాం. నీలాంటి బాలలు ఈ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలలకు ఆదర్శం. నువ్వు నాకు కూడా ఆదర్శం'. అంటూ ట్వీట్ చేశాడు. అదే సమయంలో సోషల్ మీడియాలో జైరా పై విమర్శలు చేస్తున్న వారికి కూడా ఓ విజ్ఞప్తి చేశాడు ఆమిర్. 'పదహారేళ్ల వయసులో జీవితంలో ఏదో సాధించాలని ప్రయత్నిస్తున్న జైరాకు తను సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకావమివ్వండి'. అంటూ ట్వీట్ చేశాడు. pic.twitter.com/Ynu3VvdRs0 — Aamir Khan (@aamir_khan) 17 January 2017 -
వివాదంలో చిక్కుకున్న ‘దంగల్’ నటి
-
వివాదంలో ‘దంగల్’ నటి
ముంబై: ‘దంగల్’ సినిమాలో నటించిన వసీం జైరా(16) వివాదంలో చిక్కుకుంది. కశ్మీర్ అమ్మాయిలు తనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. జైరా వ్యాఖ్యలపై కశ్మీర్ వేర్పాటువాదులు మండిపడడంతో ఆమె క్షమాపణ చెప్పింది. ‘దంగల్’ సినిమాలో రెజ్లర్ గీత పొగట్ చిన్నప్పటి పాత్రలో నటించి మెప్పించింది జైరా. ఆమె సొంత రాష్ట్రం జమ్మూకశ్మీర్. జైరా తన తల్లిదండ్రులతో పాటు శనివారం కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీని కలిసింది. విద్యాభ్యాసం, కెరీర్, దంగల్ సినిమా షూటింగ్ అనుభవాలు ముఫ్తీతో పంచుకుంది. కశ్మీర్ అమ్మాయిలు తనను స్ఫూర్తిగా తీసుకోవాలని తర్వాత ఫేస్ బుక్ లో ఆమె పోస్టు చేసింది. ఆమె వ్యాఖ్యలను వేర్పాటువాదులు తీవ్రంగా ఆక్షేపించారు. తన వ్యాఖ్యలను తొలగించి క్షమాపణ చెప్పింది. తన ప్రవర్తన ఎవరినైనా నొప్పించివుంటే క్షమించాలని వేడుకుంది. తనను ఎవరూ ప్రేరణగా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘కశ్మీరీ యువతకు రోల్ మోడల్ గా నన్ను చూపించారు. నన్ను ఎవరూ స్ఫూర్తిగా తీసుకోవద్దని స్పష్టం చెబుతున్నాను. రోల్ మోడల్ గా కూడా పెట్టుకోవద్దు. నేను 16 ఏళ్ల అమ్మాయిని. నా వయసును దృష్టిలో పెట్టుకుని నేను చేసిన వ్యాఖ్యలను చూడాల’ని జైరా కోరింది. కాగా, జైరాపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేశారు. 16 ఏళ్లతో అమ్మాయితో బలవంతంగా క్షమాపణ చెప్పించారని మండిపడ్డారు. -
కశ్మీర్ స్కూల్ కు కిరణ్ రావు థ్యాంక్స్
శ్రీనగర్(జమ్మూకశ్మీర్): బాలనటి జైరా వాసిం చదువుతున్న సెయింట్ పాల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ భార్య కిరణ్ రావు సందర్శించారు. జైరాను తమ సినిమా 'దంగల్'లో నటించేందుకు అనుమతి ఇచ్చినందుకు ప్రిన్సిపాల్ కు ధన్యవాదాలు తెలిపారు. జైరాకు సెలవులు మంజూరు చేయడమే కాకుండా, ఆమెకు చదువుకోసం పర్సనల్ ట్యూటర్ ను ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. అంతకుముందు కిరణ్ రావుకు పాఠశాల విద్యార్థులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. 'దంగల్' సినిమాలో గీతా పొగట్ చిన్ననాటి పాత్రలో జైరా నటిస్తోంది. యూటీవీ మోషన్స్, ఆమీర్ ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్ మస్ కు ఈ సినిమా విడుదలకానుంది.