తన మీద వస్తున్న ట్రోల్స్‌కు గట్టి సమాధానమిచ్చారు బాలీవుడ్ నటి జైరా వసీమ్. ట్రోల్స్‌కు బదులు సానుభూతి చూపించాలని నెటిజన్లను కోరుతూ ఆమె హృదయ పూర్వక లేఖ రాశారు. ప్రతి ఒక్కరూ కఠిన విమర్శలను తట్టుకోలేరని అన్నారు. జాతీయ అవార్డు గ్రహీత, దంగల్ ఫేమ్ జైరా వసీమ్ ఇకపై సినిమాల్లో నటించనని గతేడాది వెల్లడించిన విషయం తెలిసిందే. తనకు వచ్చే పాత్రల ద్వారా మా మతవిశ్వాసాన్ని కోల్పోతున్నాని, అందుకే ఇకపై సినిమాల్లో నటించనని స్పష్టం చేశారు. జైరా చివరి సారిగా ప్రియాంక చోప్రా నటించిన 'ది స్కై ఈజ్ పింక్' చిత్రంలో కనిపించారు. ఇక ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి జైరాను అనేకమంది ప్రశ్నిస్తున్నారు. జైరా ఈ నిర్ణయం తీసుకోవడానికి కేవలం మతం కారణాలు మాత్రమే కాకుండా వేరే కారణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. (మన కథ ముగిసింది: నీతూ కపూర్ )
వీటిపై తాజాగా జైరా వసీమ్ స్పందిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘపోస్టు చేశారు. ‘‘ఒకరి మాటలు, పనులు, తెలివి తక్కువ జోకులు ఇతరులపై అధిక ప్రభావం చూపుతాయి. ఒకరి బాధలు, కష్టాలకు మీరు కారణం కాకండి. మీరు చేసే జోక్స్ వారి ఆత్మగౌరవంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. ఏ వ్యక్తి అయినా అతను కేవలం మీ వల్లే ఓడిపోయానని అనుకుంటున్నాడని మీరు ఊహించుకోండి. మీ జోక్, మీమ్ , కామెంట్లు సరాదాగా అనిపించవచ్చు. కానీ ఎదుటి వాళ్లకు అనేక సమస్యలను, ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ప్రతి ఒక్కరూ ధైర్యవంతులుగా జన్మించలేరు.సున్నితమైన వ్యక్తులు కూడా ఉంటారు. వారు ఇలాంటి విమర్శలను తట్టుకోలేరు. మీ మాటలు ఒకరు ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణమవుతాయి. కొంతమంది వాటిని తట్టుకోలేరు’’. అని పేర్కొన్నారు. (‘గతంలో ఎప్పుడూ చూడని విధంగా..’)
ప్రజలపై ప్రతి ఒక్కరూ సానుభూతి చూపించాలని జైరా వసీమ్ కోరారు. ‘‘మనం ఒరిని తప్పు పడుతున్నాము. కానీ ఒకరిని చూసి ముసిముసిగా నవ్వడం ద్వారా వారిని అపహాస్యం చేసినవారవుతాం. అలా చేయకుండా అందరిపై సానుభూతి, సహాయం, వారికి సలహాలు ఇవ్వండి. దీని ద్వారా వాళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతుంది. వారి ఎదుగుదలకు సహాయపడండి. ఒకరి ప్రవర్తనలో మార్పు వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ జీవితమనే ప్రయాణంలో మనమందరం ఒకరి లోపాలను ప్రేమతో, సానుభూతితో సరిదిద్దుకుందాం’’. అంటూ జైరా వసీమ్ భావోద్వేగంతో ముగించారు. (ఇండస్ట్రీ నాకు తగదు; నష్టమేమీ లేదు!)
Comments
Please login to add a commentAdd a comment