ప్రమాదం నుంచి బయటపడ్డ నటి | Zaira Wasim rescued from Dal Lake after accident | Sakshi
Sakshi News home page

ప్రమాదం నుంచి బయటపడ్డ నటి

Published Sat, Jun 10 2017 1:23 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ప్రమాదం నుంచి బయటపడ్డ నటి - Sakshi

ప్రమాదం నుంచి బయటపడ్డ నటి

శ్రీనగర్‌ : బాలీవుడ్‌ చిత్రం 'దంగల్‌'లో తన సహజ నటనతో మెప్పించిన నటి జైరా వాసిమ్‌ తృటిలో ప్రాణాలతో బయటపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైరా వాసిమ్‌ ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి గురువారం బౌలేవార్డ్ రోడ్ సమీపంలో దాల్‌ లేక్‌లో పడిపోయింది.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు. జైరా వాసిమ్‌తో పాటు వాహనంలో ప్రయాణిస్తున్నఓ వ్యక్తికి గాయాలు అయినట్లు ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. అయితే జైరాకు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు.  కాగా కారు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement