‘ఆమెకు నిర్ణయం తీసుకునే సత్తా ఉంది’ | Zaira Wasim Has Ability To Take Decisions Said By Priyanka Chopra | Sakshi
Sakshi News home page

ఆమెకు నిర్ణయం తీసుకునే సత్తా ఉంది: ప్రియాంక

Sep 25 2019 6:23 PM | Updated on Sep 25 2019 6:58 PM

Zaira Wasim Has Ability To Take Decisions Said By Priyanka Chopra - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి  జైరా వసీమ్‌ అత్యంత ప్రతిభావంతురాలని, దంగల్‌లో ఆమె నటనకు జాతీయ అవార్డు వచ్చిందని గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంకా చోప్రా అన్నారు. దంగల్, సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ వంటి సినిమాలలో జైరా నటన అమోఘమని కొనియాడారు. భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకునే సత్తా తనకు ఉందని ప్రియాంకా ప్రశంసించారు. తన మత ఆచారాలకు ఆటంకం కలుగుతున్న కారణంగా.. ఇక మీదట బాలీవుడ్‌లో నటించబోనని జైరా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆమె నిర్ణయాన్ని బాలీవుడ్‌లో పలువురు సమర్థించగా, మరికొందరు వ్యతిరేకించారు. ప్రస్తుతం జైరా, ప్రియాంక కాంబినేషనల్‌లో ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ప్రియాంక సమాధానమిచ్చారు. మోటివేషనల్ స్పీకర్ ఈషా చౌదరి తల్లిదండ్రుల ప్రేమకథగా ఈ చిత్రం రూపొందిందని అన్నారు.

ఇక ఈ సినిమాలో ఈషాగా జైరా నటిస్తుండగా..ఆమె తల్లిదండ్రులుగా ఫర్హాన్ అక్తర్, ప్రియాంకా చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. కూతురు ఈషాకు రోగనిరోదక వ్యవస్థ లోపం కారణంగా వచ్చే పల్మనరీ ఫైబ్రోసిస్ ఉన్నట్లు డాక్టర్లు నిర్దారించగా, కూతురు కోసం  తల్లడిల్లే  తల్లి పాత్రలో ప్రియాంకా కనిపించనున్నారు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం.. అందులోనూ కూతురికి అనారోగ్యం వంటి దుస్థితిని ఎదుర్కొనే అదితి పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఇక నటుడు రోహిత్‌ శరీఫ్‌ ఈ సినిమాలో జైరాకు అన్నగా నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement