దాల్‌సరస్సులో అగ్నిప్రమాదం... రెండు బోట్లు దగ్ధం | Dal Lake Houseboat Fire: 2 Houseboats In Srinagar Were Burnt | Sakshi
Sakshi News home page

Houseboat Fire: దాల్‌సరస్సులో అగ్నిప్రమాదం... రెండు బోట్లు దగ్ధం

Published Wed, Jan 5 2022 12:32 PM | Last Updated on Wed, Jan 5 2022 12:36 PM

Dal Lake Houseboat Fire: 2 Houseboats In Srinagar Were Burnt  - Sakshi

శ్రీనగర్‌లోని దాల్ సరస్సు వద్ద అగ్నిప్రమాదం సంభవించడంతో రెండు హౌస్‌బోట్‌లు దగ్ధమయ్యాయి. దాల్‌ సరస్సు వద్ద మంటలు  చెలరేగడంతో న్యూజిలాండ్‌, అపోలో xI అనే రెండో హౌస్‌బోట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసి ఇతర హౌస్‌బోట్‌లకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. అయితే స్థానిక దేవదారుతో చేసిన ఈ హౌస్‌బోట్‌లు దాల్ సరస్సులో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇవి పశ్చిమ భాగంలో విడిగా లంగరు వేసి ఉంచుతారు. ఫ్లోటింగ్ ప్యాలెస్‌లుగా పిలిచే హౌస్‌బోట్‌లు వంతెనలతో అనుసంధానించబడి ఉంటాయి.

(చదవండి: తెలివైన కుక్క.. ప్రమాదంలో యాజమాని.. ప్లీజ్‌ ఫాలో మీ అంటూ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement