boats damaged
-
అజయ్ కోసం హుస్సేన్ సాగర్‌లో గాలింపు
హైదరాబాద్, సాక్షి: ట్యాంక్ బండ్ బోట్ల దగ్ధం ఘటన తర్వాత అజయ్ అనే యువకుడు కనిపించకుండా పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో హుస్సేన్ సాగర్‌లో రెండు బృందాలతో ఈ ఉదయం నుంచి అధికారులు గాలింపు చేపట్టారు. మరోవైపు.. యువకుడి తల్లిదండ్రుల రోదనలతో ఈ ప్రాంతం మారుమోగుతోంది. కనిపించకుండా పోయిన యువకుడు నాగారం ప్రాంతానికి చెందిన అజయ్(21)గా నిర్ధారణ అయ్యింది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి భరతమాత మహా హారతి కార్యక్రమం కోసం అజయ్ ట్యాంక్ బండ్‌కు వచ్చాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ఛాప్ వస్తోంది. మరోవైపు.. అతని ఆచూకీ కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. అజయ్‌కు ఈత రాదని కుటుంబ సభ్యులు చెప్పడంతో.. హుస్సేన్ సాగర్‌లో మునిగిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఉదయం నుంచి గజఈతగాళ్లతో సాగర్‌లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.ఘటనపై కేసు నమోదుహుస్సేన్ సాగర్‌లో భారతమాత హారతి అపశ్రుతి ఘటనపై కేసు నమోదయ్యింది. బోటు టూరిజం ఇన్‌ఛార్జి ప్రభుదాస్ ఫిర్యాదుతో లేక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆదివారం భరతమాతకు మహాహారతి కార్యక్రమం ముగింపు సందర్భంగా రాత్రి 9 గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌లో బోట్ల నుంచి బాణసంచా పేల్చుతున్న క్రమంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో బోటులో ఉన్న ఐదుగురూ నీళ్లలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల ధాటికి రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీనికి కొద్దిక్షణాల ముందే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు అక్కడి నుంచి వెళ్లారు. అనంతరం ఒక జెట్టీలో బాణసంచాను ఉంచి వాటిని పేల్చేందుకు ఐదుగురు సహాయకులు అందులోకి ఎక్కారు. ఈ జెట్టీని మరో బోటుకు కట్టి సాగర్‌లోకి తీసుకెళ్లి బాణసంచా పేల్చడం మొదలుపెట్టారు. రాకెట్ పైకి విసిరే క్రమంలో అది అక్కడే బాణసంచాపై పడి పేలడంతో మంటలు చెలరేగాయి. గణపతి అనే వ్యక్తికి తీవ్ర గాయాలై అపస్మారకస్థితిలో ఉండగా... సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన నలుగురికి స్వల్ప గాయాలవ్వగా, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి తెలిసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి క్షతగాత్రులను పరామర్శించారు. -
నడి సముద్రంలో తప్పిన పెనుముప్పు
కాకినాడ క్రైం: భారీ మత్స్య సంపదతో తీరానికి చేరుతున్నామని పట్టరాని ఆనందంలో ఉన్న 11 మంది మత్స్యకారుల తలరాత క్షణాల్లో మారిపోయింది. ఆనందపు అంచుల నుంచి ఒక్కసారిగా మృత్యు ఒడికి దాదాపుగా జారుకున్నారు. సంద్రపు అలని తలదన్నే ఎత్తులో అగ్నికీలలు ఆకాశాన్ని తాకుతుంటే నివ్వెరపోయారు. ఆ కీలలన్నీ తమ బోటు నుంచేనని తెలిసే లోపే మంటల్లో చిక్కుకున్నారు. తక్షణమే లైఫ్ జాకెట్లు వేసుకుని సముద్రంలోకి దూకేశారు. ఒకొక్కరూ గంటకు పైగా మృత్యువుతో పోరాడారు. చివరికి అటుగా వచ్చిన సహ మత్స్యకారులు, కార్పోరేట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో బోటులోని సిబ్బంది.. వారి ప్రాణాలు కాపాడి తమ బోటులోకి చేర్చుకున్నారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని ఓడలరేవు తీరం భైరవపాలెం సముద్ర ఉపరితలంలో శుక్రవారం జరిగింది. కాకినాడలోని జగన్నాథపురం, ఏటిమొగకు చెందిన 11 మంది కాకినాడ ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1న బోటులో చేపల వేటకు వెళ్లారు. ఈ బోటు యజమాని పరం రామకృష్ణ. నారాయణ అనే మత్స్యకారుడు బోటు మాస్టర్. ఈ 11 మంది కాకినాడ తీరం నుంచి సుదూరానికి వెళుతూ...వెళ్లే దారిలో తిరుగు ప్రయాణంలో భైరవపాలెం వద్ద ఒక భారీ వల వేశారు. సముద్ర తీరంలో 135 నాటికల్ మైళ్ల దూరంలో వేటలో ఉండగా గురువారం రాత్రి కోస్ట్‌గార్డ్ బృందం తుఫాను హెచ్చరికలు చేసి తీరానికి వెళ్లిపోవాలని వీరిని అప్రమత్తం చేసింది. వీరు శుక్రవారం తెల్లవారుజామున కాకినాడ తీరానికి బయల్దేరారు. భైరవపాలెంలో వేసిన వల తీసేందుకు వెళ్లి ఆ దారిలో కాకినాడ తీరం వైపుగా వెళ్లాలని అనుకున్నారు. భైరవపాలెంలో వల తీస్తుండగా అప్పటికే వేడెక్కి ఉన్న ఇంజన్ నుంచి ఇంధనం ట్యాంకులకు అనుసంధానం చేసిన పైపుల నుంచి డీజిల్ చిమ్మింది. గొట్టాల పరిసరాలన్నీ ఇంధనంతో తడిసి..ఇంధన ట్యాంక్‌పై చమురు చిమ్మి మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు దావనలంలా వ్యాపించాయి. ఓడ పూర్తిగా దగ్ధమై నీట మునిగిపోతున్న చివరి క్రమంలో వీరు సముద్రంలోకి దూకేశారు. సరిగ్గా అటుగా వస్తు్తన్న మత్స్యకార బృంద ఈ11 మందిని చూశారు. రిలయన్స్ సిబ్బందితో కలిసి వారు 11 మందిని రక్షించారు. కోస్ట్‌గార్డ్ సిబ్బంది మత్స్యకారులను ఐసీజీఎస్ చార్లీ–438 ఫిప్ ద్వారా కాకినాడ తీరానికి చేర్చారు. కోస్ట్‌గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ విశ్వాస్ తాపా ఆధ్వర్యంలో 10 మంది కోస్ట్‌గార్డు సిబ్బంది మత్స్యకారుల్ని కాకినాడ తీరానికి చేర్చారు. మొత్తం రూ.70 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనపై ఓడలరేవు మెరైన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మృత్యుంజయులు వీరే... బొమ్మిడి వీరబాబు, సంగాడి నారాయణ, పెమ్మాడి సత్యం, చెక్కా నాగూర్, పాలెపు నూకరాజు, పినపోతు తాతారావు, ఆదం ధనరాజు, కొప్పిడి సత్యనారాయణ, పంతాడి సతీష్, పినపోతు ధర్మరాజు, దోమ వీరబాబు -
దాల్ సరస్సులో అగ్నిప్రమాదం.. మంటల్లోకాలి బూడిదైన హౌజ్బోట్లు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనర్‌లో ఉన్న దాల్ సరస్సులో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సరస్సులో ఉన్న హౌజ్‌బోట్లకు ఉదయం నిప్పంటుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో అనేక బోట్లు కాలిబూడిదయ్యాయి. దాల్ సరస్సులో భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #WATCH | Several houseboats were gutted in a fire in Srinagar's Dal Lake last night pic.twitter.com/uDtuOQO9yw — ANI (@ANI) November 11, 2023 ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సరస్సు వద్దకు చేరుకొని అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాల్ సరస్సులోని ఘాట్ నెంబర్ 9 సమీపంలోని హోస్బోట్లో ఉదయం 5 గంటల సమయంలో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. వెంటనే ఆ మంటలు ఇతర బోట్లకు వ్యాపించినట్లు పేర్కొన్నారు. #WATCH | Srinagar, J&K: On fire in houseboats at Dal Lake, Station House Officer Fire Service Farooq Ahmad says, "The fire emerged at around 5:15 in the morning and as soon as I received the call we came here. Some 5-8 houseboats and huts were gutted in the fire. We can't… pic.twitter.com/rEQ0cSCDw7— ANI (@ANI) November 11, 2023 సరస్సు వద్ద భారీ ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో అయిదు నుంచి ఎనిమిది పడవల వరకు పూర్తిగా దగ్ధం కాగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు చెప్పారు. చదవండి: జైలు నుంచి ఇంటికి సిసోడియా..అనుమతిచ్చిన కోర్టు Deeply saddened by the devastating fire incident in Dal Lake, Srinagar, where several houseboats were gutted. Requesting @OfficeOfLGJandK and the district administration to kindly ensure swift and comprehensive assistance to those affected. Our thoughts are with the victims… pic.twitter.com/qgvkvcNcGN — Tanvir Sadiq (@tanvirsadiq) November 11, 2023 -
సీఎం నితీశ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బోటు వంతెన పిల్లర్‌ను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. సీఎంతో పాటు ఆయనతో బోటులో ఉన్నవారంతా సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్పారు. పాట్నా సమీపంలోని గంగానదిలో బోటు ప్రయాణం చేస్తున్న క్రమంలో శనివారం ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. పాట్నాలోని ఛత్‌గట్‌ను పరిశీలించేందుకు బోటులో ప్రయాణించారు సీఎం నితీశ్. ఆయనతో పాటు పలువురు పార్టీ నేతలు, అధికారులు సైతం బోటులో ఉన్నారు. ఈ క్రమంలో జేపీ సేతు పిల్లర్‌ను బోటు ఢీకొట్టింది. అయితే, బోటు వేగం తక్కువగా ఉండటం వల్ల భారీ స్థాయిలో ఎలాంటి పగుళ్లు ఏర్పడలేదు. దీంతో నీటిలో మునిగిపోయే ప్రమాదం తప్పింది. బోటులో ఉన్న సీఎం నితీశ్‌తో పాటు మిగితా వారంతా క్షేమంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. Patna | Bihar CM Nitish Kumar's boat collided with a pillar of JP Setu during the inspection of Chhath Ghat situated on the bank of river Ganga today. All onboard the boat including the CM are safe. pic.twitter.com/ga8vusRtjH — ANI (@ANI) October 15, 2022 ఇదీ చదవండి: కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఒకరు మృతి -
తక్కువ అంచనా వేశారు.. రష్యన్ బోట్లను పేల్చేశాం: ఉక్రెయిన్
ఉక్రెయిన్‌పై రష్యా మిలటరీ ఆపరేషన్ మొదలుపెట్టి రెండు నెలలు దాటిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతోంది తెలియట్లేదు. రష్యా యుధ్దం అయితే మొదలుపెట్టింది గానీ దీన్ని ముగించేలోపు కోట్లలో ఆస్తులు నష్టం, లక్షల్లో నిరాశ్రయులు కాగా వేల సంఖ్యల్లో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నల్ల సముద్రంలోని స్నేక్ ఐలాండ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రెండు రష్యా రాఫ్టర్ పడవలను ఉక్రెయిన్ పేల్చివేసింది. వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారు జామున స్నేక్ ఐలాండ్ వద్ద రెండు రప్తార్ బోట్లను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. ఈ బోట్ల పేల్చివేతకు సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫూటేజ్‌ను సోషల్ మీడియాలో విడుదల రిలీజ్ చేసింది. అనంతరం ఈ ఘటనపై మాట్లాడుతూ.. టర్కీకి చెందిన బైరక్తార్ డ్రోన్లతో ఈ దాడి జరిగిందని, అవి బాగానే పనిచేస్తున్నాయని ఉక్రెయిన్ సైనిక దళాల కమాండర్ తెలిపారు. రఫ్టార్ పెట్రోలింగ్ బోట్లలో ముగ్గురు సిబ్బంది ఉంటారు. మరో 20 మంది వరకు అవి తీసుకువెళ్ల సామర్థ్యం ఉంటుంది. వాటిలో మెషిన్ గన్స్ ఉంటాయి. ల్యాండింగ్ ఆపరేషన్స్ కోసం వీటిని ఎక్కువగా వాడుతుంటారు. స్నేక్ ఐలాండ్ వద్ద ఉక్రెయిన్ దళాలు రష్యాను తీవ్రంగా ప్రతిఘటించాయి. కాగా ఇటీవలే నల్లసముద్రంలో పార్కింగ్ చేసిన మాస్క్వా యుద్ధ నౌకను కూడా పేల్చినట్లు ఉక్రెయిన్ వెల్లడించిన విషయం తెలిసిందే. 💬Головнокомандувач ЗС України генерал Валерій Залужний: Сьогодні на світанку біля острова Зміїний було знищено два російські катери типу Раптор. Працює #Байрактар. Разом до Перемоги!🇺🇦 pic.twitter.com/3wxlwjDtdx — Defence of Ukraine (@DefenceU) May 2, 2022 చదవండి: తండ్రి కూతురికి సరిపోయే మ్యాచ్ తీసుకువస్తే...ఆమె ఏం చేసిందో తెలుసా? -
దాల్సరస్సులో అగ్నిప్రమాదం... రెండు బోట్లు దగ్ధం
శ్రీనగర్‌లోని దాల్ సరస్సు వద్ద అగ్నిప్రమాదం సంభవించడంతో రెండు హౌస్బోట్లు దగ్ధమయ్యాయి. దాల్ సరస్సు వద్ద మంటలు చెలరేగడంతో న్యూజిలాండ్, అపోలో xI అనే రెండో హౌస్బోట్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసి ఇతర హౌస్బోట్లకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. అయితే స్థానిక దేవదారుతో చేసిన ఈ హౌస్బోట్లు దాల్ సరస్సులో ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇవి పశ్చిమ భాగంలో విడిగా లంగరు వేసి ఉంచుతారు. ఫ్లోటింగ్ ప్యాలెస్‌లుగా పిలిచే హౌస్బోట్లు వంతెనలతో అనుసంధానించబడి ఉంటాయి. (చదవండి: తెలివైన కుక్క.. ప్రమాదంలో యాజమాని.. ప్లీజ్ ఫాలో మీ అంటూ..) -
జీవిత నౌక మునక
తీవ్ర తుపాను హెచ్చరికలతో సముద్రంలో సుదూర ప్రాంతాల్లో వేట సాగిస్తున్న బోట్లన్నీ రెండు రోజుల క్రితమే చేరుకున్నాయి. ఫిషింగ్ హార్డర్ జెట్టీల్లో నిలిచిపోయాయి. సముద్రంలో ఉంటే ప్రమాదమని భయపడి తీరానికి చేరుకుంటే.. ఇక్కడా పెథాయ్ తుపాను ముప్పు తప్పలేదు.తుపాను ప్రభావంతో వీచిన పెనుగాలులు, విరుచుకుపడిన అలల ఉధృతికి జెట్టీల్లో ఉన్న బోట్లు పరస్పరం ఢీకొని సముద్రంలో మునిగిపోయాయి. విశాఖ ఫిషింగ్ హార్డర్లో ఇలా లంగరేసిన 9 మరబోట్లు, 3 ఫైబర్ బోట్లు బోల్తాపడి సముద్రంలో మునిగిపోయి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామంతో బోట్ల యజమానులకు సుమారు రూ.3 కోట్ల నష్టం వాటిల్లిందంటున్నారు. మరోవైపు వీటిపైనే ఆధారపడిన మత్స్యకారులు, కలాసీలు తమ జీవనోపాధి పోయిందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరుస తుపాన్ల వల్ల వేట సక్రమంగా సాగక పూట గడవని స్థితిలో ఉన్న తాము ఇప్పుడు పూర్తిగా ఉపాధి కోల్పోయామని వారు వాపోతున్నారు. పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): పెథాయ్ ప్రకోపానికి విశాఖ మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. సముద్ర తీర ప్రాంతాలను చిగురుటాకులా వణికించి తీరం దాటిందన్న సంతోషం ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆవిరైపోయింది. ఫిషింగ్ హార్బర్లో జెట్టీలకు చేర్చిన తొమ్మిది మరబోట్లు, మూడు ఫైబర్‌బోట్లు నీటిలో మునిగిపోవడంతోపాటు మరో ఐదు ఫైబర్ బోట్లు దెబ్బతినడంతో బోట్ల యజమానులకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. జెట్టీలలో కట్టిన బోట్లు సోమవారం ఉదయం నుంచి వీచిన ఈదురుగాలుల ప్రభావంతో తాళ్లను తెంచుకుని ఒకదానికి ఒకటి గుద్దుకుని నీట మునిగాయి. బోటులో బిగించిన ఇంజిను, డీజిల్ ఆయిల్, వలలు, ఇతర వేట పరికరాలు నీట మునిగిపోయాయి. బోట్లు ముక్కలు చెక్కలుగా విడిపోయాయి. వీటిని నీటి నుంచి వెలుపలికి తీసినా పనిచేసే పరిస్థితి కనిపించడం లేదని బోట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోటులో ఉన్న పరికరాలతో సహా మునిగిపోవడంతో ఒక్కొక్క మర బోటుకు సుమారుగా రూ.30 లక్షలు, ఫైబర్ బోటుకు రూ.3 లక్షల వరకూ నష్టపోయామని... అన్ని బోట్లకు కలిపి రూ.3కోట్లకు పైబడి ఆస్తి నష్టం జరిగిందని యజమానులు వాపోతున్నారు. మరోవైపు బోట్లు మునిగిపోవడంతో వీటిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసే సుమారు 200 మంది ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం ఆర్థికంగా తమను ఆదుకోవాలని వీరంతా కోరుతున్నారు. ఇటీవలి వరకూ వేట సక్రమంగా సాగకపోయినా అప్పులు చేసి చేపల వేటకు బోట్లను పంపామని, ఇప్పుడు పూర్తిగా మునిగిపోవడంతో తాము కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునిగిన బోట్ల వివరాలివీ జీరో జెట్టీలో ఒకటి, 7వ నంబరు జెట్టీలో 4, 11వ నంబరు జెట్టీలో 3, 9వ నంబరు జెట్టీలో ఒకటి చొప్పున మరబోట్లు మునిగిపోగా... 9వ నంబరు జెట్టీలో మూడు ఫైబర్ బోట్లు మునిగిపోగా, 5 ఫైబర్ బోట్లు దెబ్బతి న్నాయి. అల్లిపిల్లి సత్యవతి, కె.సత్యనారాయణ, మైలపిల్లి పోలయ్య, మైలపిల్లి ఎర్రన్న, పుక్కళ్ల మస్తానమ్మ, సుగ్గళ్ల నూకరత్నం, సీహెచ్.వీర్రాజు, మేడ ఎల్లయ్యల బోట్లు నీటమునిగాయి. 11వ నంబరు జెట్టీలో మునిగిపోయిన బోటు యజమాని వివరాలు ఇంకా తెలియరాలేదు. గాలి తాకిడికి గుద్దుకున్నాయి తుపాను గాలి తీవ్రతకు జెట్టీలో కట్టి ఉంచిన మరబోట్లు తాళ్లను తెంచుకుని ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడం వల్ల చెక్కలు పగిలి బోట్లు నీట మునిగిపోయాయి. మునిగిన బోట్ల వల్ల సుమారుగా రూ.3కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నాం. మత్స్యశాఖ అధికారులు, ప్రభుత్వం బోటు యజమానులను ఆదుకోవాలి. – పి.సి.అప్పారావు, బోటు యజమాని, మరబోట్ల సంఘం అధ్యక్షుడు మునిగిన బోటు పనికిరాదు బోటు ఉప్పు నీటిలో మునిగిపోవడంతో అందులో ఉన్న ఇంజిన్‌తో సహా ఏ పరికరమూ పనికిరాకుండా పోయింది. సుమారుగా రూ.30 లక్షల వరకూ నష్టపోయాను. నేను, నాస్నేహితుడు కలిసి బోటు నడుపుతున్నాం. ప్రభుత్వ అధికారులు ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు ప్రయత్నించాలి.– సీహెచ్.వీరరాజు, బోటు యజమాని ఇటీవలే రూ.3 లక్షలు వెచ్చించాను వేటకు వెళ్లి వచ్చిన తరువాత ఇటీవలే రూ.3 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించాను. బోటు పూర్తిగా మునిగిపోవడంతో సుమారుగా రూ.35 లక్షల వరకూ నష్టపోయాను. ఇప్పటికే అప్పులు చేశాను. ఇప్పుడు పూర్తిగా ఊబిలో కూరుకుపోయాను.– సుగ్గళ్ల నూకరాజు, బోటు యజమాని నిండా మునిగిపోయాం బోటు నీటిలో మునిగిపోవడంతో నా కుటుంబం నిండా అప్పుల్లో మునిగిపోయింది. బోటును నీటి నుంచి వెలుపలికి తీసినా ఎందుకూ పనికిరాదు. ముక్కలుగా విడిపోయింది. రూ.30 లక్షల వర కూ నష్టపోయాను. అధికారులు తగిన చర్యలు తీసుకొని బోట్ల యజమానులను ఆదుకోవాలి. – కంబాలి హరి, బోటు యజమాని -
'హుదూద్ నిలువునా ముంచేసింది'
-
'హుదూద్ నిలువునా ముంచేసింది'
విశాఖపట్నం: హుదూద్ తుపాన్ విధ్వంసంతో తమను నిలువునా ముంచేసిందని విశాఖపట్నం షిప్పింగ్ హార్బర్లోని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం షిప్పంగ్ హార్బర్లో సాక్షి విలేకరితో మత్స్యకారులు మాట్లాడుతూ... తుపాన్ బీభత్సానికి 60 మర బోట్లు దెబ్బతిన్నాయని చెప్పారు. ఒక్కో మరబోటు విలువ రూ. 40 లక్షలు ఉంటుందని అన్నారు. దాదాపు రూ. 30 కోట్ల మేర నష్టపోయామని అన్నారు. ఈదురుగాలులు, అలల తాకిడికి మరబోట్లు హార్బర్లోని జెట్టీపైకి కొట్టుకువచ్చాయని తెలిపారు. తమను అదుకోవాలని మత్స్యకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.