దాల్ స‌రస్సులో అగ్నిప్ర‌మాదం.. మంటల్లోకాలి బూడిదైన హౌజ్‌బోట్లు | Massive Fire Accident At Srinagar Dal Lake Several Houseboats Destroyed, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Dal Lake Fire Incident: దాల్ స‌రస్సులో అగ్నిప్ర‌మాదం.. ఎగిసిపడిన మంటలు.. కాలి బూడిదైన హౌజ్‌బోట్లు

Published Sat, Nov 11 2023 12:07 PM | Last Updated on Sat, Nov 11 2023 1:26 PM

Massive Fire At Srinagar Dal Lake Several Houseboats Destroyed - Sakshi

శ్రీన‌గ‌ర్: జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని శ్రీనర్‌లో ఉన్న దాల్‌ సరస్సులో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సరస్సులో ఉన్న హౌజ్‌బోట్లకు ఉదయం నిప్పంటుకుంది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో అనేక బోట్లు కాలిబూడిదయ్యాయి. దాల్‌ సరస్సులో భారీ స్థాయిలో మంట‌లు ఎగిసిప‌డుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సరస్సు వద్దకు చేరుకొని అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాల్‌ సరస్సులోని ఘాట్‌ నెంబర్‌ 9 సమీపంలోని హోస్‌బోట్‌లో ఉదయం 5 గంటల సమయంలో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. వెంటనే ఆ మంటలు ఇతర బోట్లకు వ్యాపించినట్లు పేర్కొన్నారు.

సరస్సు వద్ద భారీ ఎత్తున మంటలు, దట్టమైన పొగ వ్యాపించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో అయిదు నుంచి ఎనిమిది పడవల వరకు పూర్తిగా దగ్ధం కాగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్లు చెప్పారు. అయితే ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు చెప్పారు. 
చదవండి: జైలు నుంచి ఇంటికి సిసోడియా..అనుమతిచ్చిన కోర్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement