
ముంబాయి : దంగల్ సినిమా నటి జైరా వాసింను వేధించిన నిందితుడు వికాస్ సచ్‌దేవ్(39)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన భర్త వికాస్ అమాయకుడని భార్య దివ్వ పేర్కొంది. జైరాను వేధింపులకు గురిచేయాలని తన భర్తకు ఎలాంటి ఉద్దేశం లేదని తెలిపారు. మా కుటుంబంలో ఇటీవలే ఒకరు చనిపోయారని, ఆ కార్యక్రమానికి వెళ్లి 24 గంటలుగా నిద్ర పోకపోవడం వల్ల వికాస్ ఇబ్బంది పడ్డాడని వెల్లడించారు.
ఈ విషయాన్ని విస్తారా ఎయిర్‌లైన్స్ సిబ్బందికి తెలిపానని, అతని నిద్రపోయేటపుడు ఇబ్బందిపెట్టవద్దని తెలిపాని అన్నారు. వికాస్ తన కాలిని ముందున్న సీటుపై పెట్టుకుని మాత్రమే నిద్రపోయారని, జైరాని వేధించాలని తన భర్తకు ఎలాంటి ఉద్దేశం లేదని చెప్పారు. ఈ ఘటన పట్ల పలువురు ప్రముఖులు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment