
ప్రియాంకా చోప్రా తల్లి పాత్రలో కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. హీరోయిన్‌గా స్టార్ స్టేటస్‌తో దూసుకెళ్తున్నవారు తల్లి పాత్రలో నటించేందుకు అంతగా ఆసక్తి చూపరు. అయితే.. ఇందుకు కొందరు మినహాయింపు. పాత్ర నచ్చాలే కానీ చాలెంజింగ్‌గా తీసుకుని నటిస్తారు. ఇప్పుడు ప్రియాంక కూడా తల్లి పాత్రను ఓ చాలెంజ్‌గా తీసుకోబోతున్నారట. ఆ మధ్య వరుస హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవల బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు.
ప్రస్తుతం కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో ‘భరత్’ చిత్రంలో నటిస్తున్నారు ప్రియాంక. ఆ సినిమా తర్వాత సోనాలి బోస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో 18 ఏళ్ల కూతురికి తల్లిగా నటించనున్నారట ఈ బ్యూటీ. అయేషా చౌదరి అనే యువతి 18 ఏళ్లకే ‘ఇమ్యునోడెఫిషియన్సీ’ వ్యాధితో (రోగ నిరోదక శక్తి లోపించడం) మృతి చెందారట. ఆమె జీవితం ఆధారంగానే ఈ సినిమా ఉండనుందని సమాచారం. అయేషా పాత్రలో ‘దంగల్’ ఫేమ్ జైరా వసీమ్ నటించనుండగా, ఆమె తల్లిగా ప్రియాంక నటిస్తారట. ఈ చిత్రంలో ప్రియాంక భర్తగా అభిషేక్ బచ్చన్ కనిపించనున్నారట. ఈ ఏడాది ఆఖర్లో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment