
ప్రియాంకా చోప్రా
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా కొబ్బరికాయ కొట్టి దిష్టి తీశారు. దిష్టి తీసింది మనుషులకు కాదు. కొత్త లొకేషన్‌కి. ఎందుకంటే..‘ది స్కై ఈజ్ పింక్’ చిత్రం కోసం. సోనాలి బోస్ దర్శకత్వంలో ఫర్హాన్ అక్తర్, ప్రియాంకా చోప్రా, ‘దంగల్’ ఫేమ్ జైరా వసీమ్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ముంబైలో పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం తాజా షెడ్యూల్ లండన్‌లో ప్రారంభమైంది. చిత్రీకరణకు అంతరాయం కలగకుండా లొకేషన్‌కు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టారు ప్రియాంక. ఇటీవల ప్రియాంక, నిక్ జానస్‌ల నిశ్చితార్థం జరిగింది. నిక్, ప్రియాంకల వివాహం రాజస్తాన్‌లోని జోధాపూర్‌లో నవంబర్‌లో జరుగనుందని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment